విశాఖలో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసి బోర్డును తగలబెడుతున్న టీడీపీ కార్యకర్తలు
రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు
కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు
అద్దాలు, పూలకుండీలు ధ్వంసం
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్’ కథనం మీద ఆగ్రహం
తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్
దాడి అప్రజాస్వామికమన్న సీపీఐ, సీపీఎం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు)/అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్న టీడీపీ.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో పత్రికా స్వేచ్ఛపైనా దాడికి దిగింది. విశాఖ నగరంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ సంఘాల నేతలు దాడి జరిపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ పత్రిక బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కథనంలో పేర్కొంది. వారి మాటల సారాంశాన్ని వివరిస్తూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీంతో టీడీపీ అనుబంధ సంఘాలైన టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగునాడు మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై మెరుపు దాడి చేశారు.
కార్యాలయం గేటు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి కార్యాలయం అద్డాలు, ఫరి్నచర్, పూల కుండీలను పగులగొట్టారు. కార్యాలయంలోని మహిళా సిబ్బందితో వాగ్వీవాదానికి దిగి దుర్భాషలాడుతూ దూషించారు. కొంతమంది తెలుగు మహిళలు కార్యాలయం ఎదుట డెక్కన్ క్రానికల్ పేరుతో కూడిన పోస్టర్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టగా.. టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు కార్యాలయ ప్రహరీ గోడపైకి ఎక్కి బోర్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పత్రిక యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను బూతులు తిట్టారు. ఊహించని పరిణామంతో క్రానికల్ కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు
దాడి ఘటనపై విశాఖ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడికి పాల్పడి కార్యాలయ ఆస్తులకు పెట్రోల్ పోసి నిప్పటించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుకరాళ్లతో కార్యాలయ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో వివరించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం పోలీసులకు అందజేశారు.
దాడి సరికాదు: సీపీఐ
పత్రికల్లో వచ్చిన వార్తల్లో అవాస్తవం ఉంటే ఖండించాలి కానీ పత్రికా కార్యాలయాలపై దాడికి పాల్పడటం సరైనది కాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ, జనసేన వాటి వైఖరిని స్పష్టం చేయాల్సి ఉందన్నారు.
దాడి అప్రజాస్వామికం
డీసీ కార్యాలయంపై టీడీపీ విద్యారి్థ, తెలుగు మహిళా విభాగం దాడిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.లోకనాథం తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై డెక్కన్ క్రానికల్‌లో ప్రచురించిన కథనాన్ని భరించలేని టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమేనన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జాప్ ఖండన
డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీవీఎస్‌ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్‌రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై టీడీపీ ప్రభుత్వ దాడిగా అభివరి్ణంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి దాడులపై కఠినంగా వ్యవహరించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
హేయమైన చర్య: ఏపీడబ్ల్యూజేఎఫ్
డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి హేయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియాపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. దాడిని ఏపీబీజీఏ రాష్ట్ర నాయకులు కె.మునిరాజ్, వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు బాధ్యత వహించాలి: వైఎస్ జగన్
డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీకి చెందిన వ్యక్తులు దారుణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. మీడియాను అణచివేసేందుకు టీడీపీ గుడ్డిగా చేసిన మరో ప్రయత్నం ఇది అని దుయ్యబట్టారు. కొత్త పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంçœున నిరంతరం జరుగుతోందన్నారు. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment