ప్రతి అడుగులోనూ ‘చంద్ర’మోసం: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Meeting With Ysrcp Leaders Of Joint Visakha District Updates | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులోనూ ‘చంద్ర’మోసం: వైఎస్‌ జగన్‌

Published Tue, Aug 13 2024 11:00 AM | Last Updated on Tue, Aug 13 2024 3:24 PM

Ys Jagan Meeting With Ysrcp Leaders Of Joint Visakha District Updates

వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ భేటీ

సాక్షి, గుంటూరు: మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని.. చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

‘‘ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికీ మించి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. జగన్‌ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. పలావు లేదు.. బిర్యానీ లేదు ఇప్పుడు. ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి.’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

‘‘జగనే ఉండి ఉంటే.. రైతు భరోసా అందేది. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడీ తల్లులకు అమ్మ ఒడి అందేది. సున్నావడ్డీ కూడా వచ్చి ఉండేది. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన వచ్చేది. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేది. చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈసరికే పడి ఉండేది. ఆగస్టు నెలాఖరు లోపల ప్రతి ఏటా ఇవి మనం ఇచ్చాం. సహజంగానే పథకాలు అమలు జరిగింది. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేకపోవడతో ఇవేమీ రావడంలేదు.

..ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయింది. జన్మభూమి కమిటీలు చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులందరికీ కూడా ఉచితంగా బీమా ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడంలేదు. 2023-24 సంబంధించి ఏప్రిల్‌, మేలో ప్రీమయ కట్టేవాళ్లం. జూన్‌లో ఇన్సూరెన్స్‌ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్లం. పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోంది.

..స్కూళ్లలో టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ప్రపంచంతో పోటీపడేలా చదువులను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాకానుక పంపిణీకూడా అస్తవ్యస్తం. ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకంలేదు. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక మెనూ కూడా అస్తవ్యస్తం. ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి. ఆరోగ్య శ్రీ కింద ఒక్కపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు. లా అండ్‌ ఆర్డర్‌ కూడా పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉంది

..ఈ మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోంది. మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే మనం మోసం చేయలేదు, ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. ఐదేళ్లలో వేధింపులకు గురిచేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కాని కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ఇది సృష్టిసహజం. అలాగే ఈ ఐదేళ్లుకూడా ముగుస్తాయి, మనమే అధికారంలోకి వస్తాం. విలువలు, విశ్వసనీయతమీదే మనం రాజకీయాలు చేస్తున్నాం. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబునాయుడు, టీడీపీ పార్టీ అలవాటు పడింది’’ అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

మాడుగుల వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement