ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు | BJP MLA Vishnu Kumar Raju Controversy Comments On AP Voters | Sakshi
Sakshi News home page

ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు

Published Tue, Jul 23 2024 4:47 PM | Last Updated on Tue, Jul 23 2024 5:43 PM

BJP MLA Vishnu Kumar Raju Controversy Comments On AP Voters

సాక్షి, విశాఖపట్నం:  ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు  ఇతర పార్టీల్లోనూ  తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు.  

తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement