చీరాలలో జన్మభూమి రచ్చ రచ్చ | Quarreling between Amanchi Krishna Mohan supporters, Pothula Sunitha supporters | Sakshi
Sakshi News home page

చీరాలలో 'జన్మభూమి' రచ్చ రచ్చ

Published Sun, Oct 5 2014 12:12 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

Quarreling between Amanchi Krishna Mohan supporters, Pothula Sunitha supporters

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని విజయనగర కాలనీలో 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆదివారం రచ్చ రచ్చ అయింది. జన్మభూమి కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతుల సునీతను ఆహ్వానించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏ అర్హతతో వచ్చావో చెప్పాలని ఆమంచి వర్గీయులు సునీతను డిమాండ్ చేశారు. దీంతో సునీతతోపాటు ఆమె వర్గీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఆమె వర్గీయులు ఆమంచి వర్గీయులపై దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అదే క్రమంలో పోతుల సునీతను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించారు. దీంతో సునీత ఆగ్రహంతో మహిళ కానిస్టేబుల్పై దాడి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement