సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని వారు కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రతినిధులు ఉన్నారు.
అనంతరం, ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవి. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్‌ను అడ్డుపెట్టుకుంటున్నారు. పవన్ వారి కోసమే రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేశ్‌ల జేబు సంస్థగా పవన్ పనిచేస్తున్నాడు. పవన్‌కు మహిళలంటే గౌరవం లేదు. వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్.
అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. పవన్‌ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారు. పవన్‌కు ఇదే మా హెచ్చరిక. మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్. మహిళలు, వాలంటీర్లకు పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. పవన్.. చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావ్. పవన్ వంటి వ్యక్తులు రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదు. పవన్‌ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని ఫైర్
Comments
Please login to add a commentAdd a comment