‘నిమ్మలకు ఇది తెలియకపోవడం సిగ్గుచేటు’ | MLC Pothula Sunitha Fires On Nimmala Kishtappa | Sakshi
Sakshi News home page

‘నిమ్మలకు ఇది తెలియకపోవడం సిగ్గుచేటు’

Published Mon, Jun 22 2020 6:53 PM | Last Updated on Mon, Jun 22 2020 6:59 PM

MLC Pothula Sunitha Fires On Nimmala Kishtappa - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మల  పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. నేతన్నలకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎవ్వరు సరిలేరని తెలిపారు. ఏడాది కాలంలో చేనేత రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో చేనేతలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేనేతలకు 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు.

చేనేత రంగానికి ఎవరు ఎంత సహాయం చేశారనే అంశంపై చర్చకు సిద్ధమని సునీత సవాలు విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హ్యాంక్‌ యార్న్‌పై సబ్సిడీ ప్రవేశపెట్టారని.. దానిని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా పనిచేసిన నిమ్మల కిష్టప్పకు ఇది కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement