handloom sector
-
చేనేత శంఖారావానికి సన్నాహాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపుతున్న చేనేత రంగం తన ఉనికిని చాటుకునేందుకు శంఖారావం పూరిస్తోంది. తమ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో పోరుబాట పడుతోంది. రాజకీయంగా తమకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చేనేత కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సాధించేందుకు ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నడుం బిగించింది. రాజకీయంగా బలపడేందుకు.. అసెంబ్లీ స్థానాల్లో తమ వాటా కోసం రాష్ట్రంలోని చేనేత కులాలను ఫెడరేషన్ ఏకం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 18 చేనేత కులాలు..దేశంలో చేనేత వృత్తి పైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీర క్షత్రియ, స్వకులశాలి, కుర్తీన సెట్టి (కుర్తి) (నెస్సీ), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనా సూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ వంటి 18 చేనేత కులాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ఇక అధికారిక, అనధికార లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు 10లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఓ అంచనా. అలాగే, ఈ వర్గం తరఫున అసెంబ్లీలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు, ముడిసరుకుల ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్సిడీలు, ఇతర సౌకర్యాలు, వంటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని ‘చేనేత’ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారు శంఖారావం పూరించనున్నారు.ఒకే వేదికపైకి చేనేత కులాలు..ఇక దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ తమ సమస్యల సాధన కోసం అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల 18 కులాలలోని ముఖ్యులు సమావేశమయ్యారు. ఇందులో చేనేత వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఆయా కులాల పెద్దలు పాల్గొన్నారు. రాజకీయంగా తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవాలని.. రాష్ట్రంలోని చేనేత కులాలతోపాటు, చేనేత సంఘాలను కూడా కలుపుకుపోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలు ఉన్నందున రాష్ట్రస్థాయిలో భారీఎత్తున చేనేత శంఖారావం సభ నిర్వహించాలని సంకల్పించారు. ఈ విషయమై ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరంలో చేనేత కులాలకు చెందిన పలువురు ముఖ్యులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో శంఖారావంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్‌కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్‌లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది: మంత్రి అమర్నాథ్
-
రద్దుల ఘనత బీజేపీది.. పద్దుల ఘనత టీఆర్ఎస్ది: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి, కార్మికులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటులు, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం చేనేత రంగాన్ని విస్మరిస్తూ అన్నీ రద్దు చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పద్దులు ఇస్తూ ఆ రంగాన్ని ఆదుకుంటోందని చెప్పారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని వీవర్స్భవన్లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావుతో పాటు మంత్రి కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రానివి అన్నీ రద్దులే... 1992లో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను 2020లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దేశంలోని స్పిన్నింగ్ మిల్స్‌లో ఉత్పత్తి అయ్యే నూలులో 40 శాతం చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం 15 శాతానికి కుదించిందని చెప్పారు. ఆసరా పెన్షన్ కింద తాము రూ.2,016 ఇస్తుంటే దీనిలో కేంద్రానిది ఒక్క రూపాయి వాటా కూడా లేదన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకుంటున్నామని చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రద్దులు చేసిన వారివైపు ఉండాలా? పద్దులు ఇచ్చిన వారివైపు ఉండాలా? అనేది పద్మశాలీలు ఆలోచించుకోవాలని హరీశ్ అన్నారు. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ‘మీరు ఏ ఒక్క రంగాన్నైనా అభివృద్ధి చేశారా? ఒక్క నాడైనా చేనేత గురించి మాట్లాడారా?’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నిలదీశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించారని మండిపడ్డారు. ‘ఆ జెండాల తయారీని దేశంలోని చేనేత రంగానికి ఇస్తే బాగుండేది కదా? ఇదేనా మోదీ మేక్ ఇన్ ఇండియా?’అంటూ ఎద్దేవా చేశారు. చేనేతకు రాష్ట్రం చేయూత చేనేత రంగంపై, కార్మికులపై అభిమానం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక నేతన్న ఎంత నేస్తే అంత బట్టని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ నష్టాన్ని భరిస్తోందన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో నూలును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల మరమగ్గాలు ఉన్నాయని, రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్‌ను కార్మికులకే ఇచ్చి వారిని యజమానులను చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. నేతన్నలకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. -
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్‌లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
చేనేత రంగం నిర్వీర్యమైంది : బండి సంజయ్
-
కేంద్రం మొండి వైఖరిపై పోరు
సిరిసిల్ల: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, జౌళి రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్ర నేతన్నల కోసం కేంద్రానికి ఎన్నో విజ్ఞప్తులు చేశామని, అయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించినప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రం తరఫున లేఖ రాశామని చెప్పారు. జీఎస్టీ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతోనే తాత్కాలికంగా పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేంద్ర మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని నేతన్నలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అండ కోరితే.. మొండి చెయ్యి చూపారు ‘‘కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి అండగా ఉండాలని, నేతన్నలను ఆదుకోవాలని ఏడేళ్లుగా అనేక లేఖలు రాశాం. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెడితే.. ఒక్కసారైనా తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్‌ను 1,250 ఎకరాల్లో ప్రారంభిస్తే దానికి సాయం చేయలేదు. రాష్ట్రంలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో దుబ్బాక, నారాయణపేట, కొత్తకోట, జమ్మికుంట, పోచంపల్లి, కమలాపూర్, సిద్దిపేట, గద్వాల వంటి ప్రాంతాల్లో 11 చేనేత కస్టర్లను ఏర్పాటు చేయాలని.. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలని కోరాం. మా కార్మికులు షోలాపూర్, భీవండిలకు వలస వెళ్లకుండా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఏడేళ్లుగా మొండిచెయ్యి చూపుతుంటే ఎలా ఊరుకుంటాం. సమయం వచ్చినప్పుడు రోడ్డెక్కాలి సిరిసిల్ల వేదికగా రాష్ట్రంలోని నేతన్నలకు పిలుపునిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జీఎస్టీ విధింపుపై మరోసారి ఉద్యమించాలి. సమయం వచ్చినప్పుడు అందరం కలిసి రోడ్డెక్కాలి. పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. కష్టమొచ్చినప్పుడే ఒక్కటిగా నిలబడి కొట్లాడాలి. అలా పోరాడితేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిస్తోంది. కార్మికులకు 50 శాతం రాయితీ అందిస్తున్నాం, పవర్లూమ్ రంగాన్ని ఆధునీరించేందుకు అప్‌గ్రేడేషన్ స్కీమ్‌ను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం. నేత కార్మికుల సంక్షేమం కోసం త్రిప్ట్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. టెక్స్టైల్ పార్క్‌కు తోడుగా కొత్తగా అపెరల్ పార్క్‌ను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నాం..’’ అని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో మెకనైజ్డ్ దోబీ ఘాట్స్ రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన మెకానైజ్డ్ (యంత్రీకృత) దోబీ ఘాట్‌ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. రూ.2.10 కోట్లతో ఆధునిక హంగులతో దీనిని నిర్మిం చారు. దోబీఘాట్‌కు శాశ్వత భవనాన్ని నిర్మిం చి.. ఆధునియ యంత్రాల సాయంతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్ని ఒకేచోట పూర్తిచేసేలా వసతిని ఏర్పాటు చేశారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే చేసే సామర్థ్యమున్న యంత్రాలను అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు రజకులకు శ్రమ తగ్గనుంది. అత్యాధునిక మోడల్ దోబీఘాట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించడంపై రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు. -
జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్న నేతన్నలు
-
‘నిమ్మలకు ఇది తెలియకపోవడం సిగ్గుచేటు’
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. నేతన్నలకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎవ్వరు సరిలేరని తెలిపారు. ఏడాది కాలంలో చేనేత రంగంపై సీఎం వైఎస్ జగన్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో చేనేతలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేనేతలకు 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. చేనేత రంగానికి ఎవరు ఎంత సహాయం చేశారనే అంశంపై చర్చకు సిద్ధమని సునీత సవాలు విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హ్యాంక్ యార్న్‌పై సబ్సిడీ ప్రవేశపెట్టారని.. దానిని సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా పనిచేసిన నిమ్మల కిష్టప్పకు ఇది కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. -
మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత
సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నల ఇళ్లలో మూగ రోదనలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల పట్టుచీరలు నేసే ఆ మగ్గాలు.. పూట గడవక కన్నీళ్లను నేస్తున్నాయి. ధగధగ మెరిసే పట్టు చీరలను చూసి మురిసిపోయే ఆ కళ్లు.. వంటగదిలో నిండుకున్న కుండలను చూసి కన్నీళ్లు పెడుతున్నాయి. రాట్నాలు ఒడికే చేతులు.. అన్నార్థుల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి. యాదాద్రి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో లాక్‌డౌన్‌తో పనుల్లేక ఇక్కట్లు పడుతున్న వేలాది మంది నేతన్నల బతుకు చిత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. సాక్షి యాదాద్రి/గద్వాల/సిరిసిల్ల/సిద్దిపేట: కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మగ్గం చప్పుళ్లు ఆగిపోయాయి. పూటగడవని నేతన్న అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకపూట తిండికోసం, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం చేనేత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా నేతన్నల జీవితాలు తారుమారయ్యాయి. చేనేతకు అవసరమైన ముడి పట్టు, కాటన్, నూలు రవాణా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ చేతిలో పనిలేక, డబ్బుల్లేక పోవడంతో నిత్యావసరాలు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. మందులకు డబ్బులు లేవు.. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికురాలు వడ్డెపల్లి గీతావాణి. లాక్‌డౌన్‌తో పని లేక నానా అవస్థలు పడుతోంది. ఈమె భర్త గోపాల్ 7 సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. ఏకైక కుమారుడు శ్రీధర్ (10) మానసిక వికలాంగుడు. శ్రీధర్ వైద్యఖర్చులు, మందులకే నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది. గీతావాణి మస్రస్ చీరలను మగ్గంపై నేస్తుంది. నెలకు 5 నుంచి 6 చీరలు నేయడం ద్వారా సరాసరి నాలుగున్నర వేలు సంపాదిస్తుంది. నెలరోజులుగా మగ్గం నడవట్లేదు. చేనేత అనుబంధ పనులు ఏమైనా చేద్దామంటే అవి కూడా మూతపడ్డాయి. మందులు కొనడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌బియ్యం, రూ.1,500 నిత్యావసర సరుకులు కొనడానికే సరిపోతున్నాయని చెబుతోంది. చేతిలో డబ్బుల్లేక ఇక్కట్లు పోచంపల్లికి చెందిన ఈమె పేరు కాముని పద్మ. భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకుని 22 ఏళ్లుగా మగ్గం నేస్తోంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కూలీ మగ్గం నేసి ముగ్గురు కుమార్తెల వివాహం చేసింది. ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత రోజూ 8 గంటలు కూలీకి మగ్గం నేస్తుంది. నెలంతా పనిచేస్తే రూ.5 వేలు సంపాదిస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహిళా సంఘం ద్వారా బ్యాంకులో తీసుకున్న లోన్, పొదుపు డబ్బులు కట్టలేకపోతోంది. పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో రూ.70కోట్లకు పైగా పట్టు చీరల నిల్వలు, రామన్నపేట, మిగతా ప్రాంతాల్లో రూ.60కోట్ల కాటన్ వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్‌లో 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. మాస్టర్ వీవర్స్ వద్ద రూ.10 కోట్లు, చేనేత సహకార సంఘంలో రూ.1.5 కోట్లు, వస్త్ర దుకాణాల్లో మరో రూ.50 కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్టాక్ అమ్మాకే కార్మికులకు ఉపాధి ఇవ్వగలుగుతామని మాస్టర్ వీవర్స్ అంటున్నారు. ‘ఇక్కత్’కు కష్టాలు పోచంపల్లి మగ్గాల కేంద్రానికి తాళం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు చీరలు, కాటన్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోవడంతో రూ.130 కోట్ల విలువ చేసే చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. సహకార, సహకారేతర రంగంలో భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, భువనగిరి, రాజపేట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్ (ఎం) యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో 1,300 పైచిలుకు మగ్గాలు ఉండగా, 3 వేలకు పైగా చేనేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,500 మంది జియో ట్యాగింగ్‌లో నమోదు కాగా, మరో 15 వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నిలిచిన ముడి సరుకు రవాణా ప్రభుత్వం లాక్డౌన్ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇస్తూ చేనేత కార్మికులు పని చేసుకోవచ్చని తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని కల్పించే సానుకూల పరిస్థితులు లేవు. చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పట్టు ముడిసరుకు, రంగులు, రసాయనాలు 3 నెలల కిందటే నిలిచిపోయాయి. బెంగళూరులో ఉత్పత్తి అయ్యే పట్టు దేశంలోని కార్మికుల అవసరాలకు సరిపోవట్లేదు. చీరల జరీ సూరత్ నుంచి వస్తుంది. కాటన్ వస్త్రాలS తయారీకి అవసరమైన కాటన్ నూలు తమిళనాడులోని ఈరోడ్, సేలం, ఆదిలాబాద్ నుంచి జిల్లాకు వస్తుంది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ముడిసరుకు దిగుమతి ఆగిపోయింది. చాలా చోట్ల ముడి నూలు లేక వస్త్రాల తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నేతన్నల దుస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 10,550 మంది చేనేత కార్మికులు వివిధ రకాల డిజైన్లతో జరీ చీరలు, దుప్పట్లు, తువాళ్లను తయారు చేస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబం నెలకు సగటున నాలుగు జరీ చీరలు నేస్తారు. లాక్డౌన్ రోజుల్లో సుమారు 10 వేల వరకు జరీ చీరలు తయారయ్యాయి. కార్మికులు నేసిన ఈ చీరలను మాస్టర్ వీవర్స్ లాక్డౌన్ కారణంగా కొనుగోలు చేయట్లేదు. దీంతో కార్మికులు తయారు చేసిన చీరలను ఇళ్లలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పని నిలిచిపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో కొంతమంది నేత కార్మికులు ఉన్నారు. ప్రధానంగా గద్వాల, రాజోలి, అమరచింత, నారాయణపేట, కొత్తకోట, అయిజ, ధన్వాడ, గట్టు, మాచర్ల, గోర్లఖాన్దొడ్డి తదితర ప్రాంతాల్లో నేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నూలు ధరలపై నియంత్రణేది చైనా నుంచి నూలు ముడి సరుకు నిలిచిపోయింది. దీంతో సిల్క్ ఉత్పత్తి తగ్గి బెంగళూరు కేంద్రంగా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 3 నెలల కింద కిలో పట్టు వార్పు రూ.3,200ల నుంచి రూ.4,500లకు, వెప్ట్ కిలో రూ.3,500ల నుంచి రూ.4,800లకు పెరిగింది. మొత్తానికి వార్పు (7చీరలు)పైన రూ.15 వేల వరకు ధర పెరిగిందని వాపోతున్నారు. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిపిన విక్రయాలకు డబ్బులు రాకపోవడంతో మాస్టర్ వీవర్స్ తమ వద్ద పనిచేసే కార్మికులకు పని నిలిపేశారు. దీంతో పనులు లేక కార్మికులు అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, రూ.1,500 మాత్రమే వారికి జీవనాధారం అయ్యాయి. మూగబోయిన సిరిసిల్ల.. సిరిసిల్లలో కరోనా ప్రభావంతో కార్ఖానాలు బంద్ అయ్యాయి. బట్ట ఉత్పత్తి చేస్తేనే నేత కార్మికుల పొట్ట గడుస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోనూ ఆధునిక మరమగ్గాలు బంద్ అయ్యాయి. దీంతో మొత్తంగా సిరిసిల్లలో 25 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికుల ఉపాధికి విఘాతం ఏర్పడింది. కాగా, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. 6.2 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చారు. చీరల డిజైన్‌ను మార్చడంతో బతుకమ్మ చీరలకు అవసరమైన నూలును దిగుమతి చేసుకుంటున్న దశలో కరోనా లాక్డౌన్ అయింది. దీంతో సిరిసిల్లకు పూర్తి స్థాయిలో నూలు ఇంకా రాలేదు. వచ్చిన నూలుతో వస్త్రోత్పత్తికి లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. దీంతో సిరిసిల్లలో అటు పాలిస్టర్ బట్ట, ఇటు బతుకమ్మ చీరల బట్ట ఏదీ ఉత్పత్తి కావట్లేదు. దీంతో నేత కార్మికుల బతుకు దయనీయంగా మారింది. నిత్యం పని చేసే కార్మికులకు నెల రోజులుగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక.. దిక్కుతోచక..! ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న శంకర్, పద్మ దంపతులిద్దరూ చేనేత కార్మికులు. వీరికి ఆరేళ్లపాప ఉంది. చేనేత వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కష్టపడి మగ్గం ద్వారా జరీ చీరలను తయారు చేస్తారు. నెలకు 3 చీరలు నేయడమే గగనం. వీటి ద్వారా సంపాదన నెలకు రూ.10 వేలకు మించదు. లాక్డౌన్ విధించడం, రాజోలి రెడ్‌జోన్‌లోకి వెళ్లడంతో మగ్గాలు నిలిచిపోయాయి. దీంతో వారు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఘొల్లుమంటున్న ‘గొల్లభామ’ గత 40 రోజులుగా సిద్దిపేట జిల్లాలో నేతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచే చేనేత కార్మికులు పని ప్రారంభించారు. జిల్లాలో 13 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 5,450 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా గొల్లభామచీరలు, లివర్ టవల్స్, జర్నరీ టవల్స్ అధికంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన వస్త్రాలను టెస్కో ఖరీదు చేస్తుంది. గత 4 నెలల నుంచి వస్త్రాలను ఖరీదు చేయడంలో టెస్కో ఆలస్యం చేయడంతో కార్మికులకు కూలీ చెల్లించలేకపోతున్నారు. సహకార సంఘాల వద్ద వస్త్రాలు పేరుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా 2.5 కోట్ల విలువైన వస్త్రాలు సహకార సంఘాల వద్ద ఉన్నాయి. వీటిని విక్రయిస్తేనే కార్మికులకు వేతనాలు అందుతాయి. ప్రభుత్వం ఈ వస్త్రాలను త్వరగా ఖరీదు చేసి అదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. పొట్ట నిండటమే కష్టమవుతోంది.. ఇతడి పేరు చాప శ్రీనివాస్ (38). నిత్యం సాంచాలు నడుపుతూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే వాడు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్‌కు ఉపాధి కరువైంది. అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్‌కు ఇద్దరు ల్లలు. భార్య బీడీ కార్మికురాలు. పొట్ట నింపుకోవడం కష్టమైతుందని వాపోతున్నాడు. చాప శ్రీనివాస్, పవర్లూమ్ కార్మికుడు, సిరిసిల్ల -
కదులుతున్న డొంక
ప్రొద్దుటూరు టౌన్ : తీగ లాగితే డొంక కదులుతోంది. చేనేత సొసైటీల్లో ఉన్న సభ్యుల వివరాల ఆధారంగా వారి గ్రామాలకు వెళ్లి సీఐడీ అధికారుల విచారణ ప్రారంభించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఈశ్వరరెడ్డినగర్‌లోనే కాక జిల్లాలోని పలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో విచారణ చేపట్టారు. గురువారం ఈశ్వరరెడ్డినగర్‌లో సీఐడీ అధికారులు పరిశీలించారు. సొసైటీల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా లేవు. వారి చిరునామలు తెలుసుకోవడాని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డోర్ నంబర్లు లేకుండా కేవలం పేరు, ప్రాంతం పేరు ఉండటం, ఒకే పేరుతో చాలా మంది చేనేతలు ఉండటం కూడా వారికి తలనొప్పిగా మారింది. మాకు సొసైటీ అధ్యక్షులు ఎవరో తెలియదు.. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తమకు సొసైటీ గురించి కానీ.. అందులో మేము సభ్యులమనే విషయం కానీ ఇంత వరకు తెలియదని చెప్పారు. దీంతో బోగస్ సొసైటీల అవినీతి ఏపాటిదో అర్థం అవుతోంది. చాలా ఏళ్లుగా ఫలానా సొసైటీలో మీరు ఉన్నారా, లివరీ రకం బట్ట నేశారా అన్న సీఐడీ అధికారుల ప్రశ్నలకు తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారు. దీంతో వారి ఆధార్ కార్డు నకలు తీసుకొని సంతకాలు చేయించుకుంటున్నారు. సొసైటీల్లో సభ్యులమని ఏడాదికో, ఆరు నెలలకో సమావేశాలకు పిలుచుకెళ్లి రూ.200, రూ.500 డబ్బులు ఇచ్చేవారు తప్ప మాకు ఏ పాపం తెలిదన్న విషయాన్ని కూడా చేనేతలు కొందరు సీఐడీ అధికారులతో చెబుతున్నారు. రూ.500 ఇస్తాం.. సీఐడీ అధికారుల విచారణ నేపథ్యంలో బోగస్ సొసైటీలు నిర్వహిస్తున్న వారు చేనేతల వద్దకు వచ్చి మీ ఆధార్ కార్డు నకలు ఇచ్చి, పేపర్‌పై సంతకం పెడితే రూ.500 ఇస్తామని మభ్యపెడుతున్నట్లు చెబుతున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పోతుందని, అయినా ఇప్పుడు ఎందుకు సంతకాలు పెట్టాలని నిలదీస్తుండటంతో వెనుదిరుగుతున్నట్లు చేనేతలు అంటున్నారు. జమ్మలమడుగు బీసీ కాలనీలో.. జమ్మలమడుగు రూరల్ : బోగస్ సొసైటీలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. పట్టణంలోని బీసీ కాలనీలో అక్షయ వీవర్స్ కో–ఆపరేటివ్ ప్రొడక్షన్, సేల్స్ సొసైటీ లిమిటెడ్‌లో రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా బీసీ కాలనీలో ఉన్న చేనేత కార్మికులతో మాట్లాడారు.సొసైటీ గురించి ఆరా తీయగా.. తమకు తెలియదని, అయితే ఎప్పుడో ఒకసారి తమతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని చేనేత కార్మికులు సీఐడీ అధికారులకు వివరించారు. ఇటీవల ఏమైనా ప్రభుత్వ పథకాలు వచ్చాయా అని అధికారులు అడిగారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 24వేల రూపాయలు తమ ఖాతాలలో జమ అయ్యాయని కార్మికులు తెలిపారు. సొసైటీ నుంచి ఎటువంటి పథకాలు తమకు అందలేదని దాదాపు 70మంది తెలిపారు. జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడిలో చాలా వరకు బోగస్‌సొసైటీలే ఉన్నట్లు గుర్తించారు. వాటి గుట్టును రట్టుచేసే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో చేనేత సొసైటీ నిర్వాహకుల్లో గుబులు మొదలైంది. మా కుటుంబంలో ముగ్గురు పేర్లు ఉన్నాయంట నా పేరు వలసాల కృష్ణదాస్. మేము మండల పరిధిలోని ఈశ్వరరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాం. 40 ఏళ్లుగా మా కుటుంబం చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మేము ఇప్పటి వరకు ఏ సొసైటీల్లో సభ్యులుగా లేము. కానీ సీఐడీ అధికారులు మా ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలు డబ్బు అందిందా అని అడిగారు. వచ్చిందన్నాను. మీరు చాలా ఏళ్లుగా శ్రీరాం సొసైటీలో సభ్యులుగా ఉన్నారా అని అడిగారు. మాకు ఆ సొసైటీ ఎక్కడ ఉందో, అధ్యక్షుడు ఎవరో తెలియదు అని చెప్పాం. తనకు తెలియకుండా సొసైటీలో ఎలా సభ్యునిగా చేర్చారని సీఐడీ అధికారులను అడిగాను. మా అన్న, మా తండ్రి పేర్లు సభ్యులుగా ఉన్నట్లు కూడా తెలిసింది. బోగస్ సొసైటీల్లో మా పేర్లు చేర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. -
పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి
చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టిం చినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపిం చలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, ‘చేనేత’ వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు ‘కుల’ రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశి స్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. 2019–20 వోట్–అన్–అకౌంట్ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు. చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయిం పులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది. 2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటి ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి. చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. డి. నరసింహారెడ్డి వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు -
‘చేనేత’పై జీఎస్టీని తొలగించండి: రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: చేనేత రంగంపై జీఎస్టీ భారాన్ని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విన్నవించారు. గురువారం ఆయన జైట్లీని కలసి వినతిపత్రం సమర్పించారు. జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు, చేతివృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. చేనేత, హస్తకళలకు ఉపయోగించే ముడిసరుకుపై ఎలాంటి పన్ను భారం మోపరాదని కోరారు. చేనేత, జౌళిపై జీఎస్టీ కారణంగా చైనా, ఇతర దేశాల నుంచి సంబంధిత ఉత్పత్తుల దిగుమతులను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతోందని తెలిపారు. అలాగే రైతాంగం ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై కూడా జీఎస్టీని తొలగించాలని విన్నవించారు. వచ్చే నెల జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీనిచ్చినట్టు రాపోలు మీడియాకు వెల్లడించారు. -
తెలంగాణ చేనేత దేశానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చేనేత రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఒడిశా ఉన్నతాధికారుల బృందం కితాబు ఇచ్చింది. భారీ నిధుల కేటాయింపు, వినూత్న పథకాల అమలు, ప్రోత్సాహకాలు, పవర్లూమ్ క్లస్టర్లు, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు వంటి చర్యలతో చేనేత రంగం పునరుజ్జీవం పొందిందని పేర్కొన్నారు. ఒడిశా చేనేత, టెక్స్టైల్స్, హస్తకళల శాఖ కార్యదర్శి శుభాశర్మ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పోచంపల్లి, సిరిసిల్లలోని చేనేత, టెక్స్టైల్ పార్కులు, పవర్‌లూమ్‌లు, విక్రయ కేంద్రాలను, అబిడ్స్, నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం(టెస్కో) కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య, రాష్ట్ర చేనేత, టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, చేనేత, హస్తకళల విభాగం అధికారి సురయ హసన్, మల్ఖా ట్రస్ట్ డైరెక్టర్ ఉజ్రమ్మ, నిఫ్ట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీఆర్ నాథన్‌లతో చేనేత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శుభాశర్మ మాట్లాడుతూ తెలంగాణ స్ఫూర్తితో తమ రాష్ట్రంలోనూ చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. -
చేనేత మానేసి హోటళ్లలో పనిచేస్తున్నారు..
సాక్షి, మంగళగిరి: ‘‘అన్నా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆప్కోకి ఉత్పత్తులు అమ్మితే 15 రోజుల్లో డబ్బులు వచ్చేవి. ఇప్పుడు సంవత్సరాలు గడిచినా డబ్బులు ఇవ్వట్లేదు...’ ‘మేమేమైనా ఉద్యోగాలు అడిగామా? మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామనేగా అంటున్నది..’ వైఎస్సార్ ఉన్నప్పుడు మగ్గంగుంటలోకి నీళ్లొస్తే ఆ కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రేషన్ సరుకులను అదనంగా ఇచ్చి ఆదుకునేవారు.. ఇవాళమాత్రం ఆ పరిస్థితి లేదు’ .. ఇవీ.. జననేతతో ముఖాముఖిలో నేతన్నలు చెప్పిన అభిప్రాయాలు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో సమావేశామైన వైఎస్ జగన్.. వారి కష్టాలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మాటిచ్చారు. హోటళ్లలో పనిచేస్తున్నాం: గౌరి శంకర్, మంగళగిరి నేతన్న ‘‘చేనేత తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. 45 ఏళ్లు నిండిన ఏ ఒక్కరూ పనిచేసే పరిస్థితిలో లేరు. నేత మానేసి హోటళ్లలో పనికి వెళుతున్నాం. అన్నా.. ఈ ప్రభుత్వాన్ని మేము ఉద్యోగాలు ఇవ్వమనలేదే! మా వృత్తిని గౌరవంగా చేసుకుంటామని అడిగామంతే. వైఎస్సార్ బతికున్న రోజుల్లో చేనేత సెంటర్లు పెట్టాలనే ఆలోచన చేశారు. అన్నా.. మీరు అధికారంలోకి వస్తే.. ఆ సెంటర్ల ద్వారా వయసు మీదపడిన కార్మికులకు పని కల్పించండి. జీఎస్టీ వల్ల మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. సబ్సిడీ ఇచ్చినప్పుడే పోటీ తట్టుకుని నిలబడగలుగుతాం. మహానేత ఉన్నప్పుడు ఆప్కోకు బట్టలు అమ్మితే 15 రోజుల్లోపల డబ్బులు అందేవి. ఇవాళ సంవత్సరమైనా డబ్బులివ్వడంలేదు. అడిడితే.. చేనేత వృత్తి మానేసి వేరే పని చూసుకోండని ఎద్దేవా చేస్తున్నారు’’ ప్రత్యేక హోదాతో నేతన్నలు బాగుపడతారు: వెంకటేశ్వర రావు ‘‘ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు, విద్యావకాశాలే కాదు చేనేత కార్మికులు కూడా బాగుపడతారు. హోదా ఉంటే.. నేతకు అవసరమైన రసాయనాల ఉత్పత్తి పరిశ్రమలు ఇక్కడికే వస్తాయి. కార్మికులు నెలంతా కష్టపడినా 4 వేలకు మించి ఆదాయంలేదు. చేనతలు అందరికీ కనీసం నెలకు రూ.15వేల గిట్టుబాట ధర వచ్చేలా చేయాలి’’ వైఎస్సార ఆదుకున్నారు: లక్ష్మి ‘‘వర్షా కాలంలో మగ్గం తడిసిపోతే, అది ఆరడానికి నెల పైనే పడుతుంది. ఆ కాలమంతా మాకు ఉపాధి ఉండదు. వైఎస్సార్ హయాంలో వర్షాలు కురిసినప్పుడు చేనేత కార్మికులకు 20 కేజీల బియ్యం, నష్టపరిహారం ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు ఏమీ ఇవ్వడంలేదు. డబ్బులు లేని కారణంగా చేనేత కుటుంబాల్లోని పిల్లలు చదువులకు దూరం అవున్నారు’’ -
‘సమంతకు రూపాయి కూడా ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం కీలకంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనమండలిలో మంగళవారం చేనేత రుణాలు, హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే అంశంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ చేనేత కార్మికులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవని, తమది చేనేతల, చేతల సర్కారని స్పష్టం చేశారు. 2002లో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2007లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్ చేశామని వెల్లడించారు. చేనేత రుణమాఫీని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది సూరత్ నుంచి వచ్చిన చీరల్లో కొన్ని నాసిరకం వచ్చాయని.. అందువల్ల ఈ సారి బతుకమ్మ చీరలు సిరిసిల్లలోనే తయారు చేస్తున్నామన్నారు. చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేదని తెలిపారు. మరో వైపు చేనేత బ్రాండ్ అంబాసిడార్‌గా సినీ నటి సమంత ఉచితంగానే వ్యవహరిస్తున్నారని.. ఆమెకు తెలంగాణ సర్కారు ఒక్క రుపాయి కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని కేటీఆర్ అన్నారు. -
చేనేతకు చుక్కలు చూపించారు!
అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజస పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది. తాజా బడ్జెట్ చేనేత పరిశ్రమపై శీతకన్ను వేసినట్లే చెప్పాలి. చేనేత రంగానికి గత సంవత్సరం రూ. 604 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం రూ. 386.09 కోట్లు కేటాయించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో కుదేలైన చేనేత రంగంపై దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. గత వందేళ్లలో చేనేత రంగానికి ఇంత తక్కువ ఎన్నడూ కేటాయించలేదు. భారీ నష్టాలు, పెరిగిన అప్పులతో సతమతమవుతున్న చేనేత కార్మికులు, ఈ ఏటి బడ్జెట్లో అయినా ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగిస్తుందని, ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రోత్సహిస్తుందని పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. చూస్తుంటే ప్రభుత్వానికి ఆలోచనలే కరువై చేష్టలుడిగినట్లు కనిపిస్తోంది. అన్ని పథకాల కంటే చేనేత రంగానికి కేటాయింపులను దారుణంగా తగ్గించేశారు. పెరిగిన ఉత్పత్తి ధరలు, అసమంజసమైన పోటీ, ప్రత్యర్థి రంగాలకు సబ్సిడీ ఇవ్వడం వంటి పరిణామాలతో చేనేతరంగం గిడసబారిపోతోంది. నూలు సరఫరా స్కీం కేటాయింపుల్లో భారీ కోతలు తమ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. పట్టు, పత్తి, నూలు, ఇతర సహజ ఫైబర్‌కి సంబంధించిన ముడి çసరుకు ధర పెరిగిపోవడంతో చేనేత రంగం నిత్యం ప్రకంపనలకు గురవుతూనే ఉంది.బీజేపీ ఎన్నికల ప్రణాళికల్లో, ఎన్నికల ప్రసంగాల్లో సమీకృత అభివృద్ధి గురించి వాగ్దానం చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ఈ అభివృద్ధిలో చేనేత కార్మికులను భాగం చేయలేదు. చేనేతరంగాన్ని పైకి తీసుకురావడానికి కనీస ప్రతిపాదనలు కూడా పొందుపర్చలేదు. 14 శాతం నుంచి 60 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్న తమకు తక్కువ వడ్డీతో అప్పు ఇప్పించాలని చేనేత కార్మికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. పైగా, చేనేత ఉత్పత్తికి సంబంధించి అతి ముఖ్యమైన భాగం పెట్టుబడి. సాంప్రదాయిక వనరుల నుంచి చేనేతకు పెట్టుబడులు తరిగిపోతున్నాయి. చేనేత రంగానికి అంతో ఇంతో పెట్టుబడులు అందించేదిగా పేరుపడిన నాబార్డ్ చాలా వరకు ఆ బాధ్యతను తగ్గించుకుంది. దీని ఫలితంగా అధిక ఖర్చు భారాన్ని మోపే ప్రైవేట్ వనరుల వైపు మళ్లవలసి వస్తోంది. అధిక వడ్డీ రేట్లు, జాగరూకత లేమి, దోపిడీ పరిస్థితులు చేనేత కార్మికుల కష్టాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీ చేనేతకు జీవగర్ర లాంటిది. కానీ ఈ విషయంలో కేంద్రం స్పందన రానురానూ తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. 2013–14 బడ్జెట్లో రూ. 157 కోట్ల స్వల్పమొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం 2016–17 నాటికి చేనేత కార్మికుల వెతలను విస్మరించేసింది. - డా‘‘దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త స్వతంత్ర జౌళి విధాన నిపుణులు ఈ–మెయిల్ : nreddy.donthi16@gmail.com -
జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించండి
♦ కేంద్ర ఆర్థిక మంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ విన్నపం న్యూఢిల్లీ: జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించింది. పార్టీ చేనేత విభాగం నేతలతో కలసి ఎంపీలు బుట్టా రేణుక, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం సమర్పించారు. ‘జీఎస్టీ ప్రభావం నిరుపేద చేనేత కార్మికులకు ఇబ్బందిగా పరిణమించింది. చేనేత వస్త్రాల ముడి సరుకుపై 5 శాతం, వెయ్యి రూపాయల పైబడి ఉత్పత్తులకు 12 శాతం జీఎస్టీ విధించారు. చేనేత రంగంపై జీఎస్టీ ప్రభావం లేకుండా చూడాలి. ఈ అంశాలపై మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే మీకు లేఖ రాశారు’ అని విజ్ఞాపన పత్రంలో కోరారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ ‘జీఎస్టీ ప్రభావాన్ని ఆర్థిక మంత్రికి వివరించాం. చేనేతను, పవర్లూమ్ రంగాన్ని వేరుగా చూడాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు..’ అని వివరించారు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘వారం క్రితమే చేనేత సోదరులు జగన్మోహన్రెడ్డిని కలిశారు. చేనేత కార్మికులకు జీఎస్టీ లేకుండా చూడాలని వారు కోరారు. జగన్ వెంటనే ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. చేనేత ప్రతినిధులను కేంద్ర మంత్రి వద్దకు తీసుకెళ్లాలని మాకు సూచించారు. మేమంతా ఆయనకు సమస్యను వివరించాం. చేనేత రంగానికి జీఎస్టీ ఉండరాదని గట్టిగా మా డిమాండ్ వినిపించాం. దీనిని ఫిట్మెంట్ కమిటీకి నివేదిస్తామని, ఆ తరువాత జీఎస్టీ కౌన్సిల్‌కు వస్తుందని, ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని జైట్లీ మాకు హామీ ఇచ్చారు..’ అని పేర్కొన్నారు. ఈ ప్రతినిధి బృందంలో వైఎస్సార్ చేనేత విభాగం ఏపీ అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, పార్టీ సీజీసీ సభ్యుడు గిరిరాజ్ నగేష్, పార్టీ చేనేత విభాగం నేతలు భండారు ఆనంద్ ప్రసాద్, అందె జగదీష్, పాక సురేష్, కొల్లిపాక సురేష్ బాబు, బుట్టా రంగయ్య తదితరులు ఉన్నారు. -
లండన్‌లో చేనేతకు చేయూత సదస్సు
లండన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చేనేత కళాకారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రవాస జనసేన కార్యకర్తలు నడుంబిగించారు. లండన్‌లో చేనేత- చేయూత సదస్సును జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సు లో ముఖ్యంగా చేనేత కళాకారుల సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారధ్యంలో పార్టీ తరఫున ప్రజా సమస్యల పై పోరాడతామని, అందుకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కార్యకర్తలు తెలిపారు. చేనేత కళాకారుల సమస్యల పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, నేత కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వమే నేరుగా వస్త్రాలను కొనుగోలు చేయాలని సదస్సులో పాల్గొన్న ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో చర్చించిన విషయాలను జనసేన కార్యాలయానికి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ హాం కౌన్సిలర్ పాల్ హాజరయ్యారు. ప్రముఖ సినీతార ప్రణీత చేనేతకు పూర్తి మద్దతు తెలుపుతూ తన సందేశాన్ని పంపించడం ఈ కార్యక్రమంలో మరో విశేషం. ఈ సదస్సులో జనసేన కార్యకర్తలు ఇంగ్లాండ్‌లోని వెస్ట్ లండన్, సౌతాంఫ్టన్, మాంచెస్టర్ తదితర ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, జర్మనీ, తైవాన్ తదితర దేశాల నుంచి కూడా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి సందీప్ పంచకర్ల కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొని తన మద్దతును ప్రకటించి నిర్వాహకులను అభినందించారు. ఈ సదస్సులో ఎన్ఆర్ఐ జనసేన కార్యవర్గం నాగ రమ్యకాంత్, అయ్యప్ప గార్లపాటి, నరేంద్ర మున్నలూరి, శ్రీరామ్ అంగజాల, రుద్ర వర్మ బట్ట, శ్రీకాంత్ మద్దూరి,రాంబాబు, సురేష్ మొగంటి, రాఘవ, జగదీష్, రాకేష్, ఉదయ్, రాజవశిష్టా, సిద్ధం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత రంగానికి తగిన ప్రాధాన్యత
- 2022 నాటికి అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు: దత్తాత్రేయ - సంక్షేమ రంగానికే ఎక్కువ నిధులు: ఈటల సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి కేంద్రం తగిన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అందులో భాగంగానే చేనేత కార్మికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, తక్కువ వడ్డీకి రుణాలు, నిరుద్యోగులు పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.కోటి వరకు రుణాలను కేంద్రం అందజేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆదివారం జరిగిన పద్మశాలి చైతన్య సభలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కట్టించే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..2017–18 బడ్జెట్లో సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగానే చేనేత రంగానికి రూ.12 వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్ని పార్టీలనుంచి అధిక స్థానాల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, గుర్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేతను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దత్తతకు తీసుకుని కార్మికుల సంక్షేమానికి నిర్దిష్ట విధానాన్ని రూపొందిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చేనేత రంగంపై సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్ష నిర్వహించినా.. క్షేత్రస్థాయి నుంచి ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహనకు వచ్చినట్లు కనిపించడంలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం మగ్దూంభవన్‌లో చేనేత కార్మికుల సమస్యలపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో చాడ మాట్లాడుతూ రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత చేతివృత్తుల వారికి న్యాయం జరుగుతుందని ఆశించగా, ప్రభుత్వం మాత్రం పెద్దగా ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. -
బడ్జెట్లో చేనేతకు తగిన ప్రాధాన్యం
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో చేనేత రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో వినియోగానికి చేనేత వస్త్రాలను వీలైనంతగా కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నేతన్నలని ఆదుకునేందుకు బీమా సౌకర్యంతో పాటు వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నూలు కొనుగోలుకు 20 శాతం సబ్సిడీ, అధునాతన టెక్నాలజీతో నడిచే పెడల్ లూమ్స్ అందిస్తున్నామన్నారు. నేత వస్త్రాలకు టెస్కో ద్వారా మార్కెటింగ్ సౌకర్యం ఉందన్నారు. చేనేత సంఘాలకు అందిస్తున్న త్రిఫ్ట్ ఫండ్‌లో 20 శాతం సభ్యులు కడితే మిగతా 80 శాతం ప్రభుత్వమే జమ చేస్తుందన్నారు. సొసైటీలకు వర్క్షెడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పావలా వడ్డీతో క్యాష్ క్రెడిట్ ఇప్పటికే అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
టిడిపి సర్కారు చేనేత రంగాన్ని గాలికొదిలేసింది
-
చేనేతను వాడండి
ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: చేనేత రంగం అభివృద్ధి వల్ల లక్షలాది మంది నేతన్నలకు ఉపాధి కల్పించడమే కాక.. మహిళా సాధికారతకు తోడ్పాటును అందిస్తుందని, అందువల్ల దేశ ప్రజలంతా దైనందిన జీవనంలో చేనేత ఉత్పత్తుల వినియోగం పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘‘మన చేనేత రంగం విభిన్నమైనది. పర్యావరణ అనుకూలమైంది. లెక్కలేనంత మంది నేతన్నలకు ఉపాధి వనరుగా ఉంది. దీనంతటికీ మనం అందిస్తున్న ప్రోత్సాహమే కారణం’’ అని పేర్కొన్నారు. చేనేత రంగంతో అనేక మహిళలు కూడా ఆధారపడి జీవిస్తున్నారని, అందువల్ల ఈ రంగం అభివృద్ధి మహిళా సాధికారతకు తోడ్పడుతుందని వివరించారు. మనం చేనేత రంగానికి పోత్సాహకంగా నిలవాలని, రోజువారీ కార్యకలాపాల్లో చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ‘దేశం కోసం ఖాదీ.. ఫ్యాషన్ కోసం ఖాదీ(ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్)’ ఇదే మన మార్గదర్శక సూత్రంగా ఉండాలని శనివారం నాటి టౌన్‌హాల్ తరహా మీట్లో ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులాంటిదని, అందువల్ల 125 కోట్ల మంది భారతీయులు తమ దుస్తుల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలను వినియోగించాలన్నారు. చేనేత రంగానికి సంపూర్ణ మద్దతు ఇస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమూలంగా మారిపోతుందన్నారు. దీని కో సం గ్లోబల్ మార్కెటింగ్‌కు ఈ ప్లాట్‌ఫామ్.. నేతన్నకు సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. -
చేనేత రుణాలు మాఫీ చేస్తాం
నెల రోజుల్లో రుణమాఫీ పత్రాలు అందిస్తాం మళ్లీ జనతా వస్త్రాలు ఇస్తాం జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రులు కొల్లు, ప్రత్తిపాటి, దేవినేని విజయవాడ బ్యూరో: చేనేత రంగానికి చేయూతనిచ్చేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వెయ్యి చేనేత సొసైటీలకు చెందిన 2.80లక్షల మంది కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. చేనేత కార్మికులకు రూ.125 కోట్ల రుణాలు రద్దు చేస్తామని, నెలరోజుల్లోగా 25వేల మందికి రుణమాఫీ పత్రాలు అందిస్తామని చెప్పారు. జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెప్పారు. ఈ సందర్బంగా చేనేతలో విశేష సేవలందించిన కూన మల్లికార్జున్, రామయ్యలను సత్కరించారు. సభకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. -
చతికిలపడ్డ చే‘నేత’
నాడు దర్జాగా... నేడు దీనంగా నేతన్న నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జిల్లాలో చేనేత రంగం చతికిల పడింది. నాడు దర్జాగా బతికి పది మందికీ ఉపాధి కల్పించిన నేతన్న నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపుతుండడం వారికి శాపంగా మారుతోంది. మగ్గం నడవక.. కడుపు నిండక నరకయా తన అనుభవిస్తున్నారు. మదనపల్లె సిటీ: జిల్లాలో 39 వేల మగ్గా లు ఉండగా, అందులో దాదాపు 40 వే ల కుటుంబాలు చేనేత రంగం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. మదనపల్లె(నీరుగట్టువారిపల్లె), కలక డ, వాల్మీకిపురం, పుత్తూరు, నగిరి, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, నిమ్మనపల్లె ప్రాంతాల్లో చేనేతరంగంపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ముడిసరుకుల ధరలు పెరగడం, తయారైన వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మగ్గాలు మూత పడటంతో యంత్రాలు గుజిరీకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఊసేలేని రుణమాఫీ చేనేత కార్మికులకు రుణ మాఫీ ఊసేలేదు. జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాంకర్లు చిల్లిగవ్వ కూడా తో యలేదు. నేతన్నలకు నోటీసులు పంపడం రివాజుగా మారుతోంది. ఆగిన సిల్క్ సబ్సిడీ చేనేత కార్మికులకు అందాల్సిన స బ్బిడీ సిల్క్ నాలుగు నెలల నుంచి ఆగిపోయింది. నీరుగట్టువారిపల్లెలో సుమారు 20 వేల మగ్గాలు ఉంటే 2500 మందికి సిల్క్ సబ్సిడీ పాసుపుస్తకాలు అందజేశారు. అది కూడా అందకపోవడంతో నేతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేనేతలు ఆరోగ్యబీమా పథకం రెండు సంవత్సరాలుగా రద్దు చేశారు. అనారోగ్యబారిన పడిన కార్మికులు వైద్యపరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో ఇటీవల నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే ప్రాంతంలో గతంలో దాదాపు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలో మదనపల్లె, తిరుపతిలో చేనేత భవన్ల ఏర్పాటు, రాయితీతో మగ్గాలకు విద్యుత్ సరఫరా, పుణ్యక్షేత్రాల్లో వస్త్రవిక్రయశాలకు అనుమతి, వర్క్షెడ్డుకు రూ.1.5లక్షలు మంజూరు వంటి పథకాలు అమలుకు నోచుకోలేదు. -
సంక్షోభంలో చేనేత రంగం
ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న నేతన్నలు పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం నేటి నుంచి ఆమరణ దీక్షలు ధర్మవరంటౌన్ : అగ్గిపెట్టెలో ఒదిగే పట్టు చీరను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (పేటెంట్ హక్కు) పొందిన చేనేత రంగం భవిష్యత్ సంక్షోభంలో కూరుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందెపల్లి, కోటంక, సిండికేట్ నగర్, యాడికి తదితర ప్రాంతాల్లో 1.5లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధార పడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత రంగంపై 5 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. పవర్లూమ్ ఉత్పత్తులు పట్టు ప్రాముఖ్యతను దెబ్బతీస్తుండడంతో చేనేత సంక్షోభం తారాస్థాయికి చేరింది. ధర్మవరం పట్టణంలో 15వేలకు పైగా మగ్గాలు మూత పడ్డాయి. సంక్షోభానికి ప్రధాన కారణం చేనేత రంగం సంక్షోభానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిన ముడిసరుకు ధరలు. పట్టు చీరలకు ఉపయోగించే వార్పు, రేషం, జరీ ధరలు మూడిం తలు పెరిగాయి. పట్టుచీర ధర మాత్రం ఒకే విధంగా ఉంది. అంతేకాకుండా పవర్లూమ్ మగ్గంలో తయారైన చీర ధరకు వెయ్యి నుంచి 1500 వరకు తక్కువ ధర ఉండడంతో వ్యాపారులు మరమగ్గాల చీరలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో చేనేత పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. నేటి నుంచి ఆమరణ దీక్షలు ప్రాణాలర్పించైనా ధర్మవరం పట్టణంలో పవర్‌లూమ్స్‌కు అనుమతులు సాధించి ఏర్పాటు చేసుకుంటామని పవర్లూమ్ అసోసియేషన్ నాయకుల గిర్రాజు రవి, కాటా రామాంజినేయులు పేర్కొన్నారు. మరమగ్గాల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ అసోసియేషన్ సభ్యులు చేసు ్తన్న నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 5వరోజుకు చేరాయి. వారు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లా ఏడీ మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదన్నారు. కర్ణాటక వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు లొంగి చేనేతల పొట్టకొడుతున్న ఏడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యేడాదికి 30మందికిపైగా నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఆత్మహత్యలకు హ్యాండ్లూమ్ ఏడీ బాధ్యత వహించాలన్నారు. మరమగ్గాల అనుమతుల కోసం సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. ఈ దీక్షల్లో రాధాకృష్ణ, ఓబుళరాజు, నాగయ్య, ఓబుళమ్మ, రామక్క, సాలమ్మ, చెన్నమ్మ, రంగమ్మ పాల్గొన్నారు. -
మంగళగిరిలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలి
-ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి: చేనేత రంగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మంగళగిరి పట్టణంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు క్లస్టర్లలో ఒకటి ధర్మవరం, మరొకటి ఎమ్మిగనూరుకు కేటాయించగా మూడోది ఎక్కడ కేటాయించేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం శోచనీయమన్నారు. గురువారం ఆర్కే ఫోన్లో మాట్లాడుతూ మంగళగిరిలో 15వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా మంగళగిరికి చేనేత క్లస్టర్‌ను కేటాయించి ఆ రంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ తాను మంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వున్న చోట మాత్రమే ప్రభుత్వం పనులు చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వున్న చోట ప్రజలను విస్మరించడం సరికాదన్నారు. క్లస్టర్ ఏర్పాటు కోరుతూ తాను ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించాగా ఏర్పాటుకు హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇప్పటికే పట్టణంలో చేనేత రంగంలోకి వచ్చేందుకు యువకులు వెనుకాడుతున్నారని, ఆ రంగాన్ని అభివృద్ధి పరచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
మగ్గాల ఆకలికేకలు ఇంకెన్నాళ్లు?
పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగం విస్తృత స్థాయిలో ఉన్నది. నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాల్లో మినుకు మినుకు మంటున్న ఈ పరిశ్రమ ఇతర జిల్లాల్లో పూ ర్తిస్థాయిలోనే ఉంది. తెలంగాణలో వలస వెళ్లిన మొట్టమొదటి కుటుంబాలు చేనేత రంగంనుంచే. వీళ్లు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వెళ్లారు. కొందరైతే భివాండి వంటిచోట్ల పవర్లూమ్ పని నే ర్చుకుని వచ్చి ఇక్కడ మరమగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక కాలంలో చేనేతకు మంచి భవిష్యత్తు ఉంది. అయితే, ఆదుకోవాల్సిందీ, ఆసరా కల్పించాల్సిందీ తెలం గాణ సమాజమే. చేనేత కుటుంబాలకు ప్రధాన సమస్య చాలినంత ఆదాయం ఈ వృత్తిలో లభించకపోవడమే. యాం త్రికీకరణవల్లా, అనైతిక పోటీవల్లా, ప్రభుత్వాల వివక్ష వల్ల చేనేత ఎంతో నష్టపోతున్నది. ఇటు నూలు ధరల మధ్య విప రీత భేదం ఉండటం చేనేత వస్త్రాల ధరలను పెంచుతోంది. దీనివల్ల మార్కెట్లో దానికి తగినంత ఆదరణ కరువవుతు న్నది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ వృత్తిపట్ల మక్కువ, గౌరవం ఉన్న కుటుంబాలూ, వ్యక్తులూ అనేకం. ఇలాంటివారివల్లే ఈ రంగం ఇంకా నిలబడింది. అయితే, నిధుల లేమి, లోపిం చిన చిత్తశుద్ధి, సమన్వయ లేమి, అవగాహనాలోపం, వివక్ష, చట్టాల్లో లొసుగులవంటి కారణాలవల్ల అలాంటి కుటుం బాలకు అన్యాయం జరుగుతున్నది. అరకొర కేటాయింపులు చేనేత రంగానికి చేసే కేటాయింపులే అసలు సమస్య. స్వ ర్ణాంధ్రప్రదేశ్, విజన్ -2020 వంటి విధానాలతో చేనేతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో చేనే తకు ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. కేంద్ర నిధులు మురిగిపో తున్నాయి. పథకాల సంఖ్య తగ్గిపోయింది. ఆ పథకాల అమలులో కూడా అనేక లోపాలు, అవినీతి! పర్యవసానంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు సంక్షో భంలో కూరుకుపోయాయి. ఎందరో ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. ఈ ఆత్మహత్యలవల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2004లో వైఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే 2005-06, 2006-07 చేనేత రం గంపై చేసిన ఖర్చు కేటాయింపులకంటే ఎక్కువుంది. 2005- 06లో రూ. 76.68 కోట్లు కేటాయిస్తే, రూ. 80.27 కోట్లు ఖర్చయింది. 2006-07లో 99.52 కోట్లు కేటాయిస్తే రూ. 136.25 కోట్లు వ్యయం అయింది. ఖర్చు పెంచడమే కాక ఈ కాలంలో చేనేత కుటుంబాలకు అవసరమైన ఇల్లు, పింఛను పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2009లో ఓటాన్ అకౌంట్లో పెట్టి ఎన్నికల తర్వాత ఆమోదించిన రుణమాఫీ పథకం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపింది. అయితే, 2009-10లో దీని అమలు సరిగాలేక కేవలం 44.38 కోట్లు మాత్రమే ఖర్చయింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత ఇందుకు కారణం. తెలంగాణలో అభివృద్ధికి మార్గాలు పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగం అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి అవసరం. అందుకు ఈ అంశా లను పరిగణనలోకి తీసుకోవాలి. 1. చేనేత రంగంలో సర్కా రు పెట్టుబడులు పెరగాలి. కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగాలి. చేనేతకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి అందించాలి. 2. సహకార ఉత్పత్తి విధానాలకు ప్రథమ స్థానం ఇస్తూనే ఇతర ఉత్పత్తి పద్ధతులకు మద్దతివ్వాలి. 3. వికేంద్రీకృత టెక్నాలజీ ద్వారా చిన్న నూలు మిల్లులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రత్తి రైతుకు, చేనేత కార్మికులకూ నేరుగా సంబంధం ఏర్పరచాలి. పట్టు రీలింగ్ పరిశ్రమకు ప్రోత్సాహమివ్వాలి. 4. చేనేత ఉత్పత్తుల మార్కెట్లను కాపాడటానికి రక్షణ చట్టాలను పటిష్టంగా అమ లుచేయాలి. మార్కెట్ వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఎగుమతులకు అవకాశం కల్పించాలి. 5. చేనేత సంక్షేమ పథకాలు చేపట్టి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, పిల్లలకు అవసరమైన సంక్షేమ పథకాలు చేకూర్చాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి. 6. తెలంగాణకు ప్రత్యేక అపెక్స్ సహకార సంస్థ ఏర్పాటుచేసి ఈ ప్రాంత సహకార సంఘాలకు తగిన వనరులు అందించాలి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలి. 7. చేనేత కార్మికులకు కనీస రోజు కూలీ వచ్చేవిధంగా కనీస వేతన చట్టం అమలు చేయాలి. - వ్యాసకర్త చేనేత రంగ నిపుణులు డాక్టర్ డి. నరసింహారెడ్డి -
మగ్గం.. ఛిద్రం
చేనేత రంగం కుదేలు అవుతున్న రోజులవి. ఎందరో కార్మికులు మగ్గాన్ని వదిలి పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారు. మరి కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవన్ని చూస్తూనే ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతన్నలకు బతుకుపై భరోసా కల్పించలేకపోయారు. అలాంటి నేత మళ్లీ తానే ముఖ్యమంత్రినైతే చేనేత రంగం రూపు రేఖలు మారుస్తానని, చేనేతల రుణాలను మాఫీ చేస్తానని ప్రకటిస్తున్నారు. మళ్లీ అధికారం మాట ఓటరు దేవుళ్లకెరుకుగానీ.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా బాబూ అంటూ.. నేతన్న ప్రశ్నిస్తున్నాడు. ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: ఎమ్మిగనూరుకు చేనేత పురిగా కూడా మరో పేరు. ఇక్కడ వ్యవసాయ తర్వాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చేనేత. కుర్ణి, సాలే, దూదేకుల, రజక, మైనార్టీ కులాల్లో ప్రధానంగా చేనేత వృత్తినే మెజార్టీ కుటుంబాలు ఎంచుకున్నాయి. ఎమ్మిగనూరు పరిసర ప్రాంతంలోని గుడేకల్, గోనెగండ్ల, నందవరం, నాగులదిన్నె, కోడుమూరు మరో నాలుగు వేల కుటుంబాలు నేడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో నేతన్న బతుకులు మరింత దిగజారాయి. చేయూత నివ్వాల్సిన చేనేత సొసైటీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉపాధిని చూపే స్పిన్నింగ్ మిల్లు మూతపడింది. ఆదుకోవాల్సిన సర్కార్ అలసత్వం ప్రదర్శించడంతో చేనేత రంగం జవసత్వాలు కోల్పోయింది. బాబు జమానాలో ఐదుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా 38 మంది స్పిన్నింగ్ మిల్లు కార్మికులు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందారు. ఆదరణ పథకం కింద బాబు జమానాలో కొంతమందికి చేనేత మగ్గాలను పంపిణి చేసినా అవి కూడా దళారుల దోపిడీకి గురైయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, నమ్ముకున్న వృత్తిలో గట్టెక్కలేక సుమారు 3వేల మంది కార్మికులు ప్రత్యాన్మయ రంగంలోకి వెళ్లారు. మహిళా కార్మికులు హోటళ్లల్లో, ఇళ్లలో పని మనుషులుగా, పురుషులు లాడ్జిలలో రూం బాయ్‌లుగా హోటళ్లలో సర్వర్లుగా, పరిశ్రమలలో వాచ్మెన్లుగా కొంతమంది చేరితే ఎక్కువ మంది బెంగళూరు, ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. చేయూతనిచ్చిన వైఎస్ సర్కార్: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగానికి వైఎస్ పాలన వరమైంది. వృద్ధాప్య పెన్షన్‌ను చేనేత కార్మికులకు 50 ఏళ్లకే ఇచ్చేలా జీవో జారీ చేసింది. టీడీపీ హయాంలో ఎమ్మిగనూరుకు చెందిన 298 మంది 60 సంవత్సరాలు పైబడిన కార్మికులు పెన్షన్లు పొందితే వైఎస్ హయాంలో నెలకు రూ. 200 చొప్పున 50 ఏళ్లు దాటిన 1586 మంది చేనేతలకు పెన్షన్ సదుపాయం దొరికింది. క్లస్టర్ స్కీంలను ఏర్పాటు చేసి కార్మికులకు అవసరమైన నూలు, ముడి సరుకులను క్లస్టర్ ద్వారా ప్రభుత్వం పంపిణి చేసింది. ఆర్టీజన్ కార్డు, రుణ అర్హత కార్డులను జారీ చేసి కార్మికులకు బీమా సౌకర్యంతో పాటు రుణ సదుపాయాలను కూడా కల్పించింది. వైఎస్ చొరవతో ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీకి చెందిన రూ. 3.5కోట్లు రుణాలు, చేనేతలకు చెందిన 16.78లక్షల వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయి. మహానేత వైఎస్ మరణాంతరం చేనేతల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. బాబు పాలనకు బ్లూ ప్రింట్‌గా కొనసాగిన కిరణ్ సర్కార్ సంక్షేమాన్ని, సంస్థల్ని నిర్వీర్యం చేేసిందనీ నేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చేనేత.. మారని రాత
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో వ్యవసాయం తర్వాత అంత స్థాయిలో విస్తృతమైనది చేనేత రంగం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదేళ్ల క్రితం జిల్లాలో చేనేతకారులు, కార్మికులు దాదాపు 50 వేల మంది ఉండగా ప్రస్తుతం 20 వేలకు పడిపోయింది. వీరిలో మహిళలు 8 వేల మంది ఉన్నారు. చేనేత పరిశ్రమలో మహిళలు కీలకంగా పని చేస్తున్న వీరికి ప్రభుత్వం నుంచి చేయూత లభించడం లేదు. బ్యాంకులు మహిళా చేనేత కారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఇప్పటికి ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, ప్యాపిలి, క్రిష్ణగిరి మండలాల్లో చేనేత పరిశ్రమపై ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డాయి. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం లేక పోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన చేనేతకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత రెండేళ్లలో 9 మంది చేనేతకారులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడినా వారికి ఎటువంటి చేయూత లభించలేదు. నిబంధనల ప్రకారం రూ.1.50 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉండగా అతీ గతీ లేదు. వీవర్ క్రెడిట్ కార్డులకు రుణాలు ఏవీ? చేనేతకారులకు క్రెడిట్ కార్డుల ద్వారా ఎటువంటి హామీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయం బ్యాంకులు కల్పించాల్సి ఉంది. జిల్లాలో 3100 మందికి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా బ్యాంకులు కేవలం 153 మందికి మాత్రమే రుణాలు ఇచ్చాయి. ఇందులో మహిళల్లో కేవలం 23 మందికి మాత్రమే రుణాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రివైవర్, రీఫామ్స్, రీస్ట్రక్చరింగ్(త్రిబుల్ ఆల్) కింద చేనేతకారుల అన్ని రకాల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. జిల్లాలో 16 చేనేత సహకార సంఘాలకు సంబంధించి రూ.6.87 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి స్పందన కరువయింది. సమగ్ర చేనేత అభివృద్ధి పథకం కింద ఎమ్మిగనూరు, కోడుమూరు క్లస్టర్లను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లోని మహిళా చేనేతకారులను డిజైనింగ్, తదితర వాటిపై శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విచ్ఛిన్నమవుతున్న సంఘాలు: బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేనేత సహకార సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా ఇందులో 5 వేల మంది సభ్యులు ఉన్నారు. మహిళలు 2 వేల మంది ఉన్నారు. ప్రోత్సాహం కరువు కావడంతో 23 సంఘాలు పని చేయడం లేదు. 20 సంఘాలు మాత్రమే కొంత వరకు రాణిస్తున్నాయి. మహిళలకు నూలు సబ్సిడీ స్కీమ్ అమలు కావడం లేదు. బీమా పథకాలు ఉన్న ప్రచారం లేక మూలన పడుతున్నాయి. మహాత్మా గాంధీ బోంకార్డు బీమా యోజన, ఆరోగ్య బీమా పథకాలు ఉన్న మహిళలకు వర్తింపజేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. చేనేతకారులకు రునాలు ఇప్పించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్న బ్యాంకర్లు ఖాతరు చేయడం లేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ: ఆదోనిలో బెంచీ, మగ్గం, గుంత మగ్గాలతో దుస్తుల తయారీ చేస్తున్నారు. మగ్గాలతో నేసిన లుంగీలు, చీరలు, టవల్, దోమతెరలు, బెడ్షీట్లను ప్రభుత్వమే కొనుగోలు చేయక పోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆలూరు, పత్తికొండ, హొళగుంద చేనేతలు తయారు చేసిన వస్త్రాలను చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగే సంతల్లో తక్కువ ధరకు విక్రయించుకుని కుటుంబీలను పోషించుకుంటున్నారు. బనగానపల్లె పరిధిలో ఇల్లూరు కొత్తపేట, నందివర్గం, పలుకూరు తదితర గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలు చేనేత మగ్గలపై ఆధారడి జీవిస్తున్నారు. ఈ గ్రామ ప్రాంతాల్లో చేనేత సంఘాలు ఏర్పడినా మొక్కుబడిగా మారాయి. . తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల్లో 1,490 చేనేత కుటుంబాలు ఉండగా 80 శాతం మంది మగ్గాలకు స్వస్తి పలకగా కేవలం అతికష్టంపై 110 కుటుంబాలు మాత్రమే చేనేత కార్మికులుగా కొనసాగుతున్నారు. ఈమె పేరు పార్వతి. ఎమ్మిగనూరులో నివసిస్తోంది. భర్త హోటల్లో పనిచేస్తుండటంతో కుటుంబానికి తన వంతుగా అసరాగా ఉండాలని మగ్గం వైపు మొగ్గు చూపింది. వారానికి ఒక చీరను నేసే సామర్థ్యం ఉన్నా కూలీ గిట్టుబాటు కాకపోవడంతో వృత్తిపై ఆసక్తిని చంపుకుంది. నెలకు రెండుకు మించి చీరలను నేయడం లేదు. ప్రభుత్వం నుంచి సబ్సిడీపై ముడి సరుకు అందక పోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వక తదితర కారణాలతో తమ ప్రాంతంలో చేనేతలు దుకణాల్లో, హోటళ్లలో కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఇది మోసం, దగాల ‘కలనేత’
దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొనుగోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి. ‘అంచు డాబే కానీ, పంచె డాబు లేదు’ అని సామెత. చేనేత మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను పరిశీ లిస్తే ఇదే అనిపిస్తుంది. పైపై మెరుగులు, ఆధునిక జౌళి రంగాన్ని సంతృప్తి పరచడం కోసం ఈ పనిని కేంద్రం దొడ్డితోవనైనా సాధించాలని చూస్తోం ది. ‘సాలెల మగ్గా’నికి కొత్త నిర్వచనం ఇచ్చే మహత్కార్యం నిర్వర్తించడానికి మే 2, 2013న కేంద్రం ఒక సంఘాన్ని నియమించింది. ఇందులో చేనేతరంగ ప్రతినిధులకు చోటివ్వలేదు. పవర్ లూమ్ రంగానికి చెందిన కొందరిని సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ అంతరంగం ఏమిటో ఈ చర్యే చెబుతోందని అసలు నేతన్నలు మథనపడుతున్నారు. సంఘం ఎందుకు? చేనేత ఉత్పత్తులలో కొన్నింటిని యాంత్రీకరణ చేసే అవకాశాలను పరిశీలించాలి. జౌళి రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేతి మగ్గం అంటే ఏమిటో పునర్ నిర్వచించాలి. చిన్న పవ ర్ లూమ్ ఉత్పత్తిదారులను వర్గీకరించి, చేనేత కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ సాయం వారికి కూడా అందేవిధంగా సిఫారసులు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆధునీకరణ/ యాంత్రీకరణ ఎంతవరకు పూర్తయిందో అంచనాలు వేసి, చేనేత వస్త్రాన్ని కూడా ఆయా ప్రక్రియలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు ఇతర ప్రాంతాలలో కూడా ఆ సిఫారసులను విస్తరించాలి. సంఘం ఉద్దేశాలన్నీ గతంలో ప్రభుత్వాలూ, న్యాయస్థానాలు చేనేత రంగానికి ఇచ్చిన రక్షణలూ, భరోసాలకు భంగం వాటిల్ల చేసేవిగానే ఉన్నాయని ఎవరికైనా అర్థమవుతుంది. చేనేత రంగం అభ్యర్థనలను ఈ ప్రభుత్వం ఏనాడూ వినిపిం చుకోలేదు. దానికి రుజువు ఆత్మహత్యలు. అయితే ఇప్పుడు చేనేత రంగం ప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యర్థన కూడా అందకుండానే ఒక సంఘాన్ని నియమించి మగ్గానికి మారుపేరు పెట్టే పనిని నెత్తికెత్తుకుంటున్నది. అసలు చేనేత రంగ ప్రతినిధులు లేకుండా మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ఎంత వరకు సబబు? ఒక్క పవ ర్ లూమ్ వల్ల పాతిక మంది చేనేత వృత్తిదారులు ఉపాధి కోల్పోతారని 1974లోనే శివరామన్ కమిటీ చెప్పిన సంగతి ప్రభుత్వానికి గుర్తు లేదా? విచ్ఛిన్నం చేయడానికే! చేనేత మగ్గాన్నీ ఆధునిక యంత్రాల పక్కన పెట్టి చూడటం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడానికే. మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం వల్ల చిన్న పవర్ లూమ్ ఉత్పత్తిదారులు, చేనేత నుంచి పవ ర్ లూమ్ ఉత్పత్తులకు మారిన చేనేత వృత్తిదారులు లబ్ధిపొందుతారని ఒక మాట వినిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే పవ ర్ లూమ్ రంగంలోని పెద్ద, అతి పెద్ద ఉత్పత్తిదారులే దీనితో మేలు పొందుతారు. గత పదిహేను ఏళ్లుగా వివిధ పథకాలు, ప్రత్యేకంగా టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ ద్వారా వారికి ధన సహాయం వెళ్లిందేకానీ, పైన చెప్పినట్టు మార్పు చెందిన కుటుంబాల వారికి కాదు. ఇది గమనించాలి. నిధుల లోటు, ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం, అవగాహన లేమి, వివక్ష, గాంధీగారు ఎంతో ప్రేమించిన ఈ రంగం మీద అసలు సానుభూతి లేకపోవడం చేనేతకు అసలు శాపం. అందుకే చేనేత రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, ప్రభుత్వం రూపొందించిన విధానాలు కూడా నామ మాత్రంగానే మిగిలాయి. చేనేత రిజర్వేషన్ మాటేమిటి? చేనేత రంగం అత్యంత అవసరమైన వృత్తిగా, ఉపాధి రంగంగా గుర్తించిన గత ప్రభుత్వాలు 1985 తరువాత ఆ రంగం రక్షణకు కొన్ని చర్యలు రూపొందించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం 1950 నుంచే చేనేత రిజర్వేషన్ ప్రభుత్వ రికార్డులలో ఉంది. చేనేత ఉపాధిని కాపాడే ప్రయత్నంగా ఈ ‘రక్షణ’ కల్పించారు. ఉపాధి పట్ల నాడు, నేడు కూడా ప్రభుత్వాల ఆలోచనలు మారలేదు. కానీ చేనేత రంగం ఉపాధి పట్ల వివక్ష కనపడుతున్నది. ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి పట్ల మమకారం కనపడుతున్నది. పెద్ద కంపెనీలకు పూలబాట వేయడానికి పోటీలు పడే రాజకీయ నాయకులకు, అధికారులకు దేశంలో కొదవలేదు. కానీ కోట్లాది కుటుంబాలు మన దేశ సంస్కృతిని కాపాడుతూ, తమ నైపుణ్యాన్ని పెంచు కుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవిస్తున్నవారికి అండగా నిల వటానికి ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం. నేతన్నల కడుపు కొడుతున్నారు దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొను గోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి. కాని ఆధునిక ‘బకాసుర’ యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి ప్రభుత్వ సబ్సిడీల సహకారంతో, అధికారుల అవ్యాజ ప్రేమతో ‘నకిలి’ చేనేత వస్త్రాలను మార్కెట్లో ప్రవేశపెట్టి అనైతిక పోటీని సృష్టిస్తూ నేతన్నల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. 1985లో నూతన జాతీయ ఔళి విధానం ప్రకటించారు. ఈ విధానం మొదటిసారిగా చేనేత- ఆధార జౌళిరంగ అభివృద్ధికి కాకుండా, అప్పటి వరకు ఉన్న విధానాలకు భిన్నంగా రూపొందించారు. దానికి ‘నూతన’ పదం జోడించారు. కాక పోతే, అప్పటి చేనేత రంగానికి రాజకీయ మద్దతు ఉన్నందువల్ల, ఓట్ల గురించి మాత్రమే చేనేత రక్షణకు కొన్ని చర్యలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది. చేనేత రిజర్వేషన్ చట్టం. ఈ చట్టం ద్వారా 22 రకాల చేనేత ఉత్పత్తులు పవర్ లూమ్ లేదా మిల్లులు, ఉత్పత్తి చేయకుండా, కేవలం చేతి మగ్గాల మీదనే ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. కానీ చట్టం ఉన్నా అం దులో చేనేత వస్త్రాన్ని కాపాడేందుకు సరైన చర్యలు లేవు. చట్టుబండలైన చట్టం చేనేత రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు 1993లో కొట్టివేసింది. చట్టం సక్రమమేనని తేల్చింది. 1995లో మీరా సేథ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చట్టం పరిధిలో రిజర్వేషన్ 11 రకాలకు కుదించారు. పదేళ్ల కాలంలోనే, చట్టం పూర్తిగా అమలు కాకముందే, దాని అనుభవాల విశ్లేషణ జరగకముందే, చేనేత రంగ ప్రతినిధులతో పూర్తిగా సంప్రదించకుండా, అధికారికంగా నీరుగార్చేశారు. అటువంటి ప్రయ త్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 1995కి ముందు, ఆ తరువాత కూడా ఈ చట్టం అమలు తీరు పూర్తిగా లోపభూయిష్టంగానే ఉంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపు 25 ఏళ్ల కాలంలో ఒక్క శిక్ష కూడా ఖరారైనట్లు సమాచారం లేదు. నిర్లక్ష్యానికి ఇది ఒక సూచిక. 11, 12వ పంచవర్ష ప్రణాళికలలో చేనేత రిజర్వేషన్ చట్టం ఎత్తివేసే ప్రతిపాదనలు చేశారు. ఎగుమతి మార్కెట్ల పేరిట ఈ రిజర్వేషన్‌కు స్వస్తి పలికే ప్రయత్నం చేశారు. ఇప్పుడు, చేనేత మగ్గం నిర్వచనం మార్చి, నామ మాత్రంగానే ఉన్న ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి, చేనేతరంగాన్ని తుడిచి పెట్టే ప్రయత్నాలు ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ‘చేనేత కార్మికులు వృధాగా శ్రమపడుతున్నారు. వారి శారీరక శ్రమను తగ్గించడానికి, చేనేత మగ్గానికి మార్పులు చేశాం. ఆయా మార్పులు, విద్యుత్‌తో నడిచే పరికరాల ఆధారంగా జరిగినవి కాబట్టి, రిజర్వేషన్ చట్టంలో ఆ విధమైన మార్పులు చేయాలి’ అనేది వారి ప్రతిపాదన. ఈ నిర్వచనాన్ని మార్చినందువల్ల పవర్ లూమ్ రంగం విస్తృతంగా లాభపడే అవకాశమే ఉంది. మానవ శ్రమ, చేతి నైపుణ్యం, సృజన, కళ ఇమిడి ఉన్న చేనేత రంగం కుంటుపడి, ఆ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఎక్కువ. మభ్యపెడుతున్న ప్రభుత్వాలు చేనేతను కాపాడుతున్నామని మభ్యపెట్టి, పబ్బం గడుపుకోవడమే తప్ప కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి సేవ చేద్దా మనే ఆలోచన పాలకులకు లేకపోవడం శోచనీయం. చేనేత వస్త్రం, చేనేత మగ్గం పునర్ నిర్వచన కార్యక్రమం విరమించుకున్నామని అధికారులు, మం త్రులు నోటి మాటగా చెబుతున్నారు. కానీ కాగితం రూపేణా ఇప్పటి వరకు చెప్పలేదు. కమిటీ ఉందో, రద్దయిందో కూడా తెలియలేదు. ఈ ప్రతి పాదనకు వ్యతిరేకంగా చేనేత శ్రామికులు, చేనేత వస్త్ర ప్రేమికులు, ఆ రంగం నుంచి ఉపాధిని కోరుకునే వారు భారత ఆర్థిక సార్వభౌమత్వాన్ని కోరుకునేవారు, పర్యావరణ ఉద్యమకారులు నడుం బిగించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. - డాక్టర్ డి.నరసింహారెడ్డి జాతీయ జౌళిరంగ నిపుణులు -
చేనేత రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: వ్యవసాయం తర్వాత అధిక శాతం ప్రజలు ఆధారపడిన చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని పద్మశాలి సేవా సంఘం తెలంగాణ అధ్యక్షుడు గోశిక యాదగిరి విమర్శించారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో వచ్చే నెల 23న నిర్వహించనున్న పద్మశాలి యువజన గర్జన విజయవంతానికి పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర బుధవారం రాత్రి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా పద్మశాలి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మశాలీలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని అన్నారు. చేనేత కార్మికులు ఆకలిచావులకు గురవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. తెలంగాణలో 15 శాసనసభ, మూడు పార్లమెంటు స్థానాలు పద్మశాలీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీల డిమాండ్ల సాధనకు నిర్వహించే గర్జనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గర్జన ఫ్లెక్సీలను విడుదల చేశారు. అంతకుముందు పట్టణంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎనగంటి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు గుల్లపల్లినర్సయ్య, గుల్లపల్లి బుచ్చిలింగం, నల్ల కనకయ్య, కొంగ సత్యనారాయణ, తాలూకా అధ్యక్షుడు ఒడ్నాల వెంకన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సదానందం, రాపెల్లి నాగేశ్వర్రావు, యూత్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్, నాయకులు పర్శ చంద్రశేఖర్, మామిడాల తిరుపతయ్య, గుల్లపల్లి లావణ్య, మామిడాల మమత పాల్గొన్నారు.