నాడు దర్జాగా... నేడు దీనంగా నేతన్న
నేడు ప్రపంచ చేనేత దినోత్సవం
జిల్లాలో చేనేత రంగం చతికిల పడింది. నాడు దర్జాగా బతికి పది మందికీ ఉపాధి కల్పించిన నేతన్న నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపుతుండడం వారికి శాపంగా మారుతోంది. మగ్గం నడవక.. కడుపు నిండక నరకయా తన అనుభవిస్తున్నారు.
మదనపల్లె సిటీ: జిల్లాలో 39 వేల మగ్గా లు ఉండగా, అందులో దాదాపు 40 వే ల కుటుంబాలు చేనేత రంగం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. మదనపల్లె(నీరుగట్టువారిపల్లె), కలక డ, వాల్మీకిపురం, పుత్తూరు, నగిరి, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, నిమ్మనపల్లె ప్రాంతాల్లో చేనేతరంగంపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ముడిసరుకుల ధరలు పెరగడం, తయారైన వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మగ్గాలు మూత పడటంతో యంత్రాలు గుజిరీకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఊసేలేని రుణమాఫీ
చేనేత కార్మికులకు రుణ మాఫీ ఊసేలేదు. జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాంకర్లు చిల్లిగవ్వ కూడా తో యలేదు. నేతన్నలకు నోటీసులు పంపడం రివాజుగా మారుతోంది.
ఆగిన సిల్క్ సబ్సిడీ
చేనేత కార్మికులకు అందాల్సిన స బ్బిడీ సిల్క్ నాలుగు నెలల నుంచి ఆగిపోయింది. నీరుగట్టువారిపల్లెలో సుమారు 20 వేల మగ్గాలు ఉంటే 2500 మందికి సిల్క్ సబ్సిడీ పాసుపుస్తకాలు అందజేశారు. అది కూడా అందకపోవడంతో నేతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేనేతలు ఆరోగ్యబీమా పథకం రెండు సంవత్సరాలుగా రద్దు చేశారు. అనారోగ్యబారిన పడిన కార్మికులు వైద్యపరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో ఇటీవల నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే ప్రాంతంలో గతంలో దాదాపు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలో మదనపల్లె, తిరుపతిలో చేనేత భవన్ల ఏర్పాటు, రాయితీతో మగ్గాలకు విద్యుత్ సరఫరా, పుణ్యక్షేత్రాల్లో వస్త్రవిక్రయశాలకు అనుమతి, వర్క్‌షెడ్డుకు రూ.1.5లక్షలు మంజూరు వంటి పథకాలు అమలుకు నోచుకోలేదు.
చతికిలపడ్డ చే‘నేత’
Published Fri, Aug 7 2015 2:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement