The loan waiver
-
డప్పుకొట్టి.. మాటతప్పి..
ముగిసిన మూడో విడత జన్మభూమి సభలు నామమాత్రంగానైనా పరిష్కారం కాని సమస్యలు అధికార పార్టీ మద్దతుదారులకే రేషన్ కార్డులు 2 లక్షల వినతుల్లో అప్లోడ్ చేసింది 83,984 మాత్రమే సమస్యల పరిష్కారానికి చక్కని వేదికలు మూడో విడత జన్మభూమి-మా ఊరు గ్రామసభలు.. ప్రజలు ధైర్యంగా సమస్యలు చెప్పండి.. పరిష్కార మార్గాలను కనుక్కోండి.. అంటూ అధికారులు, నాయకులు ఊదరగొట్టేశారు. వీరి మాటలిని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్న ఆశతో పేదలు పెద్ద సంఖ్యలో సభలకు తరలివెళ్లారు. కానీ వారికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. వీరి మొర ఆలకించేవారే కరువయ్యారు. అంతా ఆర్భాటం.. సొంత డబ్బాకే ప్రాధాన్యమిచ్చి సభలను ముగించేశారు. చిత్తూరు: గతంలో రెండు విడతలు నిర్వహించిన జన్మభూమి సభల్లో పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, ఇంటి స్థలాలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. జన్మభూమి కమిటీల ద్వారా రేషన్‌కార్డుల కోసం 1.42 లక్షల వినతులు వచ్చాయి. అర్హులైన వారు ఇంతకు రెట్టింపు వినతిపత్రాలు సమర్పించినట్లు సమాచారం. అయితే అధికారపార్టీకి చెందిన జన్మభూమి కమిటీలు ససేమిరా అనడంతో అధికారులు వాటిని బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 1.02లక్షల కార్డులను మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా మొక్కుబడిగా వందల సంఖ్యలో రేషన్‌కార్డులను పంపిణీచేసి చేతులు దులుపుకుంది. సర్వర్, వెబ్సైట్ సమస్యలు, ఫొటోలు అందలేదనే సాకులు చూపి మిగిలిన కార్డులను పంపిణీ చేయకుండా చేతులు ఎత్తేసింది. సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీత ఈనెల 2న జన్మభూమి సభలు ప్రారంభంకాగా 11న (సోమవారం) ముగిశాయి. ఈ సభల్లో ప్రజలు అధికారులను నిలదీశారు. నిరసనలు వ్యక్తంచేశారు. సమస్యలను పరిష్కరించనపుడు జన్మభూమి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి సమీప బంధువు రుణమాఫీ కాలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలిరోజు చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడులో అధికారపార్టీ నాయకులే మూడు గంటలు జన్మభూమిని అడ్డుకున్నారు. మూడో విడత 2లక్షలకు పైగా వినతులు మూడో విడత జన్మభూమిలో 2లక్షల పైచిలుకు వినతిపత్రాలు అందాయి. ఆదివారం సాయంత్రానికి 1.8లక్షల వినతిపత్రాలు అందగా, సోమవారం మరో 20వేల అర్జీలొచ్చాయి. అయితే ఇప్పటివరకు 83,984 వినతిపత్రాలు మీ-కోసం వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఇంకా 1.2 లక్షలకు పైగా వినతిపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందుకు మరో వారానికి పైగా గడువుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గత రెండు విడతల జన్మభూమిలో ఇచ్చిన లక్షలాది వినతిపత్రాలు పెండింగ్‌లో ఉండగా, తాజాగా అందజేసినవి మరో 2లక్షలకు పైగా తోడయ్యాయి. పాత వినతులనే పట్టించుకోని ప్రభుత్వం కొత్త వినతులను ఏమేరకు పరిష్కరిస్తుందో వేచి చూడాలి. -
ఈ పాపం బాబుదే
ఆడిన మాట తప్పిన ముఖ్యమంత్రి రుణ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ అధికారంలోకి వచ్చినా తీరని అప్పులు కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని ఛీకొట్టిన బ్యాంకర్లు తప్పక వడ్డీవ్యాపారుల గడపతొక్కిన మహిళలు, రైతులు చివరకు అధిక వడ్డీ కబంధ హస్తాల్లో విలవిల... కాల్‌మనీ వ్యాపారుల అకృత్యాలు, దురాగతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూల కారణమని జిల్లాలోని రైతులు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆడిన మాట తప్పి పాపం మూటగట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేసి ఉంటే నేడు ఈ అఘాయిత్యాలకు అవకాశమే ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు. గుంటూరు : కాల్‌మనీ అనర్థాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాలను బేషరతుగా రద్దు చేస్తానని, తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని బాబు ప్రచారం చేశారు. ఆయనకు తోడు పార్టీ కార్యకర్తలు సైతం ఇంటింటికీ తిరిగి ‘బాబు వస్తే జాబు’తోపాటు రుణాలు రద్దవుతాయని ప్రజలను నమ్మించారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మాట మార్చారు. షరతులు విధించారు. వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తానని చెప్పారు. ఏడాదిన్నర గడిచినా తీసుకున్న రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కాకపోగా, వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి. పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే అనేక మంది రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు. జిల్లాలో 11 లక్షల 47 వేల మంది రైతులు రూ.9,600 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తం మాఫీ అవుతుందని భావించారు. అయితే మాఫీకి సంబంధించి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు పట్టాదారు పుస్తకాలు ఉండాలన్నారు. పట్టాదారు పుస్తకాలు లేని రైతులను అనర్హులుగా ప్రకటించారు. మొత్తం రుణం వాయిదాల్లో మాఫీ చేస్తామని, రుణ మాఫీలో ఆలస్యమైనా వడ్డీని తామే చెల్లిస్తామని పాలకులు చెప్పారు. మొదటి దశలో రూ.543 కోట్లు చెల్లించారు. అయితే వడ్డీలు, సర్‌చార్జీలు కలిపి పెరిగిన రుణంలో ఈ మొత్తం 10 శాతం కూడా లేకపోవడంతో రైతుల రుణ మొత్తాలు తగ్గలేదు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వలేదు. ప్రతీ ఖరీఫ్‌లో వరి రైతు ఎకరాకు రూ.20 వేల వరకు రుణం తీసుకుంటాడు. ఈ సారి బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రుణాల కోసం రైతులు కాల్‌మనీ, అధిక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీనిని అలుసుగా తీసుకున్న కాల్‌మనీ వ్యాపారులు ఇళ్లు, ట్రాక్టర్లు, ఇతర ఆస్తులను తనఖా పెట్టుకుని రైతులకు రుణాలు ఇచ్చారు. ఒక వైపు పాత అప్పులు కట్టాలని బ్యాంకర్ల ఒత్తిడి, మరో వైపు కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక కొందరు రైతులు అనారోగ్యంతో మృతి చెందితే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మొత్తం 60 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం బాబుదేనని ఆ రైతు కుటుంబాలు ఘోషిస్తున్నాయి. జిల్లాలో 55 వేల డ్వాక్రా గ్రూపుల్లో ఎక్కువ మంది సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన మాటల గారడీతో బురిడీ కొట్టించారు. వారు తీసుకున్న రూ.450 కోట్లను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులంతా అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చివరకు ప్రభుత్వం ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలను బ్యాంకులో జమ చేశారు. అయితే సభ్యులు వడ్డీలు చెల్లించడం లేదని ఆ రూ.3 వేలను బ్యాంకర్లు లాగేసుకున్నారు. చివరకు మహిళలు కూడా బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని కాల్‌మనీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించారు. ఈ క్రమంలో సకాలంలో చెల్లించని అనేక మంది మహిళలపై కాల్‌మనీ నిర్వాహకులు నియమించిన బౌన్సర్లు దాడులు చేశారు. ఇళ్లల్లో సామాన్లు బయట పడేసిన సంఘటనలు జిల్లాలో లేకపోలేదు. విజయవాడ తరహా సెక్స్‌రాకెట్ అకృత్యాలు గుంటూరులో బయటపడలేదని, అయితే ఆ తరహా దురాగతాలు లేవని చెప్పలేమని కొందరు పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
చతికిలపడ్డ చే‘నేత’
నాడు దర్జాగా... నేడు దీనంగా నేతన్న నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జిల్లాలో చేనేత రంగం చతికిల పడింది. నాడు దర్జాగా బతికి పది మందికీ ఉపాధి కల్పించిన నేతన్న నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపుతుండడం వారికి శాపంగా మారుతోంది. మగ్గం నడవక.. కడుపు నిండక నరకయా తన అనుభవిస్తున్నారు. మదనపల్లె సిటీ: జిల్లాలో 39 వేల మగ్గా లు ఉండగా, అందులో దాదాపు 40 వే ల కుటుంబాలు చేనేత రంగం ద్వారా ఉపాధి పొందుతున్నాయి. మదనపల్లె(నీరుగట్టువారిపల్లె), కలక డ, వాల్మీకిపురం, పుత్తూరు, నగిరి, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, నిమ్మనపల్లె ప్రాంతాల్లో చేనేతరంగంపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ముడిసరుకుల ధరలు పెరగడం, తయారైన వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మగ్గాలు మూత పడటంతో యంత్రాలు గుజిరీకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఊసేలేని రుణమాఫీ చేనేత కార్మికులకు రుణ మాఫీ ఊసేలేదు. జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాంకర్లు చిల్లిగవ్వ కూడా తో యలేదు. నేతన్నలకు నోటీసులు పంపడం రివాజుగా మారుతోంది. ఆగిన సిల్క్ సబ్సిడీ చేనేత కార్మికులకు అందాల్సిన స బ్బిడీ సిల్క్ నాలుగు నెలల నుంచి ఆగిపోయింది. నీరుగట్టువారిపల్లెలో సుమారు 20 వేల మగ్గాలు ఉంటే 2500 మందికి సిల్క్ సబ్సిడీ పాసుపుస్తకాలు అందజేశారు. అది కూడా అందకపోవడంతో నేతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేనేతలు ఆరోగ్యబీమా పథకం రెండు సంవత్సరాలుగా రద్దు చేశారు. అనారోగ్యబారిన పడిన కార్మికులు వైద్యపరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో ఇటీవల నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే ప్రాంతంలో గతంలో దాదాపు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలో మదనపల్లె, తిరుపతిలో చేనేత భవన్ల ఏర్పాటు, రాయితీతో మగ్గాలకు విద్యుత్ సరఫరా, పుణ్యక్షేత్రాల్లో వస్త్రవిక్రయశాలకు అనుమతి, వర్క్షెడ్డుకు రూ.1.5లక్షలు మంజూరు వంటి పథకాలు అమలుకు నోచుకోలేదు. -
బంగారు కలలు కల్లలయ్యాయి
సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణను చూడాలని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రజల కలలు కల్లలయ్యాయని, ఇందుకు పూర్తి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఎన్నికల ముందు ఇచ్చిన పలు హామీలను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదున్నర నెలల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. పంటలు ఎండిపోతూ ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు రాష్ట్రవ్యాప్తంగా 230 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఏజన్సీలో వైద్యం అందకపోవడంతో విషజ్వరాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నా అసలు డెంగీ మరణాలే లేవంటూ ప్రభుత్వం కొట్టివేయడం దారుణమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్రం ఇవ్వనందునే పాలన సాగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, వారిని ఇస్తే ఆత్మహత్య చేసుకున్న రైతులు.. విషజ్వరాలతో మృతిచెందిన గిరిజనులను బతికిస్తారా..? ఎండిపోయిన పంటలను కాపాడతారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడే విద్యుత్‌కష్టాలు మూడేళ్లపాటు ఉంటాయని ప్రకటిస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు పత్తి మద్దతుధర రూ.6వేలు ఇవ్వాలని, దళారీ వ్యవస్థకు మంగళం పాడితేనే కరువు పరిస్థితుల్లో రైతులకు ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రాష్ట్ర ప్రజల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. బడ్జెట్లో శాఖలవారీగా నిధుల కేటాయింపుపై అంశాల వారీగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతుందన్నారు. -
నేడు రూ.5వేల కోట్లు విడుదల
20 శాతం రుణాల మాఫీకిగాను వ్యవసాయ శాఖకు మంజూరు నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్: రైతుల రుణాల్లో 20 శాతం మాఫీ చేయడంలో భాగంగా ఆర్థిక శాఖ శనివారం రూ.5000 కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేయనుంది. మరోపక్క నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం రిజిస్టర్ చేసింది. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఈ కార్పొరేషన్‌ను ఈ నెల 21న సీఎం ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. డెరైక్టర్లుగా ఆర్థిక, వ్యవసాయ, పుశుసంవర్ధక శాఖల ముఖ్యకార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్ వ్యవహరించనున్నారు. ఈ కార్పొరేషన్‌ను రూ.కోటి మూలధనంతో ఏర్పాటు చేశారు. ప్రాధాన్యతా క్రమంలో మాఫీ.. ఆర్థిక శాఖ నుంచి వచ్చే 5000 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ రైతు సాధికారిత కార్పొరేషన్‌కు విడుదల చేయనుంది. అక్కడ నుంచి రుణ మాఫీకి అర్హులైన రైతుల రుణాల్లో 20 శాతం నిధులను బ్యాంకులకు విడుదల చేయనున్నారు. ఈ 20 శాతం నిధుల చెల్లింపును కూడా ప్రాధాన్యత క్రమంలో చేయనున్నారు. తొలుత పంట రుణాలకు, ఆ తరువాత ప్రకృతి వైపరీత్యం సమయంలో దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలకు ఇస్తారు. చివరి ప్రాధాన్యతగా బంగారంపై తీసుకున్న రుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. బంగారం రుణాలకు 20 శాతం ప్రభుత్వం చెల్లించినప్పటికీ అవి కొత్త రుణాలగా మారబోవని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 20 శాతం నిధులను చెల్లిస్తే మిగతా 80 శాతం రుణాన్ని రైతులు చెల్లించి బంగారం విడిపించుకోవాల్సి ఉంటుంది.అలా కాకుండా మిగతా 80 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, అప్పుడు బంగారం విడిపించుకోవచ్చునని రైతులు అనుకుంటే 14 శాతం మేర వడ్డీ భారం పడుతుంది. బంగారం రుణాలతో పాటు, పంట రుణాలన్నింటికీ గత ఏడాది డిసెంబర్ వరకుగల వడ్డీనే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, జనవరి నుంచి 7 శాతం మేర వడ్డీని, జూలై నుంచి 14 శాతం వడ్డీని రైతులే భరించాలని ఓ అధికారి తెలిపారు. -
కేసీఆర్‌వన్నీ అబద్ధాలే!
-
కేసీఆర్‌వన్నీ అబద్ధాలే!
సీఎం అసమర్థత వల్లే రైతులకు కష్టాలు ‘రైతు భరోసా యాత్ర’లో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ, సీఎల్పీ నేతల పర్యటన ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయి? సర్కారు తీరును అసెంబ్లీలో ఎండగడతాం అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే రాష్ట్ర ప్రజలకు ఆకాశంలో చుక్కలు, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్కు పట్టం కడితే బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ప్రాథమిక హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రజలు బంగారు తెలంగాణ కోరుకుంటే.. బాధల తెలంగాణను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. టీపీసీసీ, సీఎల్పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు గురువారం నిజామాబాద్ జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ను చేపట్టారు. దోమకొండ, భిక్కనూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్, రైతు విభాగం అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పర్యటించారు. బస్వాపూర్, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, సంగమేశ్వర్, సీతారాంపూర్ దారి పొడవునా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అనంతరం రామేశ్వర్పల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎన్నాళ్లు మభ్యపెడతారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబెట్టిన కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారని పొన్నాల అన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఏడు గంటల సరఫరా కూడా లేకుండా చేశారన్నారు. రెండు మూడు గంటలు కూడా కరెంట్ రాక నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి ఓటేసిన 4 కోట్ల మంది ప్రజల కలలను వమ్ము చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతలు, అప్పుల బాధతో తెలంగాణలో ఇప్పటికే 220 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కరెంట్, రుణమాఫీ విషయంలో ‘దాహమేస్తుంది అంటే.. బావి తవ్వుతా’ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని తిట్టి పబ్బం గడువుకోవాలని చూస్తే అది చెల్లదు. కేసీఆర్ ఖబడ్దార్. రైతుల సమస్యలు విస్మరించిన నీకు ఇక నూకలు చెల్లినట్లే. ఇప్పటికైనా 54 శాతం విద్యుత్ వాటా కోసం కొట్లాడు. విద్యుత్ మంత్రి, సీఎండీ లేని నీ పాలనలో రైతులను ఏం చేయదలచుకున్నావ్’ అంటూ పొన్నాల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు భరోసా ఇచ్చేందుకే ఈ యాత్రను మొదలుపెట్టామన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. రైతుల బాధలు వర్ణణాతీతం టీఆర్ఎస్ పాలనలో రైతుల బాధలు వర్ణనాతీతమని జానారెడ్డి అన్నారు. హామీలతో ప్రజలను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన కేసీఆర్ వాటి అమలును విస్మరించి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ వైఖరితోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు పునరావృతమవుతున్నాయని అన్నారు. నాలుగు నెలల కిందటే విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉండగా.. పంటలు ఎండిపోయాక కరెంట్ కొనుగోలుకు టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉంటుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెం బ్లీలో ఎండగడతామని జానారెడ్డి స్పష్టం చేశారు. ఉసురు పోసుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని, రైతుల కడుపుమంట, కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిదికాదని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు వ్యాఖ్యానించారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 20 ఏళ్లలో ఇంత దుస్థితిని ఎన్నడూ చూడలేదని, జనరేటర్ల సాయంతో పంటలు పండించుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు హామీ మేరకు సాగుకు ఏడు గంటల కరెంట్ ఇవ్వాలని, నిజామాబాద్‌ను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రుణమాఫీకి టీడీపీ టోపీ!
మాటల్లో తప్ప చేతల్లో పొంతనేది? ముంగిట్లో వేలాడుతున్న వేలం నోటీసులు లబోదిబోమంటున్న రైతులు దయచూపని బ్యాంకర్లు వీరులపాడు : రుణమాఫీ మాటల్లో తప్ప చేతల్లో కనబడడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలకు ముందు బంగారం బ్యాంకులో నుంచి తీసి చెల్లెమ్మల మెడలో వేస్తామని, తమ్మూళ్లూ రుణాలు చెల్లించొద్దని, మీ అప్పులన్నీ మాఫీ చేసి మిమ్మల్ని లక్షాధికారులను చేసేవరకు నిద్రపోనని హామీలిచ్చిన చంద్రబాబు గెలిచిన తరువాత మొహం చాటేశారనిధ్వజమెత్తుతున్నారు. మహిళల మెడలో చంద్రబాబు బంగారం వేయడం ఏమో కానీ... బ్యాంక్ అధికారులు మాత్రం వేలం నోటీసులు ఇళ్లకు తగిలిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కాగా వాయిదా మీరిన వ్యవసాయ బంగారు రుణాలు రైతులు చెల్లించలేకపోవడంతో రుణమాఫీ ఎప్పటికి అమలవుతుందో అర్థంకాని బ్యాంకర్లు తమ ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఇండియన్ బ్యాంక్ నుంచి బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు అధికారులు వేలం నోటీసులు పంపిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో రైతుల రుణాలను పూర్తిగా మాఫీచేసే బాధ్యత మాదేనని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఇప్పడు కంటికి కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. బ్యాంకుల నుంచి వస్తున్న వేలం నోటీసులు తీసుకుని రైతులు బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లి ప్రస్తుతం రుణాలు చెల్లించే పరిస్థితుల్లో లేమని, వేలాన్ని నిలుపుదల చేయాలని కోరుతున్నారు. వ్యవసాయ పెట్టుబడుల సమయంలో బంగారం ఆభరణాలు వేలానికి రావడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు చెల్లించైనా సరే వేలాన్ని నిలుపుదల చేద్దామన్నా... చేతిలో చిల్లిగవ్వ అయినా లేదని బ్యాంక్ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు చంద్రబాబు ఆశ పెట్టిన రుణమాఫీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జుజ్జూరు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బివి.సత్యనారయణను వేలం నోటీసులపై వివరణ కోరగా.... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వాయిదా మీరిన పంట, ఆభరణ రుణాలను వేలం వేసేందుకు నోటీసులు అందిస్తున్నామని తెలిపారు. -
వంద రోజులు దొంగ డాబులు
డ్వాక్రా సంఘటితమవుతోంది డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామన్న మోసపూరిత హామీపై ఆయా సంఘాలు సంఘటితమవుతున్నాయి. లక్ష రూపాయలకే పరిమితం చేయడం ... అదీ ఆచరణలోకి తేకపోవడమేమిటంటూ నిలదీస్తున్నాయి. చేనేతన్నలకూ పచ్చ నామాలే పెట్టారు. ఒంగోలుకు మొండి చేయి ఎన్నికల వరకే పార్టీలు తరువాత అభివృద్ధే ధ్యేయంగా పని చేసేవాడే నిజమైన నేత. మరి చంద్రబాబు వైఖరి ఎలా ఉందంటే ఓట్లు వేయని వారిపై కక్ష సాధించడమే కాదు ... ఆ జిల్లాపై కూడా కన్నెర్ర చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన ఓ పార్టీ ప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధిపై వినతిపత్రం ఇస్తే ‘మీ జిల్లా ప్రజలు మా పార్టీకి ఓటెయ్యలేదు ... అభివృద్ధి ఎందుకు చెయ్యాలంటూ’ ఎదురు తిరగడంతో బాబుగారి విజన్ వెర్రితనం ఏడిసినట్టుందని వెనుతిరిగారు. అధికారంలోకి రాగానే హత్యా రాజకీయాలు అధికారంలోకి రాగానే అది చేస్తాను, ఇది చేస్తానంటూ ఓట్లు దండుకున్న బాబు అవన్నీ గాలికి వదిలేసి జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరదీశారు. మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు కొట్టమన్నట్టుగా అసెంబ్లీలోనే వైఎస్సార్ సీపీ పక్ష నేత జగన్మోహన రెడ్డి ప్రశ్నిస్తే మా తాతలు మూతులు వాసన చూడండంటూ పాత చరిత్ర చెబుతూ పక్కతోవ పట్టించే ప్రయత్నం చేశారు. రుణమాఫీ తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్నట్టుగా రుణమాఫీ వ్యవహారం తయారైంది. ఓ వైపు రుణమాఫీ చేసేసినట్టు టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తూ, అనుచరులతో ప్రకటినలిప్పిస్తూ ... మిఠాయిలు తింటూ, తినిపించుకుంటూ, సన్మానాలు, సత్కారాలు చేయించుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న జిల్లా రైతులు మాత్రం జుత్తు పీక్కుంటున్నారు. ‘పచ్చ’ రాతలు చూసి మరింత పిచ్చెక్కిపోతున్నారు. ప్రాజెక్టులకు భరోసా ఏదీ జలయజ్ఞం ప్రాజెక్టులకు భరోసా లేకుండా పోయింది. వెలిగొండ ప్రాజెక్ట్ట్ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిధులు కేవలం రూ.5 కోట్లు కేటాయించి ఈ ఏడాదిలో పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రకటించి జిల్లా ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. టీడీపీ ప్రతినిధులూ మీరెక్కడ జిల్లా టీడీపీ ప్రతినిధులూ మీ చిరునామా ఎక్కడంటూ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు గిత్తకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చిరునామానే చెరిపేస్తారా అని కన్నెర్ర చేస్తున్నారు. ఈ జిల్లాకు కనీసం వెటర్నరీ యూనివర్శిటీని కూడా తెప్పించుకోలేని చేతగాని మీకు పదవులెందుకంటూ పిడికిలి బిగిస్తున్నారు. -
ఐక్యంగా పనిచేసినా ఫలితం రాలే!
కాంగ్రెస్ నేతల్లో మళ్లీ వలసల భయం నేడు స్పీకర్‌ను కలవనున్న సీఎల్పీ బృందం హైదరాబాద్: ఉపఎన్నికల ఫలితం కాంగ్రెస్ నేతలను తీవ్రంగా నిరాశపర్చింది. గతానికి భిన్నంగా పార్టీ నేతలంతా కలసికట్టుగా పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోవ డం వారిని అసంతృప్తికి గురిచేసింది. టీఆర్ఎస్ వంద రోజుల పాలనలో రుణమాఫీసహా ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని, విస్తృత ప్రచారం నిర్వహించినా ఆ పార్టీకి కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో నేతలు పునరాలోచనలో పడ్డారు. ప్రభుత్వానికి కనీసం ఆరునెలల సమయమైనా ఇవ్వకుండా తొందరపడి విమర్శలు చేశామా? అనే భావన నేతల్లో కన్పిస్తోంది. ై ఏఐసీసీ దూతలు రామచంద్ర కుంతియా, కేబీ కృష్ణమూర్తి వంటి నేతలు రాష్ట్రంలోనే మకాం వేసి ఉపఎన్నికల ప్రచారాన్ని నేరుగా పర్యవేక్షించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో తెలంగాణలో పార్టీ ఇమేజ్ను ఎలా పెంచాలో తెలియక తలపట్టుకున్నారు. మరోవైపు పార్టీ నేతల్లో మళ్లీ వలసల భయం పట్టుకుంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారని, తాజా ఫలితాల నేపథ్యంలో వలసల ఉధృతి మరిం త పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ దూకుడును అడ్డుకోవడానికి కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధిపై తక్షణమే అనర్హత వేటు వేయాలనే వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. వెంటనే శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని కలవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా బుధవారం ఉద యం 10 గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ను కలిసి ఇటీవల పార్టీ ఫిరాయించిన ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యపై అనర్హత వేటు వేయాలని వినతిపత్రం అందజేయనున్నారు. గతంలో పార్టీ మారిన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అనర్హత పిటిషన్‌పై తొందరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరనున్నట్టు తెలిసింది. -
వారంలోగా రైతుల ఖాతాల వివరాలివ్వండి
బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు వినతి ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్ లేకపోతే మాఫీ వర్తించదు సహకార సంఘాలు చేతితో ఎక్సెల్ షీటులో నమోదు ముగిసిన ఆన్లైన్ సమాచారం గడువు నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్: వారంలోగా రైతుల ఖాతాల సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా ఏపీసీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. వాస్తవానికి గత నెల 28వతేదీతోనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌కు రైతుల ఖాతాల సమాచారం ఇవ్వడానికి గడువు పూర్తి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ మార్గదర్శకాల్లో ఈ నెల 1వ తేదీన మార్పులు చేయడంతో మరో పక్షం రోజుల్లో సమాచారం ఇవ్వడానికి గడువిచ్చింది.అది కూడా సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అందులో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఒక రైతుకు సంబంధించిన రుణ ఖాతా సమాచారమైనా అందలేదని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌కు 38 లక్షలఖాతాల వివరాలు వచ్చాయి. అందులో ఇంకా 17 కాలాలను పూరించాలి. వాటిని బ్యాంకులు బ్రాంచీల వారీగా సమాచారాన్ని సేకరించి పూర్తిచేయాలి. ఇప్పటి వరకు అది కాలేదు. రైతుల నుంచి ఆధార్, రేషన్ కార్డులను, సర్వే నంబర్లను సేకరించి నమూనా పత్రాన్ని నింపాలి. ఇందుకోసం మరో వారం గడువు ఇస్తున్నామని, అప్పటికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. ఆధార్, రేషన్ కార్డుల వివరాలు తప్పనిసరని లేకుంటే రుణ మాఫీ వర్తించదని ఆయన స్పష్టం చేశారు. సహకార బ్యాంకుల రుణ ఖాతాల వివరాలు కంప్యూటరీకరణ లేనందున ఆ వివరాలను ఎక్సెల్ సీటులో నమోదు చేస్తున్నారు. ఎక్సెల్ షీటులో నమోదు చేస్తున్నవి సక్రమంగా ఉన్నాయో లేదో ఎక్కడా చెక్ ఉండదని, వాటిని మళ్లీ పరిశీలించాల్సి ఉందని అధికారులు వివరించారు. కొంత మంది రైతుల దగ్గర రేషన్, ఆధార్ కార్డులు లేవని అధికారులు పేర్కొనగా.. అవి ఉంటేనే మాఫీ అని చెప్పాలని, అవి తెచ్చిన వారి వివరాలే మాఫీ జాబితాలో పేర్కొనాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ నెలాఖరుకు కొన్ని రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారుతాయని, దీంతో బ్యాంకులు చాలా నష్టపోవాల్సి వస్తుందని, వీలైనంత త్వరగా మాఫీని తేల్చాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోరింది. దీనిపై సీఎం స్పందిస్తూ.. బ్యాంకర్లు వివరాలను త్వరగా ఇస్తే ఎంతో కొంత మేర రుణ మాఫీకి నిధులివ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.రుణ ఖాతాల వివరాలకు చెందిన సమాచార సేకరణపై కలెక్టర్లతో సమీక్షించనున్నారు. -
హైదరాబాద్ అందరిదీ
నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టండి ఉచిత పథకాలతో దేశ ప్రగతికి చేటు ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కేంద్రమంత్రి వెంకయ్యునాయుుడు హైదరాబాద్: ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌వైపు చూస్తున్నాయని వాటిని ఆకర్షించే శక్తి భాగ్యనగరానికే ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, భాగ్యనగరం మన అందరిదన్నారు. దీనిపై అందరికీ సమాన హక్కులున్నాయని, ఎవరైనా పెట్టుబడులు నిస్సంకోచంగా పెట్టవచ్చని సూచించారు. కల్లు గీయడం, కుండలు చేయడం లాంటి కళలు, పోచంపల్లి, కంచి పట్టు లాంటి చీరలు తయారు చేయడం మనం తప్ప మరే దేశం చేయలేదన్నారు. ఇక నుంచి ఎవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్ని సౌకర్యాలు మనదేశంలో ఉన్నాయని తెలిపారు. ఉచిత పథకాల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతుందని అలాం టివి ప్రోత్సహించ వద్దన్నారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనందరం భారతీయులమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రాంతీయత పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి ని దూరం పెట్టాలని కోరారు. జన్‌ధన్ కార్యక్రమాన్ని రూపొందించి 15 రోజు ల్లో మూడు కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇప్పించామన్నారు. రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా? వ్యవసాయ రంగానికి రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య సూటిగా ప్రశ్నించారు. రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం జరిగిన రైతు నేస్తం పురస్కారాలు-2014 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. వ్యవసాయ రంగానికి అప్పుల మాఫీ కంటే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అవసరమన్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చే అప్పులు ప్రజల డబ్బు అని, ప్రజల సొమ్ముపై కొద్దిపాటి లాభాలతో రైతులకు ఇచ్చే రుణాలను మాఫీ చేస్తే దివాళా తీస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ కంటే నాణ్యమైన పదిగంటల విద్యుత్ అవసరమని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రతిరైతు కూ వ్యవసాయ భూసార కార్డులు అందించేం దుకు ప్రధాని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ప్రకటించారు. కార్యక్రవుంలో నాబార్డు రిటైర్డ్ సీజీఎం పాలాది మోహనయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు. పురస్కారం అందుకున్న వారిలో సాక్షి దినపత్రిక సబ్ ఎడిటర్ జిట్టా బాల్‌రెడ్డి ఉన్నారు. రైతు నేస్తం పురస్కార గ్రహీతలు జీవితసాఫల్య పురస్కారం: డా.ఎల్.జలపతి రావు( ఏఎన్జీఆర్ఏయూ రిటైర్డ్ రిజిస్ట్రార్) శ్రమధాత్రి పురస్కారం: జి.మునిరత్నమ్మ(చిత్తూరు), రైతు విభాగం: పారినాయుడు(విజయనగరం), సామినేని హిమవంతరావు(ఖమ్మం), ఎం.విజయరామకుమార్ (కృష్ణా), దండా వీరాంజనేయులు(ప్రకాశం), ఎస్.స్తంభాద్రిరెడ్డి (మహబూబ్‌నగర్), పి.పావని (రంగారెడ్డి), మేకల వేణు, ఎం.నాగేశ్వరరావు (గుం టూరు), భూక్యా బాలగంగాధర్ నాయక్(అనంతపురం), గోదాసు నర్సింహా (నల్లగొండ), మహమ్మద్ రియాజుద్దీన్ (నిజామాబాద్). శాస్త్రవేత్తల విభాగం: ఆర్. రాఘవయ్య, ఆర్వీఎస్కే రెడ్డి(హైదరాబాద్), వై.కోటేశ్వర్రావు(గుంటూరు), జె.కృష్ణప్రసాద్ (బాపట్ల), టి.స్వర్ణలతాదేవి (కడప), కె.జలజాక్షి(అనంతపురం), జి.జయశ్రీ, కె. విజయలక్ష్మీ(హైదరాబాద్), ఎం.కిషన్‌కుమార్, వై.ఆంజనేయులు, బి.రమేష్‌గుప్తా(కరీంనగర్). విస్తరణ విభాగం: వి. లక్ష్మారెడ్డి, డి. చక్రపాణి (మెదక్), పి. గురుమూర్తి(విజయనగరం), బి. మురళీధర్(ఆదిలాబాద్), ఎం. సరితారెడ్డి(హైదరాబాద్). అగ్రి జర్నలిజం విభాగం: జిట్టా బాల్‌రెడ్డి (సాక్షి), చాపల శ్రీవకుళ (ఈటివి), కందిమళ్ల వెంకట్రావు (ఆంధ్రజ్యోతి), పి.రామచందర్‌రావు (99 టివి), మట్టిమనిషి కార్యక్రమం (టి న్యూస్), భూమిపుత్ర కార్యక్రమం (మా టీవీ). -
టీఆర్ఎస్ చెంప చెళ్లుమనే తీర్పు వస్తుంది
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పొన్నాల హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించే తీర్పు రాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యా ఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, ఈ విషయం తెలిసే టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా విలువైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మూడు నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రుణమాఫీని ఎగ్గొట్టడానికి వీలైనన్ని దారులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ అందక, కరెంటు లేక, కరువుతో అల్లాడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు మాత్రం పట్టడంలేదని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి, విదేశీ ప్రతినిధుల తో మాట్లాడటానికి గంటల తరబడి కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యలపై మాత్రం వెచ్చించకపోవడం బాధాకరమన్నారు. వాస్తుదోషాలు, కార్ల రంగులు, గులాబీ పూల పైనున్న శ్రద్ధ.. రైతుల జాతకాన్ని మార్చేందుకు లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు కేసీఆర్పైనున్న భ్రమలన్నీ తొలగిపోయాయని, టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలో ముసలం ప్రారంభమైనందునే కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని అనుమా నం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని తెలిసి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం వెనుక ఆంతర్యమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అయ్యో రైతు
ఖమ్మం: శాస్త్రీయ సర్వేల పేరుతో కొండంత నష్టం జరిగితే గోరంతే జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు పంపారు. అప్పుడు ఆ అధికారులు చేసిన సర్వే పాపమే ఇప్పుడు జిల్లా రైతులకు శాపమైందని జిల్లాలోని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రిజర్వుబ్యాంక్ ప్రకటించిన రైతు రుణాల రీ షెడ్యూల్ జాబితాలో జిల్లా పేరు గల్లంతైందని అంటున్నారు. గత సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. వరదలతో జిల్లాలో 35వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ.13 కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని అంచనాలు వేశారు. కానీ ఈ పంటలు నాటు వేసే దశలోనే ఉన్నాయని, వీటికి నష్టపరిహారం రాదని వ్యవసాయశాఖ అధికారులు కొట్టిపారేశారు. అక్టోబర్ 22వ తేదీ నుండి ఎడతెరపి లేకుండా వారం రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల పత్తి, 28 వేల ఎకరాల వరి, 15 వేల ఎకరాల మిర్చి, 22 వేల ఎకరాల మొక్కజొన్న, 20 వేల ఎకరాల కూరగాయ, ఇతర పంటలు మొత్తం 3.3 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయని అధికారులు, రైతు సంఘాల నాయకులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. పంటనష్టం రూ. 430 కోట్లకు పైగా ఉంటుందని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో చెప్పారు. కానీ వ్యవసాయశాఖ అధికారులకు మాత్రం చలనం రాలేదు. నష్టం జరిగిన పదిహేను రోజులకు కానీ అంచనాలు వేసేందుకు వెళ్ళలేదని రైతులు ఆరోపిస్తున్నారు. శాస్త్రీయసర్వేలు, అంచనాలు పేరుతో పంటనష్టాన్ని కుదించారు. 50 శాతం కంటే ఎక్కువగా పంటనష్టం జరిగితేనే పరిహారం వస్తుందని చెప్పారు. ఈ లెక్కన జిల్లాలో కేవలం 76 వేల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. ఇరత జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా పంటనష్టం అధికంగా ఉందని అందరూ ప్రకటించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముందు రైతులు కన్నీరు పెట్టారు. జిల్లా పరిస్థితులు చూసిన ఆమె ఖమ్మం జిల్లా పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకున్న నాథుడే కరువయ్యాడు. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమన కల్గుతుందని రైతులు భావించారు. రిజర్వ్‌బ్యాంక్ రీషెడ్యూల్‌పై మెలిక పెట్టి గత సంవత్సరం కరువు, వరదల మూలంగా పంటనష్టం వాటిల్లిన జిల్లాలకే రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. ఇందులో మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పేర్లు మాత్రమే ప్రకటించారు. ఈ వార్త విన్న జిల్లా రైతాంగం ఒక్కసారిగి ఖంగుతిన్నది. నాడు వ్యవసాయశాఖ అధికారులు చేసిన పాపం మూలంగానే జిల్లాకు ఆర్బీఐ జాబితాలో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్ అయితే ఊరట కల్గుతుందని భావించిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. రుణమాఫీ వర్తిస్తుందో, లేదో అని ఆందోళన చెందుతున్నారు. -
మాటలేనా..మాఫీలేదా?
‘నరకాసుర వధ’ విజయవంతం టీడీపీ అరాచకాలను లెక్కచేయని రైతులు, మహిళలు రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు డ్వాక్రా, రైతు రుణాలన్నీ రద్దుచేస్తానని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు దాటినా రుణమాఫీపై పూటకోమాట చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎటువంటి షరతులు లేకుండా రుణాలన్నీ రద్దుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో మూడు రోజులు చేపట్టిన ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి రైతులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పల్లెలు, పట్టణాలు.. అనే తేడా లేకుండా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మాటలతో గారడీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఎటువంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని నినదించారు. వెంటనే ఖరీఫ్ సాగుకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము కోరుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం ఏమిటని పలుచోట్ల మహిళలు నిలదీశారు. మూడు రోజులుపాటు జరిగిన ‘నరకాసుర వధ’ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు. టీడీపీ నేతల హల్చల్! రైతులు, మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘నరకాసుర వధ’ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అధికార బలాన్ని ఉపయోగించి పోలీసుల సాయంతో అడుగడుగునా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అనవసరంగా రోడ్డెక్కి అల్లరు సృష్టించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టించారు. గురువారం పామర్రులో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి శాంతియుత వాతావరణంలో చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమాన్ని అడ్డుకుని అరాచకం సృష్టించారు. శుక్రవారం కూచిపూడిలోనూ వైఎస్సార్ సీపీకి ప్రతిగా టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో 144 సెక్షన్ విధించారు. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మూడో రోజూ నిరసనల వెల్లువ శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యాన చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు రైతులు, మహిళలను నిలువునా మోసం చేశాడని ఉదయభాను విమర్శించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామంలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో పాటు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నందిగామలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, డ్వాక్రా రుణాలన్నీ రద్దుచేయాలని చల్లపల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ‘నరకాసుర వధ’లో పాల్గొన్న రైతులు వ్యక్తంచేసిన అనుమానాలు రైతుల రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఏమాత్రం స్పష్టత లేదు. తీవ్రమైన అయోమయం, గందరగోళంగా ఉంది. రుణమాఫీపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. విడ్డూరమైన ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. ఎర్రచందన చెట్లను తాకట్టు పెడతారట, ఇసుకపై సెస్ వేస్తారట, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను తెచ్చి మభ్యపెట్టేలా ఉన్నారు. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. అసలు రుణమాఫీ ఎక్కడుంది? ఎక్కడ అమలవుతోంది? జూన్ 30వ తేదీలోపు రుణాలు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేదే. చంద్రబాబు మాటలు నమ్మి పాత రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.3వేలు కడితే సరిపోయేదానికి ఇప్పుడు రూ.13,000 చెల్లించాల్సి వస్తోంది. అదనపు వడ్డీ ఎవరు చెల్లించాలి. మేమా.. లేక ప్రభుత్వం భరిస్తుందా? రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాకు ఎవరు భరోసా ఇస్తారు. ఆదేశాలు రాలేదంటున్నారు.. రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన తర్వాత బ్యాంకుల వద్దకు వెళ్తే ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారు. రైతులకు ఓదార్పు మాటలు చెబుతున్నారు గానీ, రుణమాఫీ అమలయ్యే సూచనలు కనిపించటం లేదు. రైతుల బాధలు ఎప్పటికి కడతేరేనో. - ప్రత్తి వీరబాబు, మునిపెడ,కృత్తివెన్ను మండలం మభ్య పెడుతున్నారు నిధులు అందుబాటులో లేకుండా ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. బ్యాంకులు రుణాలు వసూళ్లకు ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు వడ్డీలు ప్రభుత్వమే భరించాలి. ఇన్సూరెన్స్ అమలవుతుందో, లేదో తెలియని పరిస్థితి రైతుల్లో నెలకొంది. - వెంట్రపాటి శ్యాంబాబు, పెందుర్రు, బంటుమిల్లి మండలం స్పష్టమైన ప్రకటన చేయాలి చంద్రబాబు మాట నమ్మి పాత రుణాలను చెల్లించలేదు. రుణాలు రీషెడ్యూలు చేస్తే 13 శాతం వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ వడ్డీ ఎవరు కట్టాలనే విషయంపై స్పష్టతలేదు. ఒకవైపు ఖరీప్ సీజన్ రెండు నెలలు గడిచింది. ఎప్పటికి పంట రుణం ఇస్తారో అర్థంకావడం లేదు. - నాగమల్లేశ్వరరావు, కోకనారాయణపాలెం, గూడూరు(మం)