చేనేతకు సంక్షేమ అద్దకం | Subsidized equipment with cluster training | Sakshi
Sakshi News home page

చేనేతకు సంక్షేమ అద్దకం

Published Thu, Apr 25 2024 4:00 PM | Last Updated on Thu, Apr 25 2024 4:00 PM

Subsidized equipment with cluster training - Sakshi

మగ్గానికి మహర్దశ తెచ్చిన జగన్‌ 

నేతన్న సంక్షేమానికి రూ.3,706 కోట్లు 

కరోనా కష్టకాలంలోనూ అండ, మగ్గాల ఆధునికీకరణ 

క్లస్టర్‌ ట్రైనింగ్‌తో సబ్సిడీపై పరికరాలు  

సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది,  

నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు  
2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.

కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్‌ అందిస్తున్నారు.

ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం 
చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్‌ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్‌ వంటి ఈ– కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది.   

జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్‌)) 
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి.  
 
ఉప్పాడకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 
చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్‌ వీవర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం.  
 
నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత  మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం.  
– శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం  
  
జగన్‌కు రుణపడి ఉంటాం.. 
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్‌ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్‌ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి.   –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా 
 
మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా 
నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను.  –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా 
 
మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు 
రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్‌ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌. 
  
బాబు దగా, జగన్‌ అండ
బాబు హయాంలో 
► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు.  ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు 
► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్‌ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. 
► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు,  
► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు.  

జగన్‌ హయాంలో 
► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు.  
► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్‌ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్‌ దిగ్గజాలతో ఒప్పందాలు. 
► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. 
►  416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్‌డబ్ల్యూసీఎస్‌) రూ.250.01కోట్ల సాయం. 
►  వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement