cluster
-
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్‌కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
సూసైడ్ హెడేక్: ఈ 'తలనొప్పి'తో అంత ఈజీ కాదు!
బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు. యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్‌బాల్ బ్యాట్‌తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు. ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది. క్లస్టర్ హెడేక్స్ అంటే.. క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు. ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్‌ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్‌ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..) -
‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్‌లో ఏర్పాటు చేసే క్లస్టర్కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్–ఇన్–ఎయిడ్‌గా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్లస్టర్‌కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐటీఐఆర్, ఎల్రక్టానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఐటీఐఆర్‌పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది. 2013 నవంబర్ 13న ఐటీఐఆర్ క్లస్టర్‌ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్‌లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్‌పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. 2017లో ఐటీఐఆర్ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్‌లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్‌లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్‌తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది. -
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్‌రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్‌వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
మగ్గానికి మహర్దశ.. సొంత మగ్గం ఉన్న కుటుంబానికి ఏటా రూ.24 వేలు
సాక్షి, అమరావతి: మగ్గానికి మహర్దశ వ చ్చింది. పోగు పోగుగా సంక్షేమం అందుతోంది. నేతన్నల నరాలు సత్తువ పుంజుకున్నాయి. మొత్తంగా చేనేత రంగం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమాన్ని అద్దుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగానికి ప్రముఖ పాత్ర ఉంది. అందుకే 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మగ్గానికి మహర్దశ పట్టింది. సీఎం వైఎస్ జగన్ అందించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలుకు ఊతమి చ్చింది. ఆధునిక డిజైన్లు, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్రస్తాల తయారీలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ చేనేతకు కొత్త హంగులు అందిస్తోంది. ప్రత్యేకంగా క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ అనంతరం ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందించే కార్యక్రమం చేనేతల తలరాతలను మారుస్తోంది. ‘నేతన్న నేస్తం’తో రూ.969.77 కోట్లు చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం వరుసగా ఐదేళ్లు ‘నేతన్న నేస్తం’ ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వ్రస్తాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇ చ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. చేనేత వారోత్సవాల నిర్వహణకు ఆదేశాలు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని, క్లిష్టమైన బట్టలను నేయడానికి అంకితమైన కళాకారులను, ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు చేనేత వ్రస్తాలు ధరించాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చిందని గుర్తు చేసిన జవహర్‌రెడ్డి అదే స్ఫూర్తితో యువతరం సైతం చేనేత వ్రస్తాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ఆవరణలో చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించేలా స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. ఆగస్టు 7న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేనేత వ్రస్తాలు (చీర, ధోతీ) ధరించి వాక్‌థాన్ నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం స్వచ్ఛందంగా చేనేత వ్రస్తాలు ధరించాలని ఉద్యోగులను కోరారు. -
ఏపీలో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలకు ఆటంకం లేకుండా విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం ‘క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్’ (సీఆర్ఎంటీ) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వారి స్థానంలో రిసోర్స్ పూల్‌లో ఉన్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ బోధన చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట సెలవు పెట్టినా, డెప్యుటేషన్లపై మరో చోటకు వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఆర్ఎంటీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. హైసూ్కల్ కాంప్లెక్స్‌లో బడి బయట పిల్లల డేటాను సేకరించి వారిని బడిలో చేర్పించేందుకు, ఇతర విధులకు 2001–09 మధ్య రెండు మూడు ఉన్నత పాఠశాలలకు ఒక్కరు చొప్పున క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను (సీఆర్పి) నియమించింది. ప్రస్తుతం ఆయా విధుల్లో చాలావరకు ఎంఈవోలు, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లు చేస్తున్నారు. దీంతో పాఠశాలల్లో బోధనకు అన్ని అర్హతలు ఉన్న సీఆర్పిలను బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి మండలాన్ని ఒక క్లస్టర్‌గా రిజర్వ్ మొబైల్ టీచర్లుగా వారిని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,489 మంది క్లస్టర్ రిసోర్స్పర్సన్లు ఇకపై క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా మారనున్నారు. ఎంఈవో పర్యవేక్షణలో ఒక్కో సీఆర్ఎంటీ మూడు లేదా నాలుగు పాఠశాలలకు సేవలు అందించేలా విధులను నిర్ణయించారు. రాష్ట్రంలోని 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిద్వారా నిరాటంకంగా బోధన అందించవచ్చు. -
పండోరా క్లస్టర్
అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్ క్లస్టర్’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది. అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి. -
ఇక పక్కాగా ప్రతి పంట లెక్క
సాక్షి, హైదరాబాద్: పంట లెక్కల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు పంట లెక్కలను గ్రామాల్లో ఎవరో ఒకరి ద్వారా సేకరించి అంచనా వేస్తున్నారు. ప్రతిరోజూ స్థానిక ఏఈవోలు ఆయా సమాచారాన్ని సేకరించి అందజేస్తున్నారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలా సేకరించిన సమాచారం కచ్చితంగా ఉండట్లేదన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త సర్వేకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవో) వారి క్లస్టర్ పరిధిలోని ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి వాటిని స్వయానా చూసి రాసుకుంటారు. అలా ఏఈవోలు తమ పరిధిలోని దాదాపు 3–4 గ్రామాలు తిరిగి పక్కాగా లెక్కలు తీసుకుంటారు. అలా రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం, యాసంగిలకు సంబంధించిన లెక్కలను తీసుకుంటారు. దీంతో ప్రతి ఎకరాకు సంబంధించిన పంట లెక్కలను తీసుకుంటారు. ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ పోర్టల్‌లో పొందుపరుస్తారు. పథకాల అమల్లో స్పష్టత... పంట లెక్కలను పక్కాగా తీసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం, పథకాల అమల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉదాహరణకు ఒక నిర్దేశిత గ్రామంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో తెలుసుకోవడం వల్ల ఆ గ్రామానికి ఎంత యూరియా అవసరం? ఎంత డీఏపీ కావాలి? ఎన్ని విత్తనాలు అవసరమన్న సమాచారాన్ని పక్కాగా అంచనా వేయొచ్చు. దీనివల్ల ఎక్కడా కొరత లేకుండా రైతులకు ఎరువులను అందజేసే వీలుంటుంది. అంతేకాదు పంట పండించాక ఆయా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలోనూ స్పష్టమైన నిర్ధారణకు రావడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఏ ప్రాంతంలో ఎటువంటి వసతులు కల్పించాలన్న దానిపై సూక్ష్మస్థాయిలో తెలుసుకోవచ్చు. మొత్తం పంటల డేటా సేకరణ వల్ల రైతులకు అవసరమైన అన్ని అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని 4–5 రోజుల్లో ప్రారంభిస్తామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీలో క్లస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల అనుసంధానం చేసే క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ విధానం డిగ్రీ విద్యకు బూస్టర్‌లా పనిచేసే అవకాశముంది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ అంశంపై వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్సహా తొమ్మిది కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం అమలు కోసం మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. కోఠి మహిళా కళాశాల, నిజాం, సిటీ, బేగంపేట మహిళా, రెడ్డి మహిళా, సెయింట్ ఆన్స్ మెహిదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట, భవన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సైనిక్‌పురి, లయోలా అకాడమీ అల్వాల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాసంబంధిత అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదికలు పరీక్షలు, క్రెడిట్లు, వాటి బదలాయింపు, కోర్సులు, వనరులు తదితర అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని ఈ కమిటీలను పాపిరెడ్డి ఆదేశించారు. క్లస్టర్‌గా ఏర్పాటయ్యే కాలేజీలు పరస్పరం ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవాలి. క్లస్టర్‌లోని కాలేజీలే కాకుండా, సంబంధిత యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందంలో భాగస్వామ్యమవుతాయి. కాలేజీలు విద్యార్థుల సమయాన్ని బట్టి టైం టేబుల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. సెకండియర్‌లో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులు సైతం క్లస్టర్ ఫలాలను పొందవచ్చు. ప్రయోగశాలల పరస్పర వినియోగం ఒకే క్లస్టర్‌లోని ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి వస్తే.. ఇందుకయ్యే ఫీజులను ఉన్నత విద్యామండలి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్లస్టర్ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తారు. బోధనా సిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్నవారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకాంశం. లైబ్రరీలను, ప్రయోగశాలలను కూడా పరస్పరం వినియోగించుకునే అవకాశముంది. -
5 కంపెనీలు.. లక్ష ఉద్యోగాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయ పురోగతి మూలంగా అభివృద్ధిపథంలో తెలంగాణ అగ్ర భాగాన ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరా బాద్‌లో ఏర్పాటయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ద్వారా ప్రయోగశాలల్లో పురుడు పోసుకునే ఆవిష్కరణలు పౌరుల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్‌ను శుక్రవారం కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, డిజిటల్ టెక్నాలజీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తామని పేర్కొన్నారు. రిచ్ ద్వారా రాష్ట్రంలోని జాతీయ పరిశోధనాసంస్థలు, స్టార్టప్‌లు, పౌర సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒకేతాటిపైకి తెచ్చి స్థానికంగా నెలకొన్న సంక్లిష్ట సవాళ్లకు పరిష్కారం చూపుతామన్నారు. తద్వారా స్థానికుల జీవితాల్లో పరివర్తన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్, ఆహార, వ్యవసాయ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో రిచ్ ఆవిష్కరణ వ్యవస్థలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పునరుద్ధరణీయ ఇంధనం, వ్వర్థాల నిర్వహణ, ఎమర్జింగ్ టెక్నాలజీ రంగాలకు కూడా రిచ్ తన కార్యకలాపాలు విస్తరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టియాక్ నిర్ణయం మేరకే మెగా క్లస్టర్ దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని మెగా క్లస్టర్లు సమర్థవంతమైన శాస్త్రీయ ఫలాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్ ‘దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో అత్యంత వినూత్న దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అగ్రస్థానానికి చేరే సత్తా భారత్‌కు ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణల మీద దృష్టిని కేంద్రీకరిస్తుండటంతో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధిస్తోంది. అందుకే క్లస్టర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. హైదరాబాద్‌లో 200పైగా కంపెనీలతో కూడిన అతిపెద్ద బయో క్లస్టర్ జీనోమ్ వ్యాలీ ఉంది. మరోవైపు ఫార్మా రంగానికి రాజధానిగా పేరు సంపాదించింది. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఇక్కడ నుంచే వస్తున్నాయి. విత్తన రాజధానిగా, డిజిటల్ టెక్నాలజీ హబ్‌గా పేరు సంపాదించడంతోపాటు 60కి పైగా ప్రభుత్వ, బహుళ జాతి, ప్రైవేటు పరిశోధన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి’అని విజయ రాఘవన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర శాస్త్రీయ విభాగం కార్యదర్శి డాక్టర్ అరబింద మిత్రా, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ పాల్గొన్నారు. -
అథ్లెట్ల పోరాటం
ఎల్లెడలా ఆనందం నవోదయలో ముగిసిన క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్ అగ్రస్థానంలో మెదక్ ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్ రీజియన్ టోర్నీకి 16 మంది విద్యార్థులు ఎంపిక వర్గల్:ఒకరికి మరొకరు స్ఫూర్తి.. విజయమే అంతిమ లక్ష్యం..హోరాహోరీ పోరాటం..అరుపులు, కేరింతలు, హర్షాతిరేకాలు, చప్పట్లు.. రెండ్రోజుల పాటు వివిధ జిల్లాల అథ్లెట్ల విన్యాసాలతో వర్గల్ నవోదయ స్టేడియం మార్మోగింది. క్రీడాభిమానులకు అంతులేని ఆనందం పంచింది. విజయవంతంగా కొనసాగిన క్లస్టర్ స్థాయి అథ్లెటిక్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఆతిథ్య మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నవోదయ విద్యార్థులు క్రీడాస్ఫూర్తి చాటుతూ ఆటలపోటీల్లో తమ ప్రతిభ పాటవాలు ప్రదర్శించారు. అథ్లెటిక్స్ పోటీల్లో ఆతిథ్య మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యార్థులు 21 ఈవెంట్స్‌లో విజయాలు నమోదు చేసి, క్లస్టర్ మీట్లో అగ్రస్థానానికి ఎగబాకారు. 13 ఈవెంట్స్‌లో గెలుపొందిన మహబూబ్‌నగర్ జిల్లా నవోదయ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. 11 అంశాల్లో వరంగల్ నవోదయ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా నవోదయ 8, నల్గొండ జిల్లా 8 చొప్పున, ఈస్ట్ గోదావరి 3, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నవోదయ విద్యార్థులు ఒకటేసి క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచారు. క్లస్టర్ టోర్నీలో ‘వర్గల్’ హవా క్లస్టర్ టోర్నీలో ఆతిధ్య వర్గల్ నవోదయ విద్యార్థులు చక్కని పోరాట పటిమ ప్రదర్శించారు. మొత్తం 15 మంది బాలికలు, 15 మంది బాలురు బరిలో దిగారు. ఇందులో తొమ్మిది మంది బాలికలు, ఏడుగురు బాలురు విజయాలు నమోదు చేసి టోర్నీ జరిగిన రెండు రోజుల్లోను తమ ఆధిక్యత చాటారు. లాంగ్‌జంప్, హర్డిల్స్, 100 మీటర్ల పరుగులో యూ. స్వర్ణలత ప్రథమ స్థానంలో నిలిచింది. ఎల్ స్నేహ 1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. షాట్‌పుట్‌లో కె. పవిత్ర, 1500 మీటర్ల పరుగులో ఎస్ శ్రావణి, 3 కిలోమీటర్ల పరుగులో డి. ప్రియాంక, జావెలిన్ త్రోలో జి శ్రావ్య, డిస్కస్ త్రో ఎండీ ముబీన్, హామర్‌త్రోలో కే రోషిణి, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎన్ పూజితలు విజేతలుగా నిలిచి రీజినల్ మీట్‌కు ఎంపికయ్యారు. అదేవిధంగా 400 మీటర్లు, 800 మీటర్ల పరుగులో యూ చంద్రశేఖర్, 1500 మీటర్లు, 3 కిలోమీటర్ల పరుగులో పీ నవీన్‌రెడ్డిలు విజయాలు నమోదు చేసి రీజినల్ టోర్నీలో తమ పేరు ఖాయం చేసుకున్నారు. 5 కిలోమీటర్ల పరుగులో ఆర్ చైతన్య ప్రసాద్, 200 మీటర్ల పరుగులో జి రాజేష్, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆర్ విజయ్, 100 మీటర్ల పరుగులో డీ గణేష్, 5 కిలోమీటర్ల క్రాస్కంట్రిలో జీ రాజ్ కుమార్‌లు ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తం 21 ఈవెంట్లలో ఆతిథ్య నవోదయ విద్యార్థుల హవా కొనసాగింది. -
సౌలభ్యానికి స్వస్తి
కొత్తపేట సీహెచ్ఎన్సీ కార్యాలయం జిల్లాలో మూతపడ్డ 25 సీహెచ్‌ఎన్‌సీలు మినీ డీఎంహెచ్‌ఓలుగా ఉపకరించిన క్లస్టర్లు అయిదున్నరేళ్లుగా సేవలందించిన వ్యవస్థ రద్దుతో పీహెచ్‌సీలపై కొరవడనున్న పర్యవేక్షణ కొత్తపేట : జిల్లాలో అయిదున్నరేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నిర్వహణ, పరిపాలనను సులభతరం చేస్తూ మినీ డీఎం అండ్ హెచ్ఓలుగా సేవలందించిన కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్ (సీహెచ్ఎన్సీ)లకు బుధవారం తెరపడింది. సీహెచ్ఎన్సీ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో జిల్లాలో గల 25 సీహెచ్‌ఎన్‌సీలు బుధవారం మూతపడ్డాయి. ఆ క్టస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి Ðð ళ్లనున్నారు. ఈ మేరకు గురువారం రిపోర్టు చేయనున్నారు. జిల్లాలో 119 పీహెచ్‌సీలు ఉండగా వాటిని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం (డీఎం అండ్ హెచ్ఓ) పర్యవేక్షించేది. పీహెచ్‌సీలకు సంబంధించి అన్ని వ్యవహారాలనూ ఆ కార్యాలయమే నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం సీహెచ్ఎన్సీ వ్యవస్థ ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ప్రతిపాదన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ క్లస్టర్ వ్యవస్థకు బీజం పడింది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాలనా, నిర్వహణలను సులభతరం చేసేందుకు సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వైఎస్ ముందుంచారు. ప్రజారాగ్యానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన అందుకు అంగీకరిం మరికొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన హఠాన్మరణంతో అప్పట్లో ఆ వ్యవస్థ సాకారం కాకపోయినా.. తదుపరి పాలకుల 2011 ఫిబ్రవరిలో సీహెచ్ఎన్సీలను ప్రారంభించారు. 2 లక్షల జనాభాకు ఒక క్లస్టర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 360 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని క్లస్టర్లలో నియమించారు. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (సుమారు రెండేళ్ళ క్రితం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా స్థాయిని పెంచారు), సీహెచ్ఓ, డీపీఎంఓ, హెచ్ఈ, ఎంపీహెచ్ఈఓ, ఎస్ఏతో పాటు కొన్ని క్లస్టర్స్‌లో ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఓఎస్‌లను కూడా నియమించారు. అయితే తగినన్ని పరిపాలధినాకారాలు మాత్రం కల్పించలేదు. జిల్లా కేంద్రంలో ఉండే డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నిర్వహించే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, పీహెచ్‌సీల పనితీరు పరిశీలన తదితర బాధ్యతలను ఈ క్లస్టర్ ద్వారా నిర్వహిసూ ్తవచ్చారు. మెరుగు పరచడం మాని కనుమరుగు చేశారు.. జిల్లాలో 25 సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు కాగా ఒక్కోదాని పరిధిలో 6 నుంచి 9 పీహెచ్‌సీలు ఉండేవి. ఉదాహరణకు కొత్తపేట క్లస్టర్ పరిధిలో 6, పి.గన్నవరం క్లస్టర్ పరిధిలో 8 పీహెచ్సీలుండగా మండపేట పరిధిలో అత్యధికంగా 9 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇప్పుడు సీహెచ్ఎన్సీల రద్దుతో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ కొరవడుతుంది. ప్రభుత్వపరంగా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ముందు వరుసలో ఉండే పీహెచ్‌సీల ద్వారా మరిన్ని సేవలు, మరింత సత్వరం అందేలా సీహెచ్ఎన్సీలను మరింత మెరుగుపరచడం పోయి అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై పీహెచ్‌సీల వైద్యాధికారులు, పలువురు సిబ్బంది, ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని, పర్యవసానంగా వైద్యసేవలు కుంటుపడతాయని అంటున్నారు. తెలంగాణలో సీహెచ్ఎన్సీల వ్యవస్థ కొనసాగుతుండగా ఇక్కడ రద్దు చేయడంపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
క్లస్టర్ ఇక కనిపించదు...
రాజాం: గ్రామస్థాయిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్లస్టర్ వ్యవస్థను తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూలై 1 నుంచి క్లస్టర్ విధానానికి మంగళం పాడుతుండటంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లస్టర్ ఏర్పడిందిలా... గ్రామీణ స్థాయిలో వైద్యసేవలు ఎలా అందుతున్నా యో తెలుసుకోవడం డీఎంహెచ్ఓ బాధ్యత. అయితే జిల్లా వ్యాప్తంగా వీటిని పర్యవేక్షించడం ఆ ఒక్క అధికారికే సాధ్యం కాకపోవడంతో గత ప్రభుత్వం 2011 మే నెలలో క్లస్టర్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రతి 3 పీహెచ్‌సీలను కలుపుతూ 18 క్లస్టర్లును ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్‌కు డిప్యూటీ సివిల్ సర్జన్లను నియమించారు. దీంతో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లోని కొంతమంది సిబ్బందిని ఇక్కడకు తరలించా రు. ఒక్కో క్లస్టర్‌కు సుమారు రూ. 3 లక్షలతో అవసరమైన కంప్యూటర్, జిరాక్స్ మెషీన్, ఇన్వర్టర్, స్కానర్ తదితర ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు ఫర్నీచర్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలు పనిచేసే సేవలను గుర్తించి ఆన్లైన్లో ప్రభుత్వానికి పొందుపర్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలకు సూపర్వైజింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వైద్య సేవలు ఓ గాడిన పడ్డాయని అంతా ఒప్పుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వానికి మాత్రం ఇది కనిపించలేదు. క్లస్టర్ సిబ్బందికి పనిలేదనే నెపంతో జూలై 1 నుంచి ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసింది. క్లస్టర్ చేసే పనులు.. గ్రామ స్థాయిలో వైద్యసిబ్బంది ఎంత మేర వైద్యసేవలు అందిస్తున్నారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సాయం ఎలా అందిస్తున్నారో తెలుసుకోవడం. గర్భిణుల నమోదు, చిన్నారులకు టీకాలు వేయడం, టీబీ, లెప్రసీ తదితర వాటి ని పర్యవేక్షించడం, ఇమ్యునైజేషన్, ఫ్యామిలీ ప్లానిం గ్, పల్స్‌పోలియో తదితర కార్యక్రమాలపై సూపర్వైజింగ్ చేయడం వంటి పనులు క్లస్టర్ సిబ్బంది నిర్వహించేవారు. వీటిపై ఎప్పటికప్పుడు నివేదికలు త యారు చేసి డీఎంహెచ్ఓకు సమర్పిస్తే అందులో లోటుపాట్లను గుర్తించడానికి వీలుగా ఉండేది. తొలగిస్తే నష్టాలివే... జిల్లాలోని పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం డివిజ న్లలో 75 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీలోనూ సుమారు10 నుంచి 15 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కూ సుమారు 35 నుంచి 40 వర కూ సబ్‌సెంటర్లు ఉంటాయి. వీటిపై పూర్తి స్థాయి లో పర్యవేక్షణ కేవలం డీఎంహెచ్ఓకు సా ధ్యం కాకపోవడంతో క్లస్టర్లతో పనిచేయించుకుని లోటుపాట్లను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లను తొలగిస్తే పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతుం ది. గ్రామీణ ప్రజల్లో సర్కారు వైద్యంపై ఉన్న న మ్మకం కూడా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి క్లస్టర్లను యధావిధిగా ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
క్లస్టర్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం
► త్వరలోనే వ్యవస్థను రద్దుచేస్తామన్న మంత్రి ► రద్దుచేయక.. పోస్టులు కనిపించక ► అగమ్యగోచరంలో క్లస్టర్ పరిధిలోని సిబ్బంది సాక్షి, కడప : వైద్య ఆరోగ్యశాఖలో అంతర్భాగమైన క్లస్టర్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రద్దు జరగని పరిస్థితుల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత క్లస్టర్లను రద్దు చేస్తే ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎక్కడ పోస్టింగ్ కల్పిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అటు ప్రభుత్వంగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. పోస్టుల పరిస్థితి ఏంటి? ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 14వ తేదీలోపు చాలామంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఐదేళ్లు కాలపరిమితి పూర్తిచేసుకున్న వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ కూడా కిందిస్థాయి నుంచి ఉన్నత యంత్రాంగం వరకు ఖాళీల వివరాలను గుర్తించడంతోపాటు కలెక్టర్‌కు ఫైలు పంపి తెలియజేశారు. ఇక బదిలీలే తరువాయి.. ఇలాంటి పరిస్థితుల్లో బదిలీల ప్రక్రియ ముగిస్తే.. జిల్లాలో ఎక్కడా ఖాళీలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో క్లస్టర్లను రద్దుచేస్తే వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నెలకొంది. ఖాళీలు లేనప్పుడు క్లస్టర్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎక్కడ నియమిస్తారన్నది కూడా వారిని తొలిచివేస్తోంది. ఇప్పుడే రద్దుచేసి ఉంటే.. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో దాదాపు 14 క్లస్టర్లు నడుస్తున్నాయి. వీటికి డెప్యూటీ డీఎంహెచ్ఓ స్థాయి అధికారులు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. అయితే వీటిని రద్దుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే ఉద్యోగులకు వెసులుబాటు ఉండేది. వారు కూడా ఖాళీలను బట్టి స్థానాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. వైద్య ఆరోగ్యశాఖలో మూడేళ్లుగా కనిపించని బదిలీలు అంతకుముందు కిరణ్ సర్కార్ ఆధ్వర్యంలో, తర్వాత రెండేళ్ల టీడీపీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో చాలామంది ఉద్యోగులు బదిలీలకు నోచుకోలేదు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పట్ల పెద్దగా ఆసక్తిచూపలేదు. తాజా బదిలీల నేపథ్యంలో ఉద్యోగులు కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే 20 శాతంలోపు మాత్రమే ఉద్యోగులను బదిలీ చేయాలని నిబంధన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే! క్లస్టర్లపై పురోగతి లేదు : డీఎంహెచ్ఓ క్లస్టర్లను ప్రభుత్వం రద్దు చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమిటని డీఎంహెచ్ఓ డాక్టర్ సత్యనారాయణరాజును ‘సాక్షి’ వివరణ కోరగా క్లస్టర్లకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రత్యేకంగా దీనిపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని వివరించారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. -
సర్కారు బడికి ‘లాంగ్‌బెల్’
సర్కారు బడిలో గణగణ గంటలు మోగుతున్నా.. బుడిబుడి అడుగుల సవ్వడి లేదు.. విశాలమైన ఆటస్థలం ఉన్నా... ఆడుకునే చిన్నారి లేడు.. ‘ప్రైవేటు’ పాఠాల పోటీలో ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థులు కన్నెత్తి కూడా చూడడం లేదు. వెరసి అమ్మఒడి లాంటి సర్కారు బడి ఇప్పుడు తన ఒడిలో చదువుకొనే బిడ్డలు లేరని దీనంగా రోదిస్తోంది.. తన మనుగడకే ‘లాంగ్ బెల్’ కొడతారేమోనని భయపడుతోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సర్కారు స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నా.. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నా.. నిపుణులైన ఉపాధ్యాయులు నియమిస్తున్నా... విద్యార్థులు మాత్రం చేరడమే లేదు. అదే సమయంలో ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ప్రవేశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే సర్కారు పాఠశాలలో గత 10 ఏళ్లుగా ప్రవేశాల సంఖ్య ఎంత ప్రమాదకర స్థాయిలో తగ్గిందో తేటతెల్లమవుతోంది. నిష్పత్తి తగ్గితే బడికి ‘గంటే’.. పిల్లలందరూ ప్రైవేటు బాట పట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి దారుణంగా తగ్గుతోంది. పదేళ్ల కిందట ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తి 1:36 గా ఉంటే ప్రస్తుతం 1:25 కు చేరింది. అంటే 25 మంది పిల్లలకు ఒక టీచరున్నట్టు లెక్క. టీచర్- విద్యార్థి నిష్పత్తి ఇంకా తగ్గితే ప్రభుత్వ పాఠశాలలు మూత పడక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం క్లస్టర్ పేరిట స్కూళ్లను విలీనం చేసి మండలానికి కొన్ని స్కూళ్లు మాత్రమే ఉంచాలన్న ఆలోచనలో ఉంది. గ్రామానికి సమీపంలో ప్రభుత్వ స్కూలు ఉన్న ప్రస్తుత తరుణంలోనే విద్యార్థుల చేరికలు తగ్గిపోతున్నాయి. ఇక క్లస్టర్ పేరిట సమీపంలోని స్కూళ్లు కూడా దూరమైతే ఒక్క విద్యార్థి కూడా సర్కారు స్కూల్లో చేరే పరిస్థితి ఉండదు. సర్కారు వద్దు.. ప్రైవేటు ముద్దు.. అక్షరాలా 25 లక్షలు.. గత పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లిన విద్యార్థుల సంఖ్య ఇది. 2003-04 నుంచి 2013-14 మధ్య గణాంకాలను పరిశీలిస్తే దిమ్మ తిరిగే ఇలాంటి వాస్తవాలు ఎన్నో కనిపిస్తాయి. 2003-04 లో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య 1,02,50,658 గా ఉంటే గత విద్యాసంవత్సరంలో ఈ సంఖ్య 77,66,845 మాత్రమే. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో చేరే చిన్నారుల సంఖ్య 24,83,813 కి తగ్గిపోయింది. ఇదే ప్రైవేటు స్కూళ్లలో పదేళ్ల కిందట 32,78,828 మంది పిల్లలు చేరగా ఇప్పుడీ సంఖ్య 57,48,917కు పెరిగింది. అంటే దాదాపుగా 25 లక్షల మందికి పైగా పిల్లలు ప్రైవేటు బడులలో చేరారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రభుత్వ రంగంలో 79,781 బడులు ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య ఇంచుమించు అలాగే ఉంది. కానీ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య దశాబ్దం కిందట 12,573 ఉండగా ఇప్పుడు 25,302కు చేరింది. ప్రైవేటు వైపే ఎందుకు...? గతంతో పోలిస్తే ఇటీవల సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. టీచర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా బాగానే చేపట్టింది. ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సక్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కూడా తీసుకొచ్చింది. కానీ, విద్యార్థులను ఆక ర్షించడంలో మాత్రం విఫలమైంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బడుల్లోనే తమ బిడ్డలకు నాణ్యమైన విద్య అందుతుందని సగటు జీవి బలంగా నమ్ముతున్నాడు. సర్కారు బడుల్లోని ఉపాధ్యాయులను ప్రభుత్వం తరచుగా వేరే పనులకు ఉపయోగించుకోవడం. టీచర్లలో జవాబుదారీతనం లోపించడం. పాఠశాలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారు బడిలో పాఠాలు వానాకాలం చదువులే అనే అపవాదు ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. దీంతో సహజంగానే తల్లిదండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జేబులు గుల్ల చేసుకొని మరీ ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి వస్తోంది. -
జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని వినతి
రాజంపేట:క్లస్టర్, పీహెచ్సీ పరిధిలో విధి నిర్వహణలో తమకు కేటాయించిన జాబ్‌చార్ట్‌ను కొనసాగించాలని సీహెచ్ఓ, ఎంపీహెచ్‌ఓలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ పిచ్చయ్య ఆధ్వర్యంలోజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీ.రాజా, నారాయణ డీఎంఅండ్‌హెచ్‌ఓ నారాయణనాయక్‌కు విన్నవించారు. జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మంగళవారం డీఎంఅండ్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజంపేటలో పిచ్చయ్య విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ క్లస్టర్ పరిధిలో పనిచేసే సీహెచ్ఓ, ఎంపీహెచ్ఓల విధుల నిర్వహణ గురించి సరైన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ సెలవును మంజూరు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో (సబ్‌సెంటర్) ఎన్ఆర్ హెచ్ఎం స్కీం కింద విడుదలైన నిధులను ప్రస్తుతం మహిళ ఆరోగ్య కార్యకర్తలు, పబ్లిక్ హెల్త్ నర్సులు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ అకౌంట్ కింద ఖర్చు చేస్తున్నారని వివరించారు. సంబంధిత మగ, ఆడ ఆరోగ్య పర్యవేక్షకులు, మహిళ ఆరోగ్య కార్యకర్తలు జాయింట్ అకౌంట్ కింద నిధులు ఖర్చు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓల సంఘం ఉపాధ్యక్షులు మురళీ, దిబ్బన్న, నాగరాజస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు టీపీ రెడ్డయ్య, జాయింట్ సెక్రటరీ కుసుమకుమారి, జిల్లా నేతలు వేణు, స్వామిదాస్, సురేంద్రరాజు పాల్గొన్నారు. -
కావూరి.. కరుణించాలి
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : రాష్ర్టంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలతో ఘనకీర్తి పొందిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ నేతన్నల బతుకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. సర్కారు అస్తవ్యస్త విధానాలతో తరచూ తలెత్తుతున్న సంక్షోభాల వల్ల నేత కార్మికులు నూలుపోగులనే ఉరితాళ్లుగా చేసుకుని బలవన్మరణాల బలిపీఠమెక్కుతున్నారు. వస్త్రపరిశ్రమనే నమ్ముకుని ఐదు వేల మంది ఆసాములు, 25 వేల మంది కార్మిక కుటుంబాలు నిత్యం బతుకు సమరం సాగిస్తున్నాయి. పరిశ్రమలో ఆటుపోట్లతో నష్టపోతున్నది ఆసాములు, కార్మికులే. గత ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది ఆత్మహత్య చేసుకోవడం కార్మిక కుటుంబాల దుస్థితిని తెలుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జౌళిమంత్రిత్వ శాఖ సిరిసిల్లను క్లస్టర్‌గా ఎంపిక చేసి మరమగ్గాల ఆధునికీకరణకు పూనుకోవడం శుభపరిణామం. కేవలం ఈ క్లస్టర్‌తోనే కష్టాలు కడతేరుతాయనుకోవడం అత్యాశే అవుతుందని కార్మికులు అంటున్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభానికి మూలాలను గుర్తించి.. ఆ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరమగ్గాల ఆధునికీకరణ క్లస్టర్ ప్రారంభోత్సవానికి నేడు సిరిసిల్లకు వస్తున్న కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మరిన్ని వరాలు ప్రకటించాలని వేడుకుంటున్నారు. క్లస్టర్‌పై ఆసక్తి కరువు.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు పవర్‌లూం క్లస్టర్లను గుర్తించగా అందులో సిరిసిల్ల ఒకటి. దీనికింద 50 శాతం సబ్సిడీతో మరమగ్గాలను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న మగ్గాలకు ఆధునిక పరికరాలను అమర్చుకుంటే పవర్లూంపై మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 8 మగ్గాల వరకు ఆధునికీకరించుకోవచ్చు. సిరిసిల్లలో 5 వేల మంది ఆసాములు, 34 వేల మరమగ్గాలు ఉండగా ఇప్పటివరకు 392 మంది ఆసాములు, 2,982 మగ్గాలను మాత్రమే ఆధునికీకరించుకునేందుకు ముందుకొచ్చారు. సమస్యలిక్కడ.. సేవాకేంద్రం ఎక్కడో.. సిరిసిల్లలో సేవలందించాల్సిన మరమగ్గాల సేవాకేంద్రం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. దానిని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. సమస్యలు ఇక్కడ ఉంటే.. సేవా కేంద్రం అక్కడ ఉండడం ఎవరికి సేవలందించేందుకో అర్థం కాదు. చిత్తూరు జిల్లా నగరిలో పదివేల మరమగ్గాలు ఉంటే.. అక్కడే సేవా కేంద్రం కొనసాగుతోంది. 7వేల కుటుంబాలకే బీమా ధీమా సిరిసిల్లలో 25 వేల కార్మిక కుటుంబాలుండగా.. ఏడువేల కుటుంబాలకే జనశ్రీ బీమా యోజన వర్తిస్తోంది. మిగతా 18 వేల కుటుంబాలకు బీమా ధీమా కరువైంది. ఇప్పటికీ సగం మంది కార్మికులు గుర్తింపు కార్డులకు నోచుకోవడం లేదు. టెక్స్టైల్ పార్కులో పరిశ్రమల మూత రాష్ట్రంలోనే తొలిసారిగా 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కు ఆదిలోనే మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. అధిక విద్యుత్ బిల్లులు, అందని రాయితీలు, మౌలిక వసతుల లేమితో ఈ దుస్థితి తలెత్తింది. ఇందులో 223 ప్లాట్లు కేటాయించగా, 130 పరిశ్రమలు మాత్రమే వెలిశాయి. ఇందులో ఇప్పటికే 40 దాకా యూనిట్లు మూతపడ్డాయి. చేనేత ఖిల్లా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. కాలం చెల్లిన మగ్గాలను ఆధునికీకరించి నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో డిమాండ్‌గా వస్త్రాన్ని అమ్ముకునే అవకాశం దరిచేరుతోంది. దేశంలోనే తొలిసారిగా సిరిసిల్లలో పవర్‌లూం క్లస్టర్‌ను కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మంగళవారం ప్రారంభించనున్నారు. సిరిసిల్లను పవర్‌లూం క్లస్టర్‌గా ప్రకటించి ప్రత్యేక రాయితీలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జౌళి శాఖ అధికారులు పేర్కొంటుండగా, క్లస్టర్ ఏర్పాటు కార్మికుల కష్టాలను గట్టెక్కిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి ‘కావూరి’ రాక సందర్భంగా సిరిసిల్ల సమస్యలపై ఫోకస్... సిరిసిల్ల, న్యూస్‌లైన్ మూడు దశాబ్ధాలుగా సిరిసిల్ల నేతన్నలు పురాతన మగ్గాలతో కాటన్, పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో మొత్తం 34 వేల మరమగ్గాలు ఉండగా, ఇందు లో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మ గ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తవుతోంది. 120 డైయింగ్‌లు, 50 సైజింగ్లతో వస్త్రోత్పత్తి పరిశ్ర మ విస్తరించి ఉంది. పాతికవేల మంది కార్మికులు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మగ్గాలకు కేవలం రూ.30 వేల పెట్టుబడితో ఆధునికీకరించుకోవడం ద్వారా వస్త్రం నాణ్యత పెరుగుతుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మరమగ్గాలకు ఆధునికమైన వార్ప్, వెప్ట్ స్టాప్మోషన్, ఎపిసెంట్ బ్రేకింగ్ డివైస్, 0.75 హెచ్‌పీ మోటార్లు అమర్చుకుంటే సరిపోతుంది. ఈ విధానం మూలంగా పోగు తెగిపోయినప్పుడు వెంటనే మగ్గం ఆగిపోతుం ది. ఫలితంగా వస్త్రం నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క మగ్గం ఆధునికీకరించేందుకు రూ.30 వేలు అవసరమవుతుండగా, ఇందులో కేంద్ర జౌళి శాఖ రూ.15 వేల సబ్సిడీ అంది స్తోంది. మరో రూ.15 వేలను ఆసామి భరిస్తే మగ్గాల ఆధునికీకరణ పూర్తవుతుంది. ఇంత మొత్తాన్ని భరించలేని ఆసాములకు రూ.10 వేల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పవర్‌లూం క్లస్టర్ పెలైట్ పథకం ద్వారా ఎన్ని మగ్గాలనైనా వచ్చే ఐదేళ్ల లో ఆధునికీకరించేందుకు సబ్సిడీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ మగ్గాలపై ఆధునిక డిజైన్లను ఉత్పత్తి చేసే వీలుంది. మరోవైపు కార్మికుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇప్పించాలి. బకాయిలకు మోక్షం లభించేనా? 2010 మార్చి నుంచి సిరిసిల్ల సెస్‌కు రాష్ట్ర ప్ర భుత్వం ద్వారా రావాల్సిన యాభై శాతం విద్యుత్ రాయితీ బకాయి ఏటేటా పెరిగిపోతోంది. ఇప్పటివరకు రూ.25.26 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సిరిసిల్లలో 5,710 మరమగ్గాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిపై వచ్చే విద్యుత్ బిల్లుల్లో సగాన్ని ఆసామి చెల్లిస్తుండగా, మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించాలి. ఇటీవల ప్రభుత్వం సెస్ బకాయిలు మంజూరు చేస్తూ, రూ.7.59 కోట్ల ఎఫ్ఎస్ఏ రద్దు చేస్తూ జీవో జారీ చేసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో సెస్‌కు రావాల్సిన రూ.25.26 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఫలితంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మూడంచెల విధానం సిరిసిల్లలో మూడంచెల విధానం అమలవుతోంది. నూలు మిల్లుల ద్వారా సిరిసిల్లలోని యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములు నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేసిన తరువాత తిరిగి ఆ వస్త్రాన్ని యజమానులకు అప్పగిస్తారు. ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులకు పని కల్పిస్తారు. మగ్గాల యజమాని ఆసామే కావడంతో కరెంటు బిల్లులను భరిస్తూ యజమాని వద్ద నూలు తెచ్చుకుని వస్త్రాన్ని తయారు చేసి అప్పగించడం ఆసామి డ్యూటీ. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. సిరిసిల్లలో యాభైమంది వరకు యజమానులు ఉండగా.. ఐదువేల మంది ఆసాములు ఉన్నారు. అందరూ కలిసి పాతికవేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమలో సంక్షోభం కారణంగా ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధలు, అనారోగ్యం, పరిశ్రమ సంక్షోభం ఆత్మహత్యలకు కారణమవుతోంది. కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి లభించే విధంగా చేతినిండా పని ఉంటేనే వారి బతుకులకు భరోసా లభిస్తుంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు.. విద్యుత్ టారిఫ్ రేటు పెరగడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు ఎక్కువగా వస్తున్న విద్యుత్ చార్జీలను భరించలేకపోతున్నారు. వీటికి తోడు ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్ఎస్ఏ) భారంగా మారాయి. మార్కెట్లో మరమగ్గాల మరమ్మతుకు అవసరమయ్యే విడిభాగాల రేట్లు పెరగడం, వస్త్రపరిశ్రమకు అవసరమైన నూలు రేట్లు పెరగడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. అదే స్థాయిలో వస్త్రాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి వీలులేక వస్త్రానికి గిట్టుబాటు ధర లభించడం లేదు. యజమానులు, ఆసాములు, కార్మికుల వ్యవస్థ మొత్తం ప్రైవేటు, అసంఘటిత రంగం కావడంతో ప్రభుత్వపరంగా వారిపై అజమాయిషీ ఉండడం లేదు. ఫలితంగా ఆసాములు సమ్మె చేయడంతో దినసరి కార్మికులు నష్టపోతున్నారు. యజమానులు మొండికేసినప్పుడు కార్మికశాఖ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో రాత్రీ పగలు పని చేయడం మూలంగా కార్మికులు, ఆసాములు శారీరకంగా అలసిపోతున్నారు. ఒక్కో కార్మికుడు పన్నెండు గంటల పాటు వస్త్రోత్పత్తి చేయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఎనిమిది గంటల పని విధానం ఉంటే పరిశ్రమలో కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. ఇటీవల అమలు చేస్తున్నా అది పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. సిరిసిల్ల వస్త్రోత్పత్తికి అవసరమైన నూలును యజమానులతో సంబంధం లేకుండా ఆసాములకు అందే విధంగా ప్రభుత్వ పరంగా నూలు డిపోలు లేకపోవడం పెద్ద సమస్య. ప్రభుత్వం నూలు డిపోలను ఏర్పాటు చేస్తే కొంత మేర మేలు జరిగే అవకాశముంటుంది. చేతినిండా పని ఉండాలి కార్మికులకు చేతినిండా పని ఉండే విధంగా చూస్తే చాలు. చేసుకుని బతుకుతం. నేను సూటింగ్ పని చేస్తా. నా భార్య మల్లిక బీడీలు చేస్తుంది. ఇప్పుడు 8 గంటలు పని చేస్తే వారానికి వెయ్యి నుంచి 1300 వస్తుంది. కూలి పెంచి పని కల్పించాలి. - సామల సాయికృష్ణ, కార్మికుడు హెల్త్‌కార్డులు ఇవ్వాలి కార్మికులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు దవాఖానాల్లోనూ ఉచితంగా వైద్యం అందించాలి. మగ్గాలను ఆధుని కీకరించడంతోపాటు కార్మికులకు ఇల్లు, జాగ ఇచ్చి ఆ దుకోవాలి. అన్నింటి ధరలు పెరిగిన యి. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతలేదు. - కొమటిపల్లి సదానందం, కార్మికుడు కార్మికులకు మగ్గాలివ్వాలి ప్రతీ కార్మికుడికి నాలుగు మగ్గాలు ప్రభుత్వం అందించే ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణానికి రుణ వసతి కల్పించాలి. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించాలి. - మూషం రమేశ్, కార్మిక నాయకుడు చేనేత రంగాన్ని జౌళి శాఖ నుంచి వేరు చేసి సిరిసిల్ల కేంద్రంగా ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆప్కో తరహాలో కో-ఆప్టెక్స్ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ధర లేనప్పుడు నిల్వ చేసుకునే ఉత్పత్తిదారులకు రుణవసతి కల్పించాలి. వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలను రాయితీపై అందించేందుకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. చేనేత రుణాలతోపాటు మరమగ్గాల పరిశ్రమకు సంబంధించిన రుణాలను, వ్యక్తిగత రుణాలను మాఫీ చేయాలి. సిరిసిల్లకు 50 శాతం విద్యుత్ రాయితీని అందిస్తుండగా.. మరో 25 శాతం పెంచాల్సిన అవసరం ఉంది. వస్త్రోత్పత్తి, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ జనశ్రీ బీమా పాలసీలు చేయించాలి. తమ వద్ద పనిచేసే కార్మికులందరికీ యజమానులు, ఆసాములు బీమా చేయించేలా చర్యలు తీసుకోవాలి. పేద కార్మికులకు 35 కిలోల అంత్యోదయ కార్డులను అందించి అనర్హుల కార్డులను తొలగించాలి. సిరిసిల్లలోనే పాలిస్టర్, కాటన్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి వస్త్రం అమ్మకాలకు మార్కెట్ వసతి కల్పించాలి. సిరిసిల్ల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి కాకుండా.. దోమ తెరలు, చీరెల ఉత్పత్తి, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. {పభుత్వరంగ సంస్థల్లో సిరిసిల్ల వస్త్రాన్ని వినియోగించే విధంగా ప్రోత్సహించాలి. సాంఘిక సంక్షేమ హాస్టల్, స్కూల్ పిల్లలకు డ్రెస్‌లు, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బంది యూనిఫాంలకు ఇక్కడి వస్త్రాన్ని వినియోగించాలి. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న డైయింగ్, సైజింగ్, వార్పిన్ యూనిట్లకు పవర్‌లూం సబ్సిడీని వర్తింపజేయాలి. పవర్‌లూం స్థాపనకు గతంలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ ఇవ్వగా దాన్ని రూ.75 వేలకు పెంచి పవర్‌లూం పరిశ్రమను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్‌లూం సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. సబ్సిడీ విడుదల చేసి పవర్‌లూం పరిశ్రమ పటిష్టానికి ప్రభుత్వం కృషి చేయాలి. సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో చేపడితే.. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సమస్యలకు శాశ్వత మోక్షం లభిస్తుంది. ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ‘సిరి’సిల్లగా విలసిల్లే అవకాశం ఉంది. -
పంచాయతీలకు సిబ్బంది కొరత
మోర్తాడ్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటైనా కార్యదర్శుల కొరతతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పంచాయతీలను క్లస్టర్లుగా మార్చి క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం భావించింది. అయితే కార్యదర్శుల కొరత వల్ల ఒక కార్యదర్శికి ఒక క్లస్టర్ కాకుండా రెండు, మూడు క్లస్టర్ల బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో 718 పంచాయతీలకు గాను 477 క్లస్టర్లు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాలో 477 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండాలి. అయితే అనేక మంది కార్యదర్శులు పదవీ విరమణ చేయడం, కొత్తగా కార్యదర్శుల నియామకాలు లేక పోవడంతో కార్యదర్శుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 160 మంది కార్యదర్శులే పనిచేస్తుం డగా జిల్లాలో 317 క్లస్టర్లకు ఇన్చార్జి కార్యదర్శులే గతి అయ్యారు. ఒక క్లస్టర్లో రెండు, మూడు పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రా మ పంచాయతీలలో అధిక జనాభా ఉండటం తో ఆ ఒక్క పంచాయతీని ఒక క్లస్టర్‌గా గుర్తిం చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమించాలి. గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను పరి ష్కరించాలంటే పాలకవర్గంతో పాటు కార్యదర్శి పని చేయాల్సి ఉంటుంది. పంచాయతీకి రావాల్సిన పన్నులను వసూలు చేయ డం, మురికి కాలువలను, గ్రామంలోని వీధులను పరిశుభ్రంగా ఉండేలా చూడటం, వీధి దీపాల సమస్య, తాగు నీటి సరఫరా సక్రమం గా జరి గేలా పర్యవేక్షించడం కార్యదర్శి ప్రధా న బాధ్యత. అంతేకాక పంచాయతీ పాల కవర్గం సమావేశాలను, గ్రామ సభలను నిర్వహిం చడం కార్యదర్శుల విధి. ఒక క్లస్టర్లో రెం డు, మూడు పంచాయతీలు ఉంటే ఆ క్లస్టర్ పరిధిలోని పంచాయతీల పూర్తి బాధ్యత కార్యదర్శి నిర్వర్తించాలి. చిన్న పంచాయతీ అయినా పెద్ద పంచాయతీ అయినా చేసే పని ఒక్కటే కావడంతో పని భారం అధికంగానే ఉం టుం ది. అయితే ఒక కార్యదర్శికి రెండు, మూడు క్లస్టర్ ల బాధ్యతలను అప్పగించడం వల్ల పనులు సరిగా జరుగడం లేదు. కొత్తగా ఏర్పాటయిన పంచాయతీ పాలకవర్గాలు కార్యదర్శులపై తీవ్ర పని భారం మోపుతున్నాయి. దీని వల్ల కార్యదర్శులు తమ సొంత పోస్టింగ్ పంచాయతీలపై దృష్టి పెట్టి ఇన్చార్జి క్లస్టర్ల లో పనులు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు సర్పంచ్‌లకు కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. ఒక కార్యద ర్శి నాలుగైదు పంచాయతీల సర్పంచ్‌లతో జా యింట్ చెక్ పవర్ కలిగి ఉండటం వల్ల సకాలంలో నిధులు డ్రా చేయడాని కి ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని సర్పంచ్‌లు వాపోతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 2,261 కార్యదర్శుల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.దీంతో జిల్లాలో 317 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండ గా పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు.