Recruitment Of Cluster Reserve Mobile Teachers - Sakshi
Sakshi News home page

ఏపీలో క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్‌.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

Jul 12 2023 4:20 AM | Updated on Jul 12 2023 1:02 PM

Recruitment of Cluster Reserve Mobile Teachers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలకు ఆటంకం లేకుండా విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం ‘క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్‌’ (సీఆర్‌ఎంటీ) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వారి స్థానంలో రిసోర్స్‌ పూల్‌లో ఉన్న క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్‌ బోధన చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట సెలవు పెట్టినా, డెప్యుటేషన్లపై మరో చోటకు వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఆర్‌ఎంటీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. హైసూ్కల్‌ కాంప్లెక్స్‌లో బడి బయట పిల్లల డేటాను సేకరించి వారిని బడిలో చేర్పించేందుకు, ఇతర విధులకు 2001–09 మధ్య రెండు మూడు ఉన్నత పాఠశాలలకు ఒక్కరు చొప్పున క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లను (సీఆర్పి) నియమించింది. ప్రస్తుతం ఆయా విధుల్లో చాలావరకు ఎంఈవోలు, ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు చేస్తున్నారు.

దీంతో పాఠశాలల్లో బోధనకు అన్ని అర్హతలు ఉన్న సీఆర్పిలను బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి మండలాన్ని ఒక క్లస్టర్‌గా రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లుగా వారిని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,489 మంది క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్లు ఇకపై క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లుగా మారనున్నారు. ఎంఈవో పర్యవేక్షణలో ఒక్కో సీఆర్‌ఎంటీ మూడు లేదా నాలుగు పాఠశాలలకు సేవలు అందించేలా విధులను నిర్ణయించారు. రాష్ట్రంలోని 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిద్వారా నిరాటంకంగా బోధన అందించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement