సౌలభ్యానికి స్వస్తి
సౌలభ్యానికి స్వస్తి
Published Thu, Jul 21 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కొత్తపేట సీహెచ్‌ఎన్‌సీ కార్యాలయం
జిల్లాలో మూతపడ్డ 25 సీహెచ్‌ఎన్‌సీలు
మినీ డీఎంహెచ్‌ఓలుగా ఉపకరించిన క్లస్టర్లు
అయిదున్నరేళ్లుగా సేవలందించిన వ్యవస్థ
రద్దుతో పీహెచ్‌సీలపై కొరవడనున్న పర్యవేక్షణ
కొత్తపేట : జిల్లాలో అయిదున్నరేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) నిర్వహణ, పరిపాలనను సులభతరం చేస్తూ మినీ డీఎం అండ్ హెచ్‌ఓలుగా సేవలందించిన కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్ (సీహెచ్‌ఎన్‌సీ)లకు బుధవారం తెరపడింది. సీహెచ్‌ఎన్‌సీ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో జిల్లాలో గల 25 సీహెచ్‌ఎన్‌సీలు బుధవారం మూతపడ్డాయి. ఆ క్టస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి Ðð ళ్లనున్నారు. ఈ మేరకు గురువారం రిపోర్టు చేయనున్నారు. జిల్లాలో 119 పీహెచ్‌సీలు ఉండగా వాటిని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం (డీఎం అండ్ హెచ్‌ఓ) పర్యవేక్షించేది. పీహెచ్‌సీలకు సంబంధించి అన్ని వ్యవహారాలనూ ఆ కార్యాలయమే నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం సీహెచ్‌ఎన్‌సీ వ్యవస్థ ఏర్పడింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ప్రతిపాదన
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ క్లస్టర్ వ్యవస్థకు బీజం పడింది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాలనా, నిర్వహణలను సులభతరం చేసేందుకు సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వైఎస్ ముందుంచారు. ప్రజారాగ్యానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన అందుకు అంగీకరిం మరికొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన హఠాన్మరణంతో అప్పట్లో ఆ వ్యవస్థ సాకారం కాకపోయినా.. తదుపరి పాలకుల 2011 ఫిబ్రవరిలో సీహెచ్‌ఎన్‌సీలను ప్రారంభించారు. 2 లక్షల జనాభాకు ఒక క్లస్టర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 360 క్లస్టర్‌లు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని క్లస్టర్లలో నియమించారు. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (సుమారు రెండేళ్ళ క్రితం డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓగా స్థాయిని పెంచారు), సీహెచ్‌ఓ, డీపీఎంఓ, హెచ్‌ఈ, ఎంపీహెచ్‌ఈఓ, ఎస్‌ఏతో పాటు కొన్ని క్లస్టర్స్‌లో ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఓఎస్‌లను కూడా నియమించారు. అయితే తగినన్ని పరిపాలధినాకారాలు మాత్రం కల్పించలేదు. జిల్లా కేంద్రంలో ఉండే డీఎం అండ్ హెచ్‌ఓ కార్యాలయం నిర్వహించే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, పీహెచ్‌సీల పనితీరు పరిశీలన తదితర బాధ్యతలను ఈ క్లస్టర్ ద్వారా నిర్వహిసూ ్తవచ్చారు.
మెరుగు పరచడం మాని కనుమరుగు చేశారు..
జిల్లాలో 25 సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు కాగా ఒక్కోదాని పరిధిలో 6 నుంచి 9 పీహెచ్‌సీలు ఉండేవి. ఉదాహరణకు కొత్తపేట క్లస్టర్ పరిధిలో 6, పి.గన్నవరం క్లస్టర్ పరిధిలో 8 పీహెచ్‌సీలుండగా మండపేట పరిధిలో అత్యధికంగా 9 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇప్పుడు సీహెచ్‌ఎన్‌సీల రద్దుతో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ కొరవడుతుంది. ప్రభుత్వపరంగా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ముందు వరుసలో ఉండే పీహెచ్‌సీల ద్వారా మరిన్ని సేవలు, మరింత సత్వరం అందేలా సీహెచ్‌ఎన్‌సీలను మరింత మెరుగుపరచడం పోయి అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై పీహెచ్‌సీల వైద్యాధికారులు, పలువురు సిబ్బంది, ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని, పర్యవసానంగా వైద్యసేవలు కుంటుపడతాయని అంటున్నారు. తెలంగాణలో సీహెచ్‌ఎన్‌సీల వ్యవస్థ కొనసాగుతుండగా ఇక్కడ రద్దు చేయడంపై పునరాలోచించాలని కోరుతున్నారు.
Advertisement