centres
-
శివకాశీలో భారీ పేలుళ్లు.. 10 మంది మృతి
సాక్షి, తమిళనాడు: విరుదునగర్ జిల్లా శివకాశీలోని రెండు బాణా సంచా తయారీ కేంద్రాల్లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటలో 10 మంది కార్మికులు మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషయంగా ఉంది. గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణా సంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివకాశీ సమీపంలోని రెంగపాలయంలో ఒక బాణా సంచా తయారీ కేంద్రం నడుస్తోంది. ఆ కేంద్రానికి ముందు వైపు ఉన్న షాపులో బాణాసంచా అమ్మకాలు జరుపుతారు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో భారీగా బాణా సంచాను నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చడంతో ఒక క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. దీంతో మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించాయి. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
అన్నదాతకు ప్రతి అడుగులో అండగా ఏపీ ప్రభుత్వం
-
పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం: నిరంజన్‌రెడ్డి
-
ఖమ్మంలో విజృంభిస్తున్న కరోనా
-
ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్తు వేళ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్టు దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు చోట్ల చిన్న కోవిడ్ కేర్ సెంటర్లలో 25 వరకు బెడ్లను, చాలాచోట్ల వంద వరకు బెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కోవిడ్ కేర్ సెంటర్లో మూడు/నాలుగు ఆక్సిజన్ పడకలను సిద్ధంగా ఉంచారు. వైద్యుల పర్యవేక్షణ నుంచి ప్రాథమిక చికిత్స వరకు.. కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో రోగులకు ప్రాథమిక చికిత్స అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయం, విశాఖ జిల్లా సింహాచలం, గుంటూరు జిల్లా పెదకాకాని, ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం, మహానంది, ఉరుకొంద ఆలయాలు, వైఎస్సార్ జిల్లా గండి, అనంతపురం జిల్లా కసాపురం, చిత్తూరు జిల్లా కాణిపాకం, శ్రీకాళహస్తి, చౌడేపల్లి మండలం దిగువపల్లి ఆలయాల ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు దాదాపు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత పలు రైళ్ల దారి మళ్లింపు -
ఈ నెల 30 నుంచి రైతు ముంగిట సేవలు..
సాక్షి, విజయవాడ: గ్రామస్థాయిలో రైతుకు వ్యవసాయ అనుబంధ శాఖ సేవలు అన్ని అందుబాటులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. స్వామినాథన్ సిఫార్సు చేసిన సూచనలన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలులోకి తీసుకువస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. 10,641 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో రానున్నాయని, ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. కేంద్రాల్లో కియోస్క్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటారన్నారు. గ్రామ స్థాయిలో ఖరీఫ్ కు సంబంధించిన వరి, వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కియోస్క్ లో పంటలకు సంబంధించి సమాచారం అందుబాటులో ఉంటుంది. కియోస్క్ లు అన్ని ఒకే నెట్ వర్క్ గా ఉంటాయన్నారు. ప్రతి కియోస్క్ ద్వారా అత్యంత నాణ్యమైన అమ్మకాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రైతు భరోసా భవనాలు సిద్ధం.. సబ్సిడీ పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. వ్యవసాయ, హార్టీ కల్చర్, ఫిషరీష్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. 10,505 రైతు భరోసా భవనాలను సిద్ధం చేశామని తెలిపారు. నెలాఖరుకు అన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా మట్టి నాణ్యత పరిశీలన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామాల్లో ఆవులు,గేదెలు,ఎద్దులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. విత్తన పంపిణీకి సిద్ధం.. గ్రామస్థాయిలో విత్తన పంపిణీకి సిద్ధం చేస్తున్నామని ఏపీ సీడ్స్ డైరెక్టర్ శేఖర్‌బాబు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచి 8 లక్షలు క్వింటాళ్లు వరి, వేరుశనగా, పెసలు, పిల్లి పెసర సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాలు నుంచి నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. -
ఖాళీ డబ్బాల్లా ఏటీఎంలు!
‘రాజన్న పది రోజుల కిందనే తుకం పోసిన. నాటుకు వస్తది. కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు.. బ్యాంకుకు పోతే పైసల్లేవంటున్నరు. ఏటీఎంలల్ల కూడా ఏం లేవు. ఏంజేయాలే’.. అంటూ మరో రైతు భూమన్న అన్న మాటలివి. ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరిదే కాదు. ఉమ్మడి జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. బ్యాంకులు మాత్రం నగదు లేదు, రూ.రెండే వేలు ఇస్తమంటున్నరని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): నోట్ల రద్దు ప్రభావం నేటికి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగదు కొరతతో ఖాతాదారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బ్యాంకుల ముందు రైతులు, ఖాతాదారులు బారులు తీరుతున్నారు. బ్యాంకర్లు మాత్రం ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేలకు మించి ఇవ్వడం లేదు. రామారెడ్డి మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలుండగా 35,909 జనాభా ఉంది. మండల కేంద్రం రామారెడ్డిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సొసైటీ బ్యాంకులతో పాటు రెడ్డిపేటలో ఎస్బీఐ బ్యాంకులున్నాయి. రామారెడ్డిలో ఇండిక్యాష్ ఏటీఎం, రెడ్డిపేటలో ఎస్బీఐ ఏటిఎంలు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. అయితే నగదు కారణంగా 24 గంటలపాటు పని చేయాల్సిన ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మండలంలోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. రైతులు, ఖాతాదారులు, సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు, ధాన్యంలవీ అదే కథ.. రామారెడ్డి మండలంలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 రెవెన్యూ గ్రామాలున్నాయి. యాసంగి పంట పెట్టుబడి కోసం అర్హులైన 7791 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద డబ్బులను జమ కానున్నాయి. దీనికి తోడు ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం బ్యాంకు ఖాతాల్లో వస్తుండడంతో డబ్బుల రైతులు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. నగదు కొరత కారణంగా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి రూ.2వేలు ఏం సరి పోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు సైతం నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగదు కొరతను నివారణకు గతంలో నగదు రహితంను సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజలకు ఇప్పటికీ నగదు తిప్పలు తప్పడం లేదు. ఏటీఎంను తెరిపించండి మోర్తాడ్: మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఎన్నో రోజుల నుంచి మూసి ఉంటున్నా బ్యాంకు అధికారులు ఏమి పట్టించుకోక పోవడంతో స్థానిక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంను తెరచి ఉంచితే వినియోగదారులు తమకు అవసరం ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవడంతో పాటు, మినీ స్టేట్మెంట్, బ్యాంకు బ్యాలెన్స్ ఇతర సదుపాయాలను పొందుతారని పలువురు వినియోగదారులు వెల్లడించారు. ఏటీఎంను నిరంతరం మూసి ఉంచడం కారణంగా ఎంతో మంది వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాన్ని తెరచి ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
మహిళా పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికల కమిషన్ చర్యలు
సాక్షి, నిజామాబాద్ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారత సాధించి అందరితో తాము సమానమనే భావన తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక గుర్తిం పు ఇవ్వనుంది. కేవలం మహిళా ఉద్యోగులే పోలింగ్ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించగా, ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో మొత్తం ఆరు మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుపుతూ కలెక్టర్ రామ్మోహన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడే మహిళా పోలింగ్ కేంద్రాలు ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గల 47వ నంబరు పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఇందులో 1096 మంది ఓటర్లున్నారు. బోధన్ నియోజకవర్గంలో 447 మంది ఓటర్లున్న ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లో గల 81వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 188వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ 683 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో నూతన వైశ్య పాఠశాల (మానిక్‌భవన్)లో గల 106వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 952 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ రూరల్‌లో గూపన్పల్లిలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉన్న 81వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇందులో 744 మంది ఓటర్లున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ ఎంపీడీవో కొత్త భవనంలో గల 169వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని మహిళాపోలింగ్ కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. ఇక్కడ 563 మంది ఓటర్లున్నారు. ఆయా కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులు, సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారు. -
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
కాకినాడ సిటీ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండలింగ నిర్ధారణ వెల్లడిచేసిన సెంటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఆరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యూవల్, 10 సెంటర్లకు అడ్రసు మార్పు అనుమతులు రాటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 328 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు కేంద్రం రిజిష్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు, పరీక్షలు నిర్వహించే వైద్యులు, నిపుణుల వివరాలు విధిగా ఆన్లైన్లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్డీఓలు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రాసౌండ్ స్కానర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. 6వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటీడీఏ పీఓ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, గణేష్‌కుమార్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాళిక జిల్లాలో ఆరు నెలల నుంచి 15 నెలలలోపు పిల్లలందరికీ మీజెల్స్, రూబెల్లా వైరస్ల నివారణ వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాలిక చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఐసీడీఎస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెలలో పిల్లలందరికీ నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక ఎంఆర్ కాంపెయిన్ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు: ఈనెల13న కాకినాడలో నిర్వహించే సబ్కా సాత్–సబ్కా వికాస్‌కు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి స్ధానిక రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలపై ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
సామాజిక బాధ్యత పెంచడానికే తనిఖీలు
-మరో 25 అంగన్వాడీ కేంద్రాల దత్తత యోచన -కలెక్టర్ సతీమణి, శిశుసంజీవిని కో ఆర్డినేటర్ శ్రీదేవి వెదురుపాక(రాయవరం) : ‘జిల్లాలో 50 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకున్నాను. ఆ కేంద్రాల్లో సామాజిక బాధ్యతను పెంచడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. మరో 25 కేంద్రాలను దత్తత తీసుకునే యోచన ఉం’దని కలెక్టర్ సతీమణి, మహిళా శిశు సంజీవిని జిల్లా కో ఆర్డినేటర్ హెచ్.శ్రీదేవి తెలిపారు. మండలంలోని వెదురుపాకలో సోమవారం 10వ అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,546 సెంటర్లలో 50 సెంటర్లను యూనిసెఫ్ çసహకారంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంజీవిని స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో మత్స్యకార, నాన్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన బలహీనమైన చిన్నారులు జన్మిస్తున్నారని, వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడం లేదని అన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకునేలా చైతన్యం కల్పిస్తూ ఏడాదిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సఫలమైందన్నారు. బాల్య వివాహాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేసుకున్నవారికిì పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటున్నారన్నారు. చిన్న గుడ్లు తీసుకోవద్దు.. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా శ్రీదేవి కోడిగుడ్లు చిన్నవిగా ఉండడం గమనించారు. గుడ్లు చిన్నవిగా ఉంటే ఎందుకు తీసుకుంటున్నారని కేంద్రం కార్యకర్తను ప్రశ్నించారు. చిన్నవిగా ఉన్న గుడ్లను వెనక్కు ఇవ్వాలని సూచించారు. చిన్నారులకు తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. చిన్నారులకు ఆటపాటలు ఎలా నేర్చుకున్నదీ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్ పీవో సీహెచ్ వెంకటనరసమ్మ, సూపర్వైజర్ అన్నపూర్ణలకు కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో వీఆర్వో పైన నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పల్లేటి వెంకటరత్నం, యానిమేటర్ ఎం.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులు ఇక నిరంతరం
పాడైన ఎల్ఈడీ బల్పుల మార్పునకు ప్రత్యేక కేంద్రాలు మండల కేంద్రం సెక్షన్ ఆఫీస్‌లో కౌంటర్ పెట్టిన ఏపీఈపీడీసీఎల్ లబ్ధిదారులకు ఉపసమనం జిల్లాలో 22.58 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మూడేళ్ల వరకు గ్యారెంటీ... పాడైతే ఎన్నిసార్లయినా మార్చుకునే వెలుసుబాటు ఆధార్, విద్యుత్ బిల్లు తీసుకెళితే చాలు.. పాడైన ఎల్ఈడీ బల్బులను ఇచ్చి కొత్తవి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు పాడైన బల్బులను మార్చుకోవాలంటే నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఈసేవలు అందించారు. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం నుంచి ఆయా మండల కేంద్రాల్లో మార్చుకునే విధంగా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పని వేళల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు పాడైన బల్బులను అక్కడ ఇచ్చి కొత్తవి తీసుకొవచ్చు. ఇందుకు పాత బల్బుతోపాటు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం డీఈ శ్యాంంబాబు తెలిపారు. - సాక్షి, రాజమహేంద్రవరం రేషన్‌కార్డు ప్రాతిపదికగా బల్బుల పంపిణీ గృహ అవసరాలకు సాధారణ బల్బులు వాడడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ వాడకంలో మిగులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), విద్యుత్ పంపిణీ సంస్థల భాగస్వామ్యంతో ఎల్ఈడీ బల్బులను పింపిణీ చేసింది. రేషన్ కార్డు ప్రాతిపదికగా ప్రతి లబ్ధిదారుడుకి రూ.300 విలువైన ఎల్ఈడీ బల్బులను రూ.10 చొప్పున ఏపీఈపీడీసీఎల్ రెండు బల్బులు పంపిణీ చేసింది. జిల్లాలో 24 లక్షల 40 వేల బల్బులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్ 17న పింపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11,28,732 లబ్ధిదారులకు 22,57,283(93 శాతం) బల్బులును విద్యుత్ అధికారులు పంపిణీ చేశారు. పాడైతే కొత్త బల్బు మూడేళ్ల గ్యారెంటీతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ప్రతి గ్రామంలో బల్బులను పంపిణీ చేశారు. పగిలిపోవడం కాకుండా పాడైతే ఎప్పడైనా మార్చుకునే వెలుసుబాటు కల్పించారు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులు బల్బులను మార్చుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో మరింత ఉన్నతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుడు పాడైన తమ ఎల్ఈడీ బల్బులను ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాల్లో 37,659 బల్బులను పాడైన వాటి స్థానంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మండల కేంద్రాల్లో మార్పిడి కేంద్రాలు పెట్టడం వల్ల వినియోగదారులకు దూరాబారం నుంచి ఉపసమనం కలుగనుంది. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు పాడైన ఎల్ఈడీ బల్బులను మార్చుకునేందుకు ఈఈఎస్ఎల్ సంస్థతో మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయం వద్ద కౌంటర్లు పెట్టిస్తున్నాం. ఇప్పటి వరకు పలు డివిజన్లలో ఈ ప్రక్రియ ముగిసింది. లబ్ధిదారులు సమాచారం తెలుసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. పాడైన బల్బుతోపాటు ఆధార్, విద్యుత్‌బిల్లు తీసుకువచ్చి కొత్త బల్బు తీసుకెళ్లవచ్చు. - ఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్ -
ఆలయాలు ఆదాయ కేంద్రాలా?
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హైదరాబాద్: ‘‘హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖకు ఆదాయ కేంద్రాలా? భక్తులు నిధులు, కానుకలు ఇచ్చేది అధికారులు, ఉద్యోగులకు వేతనాలిచ్చి, ఏసీ కార్లలో తిప్పడానికా?’’ అని విశాఖ శారదా పీఠాధిప తి స్వరూపానందేంద్ర స్వామి ప్రశ్నించారు. భక్తులు సమర్పించిన కానుకలు, నిధులను కాపాడాల్సిన అవసరం ఉందని, దేవాదాయ శాఖ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ చందానగర్‌లోని విశాఖ శారదాపీఠ పాలిత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం ముగింపు వేడుకల్లో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇతర మతాల ప్రార్థనాలయాల్లోకి వెళ్లడానికి దమ్ములేని ప్రభుత్వాలు హిందూ దేవాలయాల్లో మాత్రం భక్తులు సమర్పించిన నిధులను భక్షిస్తున్నాయన్నారు. రాష్ట్రం, దేశం హితం కోసం ప్రభుత్వాలు యాగాలు తలపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిధులతో అద్భుత యాగం చేశారని కొనియాడారు. ముగిసిన మహాయజ్ఞం వేడుకలు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించిన విరాట్ విశ్వశాంతి మహాయజ్ఞం వేడుకలు ఆదివారం వైభవంగా ముగిసాయి. ఉదయం 7 గంటల నుంచి సంకల్పం, విశ్వక్సేన పూజ, నవగ్రహ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, లక్ష్మీనారాయణ, మహాసుదర్శన, ఛండీ, చతుషష్టి యోగిని దేవతా విరాట్ వేంకటేశ్వర మండపారాధన హోమాలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి పూర్ణాహుతి, హరిహరులు కల్యాణోత్సవం నిర్వహించారు. కాగా, ఈ సందర్భంగా స్వామీజీ.. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతిగా, బాలస్వామిగా కిరణ్‌కుమార్ శర్మ పేరును ప్రకటించారు. -
సౌలభ్యానికి స్వస్తి
కొత్తపేట సీహెచ్ఎన్సీ కార్యాలయం జిల్లాలో మూతపడ్డ 25 సీహెచ్‌ఎన్‌సీలు మినీ డీఎంహెచ్‌ఓలుగా ఉపకరించిన క్లస్టర్లు అయిదున్నరేళ్లుగా సేవలందించిన వ్యవస్థ రద్దుతో పీహెచ్‌సీలపై కొరవడనున్న పర్యవేక్షణ కొత్తపేట : జిల్లాలో అయిదున్నరేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నిర్వహణ, పరిపాలనను సులభతరం చేస్తూ మినీ డీఎం అండ్ హెచ్ఓలుగా సేవలందించిన కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్ (సీహెచ్ఎన్సీ)లకు బుధవారం తెరపడింది. సీహెచ్ఎన్సీ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో జిల్లాలో గల 25 సీహెచ్‌ఎన్‌సీలు బుధవారం మూతపడ్డాయి. ఆ క్టస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి Ðð ళ్లనున్నారు. ఈ మేరకు గురువారం రిపోర్టు చేయనున్నారు. జిల్లాలో 119 పీహెచ్‌సీలు ఉండగా వాటిని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం (డీఎం అండ్ హెచ్ఓ) పర్యవేక్షించేది. పీహెచ్‌సీలకు సంబంధించి అన్ని వ్యవహారాలనూ ఆ కార్యాలయమే నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం సీహెచ్ఎన్సీ వ్యవస్థ ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ప్రతిపాదన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ క్లస్టర్ వ్యవస్థకు బీజం పడింది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాలనా, నిర్వహణలను సులభతరం చేసేందుకు సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వైఎస్ ముందుంచారు. ప్రజారాగ్యానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన అందుకు అంగీకరిం మరికొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన హఠాన్మరణంతో అప్పట్లో ఆ వ్యవస్థ సాకారం కాకపోయినా.. తదుపరి పాలకుల 2011 ఫిబ్రవరిలో సీహెచ్ఎన్సీలను ప్రారంభించారు. 2 లక్షల జనాభాకు ఒక క్లస్టర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 360 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని క్లస్టర్లలో నియమించారు. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (సుమారు రెండేళ్ళ క్రితం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా స్థాయిని పెంచారు), సీహెచ్ఓ, డీపీఎంఓ, హెచ్ఈ, ఎంపీహెచ్ఈఓ, ఎస్ఏతో పాటు కొన్ని క్లస్టర్స్‌లో ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఓఎస్‌లను కూడా నియమించారు. అయితే తగినన్ని పరిపాలధినాకారాలు మాత్రం కల్పించలేదు. జిల్లా కేంద్రంలో ఉండే డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నిర్వహించే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, పీహెచ్‌సీల పనితీరు పరిశీలన తదితర బాధ్యతలను ఈ క్లస్టర్ ద్వారా నిర్వహిసూ ్తవచ్చారు. మెరుగు పరచడం మాని కనుమరుగు చేశారు.. జిల్లాలో 25 సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు కాగా ఒక్కోదాని పరిధిలో 6 నుంచి 9 పీహెచ్‌సీలు ఉండేవి. ఉదాహరణకు కొత్తపేట క్లస్టర్ పరిధిలో 6, పి.గన్నవరం క్లస్టర్ పరిధిలో 8 పీహెచ్సీలుండగా మండపేట పరిధిలో అత్యధికంగా 9 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇప్పుడు సీహెచ్ఎన్సీల రద్దుతో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ కొరవడుతుంది. ప్రభుత్వపరంగా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ముందు వరుసలో ఉండే పీహెచ్‌సీల ద్వారా మరిన్ని సేవలు, మరింత సత్వరం అందేలా సీహెచ్ఎన్సీలను మరింత మెరుగుపరచడం పోయి అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై పీహెచ్‌సీల వైద్యాధికారులు, పలువురు సిబ్బంది, ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని, పర్యవసానంగా వైద్యసేవలు కుంటుపడతాయని అంటున్నారు. తెలంగాణలో సీహెచ్ఎన్సీల వ్యవస్థ కొనసాగుతుండగా ఇక్కడ రద్దు చేయడంపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
ధాన్యం అమ్మకాలకు ‘పాసుపుస్తకం’ కొర్రీ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాసుపుస్తకం కొర్రీతో కనీస మద్దతు ధర కూడా రైతులు పొందలేకపోతున్నారు. మద్దతు ధర కంటే రూ.2వేలు నష్టానికే అమ్ముకుంటున్నారు. అతి తక్కువ ధరకే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతన్నను దోపిడీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. కొడవలూరు : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే ఎక్కువకే అమ్ముకునేలా చేస్తామని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు రైతులను కేంద్రాల దరిచేరకుండా చేస్తున్నారు. అనవసరపు కొర్రీలు పెట్టి ధాన్యం అతి తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మాలంటే పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరి చేశారు. జిల్లాలో యాభై శాతం మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. వీరంతా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేక పుట్టికి రూ.రెండు వేల నష్టానికి మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు కేంద్రంలో అమ్మాలంటే పాసుపుస్తకం లేకపోయినా అడంగల్, శిస్తు రసీదు, వీఆర్వో ధ్రువీకరణ ఉంటే సరిపోయేది. ఈసారి మాత్రం పాసుపుస్తకంతో వస్తేనే కొనుగోలు చేస్తామని కేంద్రాల్లో తేల్చి చెబుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల ఆదేశాలని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యం పుట్టి రూ.11,900 ఉండగా, మిల్లర్లు అదే రకాన్ని కేవలం రూ.9,800కు కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్ల ధర బాగా తక్కువగా ఉండటంతో కేంద్రాల్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. అయితే పాస్‌బుక్ తప్పనిసరైన కారణంగా విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లనే ఆశ్రయిస్తున్నారు. 90 శాతం ధాన్యం మిల్లర్ల పర జిల్లాలో తొలి పంట సమయంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ధాన్యమంతా కూడా నెల్లూరు జిలకర, 1010 రకాలే అయినందున ఏ గ్రేడ్ కిందే లెక్క. జిల్లాలో 53 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం వరి కోతలు పూర్తవగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి దాకా కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యమంతా మిల్లర్ల పరమైంది. దీనికి ప్రధాన కారణం అనవసరపు కొర్రీలతో రైతులను కేంద్రాల దరి చేరకుండా చేయడమే. గొతాల కొరత మరోపక్క గోతాల కొరత రైతులను వెంటాడుతోంది. పాసుపుస్తకం ఉన్న రైతులు కేంద్రాలకు వచ్చినా గోతాలు లేని కారణంగా రోజుల తరబడి తిప్పుతున్నారు. అన్ని రోజులు ధాన్యాన్ని భద్రపరచుకోలేక రైతులు మిల్లర్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు వల్లే: చాలా మంది రైతులకు పాసుపుస్తకాలు లేవు. వీరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. పాసుపుస్తకం తెమ్మంటున్నారు. ప్రత్యామ్నాయం ఏమీ లేదంటున్నారు. దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించగా పాస్‌బుక్ ఉండాల్సిందేనంటున్నారు. ఎప్పుడూలేని విధంగా ఈ సారి కొత్త నిబంధన తెర మీదకు తెచ్చారంటే మిల్లర్లతో అధికారులు కుమ్మక్కై ఉంటారు. -పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి అడంగల్ తెచ్చినా తిరస్కరించారు.. పాసుపుస్తకం కోసం ధరఖాస్తు చేసిఉంటే ఇంకా రాలేదు. అడంగల్, శిస్తు రసీదులు తెచ్చి ధాన్యం కొనమని కేంద్రానికి వస్తే కుదరదని తిప్పి పంపేశారు. కేంద్రాలు కేవలం పేరుకే పెట్టారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. -దేవరపల్లి సంతోషమ్మ, సంఘబంధం అధ్యక్షురాలు రాష్ట్రవ్యాప్తంగా ఆ నిబంధనే అమలు.. పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులు పాసుపుస్తకం ఉంటేనే కొనుగోలు చేయాలని చెప్పారు. ఇతరత్రా ఏమి ఉన్నా తిప్పి పంపమని స్పష్టంగా తెలిపారు. రైతుల ఇబ్బందులను కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో పొందుపరచిన నిబంధనల్లో పాసుపుస్తకం అనివార్యమైనందున పాస్‌బుక్ ఉంటేనే కొనుగోలు చేయాలని పదేపదే చెప్పారు. అందువల్ల అలాగే చేస్తున్నాం. - రుక్మిణి, డీఆర్డీఏ ఏపీఎం -
కరువు ఉరిమింది.. పల్లె పొమ్మంది!
డొక్కల కరువు సంభవించి ఊళ్లకు ఊళ్లే వలసపోయాయని, తిండీ తిప్పలు లేక వందలాది మంది మృత్యువాత పడ్డారని జిల్లా చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ కలెక్టర్ సర్ థామస్ మన్రో ‘అనంత’ కరువును చూసి చలించిపోయి ఆనాడు జిల్లా వ్యాప్తంగా గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రాణాలు కాపాడారు. అందుకే ఆయన జయంతి, వర్ధంతిని జిల్లా వాసులు ఘనంగా జరుపుకుంటారు. జిల్లా కరువుపై విదేశీ పాలకుడే అంతగా స్పందించినపుడు.. ఈ ప్రాంత వాసులైన ఇప్పటి పాలకులు ఇసుమంతైనా స్పందించక పోవడం ఆవేదన కలిగిస్తోంది. అనంతపురం సెంట్రల్: జిల్లాలో గతేడాది సాధారణ వర్షపాతంలో (సాధారణ వర్షపాతం 552 మి.మీ కా గా నేటికీ 274 మి.మీ మాత్రమే నమోదైంది) యాభై శాతం మాత్రమే నమోదు కావడంతో లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారిపోయాయి. పంటలు సాగు చేసిన రైతులకు అపార నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఉన్న ఊరిలో పనిలేక.. అప్పులు తీర్చేందుకు మార్గం లేక జనం వలసబాట పడుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఆలసత్వం కారణంగా వలసలు ని యంత్రించాల్సిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల లేమి సమస్యగా మారింది. జిల్లాలో 7.61 లక్షల కుటుంబాలు (జాబ్ కార్డు పొం దిన వారి సంఖ్య) ఈ పథకంపై ఆధారపడ్డాయి. ఇందులో 18,20,780మంది కూలీలు ఉన్నారు. జాబ్‌కార్డు పొం దిన వారిలో 4.50 లక్షలమంది కూలీలు నిత్యం పనులకు వస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో చిన్న, సన్నకా రు రైతులు సైతం ఉన్నారు. అయితే వీరందరికీ పను లు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలుం డగా కేవలం 680 పంచాయతీల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. అదికూడా అరకొరగానే జరుగుతుండడంతో గ్రామంలోని కూలీలందరూ ఉపాధి పనులకు పోవడానికి ఆస్కారం లేకుండాపోతోంది. 4.50 లక్షలకు పైగా కూలీలు ఉన్న జిల్లాలో కేవలం 62 వేల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాలకుల నిర్లక్ష్యం.. కూలీలకు శాపం ప్రచార్భాటాల కోసం నిత్యం తహతహలాడే ప్రజాప్రతినిధులు ఉపాధి కూలీల సమస్యలపై దృష్టి సారించడం లేదు. కొండగుట్టలో చేతులు బొబ్బలు పోయేలా శ్రమటోడ్చి చేసినా వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదు. కొత్తచెరువు మండలంలో దాదాపు ఏడాది కావస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కూలీలు రెండ్రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ. 20 కోట్లు మేర ఉపాధి కూలీల వేతనాలు బకాయిగా పేరుకుపోయాయి. దీనికి తోడు పండ్లతోటల పెంపకం చేపడుతున్న రైతులకు వాచన్వార్డ్ బిల్లులు దాదాపు రూ. 45 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. చెట్లకు నీరు పోసేందుకు కాదు కదా రైతులు నాటుకున్న మొక్కలకు కూడా బిల్లులు ఇవ్వడం లేదు. జిల్లాలో ఈ తరహా పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధుల్లో మాత్రం చలనం లేదు. నిధుల సమస్యల లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కూలీలకు బకాయి వేతనాలు, బిల్లులు ఎందుకు చెల్లించడం లేదనే అంశాలపై దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. ఫలితంగా రైతులు, రైతు కూలీలు ఉన్న ఊళ్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి లేక కుటుంబాలే వలస పోతుంటే అధికారులు మాత్రం పని కల్పిస్తున్నా వలస వెలుతున్నారనే ధోరణిలో మాట్లాడుతున్నారు. బెంగుళూరు, హోసూరు ప్రాంతాల్లో ఎలాంటి కష్టం లేకుండానే ఎక్కువ డబ్బులు వస్తుండడంతో ఆ విధంగా అలవాటు పడ్డారని చెబుతుండడం గమనార్హం. నల్లచెరువు, ఆమడగూరు, తనకల్లు, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, రాయదుర్గం, గుమ్మగట్ట, శెట్టూరు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 50 వేల నుంచి 55 వేల కుటుంబాల వరకూ ఇతర ప్రాంతాల వలస పోయింటారని అధికారులు భావిస్తున్నారు. మండల పోగ్రాం ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలు ఉపాధిహామీ పథకంపై ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు. తమకు అదనంగా సౌకర్యాలు కల్పిస్తే తప్పా ఉపాధిహామీ పథకంలో జోక్యం చేసుకోమని ఇటీవల జరిగిన సమావేశంలో ఆశాఖ కమీషనర్ ఎదుట కుండబద్దలు కొట్టారు. ఏడాది నుంచి కూలి డబ్బులు ఇవ్వలేదు ఉపాధి పనులు చేసి యేడాది అవుతోంది. ఇప్పటికీ బిల్లులు ఇవ్వలే దు, పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చేతులు బొబ్బలు వచ్చేలా పనులు చేశాము. మా కూలిడబ్బులు మాకు చెల్లించక అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. దాదాపు రూ.2,300ల దాకా ఉపాధి బిల్లులు రావాల్సి ఉంది. -పద్మావతి, కొడపగానిపల్లి, కొత్తచెరువు మండలం బిల్లులు ఇవ్వరు.. ఉపాధి చూపించరు ఉపాధి పనులు కల్పిస్తామని అధికారులేమో చెబుతున్నారే తప్ప ఇప్పటికీ మాకు ఎలాంటి పనులు చూపలేదు. అసలే వర్షాలు లేక బోర్లలో నీరు ఎండిపోవడంతో ఒక పక్క రైతు కూలీ పనులు లేక మరో పక్క ఉపాధి పనులు కల్పించకపోవడంతో పూటగడవడమే కష్టంగా మారింది. మా గ్రామంలో దాదాపు 300 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ప్రతి రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మా గ్రామాన్ని సందర్శించిన సోషల్ ఆడిట్ వారు ఉపాధి పనులు కల్పిస్తారని చెప్పారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి పనులు చూపలేదు. -రామాంజినేయులు, కొడపగానిపల్లి, కొత్తచెరువు -
కరెంట్ కట్ కటా!
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా కేంద్రంతో పాటు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా కరెంటు కోతల వేళలను సదరన్ పవర్ డిస్ట్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) అధికారులు వేసవి ఆరంభం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ప్రకటించారు. అనంతపురం నగరంలో రెండు గంటలు, మునిసిపాలిటీలలో నాలుగు, మండల కేంద్రాల్లో ఆరు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల చొప్పున కోత ఉంటుందని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత వేసవిలో వినియోగం పెరగడం, రాష్ట్ర విభజన వంటి కారణాలతో కోతల వేళల్లో మార్పు చేశారు. పస్తుతం నగరంలో నాలుగు గంటలు, పట్టణాల్లో ఆరు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల చొప్పున అధికారిక కోతలు ఉన్నాయి. అయితే.. నెల రోజులుగా ప్రకటిత కోతల వేళలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ ఆర్) కింద హైదరాబాద్ నుంచే నేరుగా కోత పెడుతున్నారని, తాము నిమిత్తమాత్రులమని జిల్లా అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒక్కరోజే నాలుగు సార్లు కోత విధించారు. ఇక పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి చెప్పక్కరలేదు. పది రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఉక్కపోత తగ్గడం లేదు. దీనికితోడు కరెంటు లేకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు దోమల బెడద కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. పరిశ్రమల్లో ఉత్పత్తికి తరచూ ఆటంకం కలుగుతుండడంతో పారిశ్రామికవేత్తలు లబోదిబోమంటున్నారు. పెరిగిపోతున్న డిమాండ్ జిల్లాకు ప్రస్తుతం 14.5 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. పంపిణీ సంస్థ నుంచి మాత్రం 11 మిలియన్ యూనిట్లే వస్తోంది. 3.5 మిలియన్ యూనిట్ల లోటు కొనసాగుతోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం కారణంగా హైదరాబాద్ నుంచే నేరుగా 220 కేవీ సబ్స్టేషన్ల నుంచి వెళ్లే 133 సబ్స్టేషన్ల లైన్లకు కరెంటు సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయానికి సరఫరా తగ్గినా కోతలు పెరగటానికి కారణమేమిటన్న ప్రశ్న తలెత్తడం సహజం. కానీ జిల్లాలో పండ్లతోటలు విస్తారంగా సాగులో ఉండడం, కొన్ని పంటలు దిగుబడి స్థాయిలో ఉండడం వల్ల వంద శాతం కరెంటు మళ్లించటానికి వీలు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో కోతలు తప్పడం లేదని అంటున్నారు. ఇన్వర్టర్ల వాడకం పెరగడం కూడా కరెంటు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఇన్వర్టర్లు ఒకేసారి లోడు అవుతుండడంతో ఆ భారం సబ్స్టేషన్లపై పడుతోందని, తరచూ లైన్లు ట్రిప్ అవుతున్నాయని అంటున్నారు. -
‘పది’కి సిద్ధం
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అన్ని సెంటర్లకు చేరవేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాలను మూడు విడతలుగా మూడు సెట్లను పోలీస్స్టేషన్లలో భద్రపరచనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి డీఈవో కార్యాలయంతోపాటు ఆయా డివిజన్లలో సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు, కస్టోడియన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలకు రాష్ట్ర పరిశీలకులుగా తులసీదాస్ వ్యవహరించనున్నారు. 284 పరీక్ష కేంద్రాలు పదో తరగతి వార్షిక పరీక్షల కోసం జిలా వ్యాప్తంగా 284 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 59,073 మంది రెగ్యులర్ విద్యార్థులు, 6,380 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 65,453 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 4వేల మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. టీఏ, డీఏల భారం పడకుండా పరీక్ష కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల బాధ్యతలు అప్పగించారు. సరిపోని చోట ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి 14 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్‌తోపాటు సూపరింటెండెంట్‌పైనా చర్యలుంటాయి. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు ఒక రెవెన్యూ, పోలీస్ అధికారిని కేటాయించారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష వేళల్లో ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు చేయాలనుకునేవారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 2243268లో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలుగా గోదావరిఖని, రామగుండం, జమ్మికుంట ప్రాంతాలను గుర్తించారు. ఏర్పాట్లు పూర్తి : డీఈవో లింగయ్య పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం. పరీక్షలు సాఫీగా సాగేందుకు పలు సూచనలు చేశాం. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా హాల్‌టికెట్లు అందించాలి. ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి.