సాక్షి, నిజామాబాద్ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారత సాధించి అందరితో తాము సమానమనే భావన తేవడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక గుర్తిం పు ఇవ్వనుంది. కేవలం మహిళా ఉద్యోగులే పోలింగ్ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించగా, ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో మొత్తం ఆరు మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుపుతూ కలెక్టర్ రామ్మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక్కడే మహిళా పోలింగ్ కేంద్రాలు
- ఆర్మూర్ నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గల 47వ నంబరు పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఇందులో 1096 మంది ఓటర్లున్నారు.
- బోధన్ నియోజకవర్గంలో 447 మంది ఓటర్లున్న ప్రభుత్వ ఎస్టీ హాస్టల్‌లో గల 81వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు.
- బాన్సువాడ నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 188వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ 683 మంది ఓటర్లు ఉన్నారు.
- నిజామాబాద్ అర్బన్‌లో నూతన వైశ్య పాఠశాల (మానిక్‌భవన్)లో గల 106వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 952 మంది ఓటర్లున్నారు.
- నిజామాబాద్ రూరల్‌లో గూపన్‌పల్లిలో గల మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఉన్న 81వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇందులో 744 మంది ఓటర్లున్నారు.
- బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్ ఎంపీడీవో కొత్త భవనంలో గల 169వ నెంబరు పోలింగ్ కేంద్రాన్ని మహిళాపోలింగ్ కేంద్రంగా ఏర్పాటుచేయనున్నారు. ఇక్కడ 563 మంది ఓటర్లున్నారు.
- ఆయా కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులు, సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment