ఇందూరు సైన్యం సిద్ధం | elections management is ready nizamabad | Sakshi
Sakshi News home page

ఇందూరు సైన్యం సిద్ధం

Published Thu, Nov 29 2018 11:11 AM | Last Updated on Thu, Nov 29 2018 11:11 AM

elections management is ready nizamabad - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్ధి రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం నుంచి ఆయా నియోజకవర్గాలకు ఈవీఎం లు, వీవీ ప్యాట్‌లను తరలించారు. పోలింగ్‌కు ఎనిమిది రోజులే ఉన్నందున సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీ గా ప్రిసైడింగ్‌(పీవో), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారుల(ఏపీవో)తో పా టు అదనపు పోలింగ్‌ అధికారులను కేటాయించారు. మొత్తం అధికారులు, సిబ్బంది కలిపి 6,880 మంది పోలిం గ్‌ ప్రక్రియలో పాల్గొననున్నారు. జిల్లాలో మొత్తం 1,433 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయి.

పోలింగ్‌ స్టేషన్‌కు ఒక రు చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు ఉండనున్నా రు. ప్రస్తుతం 20 శాతం అదనంగా కలుపుకుని 1,720 మంది ప్రిసైడింగ్, 1720 మం ది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియ మించారు. ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు 20 శా తం అదనంగా కలుపుకుని 3,440 మంది నియామకమయ్యారు. అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్‌లో 272 పోలింగ్‌ కేంద్రాలుండగా, 326 మంది చొప్పున ప్రిసైడింగ్, అంతే చొప్పున అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను నియమించారు. ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు 653 మంది ఉన్నా రు. అత్యల్పంగా ఆర్మూర్‌లో 211 పోలింగ్‌ కేం ద్రాలకు 253 మంది చొప్పున ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు ఉండగా, ఇతర ప్రిసైడింగ్‌ అధికారులు 506 మంది ఉన్నారు. 

ఉత్తర్వుల కాపీలు జారీ.. 
ఎన్నికల నిర్వహణకు అన్నిశాఖల ఉద్యోగులు, టీచర్లను పోలింగ్‌ విధుల్లోకి తీసుకున్నారు. ఎవరెక్కడ విధులు నిర్వర్తించాలో  ఆర్డర్‌ కాపీలను కలె క్టర్‌ రామ్మోహన్‌ రావు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇది వరకే మొదటి దశ శిక్షణ పూర్తి చేయగా, మరోసారి ఆయా నియోజకవర్గాల వారీగా ఈనెల 28, 29 తేదీల్లో శిక్షణ ఇస్తున్నారు. 30వ తేదీన ఇతర ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్‌ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లలో తలెత్తే చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు∙వారే పరిష్కరించుకునే విధంగా నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్తర్వులు తీసుకున్న ప్రతి అధికారి, ఉద్యోగి హాజరు కావాలని, గైర్జారైతే చర్యలుం టాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement