మోర్తాడ్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటైనా కార్యదర్శుల కొరతతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పంచాయతీలను క్లస్టర్‌లుగా మార్చి క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం భావించింది. అయితే కార్యదర్శుల కొరత వల్ల ఒక కార్యదర్శికి ఒక క్లస్టర్ కాకుండా రెండు, మూడు క్లస్టర్‌ల బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో 718 పంచాయతీలకు గాను 477 క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాలో 477 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండాలి. అయితే అనేక మంది కార్యదర్శులు పదవీ విరమణ చేయడం, కొత్తగా కార్యదర్శుల నియామకాలు లేక పోవడంతో కార్యదర్శుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 160 మంది కార్యదర్శులే పనిచేస్తుం డగా జిల్లాలో 317 క్లస్టర్‌లకు ఇన్‌చార్జి కార్యదర్శులే గతి అయ్యారు. ఒక క్లస్టర్‌లో రెండు, మూడు పంచాయతీలు ఉన్నాయి. కొన్ని గ్రా మ పంచాయతీలలో అధిక జనాభా ఉండటం తో ఆ ఒక్క పంచాయతీని ఒక క్లస్టర్‌గా గుర్తిం చారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లస్టర్‌కు ఒక కార్యదర్శిని నియమించాలి. గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను పరి ష్కరించాలంటే పాలకవర్గంతో పాటు కార్యదర్శి పని చేయాల్సి ఉంటుంది. పంచాయతీకి రావాల్సిన పన్నులను వసూలు చేయ డం, మురికి కాలువలను, గ్రామంలోని వీధులను పరిశుభ్రంగా ఉండేలా చూడటం, వీధి దీపాల సమస్య, తాగు నీటి సరఫరా సక్రమం గా జరి గేలా పర్యవేక్షించడం కార్యదర్శి ప్రధా న బాధ్యత. అంతేకాక పంచాయతీ పాల కవర్గం సమావేశాలను, గ్రామ సభలను నిర్వహిం చడం కార్యదర్శుల విధి. ఒక క్లస్టర్‌లో రెం డు, మూడు పంచాయతీలు ఉంటే ఆ క్లస్టర్ పరిధిలోని పంచాయతీల పూర్తి బాధ్యత కార్యదర్శి నిర్వర్తించాలి. చిన్న పంచాయతీ అయినా పెద్ద పంచాయతీ అయినా చేసే పని ఒక్కటే కావడంతో పని భారం అధికంగానే ఉం టుం ది. అయితే ఒక కార్యదర్శికి రెండు, మూడు క్లస్టర్ ల బాధ్యతలను అప్పగించడం వల్ల పనులు సరిగా జరుగడం లేదు.
కొత్తగా ఏర్పాటయిన పంచాయతీ పాలకవర్గాలు కార్యదర్శులపై తీవ్ర పని భారం మోపుతున్నాయి. దీని వల్ల కార్యదర్శులు తమ సొంత పోస్టింగ్ పంచాయతీలపై దృష్టి పెట్టి ఇన్‌చార్జి క్లస్టర్‌ల లో పనులు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు సర్పంచ్‌లకు కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం కల్పించింది. ఒక కార్యద ర్శి నాలుగైదు పంచాయతీల సర్పంచ్‌లతో జా యింట్ చెక్ పవర్ కలిగి ఉండటం వల్ల సకాలంలో నిధులు డ్రా చేయడాని కి ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని సర్పంచ్‌లు వాపోతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 2,261 కార్యదర్శుల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.దీంతో జిల్లాలో 317 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండ గా పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు.
పంచాయతీలకు సిబ్బంది కొరత
Published Tue, Aug 20 2013 7:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement