రాజాం: గ్రామస్థాయిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్లస్టర్ వ్యవస్థను తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూలై 1 నుంచి క్లస్టర్ విధానానికి మంగళం పాడుతుండటంతో ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్లస్టర్ ఏర్పడిందిలా...
గ్రామీణ స్థాయిలో వైద్యసేవలు ఎలా అందుతున్నా యో తెలుసుకోవడం డీఎంహెచ్‌ఓ బాధ్యత. అయితే జిల్లా వ్యాప్తంగా వీటిని పర్యవేక్షించడం ఆ ఒక్క అధికారికే సాధ్యం కాకపోవడంతో గత ప్రభుత్వం 2011 మే నెలలో క్లస్టర్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రతి 3 పీహెచ్‌సీలను కలుపుతూ 18 క్లస్టర్లును ఏర్పాటు చేసింది. ఒక్కో క్లస్టర్‌కు డిప్యూటీ సివిల్ సర్జన్‌లను నియమించారు. దీంతో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లోని కొంతమంది సిబ్బందిని ఇక్కడకు తరలించా రు. ఒక్కో క్లస్టర్‌కు సుమారు రూ. 3 లక్షలతో అవసరమైన కంప్యూటర్, జిరాక్స్ మెషీన్, ఇన్వర్టర్, స్కానర్ తదితర ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు ఫర్నీచర్‌ను ఏర్పాటు చేశారు.
వీరంతా గ్రామ స్థాయిలో ఏఎన్‌ఎంలు పనిచేసే సేవలను గుర్తించి ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పొందుపర్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలకు సూపర్‌వైజింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వైద్య సేవలు ఓ గాడిన పడ్డాయని అంతా ఒప్పుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వానికి మాత్రం ఇది కనిపించలేదు. క్లస్టర్ సిబ్బందికి పనిలేదనే నెపంతో జూలై 1 నుంచి ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసింది.
క్లస్టర్ చేసే పనులు..
గ్రామ స్థాయిలో వైద్యసిబ్బంది ఎంత మేర వైద్యసేవలు అందిస్తున్నారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సాయం ఎలా అందిస్తున్నారో తెలుసుకోవడం. గర్భిణుల నమోదు, చిన్నారులకు టీకాలు వేయడం, టీబీ, లెప్రసీ తదితర వాటి ని పర్యవేక్షించడం, ఇమ్యునైజేషన్, ఫ్యామిలీ ప్లానిం గ్, పల్స్‌పోలియో తదితర కార్యక్రమాలపై సూపర్‌వైజింగ్ చేయడం వంటి పనులు క్లస్టర్ సిబ్బంది నిర్వహించేవారు. వీటిపై ఎప్పటికప్పుడు నివేదికలు త యారు చేసి డీఎంహెచ్‌ఓకు సమర్పిస్తే అందులో లోటుపాట్లను గుర్తించడానికి వీలుగా ఉండేది.
తొలగిస్తే నష్టాలివే...
జిల్లాలోని పాలకొండ, టెక్కలి, శ్రీకాకుళం డివిజ న్లలో 75 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీలోనూ సుమారు10 నుంచి 15 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కూ సుమారు 35 నుంచి 40 వర కూ సబ్‌సెంటర్లు ఉంటాయి. వీటిపై పూర్తి స్థాయి లో పర్యవేక్షణ కేవలం డీఎంహెచ్‌ఓకు సా ధ్యం కాకపోవడంతో క్లస్టర్లతో పనిచేయించుకుని లోటుపాట్లను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లను తొలగిస్తే పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతుం ది. గ్రామీణ ప్రజల్లో సర్కారు వైద్యంపై ఉన్న న మ్మకం కూడా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి క్లస్టర్లను యధావిధిగా ఉంచాలని పలువురు కోరుతున్నారు.
క్లస్టర్ ఇక కనిపించదు...
Published Thu, Jun 30 2016 8:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement