మీరు చెప్పేదంతా అబద్దం
- డీఎంహెచ్‌ఓపై మండిపడ్డ జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు
- వాడివేడిగా విద్య,వైద్య స్థాయీ సంఘ సమావేశం
ఇందూరు: ‘ఇటు చూడండి డీఎంహెచ్‌ఓ గారు... మీరు చెప్తున్న వివరాలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధం. మీరు నాకు చెవిలో పువ్వెట్టకండి..’ అంటూ గోవింద్ వాగ్మారేపై జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదారు మండిపడ్డారు. బుధవారం జిల్లా పరిషత్‌లో ఉదయం 11:30 గంటల కు జరిగిన విద్య, వైద్యం స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడారు.
గతేడాదికి సంబంధించి జిల్లాకు రూ.4,62,4,439 నిధులు రాగా వీటిని 718 గ్రామ పంచాయతీల ఖాతాలో వేయగా ఇప్పటి వరకు రూ.3,75,412 నిధులు ఖర్చు చేశారని లెక్కలు చూపుతున్నారన్నారు. అయితే ఖర్చు చేసినట్లుగా ఆధారాలు, యూసీ సర్టిఫికెట్లు లేకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వగా ఇం కా రూ.4,24,9,027 నిధులు మిగిలిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుపాలన్నారు. ఇన్ని నిధులు ఉండగా, ఖర్చు చేయడా గ్రామాల్లో ఎందుకు పనులు జరగడ లేద ని, మీరు ఈ విషయంపై తనిఖీలు చేశారా..? అని ప్రశ్నిం చారు. దీనికి డీఎంహెచ్‌ఓ సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో వచ్చే జడ్పీ సర్వసభ్య సమావేశానికల్లా ఖర్చులకు సంబంధించిన యూసీలు తెప్పించుకుని తనకుపూర్తి వివరాలు అందజేయాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు.
ఫిర్యాదు వస్తుగాని చర్యలు తీసుకోరా?
అనంతరం కాలుష్య నియంత్రణ శాఖను ఉద్దేశించి మాట్లాడారు. ఒకరి నుంచి మీకు ఫిర్యాదు వస్తే గాని వాతావరణం కాలుష్యం చేస్తున్న ఫ్యాక్టరీ, రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోరా అని ఇన్‌చార్జ్ ఏఈ రవీందర్‌పై అసహన్యం వ్యక్తం చేశారు. తరువాత విద్య శాఖ, ఆర్వీఎం శాఖలు ఎస్‌ఎఫ్‌సీ నిధులతో చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణాలు జనవరి లోగా పూర్తి చేయాలని లేదంటే నిధులు వెనక్కి వెళతాయని సంబంధిత శాఖధికారులకు సూచిం చారు. అనంతరం జడ్పీ సీఈఓ రాజారాం మాట్లాడుతూ... వచ్చే జడ్పీ సర్వ సభ్య సమావేశానికల్లా జిల్లాలోని ఫ్యాక్టరీలు, రైస్‌మిల్లర్లకు వెళ్లి కాలుష్య నియంత్రణపై తనిఖీలు చేసి రిపోర్టులివ్వాలని శాఖ అధికారిని ఆదేశించారు. ఇంట్లోనే ప్రసవాలు జరిగినందుకు సంబంధిత అధికారులను, ఏఎన్‌ఎంలను బాధ్యులను చేస్తూ నోటీసులివ్వాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
చెవిలో పువ్వెట్టకండి !
Published Thu, Oct 9 2014 3:49 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement