వైద్య సేవల్లో ముందుండాలి | Treat medical services | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో ముందుండాలి

Jul 29 2016 12:17 AM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్య సేవల్లో ముందుండాలి - Sakshi

వైద్య సేవల్లో ముందుండాలి

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని డీఎంహెచ్‌ఎం సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద లక్ష్మిగార్డెన్‌లో గురువారం నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ సబ్‌సెంటర్ల పరిధిలోని వైద్య సేవల్లో కీలక పాత్ర వీరిదేనన్నారు.

  • డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
  • వర్ధన్నపేట : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద లక్ష్మిగార్డెన్‌లో గురువారం నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో ఆ యన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ సబ్‌సెంట ర్ల పరిధిలోని వైద్య సేవల్లో కీలక పాత్ర వీరిదేనన్నారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబ లకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజ లకు వైద్య సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ఆశ కార్యకర్తల నైఫుణ్యత, భావ వ్యక్తీకరణ, రోజువారీ కార్యక్రమాల ప్రాధాన్యతపై నృత్య, నాటిక, పాట, ప్రసంగాల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యులు సతీష్‌కుమార్, ప్రశాంతి, విద్య, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాల వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement