Aasha Activists
-
ఆశ వర్కర్‌కు కరోనా..
తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్‌కు కరోనా వైరస్ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన లక్ష్మి(30) ఆశ వర్కర్‌గా పనిచేస్తోంది. గర్భంతో ఉన్న లక్ష్మి గ్రామంలో విధులు నిర్వహించడంతో కరోనా వైరస్ సోకింది. శనివారం అర్ధరాత్రి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ శిరీష లక్ష్మి కడుపులో ఉన్న శిశువు మృతిచెందాడని గుర్తించి ఆస్పత్రి çసూపరింటెండెంట్ ఆనంద్‌కు సమాచారం అందించింది. సూపరింటెండ్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని లక్ష్మికి ఆస్పత్రిలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. అనంతరం ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి, విజయవంతంగా ఆపరేషన్ చేసి గర్భాశయంలో ఉన్న పిండాన్ని తొలగించారు. అనంతరం లక్ష్మిని కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో కోవిడ్ సేవలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్ ఆనంద్ తెలిపారు. వార్డులో 20 మందికి ఒకేసారి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్య సేవలను అందించేందుకు వెంటిలేటర్లను సైతం అందుబాటులోకి తీసకొచ్చినట్లు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యుల సహకారం అభినందనీయమన్నారు. -
కరోనా: ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం
సాక్షి, కైలాస్‌నగర్(ఆదిలాబాద్) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి కుంటుంబాలను సర్వే చేసేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలపై దాడికి యత్నించడం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించడంపై జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. సర్వేకు ప్రజలు సహకరించడం లేదని, దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని, గదుల్లో బంధిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (మృతులంతా మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లే..!) చిల్కూరి లక్ష్మినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే ఆశా కార్యకర్త భారతి శివాజీచౌక్‌లో సర్వేకు వెళ్లగా.. ఓ అనుమానితుడు సర్వే ఫైల్‌ను చించే ప్రయత్నం చేసి దాడికి యత్నించాడు. సదరు వ్యక్తిపై వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక శివాజీచౌక్‌కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని సర్వే చేసేందుకు ఆశా కార్యకర్త భారతి వెళ్లగా.. అతడి సోదరుడు దురుసుగా ప్రవర్తించాడు. భారతి ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు స్వయంగా కేసును పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని ఆదేశించారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు) ఖుర్షీద్‌నగర్ ఆరోగ్య కేంద్రం ఆశా కార్యకర్త అర్చన ఖుర్షీద్‌నగర్‌లో సర్వేకు వెళ్లగా కొందరు స్థానికులు దురుసుగా ప్రవర్తించారు. ఇలా వరుస సంఘటనలో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తొడసం చెందు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ విష్ణు వారియర్ సర్వేకు వెళ్లే ఆశా కార్యకర్తలకు పోలీసు సెక్యూరిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్వేలకు వచ్చిన ౖసిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (కరోనా: మరో షాకింగ్ న్యూస్!) -
‘ఆశ’లు నెరవేరాయి
విశాఖ సిటీ :పేరుకు రూ.3 వేల గౌరవ వేతనం.. వేతనంలో ఉన్న గౌరవం పనిలో లేని దైన్యం.. ఇదీ ఆశ కార్యకర్తల ఆవేదన. గత ప్రభుత్వ హయాంలో వీరు చేయని పని లేదు. పడని మాట లేదు. వీరంతా ప్రజా సంకల్పయాత్రలో తమ గోడును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెప్పుకున్నారు. ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలు కూడా ఊహించని విధంగా రూ.10 వేలకు వేతనం పెంచి వారిని గౌరవించారు. సీఎం జగన్ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,600 మంది ఆశ కార్యకర్తలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు, బుక్ కీపర్స్ వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. -
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం
సాక్షి, నారాయణఖేడ్: కుష్టు, క్షయ(టీబీ) వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది పలువురిలో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించి నిర్మూలన చర్యలను చేపట్టాలని వైద్యశాఖ భావిస్తోంది. క్షయ, కుష్టు బాధితులు పెరుగుతుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కేంద్రం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా స్థాయిలో సూపర్వైజర్లు, పీహెచ్‌సీల స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై శిక్షణ పొందారు. వారు ఈ నెల 26న ప్రారంభించిన సర్వే సెప్టెంబర్ 12 వరకు పల్లెలు, పట్టణాల్లో కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో 2007 నుండి సర్వే కొనసాగిస్తున్నారు. తాజాగా మూడో విడత సర్వేపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు. కేసులు ఎక్కువగానే.. ప్రస్తుత కాలంలో కుష్టుతోపాటు క్షయ వ్యాధి రోగులు సైతం పెరుగుతున్నారు. వ్యాధి గాలిలోనే విస్తరించే అవకాశం ఉన్నందున బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తరించడంతో కుష్టు, క్షయ వ్యాధుల రోగుల సంఖ్యను పక్కాగా లెక్కించి చికిత్సలు అందించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ఇలా.. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తాయి. ఆశా కార్యకర్తలు మహిళలను, స్వచ్ఛంద పురుష కార్యకర్తలు పురుషులను పరీక్షిస్తారు. ఒకవేళ కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే పీహెచ్‌సీకి పంపిస్తారు. క్షయవ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. సాయంత్రం సమయంలో దగ్గు, జ్వరం వస్తుంటే వారి తెమడను తీసుకొని ఒక డబ్బాలో పొందుపరిచి క్షయ నియంత్రణ విభాగానికి పరీక్షల కోసం పంపిస్తారు. సీబీనాట్ పరికరంతో వ్యాధిని నిర్దారిస్తారు. జిల్లాలో 948 బృందాలు.. జిల్లాలో 948 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15లక్షల మంది జనాభా ఉంది. 14లక్షల జనాభాకు అంటే 90శాతం మందిని సర్వే చేయాలనే లక్ష్యంగా వైద్యాధికారులు ఉన్నారు. రోజూ లక్ష మందిని పరిశీలించనున్నారు. సర్వే చేసేందుకు 948 మంది ఆశ కార్యకర్తలు, 243సబ్‌సెంటర్లకు సంబంధించి 243 ఏఎన్ఎంలు, 35మంది సూపర్వైజర్లు, 35మంది వైద్యాధికారులు సర్వేలో పాల్గొంటారు. నిత్యం పట్టణ ప్రాంతాల్లో 30 నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 ఇళ్లలో సర్వే చేస్తారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి 45మంది కుష్టు రోగులను గుర్తించారు. గత ఏడాది 35మందిని గుర్తించగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఇప్పటివరకు నలుగురు కుష్టు రోగులను గుర్తించారు. వ్యాధుల బారిన పడినవారిని గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందజేస్తారు. క్షయబారిన పడిన రోగులకు 6 నెలలు, 12నెలల కోర్సుగా ఏడాది పొడవునా ఉచితంగా మందులను అందజేయనున్నారు. క్షయ వ్యాధిబారిన పడిన రోగులు వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడుతుంటే వారికి ప్రతీ నెలా రూ.500 చొప్పున పోషకహారం తీసుకునేందుకు పారితోషికం అందజేస్తాయనున్నట్లు జిల్లా లెప్రసీ ఉపగణాంక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. కుష్టు లక్షణాలు ఇవీ.. చర్మ పాలిపోవడం, స్పర్శజ్ఞానం లేని మచ్చలు కాళ్లు, చేతులు, నరాల వాపు, నొప్పి, తిమ్మిర్లు ముఖంపై చెవి బయట నూనె పూసినట్లుగా ఉండడం కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుండడం ముఖం, కాళ్లు, చేతులపై నొప్పి లేని బుడిపెలు కనురెప్పలు పూర్తిగా మూతపడకపోవడం చేతివేళ్లు స్పర్శ కోల్పోయి వంకర పోవడం క్షయ లక్షణాలు ఇవీ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం మెడపై వాచి గ్రంథులు, గడ్డలు రావడం పరీక్షించి ఉచిత మందులు.. జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. 14రోజులపాటు ఈ సర్వే నిర్వహిస్తాం. రోగులను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్సలు అందజేస్తాం. లక్షణాలు ఉంటే పరీక్షించి ఉచితంగా మందులను అందజేస్తాం. క్షయవ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని వెంటనే నయం చేసుకునే వీలుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తే వారికి రూ.500 పారితోషికం అందజేస్తాం. ఆర్ఎంపీలు, విద్యావంతులు అవగాహన కల్పించి రోగులు చికిత్సలు పొందేలా చూడాలి. – డి.అరుణ, డీపీపీఎం జిల్లా కోఆర్డినేటర్ -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సాక్షి, కడప : తమకు ఏడు నెలలుగా నిలిపివేసిన జీతాలు, పారితోషికం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఏఐయూటీసీ ఆ«ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.వేణుగోపాల్, అధ్యక్షురాలు సుభాషిణి, ప్రధాన కార్యదర్శి అయ్యవారమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగ్ జీతాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఇందువల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వివరించారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైందని, పిల్లలకు ఫీజులు, పుస్తకాలు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కేవలం రూ 150 పారితోషికంతో గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు అనారోగ్య కారణాలుగా కొన్నిరోజులు విధులకు హాజరు కాలేదని, ఈ కారణంగా పీహెచ్సీ అధికారులు వారిని డ్రాపౌట్స్ చేశారని తెలిపారు. డ్రాపౌట్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశాలపై పీహెచ్సీ అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని అన్నారు. కొంతమంది ఆశాలను విధులకు రావద్దని రాజకీయ నాయకులకు అనుకూలంగా పీహెచ్సీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. స్థానిక రాజకీయ నాయకుల అనుచరులను ఆశాలుగా నియమించుకునే వీలును పీహెచ్సీ అధికారులు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆశాలు రాజీనామాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తక్షణమే ఆపాలన్నారు. వీటిపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు రూ. 10 వేలు జీతం, పాత పద్దతి ప్రకారం ఇస్తామన్న పారితోషికానికి సంబంధించిన జీఓలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు.. కడప సెవెన్‌రోడ్స్ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్‌రోడ్స్ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అదుపు లేకుండా ఉందని అన్నారు. ఐఐటీ, టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏసీ క్యాంపస్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, షూ, యూనిఫాం వంటివి పాఠశాలల్లోనే అమ్ముతూ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లకు ఉచిత విద్య అందించాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, రాజేంద్ర, డీవైఎఫ్ఐ నాయకులు జగదీష్, స్టీఫెన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సునీల్, ఐద్వా నాయకురాలు ఐఎన్ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలపై నీళ్లు
పాలకొల్లు అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వం ఆశావర్కల ఆశలపై నీళ్లు పోసింది. గౌరవ వేతనం ఇవ్వాలని ఆశావర్కర్లు ఎన్నో ఏళ్ల నుంచి చేసిన పోరాటానికి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ వేతనం రూ.5,600 నిర్ణయిస్తూ గతేడాది అక్టోబర్‌లో జీఓ 113 జారీ చేశారు. అదే ఏడాది ఆగస్టు నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. జీఓ ఇచ్చిన వెంటనే ఆశ వర్కర్లందరినీ విజయవాడకు పిలిపించి వారితో గ్రూప్ ఫొటోలు దిగి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞులై ఉండాలని వారితో ప్రమాణాలు కూడా చేయించుకున్నాయి. అయితే ఇప్పటివరకూ జీఓ అమలుకు నోచుకోలేదు. వీరికి రూ.3 వేలు వేతనం, మరో రూ.3 వేలు పనికి తగ్గ పారితోషికాన్ని గతేడాది డిసెంబర్ వరకు మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతన బకాయిలు ఉన్నాయి. జీఓ వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లావ్యాప్తంగా రెండు రోజుల క్రితం పీహెచ్‌సీల వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేసినా స్పందన లేదు. 2006లో విధుల్లో చేరిన ఆశా వర్కర్లు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశావర్కర్‌ని 2006లో ప్రభుత్వం నియమించింది. వీరికి గౌరవ వేతనం నిర్ణయించలేదు. పనికి తగ్గ వేతనం కింద రూ.1,000 చెల్లించేవారు. ఆశావర్కర్లు పోరాటాల ఫలితంగా రూ.3 వేలు గౌరవ వేతనం, పనికి తగ్గ పారితోషికం కింద రూ.5,600 చెల్లించేలా గతేడాది ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే ఇది అమలుకు నోచుకోలేదు. జిల్లాలో విలీన మండలాలతో కలుపుకుని 3,490 మంది ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. ఆశావర్కర్ల విధులు గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటూ ఆశా వర్కర్ తన పరిధిలోని వెయ్యి మంది ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. గర్భిణుల నమోదు, వారికి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, ప్రసవ సమయంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న గర్భిణిని ఏరియా ఆసుపత్రికి తరలించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడం, చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, జాతీయ ఆరోగ్య మిషన్‌పై అవగాహన కల్పించడం, వ్యాధులపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం తదితర పనులను చేయాల్సి ఉంటుంది. ఆశా వర్కర్లలో ఏఎన్ఎం శిక్షణ పొందిన వారు సైతం ప్రభుత్వం ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తారనే ఆశతో చాలీచాలని వేతనంతో చాలా మంది పనిచేస్తున్నారు. వీరి డిమాండ్లు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఉద్యోగ భద్రత లభించేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం గౌరవ వేతనం, పనికి తగ్గ వేతనం ఏ నెలకు ఆ నెల ఆశ వర్కర్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలి. అర్హతలున్న ఆశ వర్కర్లకు ఏఎన్ఎం, అదనపు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ప్రాధాన్యత కల్పించాలి. రూ.5 లక్షలు బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి. గతేడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు చెల్లించాలి. 2015 నుంచి 104 వాహనంపై పనిచేసినందుకు పారితోషికం బకాయిలు, యవ్యాధి కేసులకు వైద్యం చేసినందుకు పారితోషికం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. -
బాబుకు గుణపాఠం చెబుతాం
శ్రీకాకుళం అర్బన్: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆశ వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశవర్కర్ల సంఘ నాయకులు చలో డీఎంహెచ్‌వో కార్యక్రమానికి సోమవారం పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకున్న వందలాది మంది జిల్లా కేంద్రానికి వచ్చేందుకు బయలుదేరగా మార్గమధ్యలో పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు. అయితే కొంతమంది మాత్రం జిల్లా కేంద్రానికి చేరుకొని డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించి.. ధర్నా చేశారు. ఓ దశలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆదిలక్ష్మి, కె.నాగమణిలు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆశవర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పనికితగ్గ వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో ఆశవర్కర్లకు నెలకు రూ. 8,600 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అయితే అంత ఇవ్వకుండా అందులో కోతవిధిస్తూ జీవో జారీ చేసి మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవవేతనంలో కోతలేకుండా రూ.8,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఆశ వర్కర్లను మోసగించాలని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం పోరాడుతుంటే జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. ఇటువంటి అణచివేత చర్యలకు భయపడేదిలేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి చెంచయ్యను కూడా కలిసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజనల్ కార్యదర్శి టి.తిరుపతిరావు, ఆశ సంఘ నాయకులు స్వప్న, కల్పన, దమయంతి, అమర, రాజ్యలక్ష్మి, గీత, కాంతమ్మ, సుధ, శ్రీదేవి, మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అరెస్టుల పర్వం జిల్లా వ్యాప్తంగా అశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆశ కార్యకర్తలను శ్రీకాకుళం వెళ్లనీయకుండా వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొందూరులో 20 మందిని, ఆమదాలవలసలో 35 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నరసన్నపేటలో 27 మందిని, జలుమూరులో ఇద్దరు, సారవకోటలో 8 మందిని, వీరఘట్టం మండలంలో 11 మందిని అరెస్టు చేశారు. రాజాం మండలంలో ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తమ హక్కుల సాధన కోసం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో యూనియన్ అధ్యక్షులు కె.తులసిరత్నంతోపాటు భాగ్యవతి, గౌరి, సీతారత్నం, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలిలో 18 మందితోపాటు సీపీఎంకు చెందిన నాయకులు నంబూరు షణ్ముఖరావు, పోలాకి ప్రసాదరావును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కంచిలిలో ఆరుగురు, సోంపేటలో 8 మందిని అరెస్టు చేశారు. హామీ అమలు చేయాలి ఆశ వర్కర్లకు రూ.3 వేలు వేతనం, రూ.5,600 వరకూ పారితోషకం ఇస్తామని చెప్పారు. పనికి తగ్గ వేతనం మాత్రం అందడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన జీవోనే అమలు చేయలేదు. ఒకచేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నట్లుంది. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పారితోషకాలు చెల్లించాలి. – కె.నాగమణి, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి -
గుండెపోటుతో ‘ఆశ’ వర్కర్ మృతి
తూర్పుగోదావరి, వేండ్ర (పెదపూడి): విధి నిర్వహణలో శిక్షణ పొందుతూ ఆశ వర్కర్‌గా పని చేస్తున్న పలివెల చిట్టెమ్మ(50) గుండెపోటుతో మృతి చెందిందని సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వేండ్ర గ్రామానికి చెందిన పలివెల చిట్టమ్మ ఈనెల 20 సామర్లకోటలోని టీటీడీసీ సెంటర్‌కు శిక్షణ నిమిత్తం వెళ్లిందని, గురువారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో వెంటన్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయిందన్నారు. ఆశ వర్కర్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి సామర్లకోట టీటీడీసీలో శిక్షణ పొందుతూ మృతి చెందిన ఆశ వర్కర్ పలివెల చిట్టెమ్మను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మండల సీఐటీయూ నాయకురాలు ఎం.రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో చిట్టెమ్మ భౌతికకాయాన్ని వారు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యురాలైన కోడలకు ఆశ వర్కర్ ఉద్యోగం ఇవ్వాలని, ఆశవర్కర్కు చంద్రన్న బీమా పథకం వర్తింపజేయాలన్నారు. అలాగే తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండల ఆశవర్కర్ల నాయకురాలు రెడ్డి వెంకటలక్ష్మి, సంపర పీహెచ్సీ నాయకురాలు సుందరపల్లి మణిరత్నం, డీ.రత్నం, కె.పద్మవతి, సీహెచ్ మంగయమ్మ, జి.ఈశ్వరి తదితరులు ఉన్నారు. -
తల్లిపై నిందలకు మనస్తాపం.. కుటుంబం ఆత్మహత్య
అనంతపురం, బత్తలపల్లి : ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కుమారుడి బలవన్మరణంతో మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు కూతురుతో కలిసి పురుగుమందు తాగి అర్ధంతరంగా తనువుచాలించాలనుకున్నారు. వీరిలో తండ్రీ కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, శిరీష దంపతులు. వీరికి కుమారుడు ఉమేష్‌చంద్ర (11), కూతురు కీర్తన ఉన్నారు. శ్రీనివాసులు వెలుగులో పని చేస్తూ శిక్షణ ఇచ్చేందు కోసం ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తుంటాడు. శిరీష ఆశా వర్కర్. కుమారుడు బత్తలపల్లిలోని ప్రయివేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కుమార్తె కీర్తన తనకల్లు రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. తల్లిపై నిందలకు మనస్తాపం.. ఆశావర్కర్ విధుల్లో భాగంగా శిరీష ఇంటింటికీ తిరుగుతుండటం వల్ల స్థానికులు మాట్లాడే మాటలకు కుమారుడు ఉమేష్‌చంద్ర మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉమేష్‌చంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీనివాసులు వెంటనే మధ్యప్రదేశ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కుమారుడి లేని జీవితం వద్దని.. గురువారం రాత్రి ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శ్రీనివాసులు, శిరీష దంపతులతో పాటు కుమార్తె కీర్తన పురుగుమందు తాగారు. అంతకు ముందే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని శ్రీనివాసులు వెలుగు కార్యాలయం అధికారికి వాట్సప్ ద్వారా మెసేజ్ పంపాడు. వెంటనే ఆయన బత్తలపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఎస్ఐ గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ముగ్గురినీ ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శిరీషను అనంతపురం ఆస్పత్రికి పంపారు. శ్రీనివాసులు, కీర్తనల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ లేఖ ఏమైంది..? ఆత్మహత్యాయత్నానికి కారుకైలన వారి పేర్లను సూచిస్తూ శ్రీనివాసులు లేఖ రాసినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ లేఖ ఎవరి వద్ద ఉందనేది తెలియడం లేదు. పోలీసులు కూడా ఇంతవరకూ ఆ లేఖను స్వాధీనం చేసుకోలేదు. ఆ లేఖ దొరికితే ఎవరెవరి పేర్లు ఉన్నాయి.. ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనేది తెలిసే అవకాశం ఉంది. -
ఆశాలకు మళ్లీ నిరాశేనా?
వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే కీలక వ్యక్తుల్లో ఆశా కార్యకర్తలు ఒకరు. ప్రస్తుతం కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో వారిని ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంకా ఎంత మంది కొత్త కుష్ఠు వ్యాధి గ్రస్తులు ఉన్నారనే విషయమై గత నెలలో ఇంటింటికి తిరిగి ఆశాలు సర్వే నిర్వహించారు.ఇందుకు గాను వారికి ప్రోత్సాహక నగదు ఇవ్వాలి. అయితే, గతంలో లాగే ఇప్పుడు కూడా ప్రోత్సాహక నగదు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కొత్తగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆశాలు/అంగన్వాడీ కార్యకర్తలు/మెప్మా సిబ్బంది గత నెల 2వ తేదీ నుంచి 15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ప్రతి బృందంలో ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరు జిల్లాలోని 44,40,488 జనాభాకు గాను 33,36,872 మందిని పరీక్షించినట్లు అధికారుల లెక్కలు తేల్చారు. పరీక్షించిన వారిలో 3,645 మందికి కుష్ఠు వ్యాధిలక్షణాలు ఉండటంతో వైద్యపరీక్షలు చేయించారు. చివరగా 115 మందికి మాత్రమే వ్యాధి ఉన్నట్లు నిర్దారణ చేశారు. ఈ కార్యక్రమానికి గాను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి జిల్లాకు రూ.70 లక్షలకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని ఆశావర్కర్లు, మేల్ వలంటీర్లకు అవగాహన కల్పించేందుకు, ప్రచారం కోసం కొంత ఖర్చు చేశారు. మిగిలిన మొత్తంలో సర్వే చేసిన ఆశాలకు ప్రోత్సాహక నగదు కింద రోజుకు రూ.75 చొప్పున రెండు వారాలకు గాను రూ.1050 అందజేస్తారు. ప్రోత్సాహక నగదు ఇవ్వడంలో మీనమేషాలు ఆశా వర్కర్లు లేని చోట అంగన్వాడీలు, వీరు లేని చోట పట్టణాల్లో మెప్మా సిబ్బందితోర్వే చేయించారు. కార్యక్రమం ప్రారంభం ముందుగానే ఎంపిక చేసిన వీరి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. కానీ కార్యక్రమం(సర్వే) పూర్తయి 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశాల వివరాలు మాత్రమే సేకరించారు. మిగిలిన 47 పీహెచ్‌సీల ఆశాల వివరాలు ఇంకా తీసుకోలేదు. వీరు కూడా ఖాతా వివరాలు పంపిన తర్వాత ఒకేసారి అందరికీ ప్రోత్సాహక నగదు వేస్తామని అధికారులు భీష్మించుకుని కూర్చున్నారు. గత సంవత్సరం నవంబర్లోనూ ఇలాగే మొదటి విడత సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అప్పట్లో 6,198 మంది ఆశాలతో పనిచేయించుకున్నారు. కానీ వారికి ప్రోత్సాహక నగదు ఇచ్చేందుకు 8 నెలలకు పైగా సమయం తీసుకున్నారు. ఇందులో కొందరికి ఇప్పటికీ నగదు అందలేదు. ఇప్పుడు సర్వే చేసిన వారికి ఎన్ని నెలల్లో ప్రోత్సాహక నగదు వేస్తారోనని ఆశాలు వాపోతున్నారు. తమకు అందే రూ.1,050 కోసం ఆందోళన చేసి అధికారుల దృష్టిలో ఎందుకు పడాలన్న ఉద్దేశంతో వారు బయటకు రాకుండా లోలోపలే కుమిలిపోతున్నారు. ప్రస్తుతం బ్యాంకు వివరాలు అందించిన వారికి నగదు వేస్తే ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అందరి ఖాతా వివరాలుఅందాలి జిల్లాలోని ఆశాల బ్యాంకు వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 40 పీహెచ్‌సీల ఆశాల వివరాలు మాత్రమే అందాయి. మిగిలిన వారి వివరాలు అందిన వెంటనే ప్రోత్సాహక నగదు వారి ఖాతాల్లో వేస్తాము.– రామ్మోహన్,డీపీఎంఓ, లెప్రసి కార్యాలయం -
వైద్య సేవల్లో ముందుండాలి
డీఎంహెచ్ఓ సాంబశివరావు వర్ధన్నపేట : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద లక్ష్మిగార్డెన్లో గురువారం నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో ఆ యన మాట్లాడుతూ.. పీహెచ్సీ సబ్‌సెంట ర్ల పరిధిలోని వైద్య సేవల్లో కీలక పాత్ర వీరిదేనన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజ లకు వైద్య సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ఆశ కార్యకర్తల నైఫుణ్యత, భావ వ్యక్తీకరణ, రోజువారీ కార్యక్రమాల ప్రాధాన్యతపై నృత్య, నాటిక, పాట, ప్రసంగాల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యులు సతీష్‌కుమార్, ప్రశాంతి, విద్య, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాల వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.