
విశాఖ సిటీ :పేరుకు రూ.3 వేల గౌరవ వేతనం.. వేతనంలో ఉన్న గౌరవం పనిలో లేని దైన్యం.. ఇదీ ఆశ కార్యకర్తల ఆవేదన. గత ప్రభుత్వ హయాంలో వీరు చేయని పని లేదు. పడని మాట లేదు. వీరంతా ప్రజా సంకల్పయాత్రలో తమ గోడును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకున్నారు. ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలు కూడా ఊహించని విధంగా రూ.10 వేలకు వేతనం పెంచి వారిని గౌరవించారు. సీఎం జగన్ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,600 మంది ఆశ కార్యకర్తలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు, బుక్ కీపర్స్ వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
Comments
Please login to add a commentAdd a comment