- డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
Published Sat, Sep 24 2016 1:07 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
ఎంజీఎం : జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సాంబశివరావు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీల్లో సరిపడ మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు శుభ్రమైన నీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని దూరం పోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే వృద్ధులు, పిల్లలు వర్షంలో తడకుండా చూడాలని తెలిపారు. ఏఎ¯ŒSఎంలు, ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వరంగల్ పట్టణ ప్రాంత మురికి వాడల్లో పట్టణ ఆరోగ్యకేంద్రాల, 104 సిబ్బదితో వరంగల్ కార్పొరేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మలేరియా సబ్‌యూనిట్ అ«ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎంఓ పైడి రాజు, సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement