చదువుకోమంటే చంపేశాడు | Medical Student Killed Ex Army Man in education counselling | Sakshi
Sakshi News home page

చదువుకోమంటే చంపేశాడు

Published Sat, Dec 16 2017 7:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Medical Student Killed Ex Army Man in education counselling - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువుకోమని చెప్పినందుకు ఒక మెడికో సైకోలా మారాడు. మాజీ సైనికుడిని కత్తితో పొడిచి చంపేశాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా శివనికుళంకు చెందిన కుమార్‌ అనే కాంట్రాక్టర్‌ కుమారుడు సంతోష్‌కుమార్‌ (25). చిదంబరంలోని ఒక ప్రయివేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల తన సొంతూరికి వచ్చిన సంతోష్‌కుమార్‌ అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడం మానేశాడు.

పరీక్షలు సమీపిస్తున్నా ఇంటివద్దనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు అనేకమార్లు కళాశాలకు వెళ్లమని ఒత్తిడిచేశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి కుమార్‌ మాజీ సైనికుడైన కేరళలోని తన స్నేహితుడు నౌషాద్‌ వద్ద బాధపడ్డాడు. కుమారుడికి నచ్చజెప్పాల్సిందిగా బతిమాలాడు. స్నేహధర్మంతో శివనికుళంలోని కుమార్‌ ఇంటికి వచ్చిన నౌషాద్‌ ఎట్టకేలకూ ఒప్పించాడు. శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటలకు చిదంబరం వెళ్లేందుకు సిద్ధమవుతూ నౌషాద్‌తో ఘర్షణ పడి విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో పొడిచాడు. తీవ్రరక్తస్రావం కావడంతో నౌషాద్‌ ప్రాణాలు విడిచాడు. సంతోష్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement