డామిట్.. కథ అడ్డం తిరిగింది.. | story turns horizontal damit | Sakshi
Sakshi News home page

డామిట్.. కథ అడ్డం తిరిగింది..

Published Fri, May 8 2015 11:54 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

డామిట్.. కథ అడ్డం తిరిగింది.. - Sakshi

డామిట్.. కథ అడ్డం తిరిగింది..

డాన్‌లు అవుదామని.. దొరికిపోయారు
నలుగురు యువకుల అరెస్ట్..పిస్తోల్, కత్తి స్వాధీనం
హత్య పథకం గుట్టు రట్టు
హత్య, దోపిడీలు, స్నాచింగ్‌ల కోసం ముఠా ఏర్పాటు

 
సిటీబ్యూరో: ఆ నలుగురు యువకులు విద్యావంతులు. వారిలో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడగా మరో ఇద్దరు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అనుకోకుండా వారికి ఇటీవల ఒక పిస్తోల్ దొరికింది. దాని ఆధారంగా  రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని కలలుగన్నారు. ఇందుకు హత్య, దోపిడీలు, స్నాచింగ్‌లు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా వారు ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) గుట్టు రట్టు చేసింది. నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి పిస్తోల్, కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రవికిరణ్ అలియాస్ రవి (21), కుషాయిగూడకు చెందిన ఉప్పరాజి భరత్‌కుమార్ (22),  పిన్‌రెడ్డి ప్రసాద్‌రెడ్డి (22), నేరేడ్‌మెట్‌కు చెందిన పులపల్లి భగీరథ్ (21), నలుగురూ స్నేహితులు. వీరిలో టోల్‌గేట్ వద్ద పనిచేస్తున్న రవికి రెండు నెలల క్రితం బీహార్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఒకసారి మాటల మధ్యలో బీహార్‌లో తుపాకులు సులభంగా దొరుకుతాయని రవికి చెప్పాడు. దీంతో తనకు పిస్తోల్ కావాలని కోరడంతో రూ.1.60 లక్షలకు ఇప్పిస్తానని అజయ్ హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రవి రూ.1.30 లక్షలు చెల్లించడంతో అతను నెల రోజుల క్రితం బీహార్ నుంచి పిస్తోల్‌ను తెచ్చి రవికి ఇచ్చాడు. పిస్తోల్ విషయాన్ని అతను తన స్నేహితులైన భరత్‌కుమార్, ప్రసాద్‌రెడ్డి, భగీరథ్‌లకు చెప్పడంతో అందరూ కలిసి దాని సహాయంతో దోపిడీలు, హత్యలు, స్నాచింగ్‌లు చేసి సులువుగా డబ్బు  సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ భర్తను హత్య చేయాలని ప్రసాద్‌రెడ్డి పథకం పన్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం నలుగురు కారులో వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు  ఉమేందర్, పుష్పన్‌కుమార్, ఎస్‌ఐలు రాములు, ఆంజనేయులు వారిని అడ్డుకుని పిస్తోల్‌తో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అజయ్ గురించి ఆరా తీయగా అతడు బుల్లెట్లు తెచ్చేందుకు బీహార్‌కు వెళ్లినట్లు విచారణలో తేలడంతో పోలీసులు అతని కోసంగాలిస్తున్నారు. అజయ్‌ను అదుపులోకి తీసుకుంటే ఇంకెవరికైనా తుపాకులను విక్రయించిందీ తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement