ex army man
-
మేమూ నీతో పాటే అంటూ .. చనిపోయిన భర్త, పిల్లలు
బెలగావి: సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. మనకు ఎంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధను భరించడం కష్టం. కానీ కొంతమంది ఆ బాధను మర్చిపోలేక ఆవేదనతో తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని ముగించేస్తారు. అచ్చం అలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) వివరాల్లోకెళ్లితే.... ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ తన భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై తన నలుగురి పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోయాడు. ఈ ఘటన సంకేశ్వరంలోని బోర్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తి గోపాల్ హదీమణిగా పిల్లలు సౌమ్య, శ్వేత, సాక్షి, సృజన్‌లుగా గుర్తించారు. అయితే అతని భార్య జయ జూలై 6న కోవిడ్ కారణంగా బ్లాక్ ఫంగస్‌తో చనిపోవడంతో గోపాల్ ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యకం చేస్తున్నారు. అంతేకాదు గోపాల్ భార్య మరణంతో చాలా ఆవేదన చెందాడని, పైగా అప్పటి నుంచి పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాడంటూ బాధితుడి బంధువులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఇరుగుపొరుగు వచ్చి తలుపులు కొట్టిన పలకక పోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలుకొట్టి చూస్తే గోపాల్, అతని పిల్లలు చనిపోయి ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) -
మాజీ ఆర్మీ ఉద్యోగి.. ఛీ ఇదేం పాడు బుద్ధి.. కన్న కూతుళ్లనే
సాక్షి, హైదరాబాద్: నగరంలో నివాసముంటున్న మాజీ ఆర్మీ ఉద్యోగి తన రెండో భార్యతో కలిసి ఇద్దరు కుమార్తెలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉప్పల్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నగరానికి చెందిన ఆర్మీ జవాన్ హిమాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహించేవాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. పిల్లలు నగరంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేవారు. 2016లో భార్య మృతి చెందడంతో సిటీలో ఉన్న పిల్లలకు తెలియకుండా దహన కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ తరువాత కొద్దిరోజులకే మరో వివాహం చేసుకున్నాడు. అయితే తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ, తండ్రి వ్యవహారశైలిని తప్పుపడుతూ కుమార్తెలు అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తిరిగి వచ్చారు. తరచూ సిటీకి వచ్చి వేధిస్తుండటంతో ఆర్మీ అధికారులు తండ్రి పనిచేసే ప్రాంతంలోనే క్వార్టర్స్ కేటాయించారు. ఇది జీర్ణించుకోలేని అతను.. భార్యతో కలిసి పిల్లలు నివాసముండే ప్రాంతానికి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. తరువాత బలవంతంగా హైదరాబాద్ తీసుకువచ్చి వదిలివెళ్లాడు. ఆ తరువాత వీఆర్ఎస్ తీసుకొని అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. కూతుళ్లను ఇక్కడికే పిలుచుకువచ్చి వేధింపుల పర్వం కొనసాగించాడు. బాధితులు గతంలో అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మందలించి పంపించారు. ఈ వేధింపులు ఇంకా పెరగడంతో స్థానికుల సహకారంతో ‘సఖి’ సంస్థకు చేరవేశారు. ఉప్పల్ చేరుకున్న సంస్థ ప్రతినిధులు చిన్నారులను రెస్క్యూ చేసి తమ హోమ్‌కు తరలించారు. గత నెల 24న ఉప్పల్ ఠాణాలో పెద్ద కుమార్తె తన తండ్రి, సవతి తల్లిపై ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీఆర్ఎస్ తీసుకున్న ఆ ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: దారుణం: భార్యతో గొడవపడి.. ట్రాన్స్ఫార్మర్ ఎక్కి.. -
గణేష్ నిమజ్జనంలో తుపాకీతో కాల్పులు
-
చెవి పక్క నుంచి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భంగా ఆర్మీ మాజీ జవాన్ ఒకరు తుపాకీతో హల్ చల్ చేశాడు. పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరపడంతో నిమజ్జనంలో పాల్గొన్నవారు భయభ్రాంతులకు లోనయ్యారు. నార్సింగిలోని హైదర్ష్కోటలో శివం హైట్స్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని నాగ మల్లేష్‌గా గుర్తించారు. నాగ మల్లేష్ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: నిబంధనలు గాలికి వదిలేసి.. ప్రయాణం..) మాట వినకపోవడంతో.. ఘటనపై అపార్ట్మెంట్ వాసులు, వాచ్‌మన్ మాట్లాడుతూ.. హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ మొదటి ఫ్లోర్లో ఉంది. వాళ్ల ఆఫీస్‌లో గణేష్ నిమజ్జనానికి 40 మందికిపైగా వచ్చారు. లిఫ్ట్ లో కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు. గట్టిగట్టిగా అరుస్తున్నారు. మెట్లపై, టెర్రస్‌పై మద్యం తాగుతూ హంగామా చేశారు. మేము హెచ్చరించినా పట్టించుకోలేదు. మూడో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో ఉండే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మల్లేష్ పైకి వెళ్లి మద్యం తాగొద్దు అని చెప్పాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఓసారి ఫైర్ చేసాడు. అందరూ కిందకి వచ్చి సెల్లార్ లో డ్యాన్సులు చేస్తూ అరుస్తుండటంతో.. మరోసారి గాల్లోకి ఫైర్ చేశాడు. -
మాజీ సైనికుడి అఘాయిత్యం
చెన్నై : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బాధ్యతాయుతమైన సైనిక విధులు నిర్వహించిన వ్యక్తి వృత్తికే కళంకం తెచ్చాడు. వావివరసలు మరిచి పసికందును చిదిమేశాడు. వివరాలు.. తిరుముల్లెవాయిల్కు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి సైనికుడిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుందరం తనకు కూతురు వరసయ్యే నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుందరాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు -
చదువుకోమంటే చంపేశాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువుకోమని చెప్పినందుకు ఒక మెడికో సైకోలా మారాడు. మాజీ సైనికుడిని కత్తితో పొడిచి చంపేశాడు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా శివనికుళంకు చెందిన కుమార్ అనే కాంట్రాక్టర్ కుమారుడు సంతోష్‌కుమార్ (25). చిదంబరంలోని ఒక ప్రయివేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల తన సొంతూరికి వచ్చిన సంతోష్‌కుమార్ అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడం మానేశాడు. పరీక్షలు సమీపిస్తున్నా ఇంటివద్దనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు అనేకమార్లు కళాశాలకు వెళ్లమని ఒత్తిడిచేశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి కుమార్ మాజీ సైనికుడైన కేరళలోని తన స్నేహితుడు నౌషాద్ వద్ద బాధపడ్డాడు. కుమారుడికి నచ్చజెప్పాల్సిందిగా బతిమాలాడు. స్నేహధర్మంతో శివనికుళంలోని కుమార్ ఇంటికి వచ్చిన నౌషాద్ ఎట్టకేలకూ ఒప్పించాడు. శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటలకు చిదంబరం వెళ్లేందుకు సిద్ధమవుతూ నౌషాద్తో ఘర్షణ పడి విచక్షణారహితంగా పలుమార్లు కత్తితో పొడిచాడు. తీవ్రరక్తస్రావం కావడంతో నౌషాద్ ప్రాణాలు విడిచాడు. సంతోష్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కనికరం లేని మాజీ సైనికుడు.. వీడియో వైరల్
సాక్షి, బర్నాలా: ఓ మాజీ సైనికుడు తుపాకితో తన పెంపుడు కుక్కను కట్టేసి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్ గ్రామంలో చోటుచేసుకుంది. అజిత్ సింగ్ మాజీ సైనికుడు. బాద్బార్ తన సొంత గ్రామం. అజిత్ సింగ్ తన మిత్రుడు సత్వీర్ సింగ్‌తో కలిసి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్కను కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆ సైనికుడి కుమారుడు ఆ సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై స్పందించిన జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్ డీజీపీలకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బైల్‌పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్ ల్యాబ్‌కు పంపారు. -
ప్చ్.. మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకు కారణం రాహుల్ పోస్ట్ చేసిన ఓ ఫోటోనే. డీమానిటైజేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా నోట్ల కష్టాలను ప్రతిబింబించే ఐకానిక్ ఫోటో అంటూ ఓ మాజీ జవాన్ ఫోటోను రాహుల్ పోస్టు చేశారు. ‘‘ప్రజల కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదు. అవి సముద్రాలుగా ఉప్పొంగితే మీరు కొట్టుకుపోతారు అని అర్థం వచ్చేలా హిందీలో ఓట్వీట్ చేశారు. అయితే అందులో ఉన్న పెద్దాయన నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఇంటర్వ్యూ ఇవ్వటంతో రాహుల్‌కి ఝలక్ ఇచ్చినట్లయ్యింది. రాహుల్ ట్వీట్ అనంతరం గుర్గావ్లోని నంద్ లాల్ ఇంటిని సందర్శించిన జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐ ఆయనను ఆరాతీసింది. ‘‘అది దేశానికి మేలు చేసే నిర్ణయం. ఈ ఉగ్రవాదులు(నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు) అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు మరో జాతీయ మీడియాతో కూడా ఆయన ప్రభుత్వం ఏం చేసినా అది దేశప్రజల సంక్షేమం కోసమే అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోదీ పాలనపై నందన్ లాల్ పూర్తి సంతోషంతో ఉన్నారన్న విషయం ఆయన మాటలను బట్టి అర్థమౌతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం నందన్ లాల్ వీడియో వైరల్ కాగా, నిర్ధారణ చేసుకోకుండా రాహుల్ చేసిన పనికి అల్రెడీ ఆయన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు మొదలయ్యాయి. "एक आँसू भी हुकूमत के लिए ख़तरा है तुमने देखा नहीं आँखों का समुंदर होना" pic.twitter.com/r9NuCkmO6t — Office of RG (@OfficeOfRG) November 8, 2017 నంద్ లాల్ అనే 80 ఏళ్ల మాజీ జవాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూలో నిల్చుని రోదించటం అందులో ఉంది. మూడు రోజులు తిరిగినా పెన్షన్ లభించకపోవటంతో ఆయనలా ఏడ్చాడంటూ ఓ వార్తా సంస్థ ఫోటో గ్రాఫర్ ఫోటో తీసి కథనం ప్రచురించింది. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ప్చ్.. మళ్లీ పప్పులో కాలేసిన రాహుల్
-
పాక్‌కు గూఢచర్యంపై మాజీ సైనికుడి అరెస్టు
అమృత్సర్: పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో మాజీ సైనికుడు సుఖ్వీందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మీ వాహనాల కదలికలు, కీలక సంస్థలు, ఆర్మీ శిక్షణ శిబిరాల పత్రాల ఫొటోలు, చేతితో గీసిన నిషిద్ధ స్థలాల పటాలను సింగ్ దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంగ్రూర్ జిల్లాకు చెందిన సింగ్ ‘21 సిక్కు లైట్ పదాతిదళం’లో పనిచేసి 2005లో ఉద్యోగ విరమణ చేశాడు. ప్రస్తుతం ప్రైవేటు గిడ్డంగిలో సెక్యూరిటీ గార్డ్‌గా పని ఉన్నాడు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సింగ్‌ను డబ్బు, ఉద్యోగం ఇస్తామని ప్రలోభపెట్టాడని, అతడు ‘శర్మ జీ’ పేరుతో పాక్‌కు గూఢచారిగా పనిచేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. భారత సరిహద్దుల్లో ఏర్పాటు చేసే బంకర్ల వివరాలు, నభా, సంగ్రూర్లలో ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసే పనిని సింగ్‌కు అప్పగించారు.