సాక్షి, అమరావతి: మగ్గానికి మహర్దశ వ చ్చింది. పోగు పోగుగా సంక్షేమం అందుతోంది. నేతన్నల నరాలు సత్తువ పుంజుకున్నాయి. మొత్తంగా చేనేత రంగం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమాన్ని అద్దుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగానికి ప్రముఖ పాత్ర ఉంది. అందుకే 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం.
దేశవ్యాప్తంగా చూస్తే ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మగ్గానికి మహర్దశ పట్టింది. సీఎం వైఎస్ జగన్ అందించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది.
మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలుకు ఊతమి చ్చింది. ఆధునిక డిజైన్లు, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్రస్తాల తయారీలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ చేనేతకు కొత్త హంగులు అందిస్తోంది. ప్రత్యేకంగా క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ అనంతరం ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందించే కార్యక్రమం చేనేతల తలరాతలను మారుస్తోంది.
‘నేతన్న నేస్తం’తో రూ.969.77 కోట్లు
చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం వరుసగా ఐదేళ్లు ‘నేతన్న నేస్తం’ ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వ్రస్తాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇ చ్చింది.
చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం.
చేనేత వారోత్సవాల నిర్వహణకు ఆదేశాలు
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని, క్లిష్టమైన బట్టలను నేయడానికి అంకితమైన కళాకారులను, ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు చేనేత వ్రస్తాలు ధరించాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చిందని గుర్తు చేసిన జవహర్‌రెడ్డి అదే స్ఫూర్తితో యువతరం సైతం చేనేత వ్రస్తాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ఆవరణలో చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించేలా స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. ఆగస్టు 7న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేనేత వ్రస్తాలు (చీర, ధోతీ) ధరించి వాక్‌థాన్ నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం స్వచ్ఛందంగా చేనేత వ్రస్తాలు ధరించాలని ఉద్యోగులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment