national handloom day
-
విజయవాడ : చేనేత షో అదుర్స్ (ఫొటోలు)
-
చేనేత దినోత్సవం.. విజయవాడ ఫ్యాషన్ షోలో మెరిసిన అమ్మాయిలు (ఫొటోలు)
-
చేనేత దినోత్సవం.. కేరళ చీరలో మెరిసిన పూనం కౌర్ (ఫొటోలు)
-
నేతన్నలకు కేటీఆర్ హ్యాండ్లూమ్ డే విషెస్
సాక్షి,హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం(ఆగస్టు7) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని తెలిపారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్యరాష్ట్రంలో చేనేత రంగానికి ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లు కాగా బీఆర్ఎస్ పాలనలో చేనేత రంగానికి ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. -
నేత.. మళ్లీ గుండెకోత!
జాతీయ చేనేత దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చీరాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలిపారు.సాక్షి, అమరావతి: మానవాళికి వస్త్రాన్ని అందించి గౌరవాన్ని కలి్పంచిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమవుతోంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు చేయూత కరువైంది. మంచి వ్రస్తాన్ని నేయడానికి మూడు పూటలూ కష్టపడే నేతన్న నేడు తన బిడ్డలకు ఒక్క పూట కూడా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. వైఎస్ జగన్ తన పాలనలో గత ఐదేళ్లూ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. చంద్రబాబు మరోసారి అబద్ధాల హామీల అల్లికలతో దగా చేస్తున్న వైనాన్ని నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి కుట్రలకు మగ్గం చిన్నబోతున్న వైనంపై ప్రత్యేక కథనం ఇది.. అలవిగాని హామీలతో అధికారం చేపట్టి, ఆపై చెయ్యివ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరూ సాటిరారు. 2014 ఎన్నికల ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో 600కుపైగా అడ్డగోలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేనేత రంగానికి ఇచ్చిన 25కు పైగా హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి.. ఐదేళ్లూ కాలయాపన చేశారు. తాజాగా 2024 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఇచి్చన ఉచిత విద్యుత్ హామీ అమలుకు ఇంకా అడుగు ముందుకు వేయడం లేదు.మర మగ్గాలు (పవర్ లూమ్స్)కు 500 యూనిట్లు, చేనేత మగ్గాలు (హ్యాండ్లూమ్స్)కు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తానని ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో చేనేత మగ్గాలు సుమారు 1.60 లక్షలు ఉంటాయని అంచనా. మరమగ్గాలు వీటికి అదనం. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం వద్ద తగిన సమాచారం ఉంది. దీంతో ఆయా చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఏ అడ్డంకులూ లేవు. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంపై నేతన్నలు మండిపడుతున్నారు. ఇప్పుడూ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే జూలైలోనే ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలు అందేది. దీంతోపాటు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ లా నేస్తం, జగనన్న అమ్మఒడి, పంటల బీమా, జగనన్న విదేశీ విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద కూడా ఇప్పటికే లబ్ధి చేకూరేది.జీఎస్టీ రీయింబర్స్మెంట్ మెలికపెట్టిన బాబు చేనేత వ్రస్తాలకు జీఎస్టీ ఎత్తివేయాలన్న డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారని నేతన్నలు మండిపడుతున్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు.. అది ఎలా చెల్లిస్తారో చెప్పలేదు. చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్నులు వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ రూ.వెయ్యి లోపు చేనేత వ్రస్తాల విక్రయాలపై 5 శాతం జీఎస్టీ, రూ.వెయ్యి దాటితే 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.ఇందులో తయారీదారు షాపులకు విక్రయిస్తే.. షాపుల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తారు. దీంట్లో వినియోగదారులే (ప్రజలు) జీఎస్టీ చెల్లిస్తారు. ఈ లెక్కన చంద్రబాబు ఎవరికి జీఎస్టీ రీయింబర్స్ చేస్తారు? తయారీదారులు, విక్రయదారులకు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అనుమతించవు. ఎందుకంటే జీఎస్టీ చెల్లించింది ప్రజలు కాబట్టి. వారే దరఖాస్తు చేసుకోవాలా? రూ.వెయ్యికిపైగా చెల్లించి చేనేత చీర కొనుక్కున్న వినియోగదారుడు రూ.120 (12 శాతం) జీఎస్టీ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటాడా?2014లోనూ బాబు దగా.. 2014లోనూ చంద్రబాబు నేతన్నలను దగా చేశారు. చేనేత రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, దానిపై అధ్యయనానికి కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో చేనేత కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. చేనేత కుటుంబాలకు ఇళ్లు, హెల్త్‌కార్డులు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, వర్షాకాలంలో రెండు నెలలపాటు నేత విరామానికి ఒక్కొక్క చేనేత కారి్మకుడికి రూ.4 వేల సాయం, నెలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలకు మంగళం పాడారు.జీఎస్టీ రద్దు చేస్తే నిజంగా మేలుచంద్రబాబు ప్రకటించిన జీఎస్టీ రీయింబర్స్మెంట్ కంటే జీఎస్టీ రద్దు చేస్తేనే చేనేత రంగానికి నిజంగా మేలు జరుగుతుంది. హామీ ఇవ్వాలి కానీ, అది అమలు కాకూడదు అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ఈ విషయమై అప్పట్లో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బృందం ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడైనా సీఎం చంద్రబాబు ఈ విషయమై చిత్తశుద్ధితో అడుగులు వేయాలి. – బండారు ఆనందప్రసాద్, జాతీయ అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ -
వందే నేతరం
తరం మారింది. ఈ తరంలో మగ్గంతో పని చేసే వాళ్లలో మహిళలే ఎక్కువ. గిట్టుబాటు లెక్క చూసుకుని ఈ వృత్తిని వదిలేస్తున్నారు.మగవాళ్లు. ఇంతకాలం మగవాళ్లకు సహాయంగా పని చేసిన మహిళలు ఇప్పుడు మగ్గం ముందు కూర్చున్నారు. కండె చేతిలోకి తీసుకున్నారు. తదేకంగా పని చేస్తున్నారు. వాళ్ల దీక్ష చూస్తుంటే మాటలతో పని లేనట్లు మౌనంగా ధ్యానంలో ఉన్నట్లే ఉంటారు. వాళ్ల చేతులు మాట్లాడతాయి. మగ్గం మీద దారంతో అద్భుతాలు సృష్టిస్తాయి.కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈ మంత్రజాలం అంతా కొత్త చేనేతరానిదే. వారికి వందనం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 7వ తేదీ) సోమవారంనాడు దేశంలోని చేనేతల గొప్పదనాన్ని తెలియజేసే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని గౌరంగ్స్ కిచెన్‌లో ‘విష్పర్స్ ఆఫ్ ద లూమ్’ పేరుతో మాస్టర్ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ షా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జామ్దానీ నేత ప్రత్యేకతను వివరించారు. ఈ నేత విధానాన్ని మనదేశంలో ఎన్ని ఇతర చేనేతలతో సమ్మిళితం చేయవచ్చనేది ప్రయోగపూర్వకంగా వివరిస్తూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు గౌరంగ్. ఈ తరం మనసు పడుతోంది! మహిళలు మనదేశ సంప్రదాయ చేనేత వైవిధ్యాన్ని చెరిగిపోని జ్ఞాపకంగా నిలుపుతున్నారు. కశ్మీర్ నుంచి ఢాకా వరకు, కోట, పైఠానీ, వెంకటగిరి, ఉప్పాడ, బనారస్, కంజీవరం, పటోలా, మహేశ్వరి, చందేరి, జాకార్డ్, బంధాని, ఇకత్... ఇలా ఎన్నో రకాల చేనేతలున్నాయి మనదేశంలో. కొత్తదనం ఎప్పుడూ మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఆశ్చర్యం ఆకర్షణగా మారుతుంది. అలా వెస్టర్న్ టెక్స్టైల్ ప్రవాహంలో కొంతకాలం మన సంప్రదాయ చేనేతలు తెరమరుగయ్యాయి. కానీ కనుమరుగు మాత్రం కాలేదు. భారతీయత లాగానే మన చేనేత కూడా తన ఉనికిని చాటుతూనే ఉంది. పడి లేచిన కెరటంలాగ ఇప్పుడు మన సంప్రదాయ చేనేత ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చేనేతలో ఈ తరం చేసిన ప్రయోగాలు మహిళల మనసును దోచుకుంటున్నాయి. రోజూ చీర కట్టడానికి ఇష్టపడని మహిళలు కూడా మన చేనేత చీరల కోసం వార్డ్‌రోబ్‌లో కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. పండుగలు, వేడుకల వంటి ప్రత్యేకమైన రోజులను చేనేత చీరలతో పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఈ రంగంలో చేనేత కళాకారుల కృషి కనువిందు చేస్తోంది. వైవిధ్యాల సమ్మేళనం! ఒకప్పుడు ఒక చేనేత చీరను చూడగానే అది ఇకత్ అనీ, చందేరి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పైఠానీ... ఇలా వెంటనే పేరు చెప్పగలిగేటట్లు ఉండేవి. తరాలు మారుతున్నా నేత విధానంలో ఏ మార్పూ లేకపోవడం వల్ల ఆదరణ తగ్గుతూ వచ్చింది. అలవాటు పడిన తరాలు తప్ప కొత్తతరం చేనేత వైపు చూడని రోజులు కూడా వచ్చేశాయి. అప్పుడు వచ్చింది కెరటంలాంటి ఓ ట్రెండ్. కంజీవరంలో జామ్దాని, బనారస్‌లో జాకార్డ్, ఉప్పాడలో జామ్దాని... ఇలాంటి ప్రయోగాలతో ఈ తరం చేనేత చీర ఒక పజిల్లా ఉంది. దేశంలో ఉన్న నాలుగైదు రకాల వైవిధ్యతలకు ప్రతీకగా మారింది. మనం పరిరక్షించుకోవాల్సింది చేనేతను, చేనేతకారులను కూడా. సంప్రదాయ చేనేతకారుల కుటుంబాల నుంచి మహిళలు ఆ బాధ్యతను తలకెత్తుకున్నారు. వారికి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించగలరని నిరూపిస్తున్నారు. ఈ రంగం మీద సంప్రదాయ చేనేత కుటుంబాల నుంచి మాత్రమే కాకుండా ఆసక్తి కొద్దీ ఇతరులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తన ప్రయోగాలకు సంప్రదాయ కుటుంబాలు శ్రద్ధ చూపించనప్పుడు వ్యవసాయరంగంలో పనులు చేసుకునే మహిళలకు శిక్షణ ఇచ్చి కొత్త చేనేతకారులను తయారు చేశానని చెప్పారు గౌరంగ్. మన వస్త్రాలు దేహాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా భారతీయతను చాటి చెప్తాయి. మన కళాకారుల సృజనను, మేధను ప్రతిబింబిస్తాయి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి కళాత్మకతను కాపాడుకోవాలి! చేనేతలో వైవిధ్యభరితంగా ఒక చీర తయారు కావాలంటే నెలలు పడుతుంది, ఏళ్లు కూడా పడుతుంది. ఒక అంగుళంలో ఎనభై దారాలతో నేస్తే పట్టే సమయం ఒకలా ఉంటుంది. అంగుళంలో నాలుగు వందల దారాలతో నేస్తే పట్టే సమయం వేరు. నాలుగు వందల కౌంట్ దారం కంటికి కనిపించనంత సన్నగా ఉంటుంది. డిజైన్‌ను బట్టి చీర తయారయ్యే సమయం కూడా పెరుగుతూ ఉంటుంది. రెండు దారాలు తప్పుగా పడినా సరే పువ్వు ఆకారం మారిపోతుంది. ఒక వరుస నేయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. అలా ఎన్ని వందల వరుసలు నేస్తే ఆరు మీటర్ల వస్త్రం తయారవుతుందో ఊహించుకోవాల్సిందే. మహిళలు ఉదయం ఇంటి పనులు చక్కబెట్టుకుని పన్నెండు– పన్నెండున్నర సమయంలో మగ్గం మీదకు వస్తే సాయంత్రం ఆరు గంటల వరకు తదేకంగా దీక్షతో పని చేస్తారు. ఇంత అద్భుతమైన కళను ముందు తరాలకు అందేలా కొనసాగించాలి. ఒక హెరిటేజ్ కన్‌స్ట్రక్షన్‌ను పరిరక్షించుకున్నట్లే ఈ సంప్రదాయ కళలను కూడా కాపాడుకోవాలి. ఈ ఏడాది హాండ్లూమ్ డే కోసం... చేనేత ప్రయోగాలతోపాటు కలంకారీ, పటచిత్ర, చేర్యాల పెయింటింగ్‌లు, ఎంబ్రాయిడరీల్లో చికన్‌కారీ, కచ్‌వర్క్, ఆరే వర్క్, కసౌటీ, కశ్మీరీవర్క్లను కూడా చేనేతకు జోడించి ఓ ప్రయోగం చేశాను. – గౌరంగ్ షా, మాస్టర్ టెక్స్టైల్ డిజైనర్ -
చేనేతకు ఇది స్వర్ణయుగం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆగష్టు 7వ తేదీ.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా.. చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. నా పాదయాత్రలో వాగ్దానం చేసినట్లుగా.. వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించాం. నేత కార్మికులకు సంవత్సరానికి రూ. 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చేనేత కార్మికులను ఉద్ధరించాలనే మా నిబద్ధత.. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. నేతన్నలకు గత వైభవాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాము. వారికి సుసంపన్నమైన భవిష్యత్తును అందిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారాయన. On #NationalHandloomDay, we celebrate the rich heritage of our weaver community, an integral part of our cultural legacy. As promised during my Padayatra, we launched the YSR Nethanna Nestham scheme, empowering our weavers with their looms and yearly financial assistance of Rs… pic.twitter.com/1Blmd12VF2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2023 -
మగ్గానికి మహర్దశ.. సొంత మగ్గం ఉన్న కుటుంబానికి ఏటా రూ.24 వేలు
సాక్షి, అమరావతి: మగ్గానికి మహర్దశ వ చ్చింది. పోగు పోగుగా సంక్షేమం అందుతోంది. నేతన్నల నరాలు సత్తువ పుంజుకున్నాయి. మొత్తంగా చేనేత రంగం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమాన్ని అద్దుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగానికి ప్రముఖ పాత్ర ఉంది. అందుకే 1905లో ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇతర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగం తన ప్రాభవాన్ని కోల్పోయి శిథిలావస్థకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మగ్గానికి మహర్దశ పట్టింది. సీఎం వైఎస్ జగన్ అందించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలుకు ఊతమి చ్చింది. ఆధునిక డిజైన్లు, పోటీ మార్కెట్‌కు అనుగుణంగా నాణ్యమైన వ్రస్తాల తయారీలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ చేనేతకు కొత్త హంగులు అందిస్తోంది. ప్రత్యేకంగా క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి శిక్షణ అనంతరం ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందించే కార్యక్రమం చేనేతల తలరాతలను మారుస్తోంది. ‘నేతన్న నేస్తం’తో రూ.969.77 కోట్లు చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం వరుసగా ఐదేళ్లు ‘నేతన్న నేస్తం’ ద్వారా రూ.969.77 కోట్లు అందించింది. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కారి్మకులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వ్రస్తాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇ చ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లు వ్యయం చేసింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. చేనేత వారోత్సవాల నిర్వహణకు ఆదేశాలు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని, క్లిష్టమైన బట్టలను నేయడానికి అంకితమైన కళాకారులను, ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒక రోజు చేనేత వ్రస్తాలు ధరించాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చిందని గుర్తు చేసిన జవహర్‌రెడ్డి అదే స్ఫూర్తితో యువతరం సైతం చేనేత వ్రస్తాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాల ఆవరణలో చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించేలా స్టాల్స్ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆదేశించారు. ఆగస్టు 7న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేనేత వ్రస్తాలు (చీర, ధోతీ) ధరించి వాక్‌థాన్ నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి శనివారం స్వచ్ఛందంగా చేనేత వ్రస్తాలు ధరించాలని ఉద్యోగులను కోరారు. -
లండన్‌లో శారీ వాకథాన్
భారతీయ చేనేత కళాకారులను, నేత కార్మికులను ప్రోత్సహించడానికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా లండన్‌లో బ్రిటిష్ ఉమెన్ ఇన్ శారీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దీప్తి జైన్, ఐఐడబ్ల్యూ సహకారంతో లండన్‌లో శారీ వాకథాన్-2023 నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా భారతీయ మహిళలు వారి సాంప్రదాయ చేనేత చీరలు ధరించి కార్యక్రమానికి తరలివచ్చారు. వారంతా తమ ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ సెంట్రల్ లండన్‌లోని చారిత్రక ప్రదేశాల మీదుగా నడిచారు. ఈ వాకథాన్ ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి ప్రారంభమై, 10 డౌనింగ్ స్ట్రీట్ దాటి, మన జాతీయ గీతం, కొన్ని ప్రాంతీయ ప్రదర్శనలతో పార్లమెంట్ స్క్వేర్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ముగిసింది. తెలంగాణకు చెందిన గద్వాల్, పోచంపల్లి, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట, గొల్లభామ వంటి చేనేత చీరలతో 40 మందిపైగా తెలంగాణ మహిళల బృందం ఈ వాకథాన్ 2023లో పాల్గొంది. భారతీయ చేనేత వస్త్రాలపై అవగాహన పెంచేందుకు, భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ తరహా అంతర్జాతీయ ప్రదర్శనలు చేనేత కార్మికుల జీవనోపాధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలంగాణ కోఆర్డినేటర్లు ప్రతిమ, జ్యోతి, అనూష, సాధన, సింధు, గోదా పేర్కొన్నారు. -
Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’..
ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా.. దానిని ప్రజల్లోకి తీసికెళ్లి సేల్ చేయాలన్నా ఆయా సంస్థలు సెలబ్రిటీలను ఎంచుకుంటారు. వారి ద్వారా అయితేనే ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పరిధిలోని చేనేత రంగాన్ని ప్రమోట్ చేసేందుకు స్వయానా ఐఏఎస్ అ«ధికారులు రంగంలోకి దిగారు. చేనేతలోని పలు రకాల చీరెలను ధరించి వాటి విశిష్టతను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. నచ్చిన చీరలో ఫొటో దిగి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో చేనేతకు భారీ డిమాండ్ పెరిగింది. చేనేతను ప్రోత్సహించేందుకు, కార్మికులకు సేల్స్‌ను పెంచేందుకు స్వయానా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి స్మిత సభర్వాల్. ఇటీవల చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణలోని పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సై ్టలిష్ లుక్‌లో ఛాలెంజ్ చేసిన స్మిత సబర్వాల్ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిణి స్మిత సభర్వాల్ ఓ చక్కటి చేనేత చీరను ధరించి ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చీరలో ఎంతో స్టయిలిష్ లుక్‌లో ఉన్నారు మేడం..’ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్మిత ఆ పోస్ట్ ద్వారా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చేనేతవస్త్రాన్ని ధరించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఇలా ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్లో సోషల్ మీడియాలో సందడి చేశారు. దేశం మొత్తం ఫిదా స్మిత సబర్వాల్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐటీ శాఖ సెక్రటరీ జయేష్ రంజన్, నారాయణఖేడ్ జిల్లా కలెక్టర్ హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్, యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమీలా సత్పతి, ఐపీఎస్ అధికారిణులు శిఖాగోయల్, స్వాతిలక్రా తదితరులు వారికి నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్‌ను విసరడం విశేషం. వీరి ఛాలెంజ్‌లు, డ్రస్సింగ్ సెన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు లైక్‌లు కొడుతూ కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సైతం ఈ ఛాలెంజ్‌లో పాల్గొని తమ తమ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను ప్రచారం చేశారు. వీరి ప్రచారంతో చేనేతకు ఊరట లభించడంతో పాటు అమ్మకాలు సైతం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మనదేశం లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వదేశీ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా నయా ట్రెండ్‌ను సృష్టించడం అభినందనీయం. – చైతన్య వంపుగాని, సాక్షి -
పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
-
చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. దేశంలో ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7న) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7 నుంచి ‘నేతన్న బీమా’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో తొలిసారని సీఎం తెలిపారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందడం సంతోషకరమని చెప్పారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే అర్హులైన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం.. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడిన పద్మశాలీ తదితర కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. చదవండి: ‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’ -
నేతన్న పనితీరు అద్భుతం,చేనేత దుస్తులు ధరిద్దాం
చేనేత కార్మికులకు మద్దతునివ్వడానికి ప్రతిఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని, వాటి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపజలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలకు నేత కార్మికులు అర్హులని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆకాంక్షించారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు నేత కార్మికులను సన్మానించారు. 2015లో తమిళనాడులో ప్రధాని మోదీ ప్రారంభించిన తొలి జాతీయ చేనేత దినోత్సవంలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేత కార్మికులు తమ వృత్తిపై అసాధారణమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారని, అద్భుతమైన డిజైన్లతో ఉత్పత్తులు తీసుకొస్తున్నారన్నారు. నారాయణపేట, సిద్దిపేట, వరంగల్ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతల ను తెలుపుతూ పోస్టల్ కవర్లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోస్టల్ సర్కిల్ కృషిని గవర్నర్ ప్రశంసించారు. – సాక్షి, హైదరాబాద్ -
చేనేతల కష్టాలను చూశా, వారి బాధలు విన్నా: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సీఎం జగన్ నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘చేనేతల కష్టాలను నా 3648 కిలో మీటర్ల సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులకు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండగా ఉంటున్నాం. నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇక్కడ చదవండి: జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’ చేనేతల కష్టాలను నా 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులకు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండగా ఉంటున్నాం. నేతన్నలందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.#NationalHandloomDay — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2021 -
నేతన్నలకు ప్రభుత్వమే నేస్తం
ప్రాచీనకాలం నుంచీ చరి త్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయోద్య మంతోనూ విడదీయరాని బంధం కలిగుంది. గ్రామీణ భారతంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ. రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 80 వేల మగ్గాలు ఉండగా, ఉప వృత్తులు కలిపి సుమారు నాలుగు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కాలానుగుణంగా చేనేత రంగం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేనేతల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పొందూరు, చీరాల, మంగళగిరి... ఇలా పలు చేనేత కేంద్రాల్లో కార్మికుల ఆర్థిక ఇబ్బందులను స్వయంగా గమనిం చారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా జగన్ చేనేతల సంక్షేమానికి నడుం బిగించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 24,000 వంతున రూ. 196.28 కోట్ల తొలి విడత సాయాన్ని జమ చేశారు. ఆ తరువాత కరోనా విజృం భించడంతో చేనేత కార్మికులు ఉపాధికి దూర మయ్యారు. కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, రెండో విడత నేతన్న నేస్తం పథకాన్ని ఆర్నెల్లు ముందుగానే అమల్లోకి తెచ్చారు. 81,024 మంది అర్హులైన లబ్ధి దారులకు రూ.24,000 వంతున రూ.194.46 కోట్ల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. చేనేత దినోత్సవం సందర్భంగా మూడోసారి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రాజకీయంగా కూడా చేనేత వర్గాలకు పెద్దపీట వేశారు. మునుపెన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి పాలక వర్గాలను కూడా నియమించి చరిత్ర సృష్టించారు. చేనేతకు ఏకంగా నాలుగు (పద్మశాలి, దేవాంగ, తొగటవీర క్షత్రియ, కుర్నిశాలి) కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం విశేషం. నేటి ఆధునిక యుగంలో యువత, మహిళల అభిరుచికి తగ్గట్టుగా వీవర్స్ సర్వీస్ సెంటరు సహకారంతో ఆప్కో తరపున నూతన వెరైటీల ఆవిష్కరణకు కృషి జరుగుతోంది. డిజైన్ చీరల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేసి, సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధాన ముడిసరుకైన పట్టు (సిల్క్) కొరత రాష్ట్రంలో తీవ్రంగా వుంది. మలబారు సాగుకు అనుకూల పరిస్థితులున్న విశాఖ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రసాయనాలు వినియోగించకుండా పండించిన పత్తి నుంచి నూలు, చెట్టు బెరడు, పూలు, పండ్లు, ఆకుల నుంచి సేకరిం చిన రంగులను వినియోగించి వస్త్రాలను ప్రయోగాత్మకంగా నేయిస్తోంది. కృష్ణా జిల్లా పెడన, గుంటూరు జిల్లా ఇసుకపల్లి, తూర్పు గోదావరి జిల్లా అంబాజీ పేట తదితర ప్రాంతాల్లో ఆర్గానిక్ చేనేత వస్త్రాలు తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండ్, మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్ర చేనేత జౌళి శాఖకు అనుబంధంగా పనిచేసే హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(హెచ్ఈపీ సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు దగ్గరగా ఉండే శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే మన దేశ ఖ్యాతి ఇనుమడించడంతోపాటు ఇక్కడి కార్మికుల ఉపాధి మెరుగవుతుంది. చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా శ్రమించిన చేనేత బంధు, దివంగత రాజ్యసభ సభ్యుడు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ చేనేత విభాగం ముందుకెళ్తోంది. - చిల్లపల్లి మోహనరావు వ్యాసకర్త ఆప్కో చైర్మన్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
'నేతన్న నేస్తం'తో ఆగిన ఆత్మహత్యలు: సజ్జల
సాక్షి, విజయవాడ: ‘నేతన్న నేస్తం’ పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం విజయవాడలోని ఆప్కో భవన్లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయతకు గుర్తింపు చేనేత అని తెలిపారు. ప్రభుత్వ సాయంతో చేనేతలు నిలబడే ప్రయత్నం చేయాలని సూచించారు. చేనేతరంగం మన ప్రస్థానం.. మరో ప్రస్థానంగా మార్చుతాయని పేర్కొన్నారు. మా బట్టలు మేమే తయారుచేసుకుంటాం.. మా సంప్రదాయ వస్త్రాలు మేం చేసుకుంటామని బ్రిటిష్ వారికి మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటారని గుర్తుచేశారు. చేనేత అనే పదం వింటే నాకు గుర్తొచ్చేది చట్రంతో వస్త్రం నేయటమేనని, నాకు మరచిపోలేని మంచి జ్ఞాపకమని సజ్జల తెలిపారు. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చాటుతాం, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదు, గ్రామీణ స్థాయిలోనూ సకల సౌకర్యాలు కల్పించడమన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వచనమని వివరించారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామని వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్ పోర్టల్‌ల ద్వారా విక్రయాలు, మార్కెటింగ్ పెంచుతామని వివరించారు. నైపుణ్యం ఉన్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ ఇస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. గ్రామీణ స్థాయిలో సౌకర్యాలు కల్పించడమే అభివృద్ధి అని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శశిభూషణ్, చేనేత జౌళి డైరెక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోంది : సజ్జల ‘‘కాషాయమే రాజకీయ అజెండాగా బీజేపీ పనిచేస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకుంటున్నాయా?. కేంద్రం చేసిన అప్పులు ఎంతో కూడా లెక్కలు బయటకు తీయాలి. బొల్లినేని ఏ పార్టీకి చెందినవాళ్లు. మేం ఎప్పుడూ కేంద్రాన్ని నిందించలేదు. పోలవరం నిధులు వేగంగా తీసుకొచ్చి.. క్రెడిట్ మీ ఖాతాల్లో వేసుకోండి మాకు అభ్యంతరం లేదు’’ -
జాతీయ చేనేత దినోత్సవం: నేతన్నల బతుకు దుర్భరం
సాక్షి, సిరిసిల్ల: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లుగా.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. వాటిని ఇప్పుడు ఆధునిక మగ్గాలు మింగేస్తున్నాయి. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్టను నేసే నేత కార్మికుల బతుకు దుర్భరంగా మారింది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచింది. వస్త్రాన్ని అందించి, ప్రపంచానికి నాగరికత నేర్పిన నేతన్నల జీవితం కష్టాలు, కన్నీళ్ల కలబోతగా మిగిలింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదికవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి, ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేత కళాకారుల ఖిల్లా సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగం ఆధునికత వైపు అడుగులు వేస్తుంది. కరోనా కష్టకాలంలో చేనేత రంగం ఆటుపోట్ల మధ్య ఉంది. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరమగ్గాలపై బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తి చేనేత దినోత్సవ నేపథ్యం ఇదీ.. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల ను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్ హాల్లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఎగుమతిలో 90 శాతం భారతదేశం భాగస్వామ్యం ఉండటం విశేషం. చేనేత బ్రాండ్‌గా భారతదేశాన్ని నిలిపేందుకు మద్రాసు విశ్వవిద్యాలయం సెనెట్ భవనంలో ప్రధాని, రాష్ట్రపతి చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాచీన వారసత్వం.. చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి, ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 43 లక్షల నేత కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి. వస్త్రోత్పత్తి కేంద్రాలుగా పలు పట్టణాలు ఖ్యాతిగాంచాయి. షోలాపూర్, భీవండి, ముంబయి, అహ్మదాబాద్, ఇంచన్‌కరంజ్, సూరత్, మాలేగావ్, సిరిసిల్ల, వెంకటగిరి, గద్వాల్, భూదాన్ పోచంపల్లి, ఈరోడ్, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి. చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం సిరిసిల్లలో దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహం నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, 7 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి జరుగుతోంది. సిరిసిల్లలో 25 వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిత్యం 34 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 115 పరిశ్రమల్లో ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి సాగుతోంది. ఇక్కడి వస్త్రాలు ముంబయి, భీవండి, సూరత్, ఢిల్లీ, షోలాపూర్ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. టెక్స్టైల్ పార్క్‌లో 3 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో కాటన్ వస్త్రం అద్దం యూనిట్లు 90 వరకు ఉన్నాయి. ఇక్కడి కాటన్ వస్త్రం దేశంలోని 6 రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంలో ఉంది. రెండో షోలాపూర్‌గా ఖ్యాతిగాంచిన సిరిసిల్లకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది రూ.350 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతినిండా పని దొరుకుతోంది. క్షీణదశలో చేనేత రంగం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 36 చేనేత సహకార సంఘాలు ఉండగా వీటిలో 6 వేల మంది సభ్యులున్నారు. నిజానికి 29 సంఘాలు మాత్ర మే సమర్థంగా పని చేస్తుండగా 4 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో 3 సహకార సంఘాలు పని చేస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాలు అధికంగా ఉండగా చేనేత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. చేనేత మగ్గాలపై పని చేస్తున్నవారందరూ వృద్ధులే. చేనేతపై శిక్షణ ఇచ్చేందు కు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం మూతపడింది. దీంతో చేనేత రంగం క్షీణదశలో ఉంది. గుత్తాధిపత్యం.. కరువైన ఉపాధి వస్త్రోత్పత్తి రంగంలో అనేక సమస్యలున్నాయి. నూలు కొనుగోలు నుంచి బట్ట అమ్మకం వరకు కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పరిశ్రమ బందీ అయ్యింది. ఈ గుత్తాధిపత్యం కారణంగా కార్మి కులకు మెరుగైన ఉపాధి కరువైంది. ప్రభుత్వమే నూలు డిపోలను ఏర్పాటు చేసి, వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు అందిస్తే ఆసాములకు, కార్మికులకు కాస్త మెరుగైన ఉపాధి లభిస్తుంది. కార్మికుల బీమా కల్పించడం, పొదుపు పథకం అమలు చే యడం, హెల్త్ కార్డులు ఇవ్వడం, కార్మికుల భార్యలకు గార్మెంట్ రంగంలో ఉపాధి కల్పించడం, వా రి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సి ఉంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఇల్లు, పేదలకు అంత్యోదయ కార్డులు, శ్రమించే కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికుల పొట్ట నింపాలి వస్త్ర పరిశ్రమలో శ్రమించే కార్మికుల పొట్ట నింపేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఇప్పుడు ‘పుండు ఒక్క చోట ఉంటే.. మందు మరోచోట రాస్తున్నారు’ ఇది సరైన విధానం కాదు. కార్మికులకు మేలు చేసేలా ఇప్పటికే ప్రభుత్వం కొంత చొరవ చూపింది. కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలి. వస్త్రోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలి. స్థానికంగా నూలు డిపోలు ఏర్పాటు చేసి, నేరుగా నూలు అందించాలి. కార్మికుల సంక్షేమానికి బాటలు వేయాలి. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు -
జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ‘మగ్గాలను పెట్టినాం.. నూలు నూలు ఒడికినాం.. మా నరాలనే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం.. శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో అని ఆక్రోశించిన నేతన్నల బతుకు చిత్రం ఇప్పుడు మెరుగుపడుతోంది. నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేసింది. కరోనా కష్టకాలంలోనూ ‘నేతన్న నేస్తం’ ఆదుకుంది. చేనేత రంగం.. ఇప్పుడు సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం బతికి బట్టకడుతున్న వైనం పూర్వాపరాలపై ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రంగులు అద్దుతోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం కలిగివున్న 81,703 మందికి రూ.383.79 కోట్లు అందించి జీవనోపాధి కల్పించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ( ఫైల్ ఫోటో ) చేనేత ఉపాధికి చేయూత.. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం ఒక కులానికి పరిమితం కాకుండా అనేక సామాజికవర్గాలకు ఉపాధి చూపుతోంది. పద్మశాలి, దేవంగ, కర్ణిభక్తులతోపాటు దాదాపు 18 ఉపకులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నాల్గవ అఖిల భారత చేనేత లెక్కలు 2019–2020 ప్రకారం చేనేత, నేత, అనుంబంధ కార్యకలాపాల్లో దేశంలో 31.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, ఉప్పాడ, రాజాం తదితర అనేక ప్రాంతాల్లో చేనేత రంగం రారాజుగా గుర్తింపు పొందింది. పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్ చీరలు, కలంకారీ, పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో చేనేత వస్త్రం ప్రసిద్ధి పొందాయి. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి.. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రతియేటా ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా.. నేడు కంప్యూటర్ సాయంతో ఎయిర్‌జెట్ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఇటువంటి పరిస్థితిలో చేనేతను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ( ఫైల్ ఫోటో ) హామీలు మరచిన బాబు.. ‘నేతన్న నేస్తం’ అందించిన సీఎం జగన్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరిచిపోయారని ఇప్పటికీ నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ తదితర పథకాల ద్వారా చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్నారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి చూపారు నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కష్టకాలంలో మా కుటుంబానికి ఉపాధి చూపారు. మొత్తంతో ముడి సరుకులు(మెటీరియల్) కొనుక్కున్నాను. పెట్టుబడి పెట్టిన రూ.24 వేలు రాగా, రోజువారీ కూలీ డబ్బులు(ఉపాధి) గిట్టుబాటు కాగా, అదనంగా మరో రూ.3వేల లాభం వచ్చింది. –జంజనం లక్ష్మీ, మంగళగిరి, గుంటూరు జిల్లా మగ్గాన్ని ఆధునీకరించుకున్నాను పాత మగ్గంతో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడ్డాను. ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలకు తోడు.. నేను కొంత సొమ్ము కలిపి లిఫ్టింగ్ మిషన్, జాకార్డ్ అమరికం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల నాకు నేత పని ఎంతో సులువు అయ్యింది. 2019 నుంచి మా జీవితాల్లో కొత్త కాంతి వచ్చింది. –జక్కుల వెంకట సుబ్బారావు, పెడన, కృష్ణా జిల్లా జీవితాల్లో రంగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతకు ఎంతో ఊతమిచ్చారు. అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్నలను ఆదుకోవడంలో నిజంగానే నేస్తం అన్పించుకున్నారు. మహానేత వైఎస్‌ను గుర్తు చేస్తున్నారు. కళా విహీనంగా మారిన చేనేత బతుకుల్లో రంగులు నింపుతున్నారు. – ఊటుకూరి రంగారావు, పెడన, కృష్ణా జిల్లా -
‘చీర’స్మరణీయం నైపుణ్యత.. నాణ్యత కలబోత ‘జాంధానీ’ చీర
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలో చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు.. సృష్టిస్తున్నారు.. వీరి చేతిలో రూపుదిద్దుకుంటున్న జాంధానీ చీరలు వారి కళాత్మకతకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే విశేష ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. గతంలో పేటెంట్ హక్కు పొందిన ఉప్పాడ జాంధానీ.. ఇండియన్ హ్యాండ్లూమ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం దీని విశిష్టతను చాటుతోంది. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతోంది. ఏటా కోట్ల రూపాయల మేర క్రయవిక్రయాలు జరుగుతున్నాయంటే ఇక్కడి చేనేత కార్మికుల కళానైపుణ్యం అర్థం చేసుకోవచ్చు. రెండువైపులా ఒకేవిధంగా కనిపించే ఈ చీరలకు రానురానూ గిరాకీ పెరుగుతోంది. కొత్తపల్లి మండలంలో గతంలో 50 వరకూ ఉండే మగ్గాలు ఇప్పుడు సుమారు 500కు చేరుకున్నాయి. కులంతో సంబంధం లేకుండా అందరూ వీటి తయారీలో పాలుపంచుకుంటున్నారు. తాటిపర్తి, అమలాపురం, కోనసీమ ప్రాంతాల్లోనూ ఈ చీరల నేత తయారీ ఊపందుకుంది. అంతా చే‘నేత’తోనే.. పాతికేళ్లుగా నేత పని చేస్తున్నాను. ఎంత సృజనాత్మకమైనదైనా చేతి నైపుణ్యత ద్వారానే నేస్తాం. జాంధానీకి వెండి కోటింగ్ ఉంటుంది. దీనిలో తల వెంట్రుక మందంలో ఎరుపు రంగు పట్టుదారం ఉంటుంది. నాణ్యతగల జరీ దారంలో ముడుచుకుపోయేగుణం కలిగి ఉంటుంది. దృఢంగా నేయాల్సి ఉంది. అడ్డు, నిలువు పట్టు దారాలనే ఉపయోగిస్తాం. చీర నేయడానికి ముగ్గురి నుంచి నలుగురు అవసరమవుతారు. డిజైన్‌ను బట్టి 20 నుంచి 40 రోజుల వరకూ సమయం పడుతుంది. - మీసాల నాగేశ్వరరావు, నేత కార్మికుడు, కొత్తపల్లి కుటుంబమంతా కష్టపడితేనే.. చిన్నప్పటి నుంచీ నేత పని చేస్తున్నా. డిజైన్లలో చాలా మార్పులు వస్తున్నాయి. గిరాకీకి దీటుగా ఉత్పత్తి పెరుగుతోంది. రోజూ గతంలో ఒకటి రెండు చీర్లకంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి వంద వరకూ తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసిన జాంధానీ చీరల మగ్గాలే కనిపిస్తున్నాయి. వీటి తయారీకి ఆసక్తి చూపుతున్నారు. కుటుంబమంతా కష్టపడితేనే అందమైన నాణ్యతైన చీర తయారవుతుంది. - దున్న మురళీకృష్ణ, నేత కార్మికుడు, కుతుకుడుమిల్లి ఏకాగ్రతతో పని చేయాలి జాంధానీ చీరల తయారీకి ఇంటిల్లి పాదీ పని చేయాల్సిందే. వంట, ఇంటి పనులు పూర్తి చేసుకుంటూనే నేస్తుంటాను. చీరకున్న బుటాలు, డిజై న్లు రెండువైపులా ఒకేలా కనిపిస్తాయి. డిజైన్ ప్రింట్ చేశారా అన్నట్టుగా ఉంటుంది. చాలా ఏకాగ్రతతో పనిచేయాలి. - చింతా నాగేశ్వరి, నేత కార్మికురాలు, కొత్తపల్లి ఆన్లైన్ విక్రయాలకు అవకాశం జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్ విడుదల కానుండడంతో చేనేతకు అరుదైన ఘనత దక్కుతోంది. కాలానుగుణంగా వ్యాపారాలను విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం వల్ల చేనేత రంగం అభివృద్ది చెందుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నా దళారులు ఎక్కువగా ఉన్నారు. కారి్మకులే నేరుగా ఆన్లైన్లో విక్రయాలు జరుపుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - రాజాపంతుల నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉంది
సాక్షి, అమరావతి: చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశీయ వస్త్ర పరిశ్రమలో చేనేత కార్మికుల పరంగా రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని గొప్ప వస్త్ర వారసత్వాన్ని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న మా నేతన్నలను చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్లో కొనియాడారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు రూ. 24,000 చొప్పున వరుసగా రెండేళ్లు ఇవ్వడం.. ముఖ్యంగా కోవిడ్–19 వంటి సమయంలో చేనేత కార్మికుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
అదే గిఫ్ట్ కావాలి..
చేనేత కళాత్మక సంపద.. సాంస్కృతిక జీవితానికి ప్రతీక.. విభిన్న సంస్కృతుల సమాహారం. శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఉత్థాన పతనాలు ఉన్నప్పటికీ.. ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. వస్త్ర ప్రపంచంలో ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న సంప్రదాయ చేనేత.. ఇప్పుడు సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు.. సాధారణ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు చేనేత దుస్తులు ధరించడం హుందాగా భావిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు చేనేతకు జై కొడుతున్నారు. పవర్‌లూమ్స్ వస్త్రాల వెల్లువతో ఆదరణ తగ్గి ఉపాధి కోల్పోయిన చేనేత కళాకారులను మగ్గాలు తిరిగి అక్కున చేర్చుకుంటున్నాయి. కార్మికుల నిరంతర శ్రమ, అద్భుతమైన డిజైన్లు రూపొందించే కళాకారుల ప్రతిభ చేనేతకు పట్టం కడుతున్నాయి. ఆధునిక డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల ఆదరణ చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయి. అదే గిఫ్ట్ కావాలి చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చేనేత కార్మికుల కష్టాన్ని నేను దగ్గరగా చూశాను. వాళ్లకు నా వంతు సాయం చేయాలనే దృక్పథంతో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. సినిమాల్లో మినహాయించి ప్రతిసారీ చేనేత దుస్తులే ధరిస్తున్నాను. చేనేత దుస్తులే ధరించాలని ఇతర హీరోయిన్లకూ సూచిస్తున్నాను. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చేనేతకు సంబంధించిన వాటినే ఇవ్వమని ముఖంపైనే చెప్పేస్తున్నాను. – సమంత అక్కినేని, తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎన్ని వ్యయప్రయాసలైనా భరించి ఎక్కడెక్కడో దాగిన ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్... వగైరాలను సిటీ డిజైనర్లు పోటాపోటీగా వెలుగులోకి తెస్తూ సంప్రదాయ వస్త్ర శైలులు, కళలకు ‘చే’యూతను అందిస్తుండడంతో పోచంపల్లి, మల్కా, దగ్గర్నుంచి నిన్నా మొన్నటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడని గిరిజన ప్రాంతపు ట్రైబల్ ఫ్యాషన్ సైతం ఇంటర్నేషనల్ వెన్యూలను లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. సనత్‌నగర్: చేనేత కళ నలుదిశలా వ్యాపించేందుకు నగరంలోని ‘దస్తకార్ ఆంధ్రా’ ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. 2001లో నగరానికి చెందిన కొంతమంది కలిసి ‘దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్’ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఎంతో మంది చేనేత కళాకారుల బతుకులకు భరోసా అందించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ట్రస్టీ శ్యామసుందరి ఏమంటున్నారంటే.. చేనేత మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ఉంటాయి చేనేత దుస్తులు. ఒకప్పుడు చీరలు, పంచెలు తయారీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం సిటీ ప్రజల అభిరుచులకు అనుగుణంగా డ్రెస్‌లు, కుర్తాస్, దుప్పట్టా ఇలా.. అనేక రకాల ఉత్పత్తుల తయారీకి ట్రస్ట్ బీజం వేసింది. ప్రత్యేకంగా మార్కెటింగ్ కోసం 2008లో ‘దారం’ పేరిట షోరూంను ప్రారంభించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం ఆరు జిల్లాల్లోని చేనేత కళాకారులకు దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్ తోడ్పాటునందిస్తోంది. 11 సహకార సంఘాలు..500 మంది చేనేతలకు ఉపాధి.. తెలుగు రాష్ట్రాల్లోని 11 సహకార సంఘాల్లోని 500 మంది చేనేత కళాకారులకు ట్రస్ట్ ద్వారా ఆర్డర్స్ అందుతున్నాయి. దారం షోరూంతో పాటు ఎగ్జిబిషన్ల ద్వారా వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. డిజైన్లు దగ్గర నుంచి రంగుల అద్దడం వరకు ట్రస్ట్ నిర్ణయం మేరకే చేస్తుంటారు. కేవలం దస్తకార్ సహకారం అందించే చేనేతలే కాకుండా ఎంతోమంది ఈ డిజైన్ల ఆధారంగా సొంతంగా తయారుచేసుకుని ఇతర మార్కెటింగ్ సంస్థలకు అందించి ఉపాధి పొందుతున్నారు. చేతితో నేసిన వస్త్రాలనే దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్ విక్రయిస్తుంది. నగరంలో వర్క్‌షాప్‌లు నగరంలో ఉండే నేటి తరానికి అసలు క్లాత్ ఎలా వస్తుంది, నేతన్నలు ఎంత కష్టపడితే తాము వేసుకున్న దుస్తులు బయటకు వస్తున్నాయి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఓపిగ్గా దుస్తులు తయారు చేస్తున్నారో తెలియదు. ఈ క్రమంలో దారం షోరూంలో ప్రతియేటా తరచూ వర్క్‌షాప్‌ల ద్వారా నూలు వడకడం దగ్గర నుంచి క్లాత్ ఎలా తయారు చేస్తారో ప్రాక్టికల్‌గా చూపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ కాస్త వెనుకబాటే.. చేనేత వస్త్రాల వాడకంలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త వెనుకబాటులోనే ఉంది. మొదటి స్థానంలో పుణె, ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై నగరాలు ఉండగా తదుపరి స్థానంలో హైదరాబాద్ ఉంది. ట్రస్ట్ తరఫున ఆయా నగరాల్లో ఏడాదికి ఆరు వరకు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాం. పుణె నగరంలోనే ఎగ్జిబిషన్లకు ఎక్కువ ఆదరణ ఉంది. అవగాహన అవసరం.. నగరవాసుల అభిరుచులకు తగ్గట్లుగానే ఎన్నో డిజైన్లు, రంగుల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైనా రూ.300కే చేనేత వస్త్రాలు ఇస్తున్నామంటే శుద్ధ అబద్ధం. అది చేనేత కాదని నమ్మండి. ప్రభుత్వాలు సహకార సంఘాలకు రుణ సదుపాయాలు, మార్కెటింగ్ వంటి సౌకర్యాలను అందించాలి. అప్పుడే చేనేత కళాకారుల వలసలు తగ్గుతాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు.. ‘డిమాండ్ ఉంటే సరే. లేనప్పుడు ఎలా? అందుకే చేనేత కళాకారులకు స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నా’ అన్నారు డాక్టర్ మమతా అల్లూరి. ఆరోగ్యంపై నగరవాసుల్లో పెరిగిన అవగాహన కూడా చేనేతలపై దృష్టి మళ్లేలా చేసిందంటున్నారామె. రసాయనాలు వినియోగంతో తయారయ్యే డైస్ వల్ల తప్పనిసరిగా ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది’అని వైద్య వృత్తి నుంచి డిజైనర్‌గా మారిన మమత అంటున్నారు. ప్రచారానికి సై.. ప్రస్తుతం హ్యాండ్లూమ్స్లో భాగమైన సిల్క్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు నగరానికి చెందిన శైలజారెడ్డి. కొంత కాలంగా చేనేత హస్తకళా ప్రదర్శనల ఏర్పాటుకు సహకరిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు. సిటీలో పెద్ద సంఖ్యలో చేనేత వస్త్రాల ప్రదర్శనలు ఏర్పాటవుతుండడంపై స్పందిస్తూ... ‘నగర యువతలో చేనేత, పట్టు వస్త్రాలపై అవగాహన బాగా పెరిగింది. పాశ్చాత్య ప్రభావం కూడా బాగా ఉంది. పోటీని తట్టుకుని మనదైన హస్తకళలు విశ్వవ్యాప్తం అయేలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంది’అని ఆమె అభిప్రాయపడ్డారు. చేనేత కళాకారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేర్ ద శారీ.. సేవ్ ద వీవర్ ‘దేశవ్యాప్తంగా 86 పల్లెల్లోని దాదాపు 500 మందికి పైగా చేనేత కళాకారులు నాకు రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు’’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ శ్రవణ్ కుమార్. ఏటేటా వేర్ ద శారీ సేవ్ ద వీవర్ పేరుతో ఆయన ప్రత్యేక ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చీరలను నేసిన నేతన్నలను కూడా వినియోగదారులకు పరిచయం చేస్తుంటారు శ్రవణ్. గొల్లభామతో గెలిపించి చేనేతలకు ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దే కళాకారుల ఆదాయం లేదు. దీని కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల ఫలాలు పూర్తిగా వారికి చేరడం లేదు. ఈ పరిస్థితులను మార్చాలి ఏదేమైనా సిద్దిపేట చేనేత కళాకారులకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం, మెరుగైన జీవనం కల్పించడానికి నా వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు సునంద. సిద్ధిపేట కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన ఒకనాటి గొల్లభామ చీరల సందడి మళ్లీ ట్రెండీగా మారడానికి దోహదపడిన ఈ టెక్స్టైల్ నిపుణురాలు.. ప్రస్తుతం కర్ణాటకలో వీవర్స్‌తో పనిచేస్తున్నారు. ‘ఇక్కడ కూడా చేనేత కళాకారుల ఆదాయం రెట్టింపు చేయడమే ధ్యేయంగా, కనుమరుగవుతున్న హస్తకళలను వెలుగులోకి తీసుకువస్తున్నాం’ అని చెప్పారామె. నేత‘అన్న’మాట..వెలుగుల బాట మనవైన గ్రామీణ చేనేతలనే మన డిజైన్లకు వినియోగిద్దాం అని అన్నయ్య చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నారు మణికొండ నివాసి డిజైనర్ సిరి. దాదాపు 13 ఏళ్ల క్రితం తన అన్నయ్యతో కలిసి హ్యాండ్లూమ్స్కు పెద్దపీట వేస్తూ డిజైన్ల ఆవిష్కరణ సాగించారు. ‘అనంతపురంలోని ధర్మవరంతో పాటు తెలంగాణలోని ఇకత్ తదితర చేనేత ఫ్యాబ్రిక్స్‌ను విరివిగా వినియోగించాం. వీటితో వెస్ట్రన్ శైలి అవుట్ ఫిట్స్ కూడా రూపొందించాం’ అని చెబుతున్న సిరి... తన సోదరుని హఠాన్మరణం తర్వాత తన లేబుల్‌ని అన్నయ్య పేరుతో కలిపి హేమంత్సిరిగా మార్చారు. ‘నేడు హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న షోలో పాల్గొంటున్నాను’ అన్నారామె. -
చేనేత అందాలు..
-
మాది చేనేతల ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్క నేతన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడనే మాట విన్పించొద్దనేదే మా విధానం’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేతన్న బాగుంటే, ఆత్మగౌరవంతో, సంతృప్తిగా ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సంక్షేమానికి మరెన్నో కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. వీటిపై ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర మంత్రివర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. జా తీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో చేనేత వస్త్రాల ప్రదర్శనశాలను కేటీఆర్ ప్రారంభించారు. చేనేత ఉ త్పత్తుల ప్రాధాన్యం గుర్తించడం, ప్రోత్సహించడం, మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర తదితర ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకు ని ఆన్లైన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్, మాల్స్‌లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నామని, టెస్కో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు జరుపుతామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా చేనేత, జౌళి శాఖకు రూ.1,200 కోట్ల కేటాయించామని, అందులో రూ.400 కోట్లను చేనేత రంగానికే వెచ్చిస్తున్నట్లు వివరించారు. ప్రతి పైసా చేనేత కళాకారులకే అందేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు, వాటికి అనుబంధంగా 22,875 మంది కలిపి మొత్తం 40 వేల చేనేత కళాకారులు ఉన్నారని తెలిపారు. పద్మశాలి ఇంట్లో కేసీఆర్ చదువు.. సీఎం కేసీఆర్ పుట్టిన చింతమడక గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో ఆయన ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్బాకకు రోజూ నడిచి వెళ్లేవారని కేటీఆర్ చెప్పారు. దీంతో కేసీఆర్‌ను దుబ్బాకలోని ఓ పద్మశాలి సోదరుడి ఇంట్లో ఉంచి చదివించారని గుర్తుచేశారు. కేసీఆర్ పద్మశాలీల కష్టసు ఖా లు దగ్గరగా ఉండి తెలుసుకున్నారని కేటీఆర్ పేర్కొ న్నారు. చేనేత కార్మికుడి ఇంట్లో పురుషుడు మగ్గం నేస్తే, మహిళలు బీడీలు చుట్టేవారని, దీని కారణంగా చేనేత, బీడీ కార్మికుల కష్టసుఖాల పట్ల కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేతన్న ల వేతనం పెంచాలనే ఉద్దేశంతో చేనేత మిత్ర పేరు తో పథకాన్ని ప్రవేశపెట్టి 50% సబ్సిడీపై నూలు, రసాయనాలు, అద్దకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పా రు. ఈ పథకంలో 18,683 మంది చేనేతకారు లు నమోదు చేసుకున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. చేనేతకారుల సామాజిక భద్రత కోసం నేతన్నలకు చేయూత పేరుతో పొదుపు పథకాన్ని ప్రారంభించామని, ఇందులో 19,125 మంది చేనేత కార్మికులు చేరారని, ప్రభు త్వం రూ.60 కోట్లు కేటాయించిందన్నారు. కళాకారు ల కుటుంబానికి ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేలా ఈ 2 పథకాలు అమలు చేసు ్తన్నామన్నారు. 12 వేల మంది నేతన్నలకు సంబంధిం చిన రూ.40 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. రుణాలు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు చేనేత వస్త్రాలకు మార్కెట్ భద్రత కల్పించేందుకు టెస్కో షోరూంల ద్వారా కొనుగోలు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పోచంపల్లిలో మైక్రోసాఫ్ట్ సహకారంతో డిజైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించేందుకు సినీ, టీవీ కళాకారుల సేవలను వినియోగిస్తున్నామని, ఈ క్రమంలో నటి సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని పేర్కొన్నారు. రూ.10.2 కోట్లతో 2,600 మంది కళాకారుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో 8 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేశామని, కొత్తగా 18 క్లస్టర్లు మంజూరు చేయాలని కేం ద్రాన్ని కోరామన్నారు. రూ.15 కోట్లతో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ, రూ.14 కోట్లతో గద్వాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాçపూజీ పేరుతో 30 మంది కళాకారులకు చేనేత పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డైరెక్టర్ శైలజా రామయ్యర్, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణి పాల్గొన్నారు. -
చేనేతల అభివృద్ధే నా లక్ష్యం : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అకుంటిత దీక్షతో నిరంతరం శ్రమించే చేనేత కార్మికుల కష్టనష్టాలను తీర్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు విశేషస్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాలకు చెందిన ప్రజలు పాదయాత్రతో తమ చెంతకు వస్తున్న వైఎస్ జగన్‌ను కలసి వారి గోడును వెళ్లబోసుకుంటున్నారు. వారి బాధలను కష్టనష్టాలను జననేతతో పంచుకుంటున్నారు. Prosperity of our skilled and hard-working weaving community is my priority. #NationalHandloomDay pic.twitter.com/wKYwYiPr33 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2018 -
చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు
మిరుమిట్లు గొలుపుతూ ప్రపంచానికి వెలుగులు అందించిన చేనేత.. జౌళిమిల్లుల విస్తరణతో గుడ్డికాయ పట్టింది. మసిబారుతూ వచ్చింది. చేనేత నిపుణులే వృత్తి వదిలి బట్టల మిల్లు కార్మికులుగా వలసపోవలసి వచ్చింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ ఉపాధి కల్పించిన రంగంగా చేనేత శతాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం చేనేత వృత్తి సామాజిక వర్గాలు ఆ వృత్తినుంచి వైదొలగి ఇతర వృత్తుల్లో చేరిపోయారు. చేనేత వృత్తి కులాల జనాభాలో ఐదు, ఆరు శాతం మాత్రమే చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ప్రజల మనస్సుల్లో చేనేతపట్ల ఆదరణ పెరగడం. ఎంత ధర అయినా పట్టు బట్టలు, గార్మెంట్స్, రెడీమేడ్, సూటింగ్స్ కొంటున్నట్లుగా చేనేతను ప్రతిష్టాత్మకంగా కొనే స్థితి పెరగాలి. స్వయం పోషకంగా ఎదగడానికి ప్రభుత్వం నుండి అనేక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికగా అందించడం అవసరం. చేనేత కోసం కొన్ని రకాలను ప్రత్యేకంగా కేటాయిం చడం, దాన్ని పవర్‌లూమ్‌లు, బట్టలమిల్లులు ఉత్పత్తి చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం మరొక కార్యక్రమం. చాలాకాలం నుండి బట్టలపై ప్రభుత్వం రిబేటు ఇవ్వడం ద్వారా సహకరించే కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దీని ద్వారా దొంగ లెక్కలు రాసి, ఉత్పత్తి, మార్కెట్, అమ్మకాలు లేకుండానే కాగితాలపై వాటన్నిటిని సృష్టించి భోంచేసే యంత్రాంగం పెరుగుతూ వచ్చింది. పైగా సహకార రంగంలో ఉన్న మగ్గాలు నాలుగింట ఒకటవ వంతు మాత్రమే. మిగతా మూడు వంతుల నేత కార్మికులకు ఆ సౌకర్యం కూడా అందేది కాదు. అందువల్ల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ప్రావిడెంట్ ఫండ్, జియో ట్యాగింగ్ వంటి వాటిని అనుసంధానించి పక్కాగా ప్రత్యక్షంగా చేనేత వృత్తివారికి లాభం కలిగించడం అవసరం. తిరిగి చేనేత అభివృద్ధికి కొత్త దృక్పథం అవసరమవుతున్నది. చిరిగిన బట్టలను, చింపుకుని బట్టలను వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఎంత చినిగితే అంత ఫ్యాషన్. అలా జీన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా ఒక ఫ్యాషన్‌గా చేనేతను అందరికీ ఆకర్షణీయంగా మార్చినపుడే దాని మార్కెట్, ప్రాచుర్యం పెరుగుతుంది. పట్టుచీర కట్టుకోవడం ఒక సామాజిక గౌరవం. ఖాదీ బట్టలు వేసుకోవడం ఒక సామాజిక గౌరవం. అలాగే సూటు వేసుకోవడం సామాజిక గౌరవాన్ని తెలుపుతుంది. ఈ విధంగా ఆలోచించి చేనేతను ఒక ఫ్యాషన్‌గా, ఒక సామాజిక గౌరవానికి ప్రతిష్టగా మార్చే కృషి చేయడం అవసరం. చేనేతలో కాళ్ళతో తొక్కడంగానీ, చేతులతో షట్టర్ కొట్టడంగానీ ప్రతిసారీ 25 కిలోల బరువును మోయడం, నెట్టడం జరుగుతున్నది. ఎని మిది, పది గంటలు ప్రతిసారీ 25 కిలోల బరువు నెట్టడం అనే పరిశ్రమ చేనేత కార్మికులను, వారి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, దేహదారుఢ్యాన్ని దెబ్బతీస్తున్నది. చీరలకు అంచులు, డిజైన్లు, కొంగులు ప్రత్యేకంగా రూపొందించడానికి పింజర అవసరం పడుతుంది. ఈ పింజర తిరగడానికి 25 కిలోలకు తోడుగా మరో పది కిలోల బరువు చేతులు, కాళ్ళపై పడుతున్నది. అందువల్ల ఈ బరువును కుట్టుమిషన్ మోటార్వలె హాఫ్ హెచ్‌పీ మోటారు బిగించి చేనేత కార్మికులకు బరువు, భారం తగ్గించడం చేయవచ్చు. దీనికి తోడు ప్రభుత్వం పత్తిని సేకరించి నూలు వడికించి, ఆ నూలును చేనేత కార్మికులకు అందించే ఒక సమగ్ర కార్యక్రమ రూపకల్పన కలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలను నివారించవచ్చు. సబ్సిడీ ఇవ్వడంలో భాగంగా గతంలో అనేక పర్యాయాలు ప్రతిపాదించిన ప్రతిపాదనను ఇప్పటికైనా ఆచరణలో తీసుకోవడం అవసరం. చేనేత రంగానికి సబ్సిడీతోపాటు చేనేత వృత్తివారికి వంద రోజుల పనికల్పనతో పని కల్పించి ఆ ఉత్పత్తులను సేకరించి ఆయా పండుగల్లో ప్రజలకు ఉచి తంగా గానీ, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్ధులకు అందించడం ద్వారా ఒకేసారి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా ప్రభుత్వం ఏటా ఇవ్వదలచుకున్న గ్రాంట్లు, సబ్సిడీలు తిరిగి చేనేత కార్మికులకే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా దాని ప్రయోజనం అందే విధంగా పథకాలను రూపొందించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం నిజంగానే నూతన చరిత్ర సృష్టించడానికి మార్గం వేస్తుంది. (నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా) బి.ఎస్.రాములు వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్ ‘ 83319 66987