పంజగుట్ట (హైదరాబాద్) : ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' రోజున అందరూ చేనేత దుస్తుల్ని ధరిస్తే లక్షమంది నేతన్నలకు బతుకుదెరువు ఇచ్చిన వారమవుతామని, మరో లక్ష మందికి ఉపాధి చూపినట్లవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం కూడా పూనుకుని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చేనేత స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మస సంస్కృతిని గుర్తుంచుకుని గౌరవించుకోవాలంటే చేనేత దినోత్సవాన్ని గొప్పగా నిర్వహించుకోవాలని, కనీసం ఆ రోజైనా ప్రతివారూ చేనేత వస్త్రాల్ని ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడ్క కల్పన కుమారి మాట్లాడుతూ .. ఆగస్టు 7వ తేదీన నెక్లెస్ రోడ్‌లో చేపట్టే వాక్‌లో అందరూ చేనేత వస్త్రాలు ధరించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, పద్మశాలి పొలిటికల్ ఫోరం ప్రతినిధి చిక్క చందు, ఆలిండియా హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యుడు తడ్క యాదగిరి, చేనేత వర్గాల చైతన్య వేదిక ప్రతినిధి చిక్కా దేవదాసు, గోళ్ళ నరేందర్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరిస్తే..
Published Fri, Jul 8 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement