Professor Kodandaram
-
అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి
హైదరాబాద్: దేశ రక్షణ నిమిత్తం హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ (prakash yashwant ambedkar) డిమాండ్ చేశారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ (Pakistan) సరిహద్దు నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉందని, శత్రుదేశాలు దేశ రాజధానికి దగ్గర ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదన్నారు. భారతదేశం బలమైన ప్రజాస్వామిక దేశంగా ఎదగాలంటే కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad) రెండో రాజధాని అనే అంశంపట్ల లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాలు, యూనివర్సిటీలతోపాటు ప్రతి రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం ధోరణిని కొనసాగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయాలని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హైదరాబాద్ అనుకూలమని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కీలకమైన అంశాలపట్ల సమన్యాయం కావాలని, హైదరాబాద్‌కు అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకు సమాన వాటా కల్పించాలన్నారు. ప్రముఖ సామాజిక వేత్త సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నర్సమ్మ, ప్రొఫెసర్ వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ హక్కుల నేతల అరెస్టు అక్రమం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మూలవాసీ బచావో మంచ్ మాజీ అధ్యక్షుడు రఘు మదియాని (raghu midiyami)ని ఎన్ఐఏ పోలీసులు రాయపూర్‌లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావు మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన రఘుతోపాటు గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్నారు. గత 14 నెలల కాలంలో 434 మందిని కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. పోలీసుల అప్రజాస్వామికగా చర్యలను బాహ్య ప్రపంచానికి చేరవేస్తున్నారని, పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గజేంద్ర, లక్ష్మణ్ అనే కార్యకర్తలను జైలుకు పంపారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వెలసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న హత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు చంద్రమౌళి, జాన్, భవాని, పీడీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆనందంగా అమెరికాకు బయలుదేరి.. అంతలోనే విషాదం -
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్‌కుమార్‌ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు నిర్ణయించుకున్నారు. -
కేటీఆర్‌కు కోదండరాం కౌంటర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి తారకరామారావుకు ప్రొఫెసర్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ దక్కడంపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కోదండరాం తాజాగా మరోసారి స్పందించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. తన ఎంపికపై అనవసరంగా వివాదం చేయడం సరికాదని అన్నారాయన. ‘‘రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు. రాజ్యాంగ పరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు. నేను సుదీర్ఘకాలం సేవ చేశా. అనవసరంగా నా ఎంపికను వివాదం చేయడం తగదు. ప్రజలకు అన్నీ తెలుసు వారే అంచనా వేసుకుంటారు’’ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఎదురుచూపులు.. ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమెర్ అలీఖాన్ ఇవాళ ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసన మండలికి వెళ్లిన వాళ్లకు నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ ఆయన రాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే గుత్తా రావడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. కాసేపయ్యాక.. రేపు మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. రేపు ఉదయం 9గం.30 ని. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. అందుకే రాలేకపోయా తన గైర్హాజరుపై వస్తున్న విమర్శలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్పందించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే తాను ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వెల్లడించారాయన. మండలి స్పీకర్ పదవిని తాను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్: రెండో రోజు విశేషాలు ఇవే..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం. ► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్లు పాల్గొంటారు. ► స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్‌రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు. ► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు. -
మునుగోడులో ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్?
అల్వాల్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం మహోబోధి విద్యాలయంలో కోదండరాం ఇతర ప్రజా సంఘాల నాయకు లతో కలసి గద్దర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కొందరు దానిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారుల్లో గద్దర్ ఒకరని, ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా ప్రజాస్వామిక వాదుల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను పోటీ చేయించడానికి చర్చలు జరుపుతు న్నామని కోదండరాం తెలిపారు. కాగా, ప్రజా సంఘటన ద్వారానే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించామని, అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గద్దర్ చెప్పారు. 1978లో కాళోజీ నారాయణరావు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారని, ఆయన బాటలోనే ప్రస్తుతం తాను పోటీ చేయాలని ప్రజా సంఘాల నుంచి అభ్యర్థ నలు వస్తున్నాయని, దీనిపై మరింత చర్చించిన తరువాతే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. -
రిజర్వేషన్లు కల్పించాలని సంచారజాతుల మహాధర్నా
కవాడిగూడ: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, అస్థిత్వానికి ప్రతీక సంచార జాతులు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 76 సంచార జాతుల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సంచార జాతులకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాడ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణŠ కుమార్, ఆమ్ఆద్మీ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఇందిరాశోభన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల మాట్లాడుతూ... సంచార జాతుల కులం, ఊరు, వృత్తిని కూడా గుర్తించలేని వ్యవస్థ ఉండటం దారుణమన్నారు. సంచార జాతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... సంచార జాతులను రాజ్యాంగబద్ధమైన కులాలుగా గుర్తించి విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న సంచార జాతులకు నామినేటెడ్ ఎంపీ, ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి తిరిపిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కోఆర్డినేటర్ సమ్మయ్య, అధికార ప్రతినిధి నాగరాజు పాల్గొన్నారు. -
గిరిజన హక్కులను కాపాడుదాం: కోదండరామ్
సిరిసిల్లటౌన్: ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు, గిరిజనేతరులకు అండగా నిలుస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవన్లో సీపీఐ ఆధ్వర్యంలో పోడు సాగుదారుల హక్కులపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వారి కి హక్కు పత్రాలివ్వడం సర్కారు బాధ్యత అని చెప్పారు. అటవీ చట్టాలన్నీ ఆదివాసులు, గిరిజను లకు అనుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగులో ఉన్న భూము లపై యాజమాన్య హక్కులు పొందడానికి రైతు లకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. జిల్లాలోని 20వేల ఎకరాల్లో గిరిజనులు, ఇతర నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని, తద్వారా సుమారు 10వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఆయా భూములపై యాజమాన్య హక్కులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ ‘పాలమూరు ఎత్తిపోతల’పై లేదని.. వికారాబాద్ జిల్లా నానాటికి నిర్లక్ష్యానికి గురవుతోందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో ఆదివారం రాష్ట్ర డెవలప్మెంట్ ఫోరం ఆ«ధ్వర్యంలో నదీ జలాల సంరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. జూరాల ప్రాజెక్టుతో లిఫ్ట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి నీళ్లొస్తాయన్నారు. కాళేశ్వరం నిర్మించిన ఈ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతగిరి నుంచి ఏ ఉద్యమం చేపట్టినా ఉవ్వెత్తున ఎగిసిన దాఖలాలున్నాయని ఆయన గుర్తు చేశారు. దీనిపై గ్రామగ్రామాన కరపత్రాలు వేయించి అవగాహన కల్పిద్దామన్నారు. అనంతరం వక్తలందరూ కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ రణధీర్ బద్దం, అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాజీ ఓఎస్డీ రంగారెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో శని విరగడ అవుతుంది: కోదండరాం
పంజగుట్ట: ఎవకైనా శని పట్టుకుంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుం దని జ్యోతిష్యులు అంటుంటారని, తెలంగాణ రాష్ట్రాని కి కూడా టీఆర్ఎస్ పాలన అనే శని పట్టుకుని ఏడున్నర సంవత్సరాలు కావొస్తుందని త్వరలోనే ఈ శనికూడా విరగడవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్, రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కో దండరాం మాట్లాడుతూ, అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూ పుతోందని, గుర్తింపు కార్డులు ఇస్తే ప్రభుత్వ ఆస్తులు తగ్గుతాయా, బడ్జెట్ నుంచి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని ప్రశ్నించారు. సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పోడు రైతులకు పట్టాలివ్వాలి
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రంలో పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని, పెసా చట్టాన్ని అమలు చేయాలన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో పోడురైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తరతరాలుగా భూములను సాగుచేస్తూ అడవులను కాపాడుతున్న గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కులను సాధించుకునేందుకు అక్టోబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే రాస్తారోకోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వేలాది ఎకరాల భూమి కొద్దిమంది చేతుల్లోనే ఉందని, ఈ భూములు సరిపోవడం లేదని గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ‘అటవీప్రాంతం ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలో అడవిని నమ్ముకుని జీవించేవారికి బతుకులేకుండా చేస్తున్నారు’అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీ మంచ్ జాతీయ నాయకుడు, మాజీ ఎంపీ బాబూరావు మాట్లాడుతూ అనేక పోరాటాల వల్ల వచ్చిన ఈ చట్టాన్ని ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోటు రంగారావు మాట్లాడుతూ ఏళ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న వారి భూములను ప్రభుత్వం లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భవానిరెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర్రావు, గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే నర్సయ్య, రైతు స్వరాజ్య వేదిక నాయకులు రవి, రంగారావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐఎంఎల్ నాయకులు ప్రసాదన్న, ఆదివాసీ నాయకులు బాబూదొర, టీపీఎఫ్ అధ్యక్షులు రవిచంద్ర, టీడీపీ నాయకులు ఇందిర, ఎంసీపీఐయూ నాయకులు రవి, జనసేన నాయకులు శంకర్‌గౌడ్, ఏఐకెఎంఎస్ నాయకులు అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం ఓడిపోయాడని యువకుడు ఆత్మహత్యాయత్నం
-
కోదండరాం ఓడిపోయాడని ఆత్మహత్యాయత్నం
సాక్షి, మహబూబాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ఓటమిని జీర్ణించుకోలేక మహబూబాబాద్ జిల్లా మల్యాల సాదుతండాకు చెందిన గుగులోతు రాజు ఆదివారం మధ్యాహ్నం నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు అతడిని కాపాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని వేడుకున్నాడు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుధాకర్, యువజన నాయకుడు ఇరుగు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్రావు అరెస్టు -
కోదండరాం పోటీపై టీజేఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ప్రొఫెసర్ కోదండరాం పోటీపై క్లారిటీ వచ్చింది. నల్లగొండ - వరంగల్ -ఖమ్మం అభ్యర్థిగా ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేస్తున్నారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) వెల్లడించింది. ఈమేరకు పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇక సార్ పోటీపై స్పష్టత వచ్చినప్పటికీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల ఎన్నికలను నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందనే వార్తలు వెలువడ్డాయి. (చదవండి: దుబ్బాక ఎన్నిక : టీఆర్ఎస్కు ఝలక్) అయితే, జిల్లా స్థాయి నేతలు మాత్రం పార్టీ కోసం పనిచేసినవారిలో నుంచి బలమైన వ్యక్తిని ఎన్నికల్లో పోటీకి దింపాలను టీపీసీసీ అగ్రనేతలకు సూచించారు. మరోవైపు ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుంది’ అని తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. (చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓరుగల్లులో పోటాపోటీ ప్రయత్నం) -
‘ఎన్నికల్లో కోదండరాంకు మద్దతు ఇవ్వలేం’
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదివారం ఈ సమావేశం జరిగింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న కోదండరాంకు మద్దతుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని జిల్లాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే పార్టీ క్యాడర్ దెబ్బతుంటుందని పార్టీ ఇంచార్జ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన అభ్యర్థిని మనమే నిలబెడదామని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో స్థానిక నాయకత్వం చొరవ తీసుకోవాలని మానిక్కం ఠాగూర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. దీంతోపాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం-వరంగల్-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. (చదవండి: ప్రతిష్టాత్మకంగా పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికలు) -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగునున్న పట్టభద్రల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండరాం పోటీచేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండ రామ్‌కు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ప్రతిపక్ష పార్టీలను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు పంపింది. కోదండరామ్ గెలుపు అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌రెడ్డి కోరారు. మరోవైపు రెండు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలతో పాటు అధికార టీఆర్ఎస్ సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. -
అవసరమైతే మిలియన్ మార్చ్!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో కార్మికులు విజయతీరాలకు ఎంతో దూరంలో లేరు. అనుమానమొద్దు.. విజయం మనదే. ప్రగతి భవన్లో కేసీఆర్ ఒంటరయ్యారు. ఆయన వెంట మంత్రుల్లేరు. ఎమ్మెల్యేలు లేరు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్నింటికీ మించి ప్రజలున్నారు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసే క్రమంలో అవసరమైతే ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహిద్దాం’అని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ప్రభుత్వంలో విలీనం అయితే తప్ప ఆర్టీసీ బతకదని, దాన్ని కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘సకల జనభేరి’సభకు ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా కార్మికులు సభకు తరలివచ్చారు. ఇండోర్ స్టేడియంలో మాత్రమే సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, లోపల స్థలం లేక భారీ సంఖ్యలో కార్మికులు బయటే ఉండిపోయారు. ఇంత భారీ ఉద్యమం శాంతియుతంగా నిర్వహించటం చిన్న విషయం కాదని, ప్రపంచవ్యాప్తంగా అరుదైనదని పేర్కొన్నారు. కార్మికలు తమ జీతాల కోసం సమ్మె చేయట్లేదని, సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పారు. ఈ తపన ఎంత బలంగా ఉందో.. సకల జనభేరి సభకు 50 వేల మంది రావటమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపడుతున్నా ఇప్పటివరకు సీఎంలో చలనం లేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమంటూ సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ చెబుతున్నట్లు కారి్మకులకు సగటు జీతం రూ.50 వేలు లేనే లేదని, వారివన్నీ తక్కువ జీతాలేనని స్పష్టం చేశారు. చిన్నచిన్న కారణాలకే కారి్మకుల ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన చర్చల సమయంలో కార్మిక సంఘం నేతలను అధికారులు అవమానించారని మండిపడ్డారు. దీన్ని కారి్మక సంఘం నేతలు సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది కారి్మకులు మృతి చెందారని, ఇంకా ఎంతమందిని సీఎం బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ హత్యలే: చాడ వెంకటరెడ్డి కేసీఆర్‌కు రాజ్యాంగంపై అవగాహన లేదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ తీరులో ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కారి్మకులు మృతిచెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. హైకోర్టు అక్షింతలు వేస్తుంటే.. తప్పుడు లెక్కలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ విషయం గ్రహించి కోర్టు మొత్తం కూపీ లాగుతోందన్నారు. అంతిమ విజయం కారి్మకులదేనని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రైవేటీకరించటం ఉందా: రేవంత్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తమ ఎజెండాలో లేదని సీఎం అంటున్నారని, మరి ఆరీ్టసీని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న అంశం ఏ ఎజెండాలో ఉందో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తన వ్యాపారాలకు పనికొచ్చేవే చేస్తున్నారని, అవన్నీ ఎన్నికల మేనెఫెస్టోలో పెట్టే చేస్తున్నారా అని ప్రశ్నించారు. మీరు, మీ కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులు సీఎం, మంత్రులు, ఎంపీలు అవుతారని మేనిఫెస్టోలో ప్రకటించారా అని ఎద్దేవా చేశారు. ‘సభాప్రాంగణానికి చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడేలా వేల మంది కార్మికులు వచ్చారు. ఇవి నిరసనలు కాదా.. ధర్నాలు కాదా.. కేసీఆర్‌కు కని్పంచట్లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రటేరియట్‌కు కూతవేటు దూరంలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే సీమాంధ్ర సీఎం అనుమతించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కారి్మకులు సభ నిర్వహించుకుంటామంటే అవకాశం లేకుండా చేయటం విడ్డూరమన్నారు. నిజానికి ఆర్టీసీ నష్టాల్లో లేదని, నష్టాల్లోకి నెట్టేశారన్నారు. ధనవంతులు తిరిగే విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను వేస్తూ, పేదలు తిరిగే ఆర్టీసీ బస్సుల డీజిల్‌పై 27.5 శాతం పన్ను వేయటం లాంటివాటి వల్ల నష్టాలు వచ్చాయన్నారు. విమాన ఇంధనంపై పన్ను తగ్గించి ప్రైవేటు సంస్థకు రూ.500 కోట్ల లాభం చేకూర్చి, డీజిల్‌పై పన్ను పెంచి ఆర్టీసీపై రూ.700 కోట్ల భారం మోపారన్నారు. వేల మంది పోలీసు పహారా పెట్టినా 21న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా ‘కోట గోడ’ను కొట్టామని, ప్రజలు తలుచుకుంటే ప్రగతి భవనే ఉండదని హెచ్చరించారు. కోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దుతుంటే కేసీఆర్ గాడిద పండ్లు తోముతడా అని మండిపడ్డారు. బుధవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరికి హాజరైన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడెందుకు నష్టాలు: ఎల్.రమణ తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల ఆరీ్టసీని లాభాల్లోకి తెచ్చానన్న కేసీఆర్, సీఎం అయ్యాక తీవ్ర నష్టాల్లోకి ఎందుకు వెళ్లిందో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను స్వా«దీనం చేసుకునేందుకే దాన్ని ప్రైవేటీకరించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ కారి్మకులు కీలకమవుతారని, సాధారణ ప్రయాణికులకు వాస్తవాలు చెప్పటం ద్వారా కనీసం కోటి మందిని ప్రభావితం చేయగలుగుతారని, అది ఎన్నికల ఫలితాన్ని శాసిస్తుందన్నారు. డిస్మిస్ భయం లేని ఆత్మగౌరవ ఉద్యమం: మందకృష్ణ మాదిగ సెల్ఫ్ డిస్మిస్ అంటూ కేసీఆర్ ఎంత బెదిరించినా ఆర్టీసీ కారి్మకులు ఆత్మ గౌరవంతో ఉద్యమం చేస్తున్నారని ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్ ఓటమి దిశలో ఉన్నారని, ఆర్టీసీ కారి్మకులు గెలుపుబాటలో ఉన్నారని పేర్కొన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రలో ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణలో ప్రైవేటీకరిస్తారా అని ప్రశ్నించారు. ఈ సభ చూస్తే కేసీఆర్‌కు దడ: జితేందర్‌రెడ్డి సరూర్‌నగర్ సభకు వచి్చన కారి్మక జన ప్రవాహం చూస్తే ప్రగతి భవన్లో కేసీఆర్‌కు దడ ఖాయమని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కారి్మకులను ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు వారినే డిస్మిస్ పేరుతో బెదిరించటం దారుణమన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కరెంటు సరిగా లేకపోయినా దిక్కుండదని, కేసీఆర్‌కు కావాల్సింది ఓట్లు తప్ప ప్రజల సంక్షేమం కాదన్నారు. ఇప్పటికే ఏ పథకానికీ నిధుల్లేకుండా పోయాయని, ఈ దివాలా ప్రభుత్వం ఎందుకు, కేసీఆర్‌ను దింపేస్తే సరిపోతుంది కదా అని పేర్కొన్నారు. సభలో కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేత వివేక్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నేత నరసింహారావు, చెరుకు సుధాకర్, విమలక్క, జాజుల శ్రీనివాసగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. గమ్యం చేరి తీరాలి: అశ్వత్థామరెడ్డి కారి్మకులు గెలుపు కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం ఓడిపోవొద్దని పోరాడుతోందని, ఏదో సమయంలో కచి్చతంగా ప్రభుత్వం పట్టు సడలి ఓడిపోవటం ఖాయమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గమ్యాన్ని చేరి తీరాల్సిందేనని, ఇందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతామని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే ఆరీ్టసీని ప్రైవేటీకరించే తరహా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిర్బంధాన్ని ఛేదించుకుని వేల సంఖ్యలో కారి్మకులు ఈ సభకు తరలి వచ్చారని, ఇదే ఉత్సాహంతో అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగుతారని జేఏసీ కోకనీ్వనర్ రాజిరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆరీ్టసీని విలీనం చేస్తే యూనియన్లనే తాము రద్దు చేసుకుంటామన్నారు. నేడు దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కారి్మకులంతా ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని ఈ సభలో తీర్మానించారు. గురువారం రాత్రి వరకు ఈ దీక్ష కొనసాగనుంది. నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు దీక్ష విరమించేలా చేయాలని కూడా తీర్మానించారు. గురువారం ఉదయం 9 గంటలకు నిమ్స్‌కు వెళ్లి ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు వెల్లడించారు. -
ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరిలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలని కోరడం లేదని, ఆర్టీసీని బ్రతికించండని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనేక సభలకు ప్రజలను హైదరాబాద్ తీసుకొచ్చిన ఆర్టీసీ కార్మికులు తమ సభకు వేరే బస్సులెక్కి హైదరాబాద్ తరలివచ్చారు. సమ్మె అత్యంత శాంతియుతంగా జరుగుతోంది. డీజిల్ రేట్లు పెరుగుతుండగా ఆర్టీసీకి లాభాలు ఎలా వస్తాయి? ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే తప్ప బతకని పరిస్థితి ఏర్పడింది. ఇంకెంత మంది ప్రాణాలు బలి తీసుకుంటవ్. ఇప్పటికైనా కదిలిరా. మావెంట తెలంగాణ సమాజం ఉందనే వార్త మీ ఇంటికి తీసుకెళ్లండి. సమ్మె చేస్తున్నది మనం. చర్చల ఎజెండా నిర్ణయించాల్సింది మనం. ఐక్యంగా ఉండి, సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఇది. కేసీఆర్ ఒంటరి వాడయ్యాడు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు లేరు. మిలియన్ మార్చ్ చేయడానికి వెనకాడేది లేదు’అని కోదండరాం అన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరి సభలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష పార్టీల నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. -
‘శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే’
-
‘శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదని..ప్రభుత్వ హత్యేనని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లేనని పేర్కొన్నారు. ‘ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేశానని కేసీఆర్ అంటున్నారని..వెళ్లమంటే వెళ్లడానికి ఆర్టీసీ కార్మికులు నీ ఫామ్‌హౌస్‌లో పాలేర్లు కాదని’ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రయోజనాలు కేసీఆర్‌కు పట్టవని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. అధైర్య పడొద్దని..ధైర్యంగా పోరా డాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. -
ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు. -
అచ్చంపేటలో కోదండరామ్ అరెస్టు..!
సాక్షి, నాగర్‌కర్నూల్ : అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హుజూనగర్ నుంచి ప్రొ.కోదండరామ్ పోటీ !
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరామ్ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలుపొందిన తరువాత ఎమ్మెల్యేగా రాజీనామా అనంతరం ఖాళీ అయిన ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేయనున్నారు. ఆయన గెలుపు కోసం ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు, టీవీయూవీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఎమ్మెల్యేలు ప్రస్తుతం లేనందున కోదండరామ్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నిజ్జన రమేష్ముదిరాజ్ తెలిపారు. హుజుర్నగర్లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేదు : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా... రేపు టీజేఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎనిమిది లేదా అంత కన్నా ఎక్కువ స్థానాల్లో టీజేఎస్ పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. కామన్ సింబల్ కాకుండా తమ అగ్గిపెట్టె గుర్తుతోనే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. బూత్ కమిటీలతో సింబల్ గురించి విస్తృత ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ.. మహాకూటమిని నిలబెట్టడానికి ఉమ్మడి ఎజెండాను కూడా మంగళవారమే ప్రకటిస్తామని కోదండరాం వ్యాఖ్యానించారు. మహాకూటమి కలిసి కట్టుగానే అందరితో పోటీ చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రజా ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీపీఐని కూడా కలుపుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి కోదండరాం పోటీచేయనున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
జనగామ బరిలో కోదండరాం ?
సాక్షి, జనగామ: మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీచేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్, మహాకూటమి నాయకులతో రాహుల్‌గాంధీ జనగామ సీటుపై గురువారం చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయన అనుచరుల్లో టెన్షన్ నెలకొంది. జనగామ జిల్లా సాధనకు జేఏసీ పట్టువదలకుండా చివరివరకూ పోరాడడం, ఉద్యోగులతోపాటు యువతపై ఆశలతో టీజేఎస్ ఈ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిగాయి. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలనే విషయంలో కూటమిలోని పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రకటనే మిగిలింది. గురువారం మహాకూటమి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇందులో జనగామ సీటుపై చర్చ జరిగినట్లుతెలుస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ జనగామ సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. కోదండరామ్ ఎక్కడ సీటు అడిగితే అక్కడ కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనగామ సీటు అడగడం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. టీజేఎస్‌కే జనగామ సీటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పొన్నాల లక్ష్మయ్యతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. టీజేఎస్ నాయకులు మాత్రం సంబురాల్లో మునిగిపోయారు. ఢిల్లీలో ఏం జరుగుతోంది... గత ఎన్నికల తప్పిదాలను పునరావృతం చేయొద్దని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్‌గాంధీ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వయసు పైబడిన వారి జాబితాను టీపీసీసీ నుంచి రాహుల్ గాంధీ ఇటీవల తీసుకున్నారు. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముందే గ్రహించిన పొన్నాల లక్ష్మయ్య పది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి వచ్చినట్లు సమాచారం. టికెట్‌పై రాహుల్‌తో హామీ తీసుకున్నాకే నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తిరుగులేని నేత నుంచి... జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల లక్ష్మయ్య నాలుగుసార్లు విజయం సాధించారు. 1994లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. పొన్నాల నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు కావడమేగాక పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న పొన్నాల సైతం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం తప్పించింది. ప్రస్తుతం మహాకూటమి ఏర్పాటు పొన్నాలకు తలనొప్పిగా మారింది. ఆ సీటు ఎందుకు కోరుతుంది..? టీజేఎస్ మొదటి నుంచి జనగామ సీటు కోరుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రత్యేక జిల్లా ఉద్యమం జనగామలో భారీ ఎత్తున జరిగింది. హామీ ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో జిల్లా అంతా ఏకతాటిపై నిలిచింది. రోజుకో వినూత్న కార్యక్రమం, నిరసనలతో హోరెత్తింది. దీనికి జేఏసీ నాయకత్వం వహించింది. ఆఖరికి తలొగ్గిన ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు అంగీకరించింది. ఇది జేఏసీ విజయంగా టీజేఎస్ భావిస్తోంది. దీనికి తోడు ఉద్యోగులు, నిరుద్యోగులతో జేఏసీగా కోదండరామ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనగామ సీటుపై కోదండరాం కన్నేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం వరకు ఉత్కంఠకు తెరపడనుంది. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
జహీరాబాద్: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి కాని, ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండరాదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం టీజేఎస్ జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఆశప్ప చేపట్టిన రైతు దీక్షకు కోదండరాం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వరాష్ట్రంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నా రు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగలేదని, అంతే కాకుండా అర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందని పరిస్థితి ఉందని అన్నారు. తమ భూములపైనే తమకు హక్కు లేకుండా పోయిందనే ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశప్ప చేపట్టిన దీక్ష అభినందనీయమన్నారు. వీటిని పరిష్కరించకుండానే సీఎం కేసీఆర్ తన పీఠం కోసమే ముందస్తు ఎన్నికలకు పోతున్నారని విమర్శించారు. భూములను కాపాడుకునేందుకు రైతులు తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వాన్ని నడిపి పరిష్కారం చూపడానికే కాని మోసం చేయడానికి కాదన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో వర్షాలు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. జహీరాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందుకోసం మనం కూడా ప్రయత్నిద్దామన్నారు. హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
పాలమూరు ఆగమైంది: ప్రొఫెసర్ కోదండరాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కేసీఆర్ పాలనలో పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలను విభజించి పాలమూరు ముఖచిత్రాన్ని మార్చేశారని, ఫలితంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కలెక్టర్ కార్యాలయాలు ఎక్కడో తెలియక పనులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీమైదానంలో తెలంగాణ జనసమితి(టీజేఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో కృష్ణానది జూరాల వద్ద ప్రవేశించి శ్రీశైలం వద్ద బయటకు వెళ్తుందని, జిల్లాకు నీళ్లు రావాలంటే జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయాల్సి ఉందన్నారు. కానీ శ్రీశైలం నుంచి లిఫ్టుల ద్వారా ఎత్తిపోస్తే దిగువకుపోయిన నీళ్లు పైకి ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కోదండరాం విమర్శించారు. గ్రామాల్లో 144 సెక్షణ్ విధించి ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు ఎంపీగా అవకాశమిచ్చి ఉద్యమ నాయకుడిగా తయారుచేస్తే ఇక్కడి ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. హామీలను గాలికొదిలారు ప్రభుత్వం భర్తీచేస్తామన్న లక్షన్నర ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో యువత ఆగమైందన్నారు. రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవన్నారు. ఇన్నేళ్లు చదివినా ఉద్యోగం రాలేదని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు జీఓ నం.68, 90 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, ఎస్టీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు. మన వాళ్లు పరాయి వాళ్లయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ప్రజాసమస్యలను విన్నవించే పరిస్థితి లేదన్నారు. ప్రశ్నిస్తే నిర్బంధాలు, బెదింపులకు పాల్పడుతుందన్నారు. చివరికి నిరసన తెలిపేందుకు లేకుండా చేసి ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు సీఎంను కలిసేందుకు వెళ్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలు పోతే గుర్తుపట్టే నాయకులు లేరన్నారు. అందుకే మనవాళ్లు ప్రభుత్వానికి పరాయివాళ్లు అయ్యారని విమర్శించారు. చెక్కుల పంపిణీలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పూర్తిన్యాయం జరగాలంటే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశామని వివరించారు. పాలమూరు అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో వ్యవసాయానికి నీళ్లొస్తాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత నైరాశ్యంతో ఉంది. ప్రజలకు పూర్తి న్యాయం జరగాలంటే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్నిపార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పాటు చేశాం. – టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రజల కష్టాలు చూసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాం. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలను మోసం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.. – ఆర్ఎల్డీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్ గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేద్దాం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి నుంచి ఎవరికి టికెట్ వచ్చినా అభ్యర్థుల గెలుపు కోసం ఉమ్మడిగా కృషిచేస్తామని, తెలంగాణలో నియంతృత్వ పాలన అంతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, రైతుబిడ్డగా తనకు కష్టాలు తెలుసన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఇటీవల కొండగ ట్టు బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించా రు. టీజే ఎస్ రాష్ట్ర నాయకులు దిలీప్‌కుమార్, బబ్రూది న్, నాయకులు నర్సింహయ్య, బాల్కిషన్, సాజిదాసికింద్, దేవ రాజ్‌తో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ మాట తప్పారు అంతుకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్‌సింగ్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగా ణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను చూసే పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో దశ తెలంగాణ ఉద్యమం పాలమూరు నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కోదండరాం నేతృత్వంలో ప్రజలు నడవాలని, జనసమితి పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. -
‘కొండగట్టు బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
సాక్షి, కరీంనగర్ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. గురువారం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి, ఓవర్ డ్యూటీనే కారణమని ఆరోపించారు. అంత పెద్ద సంస్థకు ఎండీ లేకపోవటం విచారకరమన్నారు. తక్షణమే ఐఏఎస్ లేదా ఐపీఎస్‌ను ఎండీగా నియమించాలని డిమాండ్ చేశారు. -
టీజేఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఆ తరువాత జిల్లాల్లో బస్సుయాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా.. కలసి వచ్చే పక్షాలనూ కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొం త కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సకల జనుల సమ్మె రోజునే.. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను ఎత్తిచూపుతూ వాటి సవరణ కోసం మండల కేంద్రాల్లో రైతులతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి చేపట్టాలని టీజేఎస్ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు.. రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చేనెల 12న హైదరాబాద్‌లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష చేపట్టాలని తీర్మానించింది. రాజీవ్ లేదా విజయవాడ రహదారిపై భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించింది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి, విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తరువాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. -
ఇది టీఆర్ఎస్ పండుగ కాదు..
సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యమాలతో సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపిస్తారని భావించాం. కాని అధికారం అడ్డుపెట్టుకుని ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని అధికారం అప్పజెప్పితే దాన్ని తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారు’ అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉద్యమకారులను మరిచిపోయిందని, ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ‘రాష్ట్రం వచ్చినందుకు ఈ రోజు పండుగ చేసుకోవాలా, లేక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినందుకు పండుగ జరుపుకోవాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవం. ఉద్యమకారుల పండుగ. ప్రజల వేడుక’ అని వ్యాఖ్యానించారు. అవినీతిలో రెండో స్థానం ఆ రోజు ఉద్యమాలను విమర్షించి.. ‘తెలంగాణ లేదు.. ఏంలేదు.. దుకాణం’ అని మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మంత్రులయ్యారని కోదండరాం విమర్శించారు. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఒక్కటైనా ఉద్యమాలకు సంబంధించిన ఫొటో గానీ, అక్షరం గానీ ఉందా? సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు.. ఇలాంటి వాటికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లేదు. కేవలం టీఆర్ఎస్ వాళ్ల పథకాల ప్రచారం కోసం మాత్రమే ప్రకటనలు ఇచ్చుకున్నారు’ అని దుయ్యబట్టారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకోవాల్సిన ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో ఒక్క ప్రకటనలో గానీ, ప్రభుత్వం పెట్టిన అంశాల్లో గానీ లేకపోవడం బాధకరమన్నారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని ప్రకటించుకుంటున్నారు. మరి అవినీతిలో రెండో స్థానం, మద్యపానంలో రెండో స్థానం, అక్షరాస్యతలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న విషయాలను కూడా ప్రకటనలో వెల్లడించాల్సింది’ అని ఎద్దేవా చేశారు. మంత్రులకూ రైతుబంధు చెక్కులా? ‘రైతు బంధు కింద ఇచ్చిన రూ.4 వేలతో రైతన్నలు ఎంత పంట పండిస్తారు? ఆ డబ్బులతో ఏం చేయాలి. ఇదే పథకంలో సత్యం రామలింగరాజుకు, సచిన్ టెండూల్కర్‌కు కూడా చెక్కులు వచ్చాయి. కొంత మంది మంత్రులు కూడా రైతు బంధు కింద చెక్కులు పొందారు. కానీ 46 లక్షల మంది కౌలు రైతులను నిర్లక్ష్యం చేయడం ఏంటి?’ అని ఆయన ప్రశ్నించారు. భూమి లేకుండా వ్యవసాయం చేస్తున్న వాళ్లకు కనీసం కిసాన్ క్రెడిట్ కార్డయినా ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారం అప్పజెపితే సేవ చేయాల్సింది పోయి.. తామేదో చక్రవర్తుల్లా వ్యవహరించడం ఏంటని విమర్శించారు. పాలనను మార్చుకుంటాం.. ‘ఈ పాలనను మార్చు కోగలుగుతాం. తెలంగాణనే తెచ్చు కున్న వాళ్లం.. ఈ ప్రభుత్వాన్ని, పాలనను మార్చ కోలేమా? ఉద్యమకారులుగా మాకు ఇది పెద్ద లెక్క కాదు. ఐక్యంగా ముందుకు సాగి, పాలనలో మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తాం’ అని కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కులవృత్తుల వారు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు చేసిన పోరా టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నా రు. ఉద్యమంలో కీలకమైన సకల జనుల సమ్మె, వంటావార్పు, సడక్ బంద్, మిలియన్ మార్చ్, సాగర హారం తదితర కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు జయశంకర్ స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ముందుకు రావాలని, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో జన సమితి పోటీ చేసి ప్రజల గొంతు వినిపిస్తుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ నేతలు వెంకట్‌రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కేంద్రంగా అభివృద్ధే తమ లక్ష్యమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాంను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. పార్టీ ఏర్పాటు కారణాలు, లక్ష్యాలపై వివరించారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. ప్రస్తుతం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, నిరంకుశ పాలనకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఎటువైపు ఉంటారో తేల్చుకోండని తెలంగాణ సమాజం అడుగుతోంది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలోపేతం చేయడానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే. యువతకు, రైతులకు, పేద వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి టీజేఎస్ కార్యకర్త కదలాలి. ప్రజలు, వారి బతుకు దెరువు కేంద్రంగా పని చేయాలి. మరో తెలంగాణను నిర్మించుకుందాం. కొత్త రాజకీయాలను సృష్టించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం చేసే వారిని నిలదీయాలన్నారు. ‘పెత్తనం చేయొద్దు.. దిగిపొమ్మని చెబుతాం.. దింపేందుకు వస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందని, ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఆగడాలు, అక్రమాస్తులు, కాంట్రాక్టర్ల దోపిడీపై తెలంగాణ జన సమితి విచారణ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఏడెనిమిది వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఆపితే అడ్వొకేట్లకు, జర్నలిస్టులకు, నిరుపేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ఒక్కరితో వచ్చింది కాదు.. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని కోదండరాం చెప్పారు. అలాంటివారి త్యాగాలతో తెలంగాణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరి వల్లో కాదని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో పోరాడిన వారిపై రౌడీషీట్లు పెట్టారని, పెట్టించిన వారు మంత్రుల స్థానంలో కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో 15 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. వేదికపై అన్ని వర్గాలు ఆవిర్భావ సభకు పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదికపై వివిధ వర్గాలకు చెందిన వెయ్యి మంది కూర్చునే అవకాశం కల్పించారు. వీరిలో పార్టీ నాయకులతో పాటు మల్లన్నసాగర్, నేరెళ్ల బాధితులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు, అమర వీరుల కుటుంబీకులు, నిర్వాసితులు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతోందని, ఇందుకేనా కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నది అని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, బిల్డింగులు కట్టడం కాదని ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించడమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు వ్యక్తుల చుట్టూనే పాలన నడుస్తోందని ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి విమర్శించారు. ‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తా అంటడు.. మరోరోజు ఇస్తాంబుల్ చేస్తా అంటడు. స్కైవేలు.. హైవేలు అని చెప్పాడు కదా... అవన్నీ ఏమయ్యాయి’ అని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. -
పరువు తీసుకుంటున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామిక సభలు, శాంతియుత నిరసనలపై ఇష్టమొచ్చినట్లు ఆంక్షలు విధించడంతో ప్రభుత్వం తన పరువు తానే తీసుకుంటోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్బంధాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ప్రభుత్వాలు జవాబుదారీతనం గా ఉండాలని, రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పాలన జరగాలని హితవు పలికారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తేనే ఆంక్షలు పెట్టొచ్చని చెప్పారు. ఎవరికీ, ఎలాంటి ఇబ్బంది లేకున్నా తమ సభలకు, నిరసనలకు ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వింత కారణాలు చెబుతున్న పోలీసులు అధికారంలో ఉన్న వారికి ఇది ప్రజాస్వామ్య దేశమని పదేపదే గుర్తుచేయాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, అభిప్రాయాలు వెల్లడించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. జనసమితి సభను హైదరాబాద్‌లో నిర్వహించుకునేందుకు 7 ప్రాంతాలను గుర్తించి, అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ చిత్ర, విచిత్రమైన కారణాలను చూపిస్తూ సభకు అనుమతిని నిరాకరిస్తోం దని ఎద్దేవా చేశారు. వాహనాల రద్దీ పెరిగి, ట్రాఫిక్ ఆగిపోయి, వాయు కాలుష్యం పెరిగి, ప్రజలకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందంటూ పోలీసుల సమాధానాలకు విస్తుపోయామని చెప్పారు. జన సమితి సభకోసం అడిగిన మైదానంలోనే ఇటీవలే ఓ సినిమాకు సంబంధించి ఫంక్షన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. పర్యావరణానికి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు మాత్రం ఎలా వస్తుందని దుయ్యబట్టారు. మేమంటేనే సమస్యలు గుర్తొస్తాయా? తెలంగాణ జేఏసీ ఏ కార్యక్రమం నిర్వహించినా, జన సమితి సభలు పెట్టుకున్నా పోలీసులకు ఎన్నో సమస్యలు గుర్తుకొస్తున్నాయని కోదండరాం విమర్శించారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ ఇక్కడే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్బంధంగా చెప్పడం అప్రజాస్వామికమని, ఇలాంటి అప్రజాస్వామిక ధోరణిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసమితి అంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు, నిర్బంధాలతో గెలుస్తామని అధికారంలో ఉన్నవారు అనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయని బయటకు చెప్పుకుంటున్నా ఓడిపోతామనే భయం టీఆర్ఎస్కు పట్టుకుందన్నారు. జనసమితి సభ ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలను, ప్రజలకు జరుగుతున్న నష్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామనే భయంతోనే అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాలు, ఎందరో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారం ఒకే కుటుంబానికే పరిమితం కావడం బాధ కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా అందరినీ సమానంగా చూడాలని, ఆ కుర్చీకి ఉన్న హోదాతో బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. -
గుర్తింపులేని కులాలను గుర్తించాలి
హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపులేని 28 కులాలను వెనకబడిన కులాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో గుర్తింపులేని కులాలకు గుర్తింపు, సామాజిక న్యాయం’అనే అంశంపై జాతీయ ఎంబీసీ, డీఎన్టీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుర్తింపులేని 28 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమీషన్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి టీజేఏసీ ఆధ్వర్యంలో త్వరలో వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ సంచార జాతుల్లో బాగోతుల, గంజికూటి, రామజోగి, ఓడ్, గవిలి, బొప్పల వంటి కులాలు ఇప్పటికీ కనీసం గుర్తింపులేక కడుదీనమైన స్థితిలో జీవనం కొనసాగిస్తున్నాయని అన్నారు. వీరికి కుల సర్టిఫికెట్ ఇవ్వకపోవడంవల్ల పిల్లలను స్కూళ్లలో చేర్పించుకోలేక చదువుకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు చెందిన శ్రీనివాస్, సారయ్య, వెంకటనారాయణ, నరేందర్, పాండురంగచారి మాట్లాడుతూ ‘వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని కులాలకు గుర్తింపు ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలను గుర్తిస్తారని భావించాం. కాని నిరాశే ఎదురైంది’అని పేర్కొన్నారు. -
ప్రజా సంక్షేమానికే కొత్త పార్టీ
ఖమ్మంమామిళ్లగూడెం: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించే వారిని టార్గెట్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. శనివారం బడ్జెట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం ఒక విధానం ప్రకారం నడుస్తే బాగుంటుందని చెప్పిన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంట్రాక్టర్ల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ సర్కార్ పని చేస్తోందన్నారు. అందుకే రాజకీయ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. తాను బీజేపీనుంచి కోదండరామ్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
‘కోదండరామ్ ఏ పదవిలో ఉన్నా ఓకే’
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఇంటి పార్టీ సారథ్యంలో ఏ పదవిలో ఉన్నా పార్టీ పరంగా తాము అంగీకరిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. సాంకేతికంగా లేదా ఇంకేమైనా అభ్యంతరాలున్నా పరిష్కరించుకుని అందరూ ఒకే పార్టీగా ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తులు సంతో షిస్తాయన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో హైకోర్టుకు చెందిన 25 మంది అడ్వొకేట్స్ జక్కుల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటి పార్టీలో చేరారు. కొత్తగా పార్టీలోకి చేరిన అడ్వొకేట్స్తో సెక్షన్ 506, 507లపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఓట్ల చీలికకు దారితీయకుండా కాంగ్రెస్‌తో కలసి ఉండే కూటమిలోకి రావాలని సుధాకర్ కోరారు. -
కమీషన్ల కోసమే విద్యుత్ కొనుగోలు
హన్మకొండ చౌరస్తా: కమీషన్ల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ కొనుగోలుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ‘రైతాంగ సమస్యలు– పరిష్కారాలు’ అనే అంశంపై టీజేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. రైతాంగ సమస్యలపై వచ్చే నెల 4న జరిగే చర్చలకు మాతో కలిసొచ్చే వారికి వివరిస్తామ న్నారు. ‘రైతు ఆత్మహత్యల నివారణ–లాభసాటి వ్యవసాయం’ నినాదంతో టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. వ్యవసాయం వల్ల రూ.కోట్లలో లాభం వస్తుందని కొందరు పెద్దలు చెబుతుంటే, రాష్ట్రంలో మాత్రం రైతులు సాగును వదులుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. -
కోదండరామ్‌కు ఆ విషయం తెలియదా?
జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఢిల్లీలో అబద్దాల చిట్టాతో సంచరిస్తున్నారని, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కోదండరామ్ అబద్దాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం లక్షా నలభై అయిదు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిందని మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని పేర్కొన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు. అసలు ఎలాంటి తెలంగాణ కావాలో కోదండరామ్ స్పష్టం చేయాలన్నారు. -
నౌకరి కోసం కొట్లాడుండ్రి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించి ప్రాణ త్యాగాలు చేసిన అమరుల స్ఫూర్తితో యువత ఐక్యమై నౌకరి కోసం ఉద్యమించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఏఐ వైఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడితే, ప్రభుత్వం కేవలం 20 వేల పోస్టుల భర్తీ మాత్రమే చేపట్టిందన్నారు. ఇంకా 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయని, 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించినా ఆచరణలో మాత్రం కనబడటం లేదని ఆరోపించారు. నెలలు గడుస్తున్నా ఎస్ఐ పరీక్షల ఎంపిక ఫలితాలను విడుదల చేయడం లేదని, వాటిపై స్పష్టత అడిగిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వెంటనే ఉద్యోగ క్యాలెండర్‌ను ఆవిష్కరించి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ సదస్సు నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. -
మిషన్ భగీరథ ఎందుకు?: కోదండరాం
కేయూ క్యాంపస్ (వరంగల్): తెలంగాణ ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరిస్తోందని, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఉండగా.. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో తెలియడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలో ఆదివారం మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా ఏడో మహాసభల్లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకం కోసం ప్రభుత్వం రూ. 42 వేల కోట్లు కేటాయించి పనులను మెగా కంపెనీకి అప్పగించారని, వీటిని ప్రభుత్వమే చేయిస్తే రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు మిగులుతాయన్నారు. నేరెళ్లలో ఇసుక రవాణా అధికంగా ఉందని, స్పీడ్ బ్రేకర్లు వేసి లారీల వేగాన్ని నియంత్రించాలని కోరిన వారిపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాము ఎక్కడికి వెళ్తున్నా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. -
సర్కారు అవినీతిని ఎదిరిద్దాం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం సిరిసిల్ల: తెలంగాణ సర్కారులో అవినీతిని ఎదురిద్దామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మూడు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్ర ముగింపు బహిరంగ సభ సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సభలో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సర్కారు దూకుడుకు ముక్కుతాడు వేయాల్సిందేనన్నారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మిషన్ భగీరథను రూ.42 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం పెరిగిపోయిందని కోదండరాం అన్నారు. ఇసుకను దోపిడీ చేస్తున్నారని, సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. -
ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకొద్దాం
అమరుల స్ఫూర్తియాత్రలో ప్రొఫెసర్ కోదండరాం రుద్రంగి (వేములవాడ): ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పనిచేయడంలేదని, ప్రజలందరం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ పాలనలో మార్పు తీసుకు వద్దామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం రెండోరోజు తెలంగాణ అమరుల స్ఫూర్తియాత్ర కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. జీఎస్టీ ద్వారా బీడీ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని, తద్వారా రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. బీడీ పరిశ్రమపై జీఎస్టీని మినహాయించాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాము మద్దతు ఇవ్వబోమని రాష్ట్రప్రభుత్వం చెబితే.. కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించదా? అని ప్రశ్నించారు. కానీ, మన పాలకులకు ఇట్లాంటి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందేందుకు, రైతులు గిట్టుబాటు ధరల కోసం, యువత, నిరుద్యోగులు, విద్య, ఉద్యోగాల్లో అవకాశాల కోసం మళ్లీ ఉద్యమించాలని కోదండరాం పిలుపునిచ్చారు. -
సిరిసిల్ల నుంచి జేఏసీ రెండో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యల పరిష్కారం, ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యంపై టీజేఏసీ చేపడుతున్న రెండో విడత యాత్రను సిరిసిల్ల నుంచి నిర్వహించాలని భావిస్తోంది. సంగారెడ్డి నుంచి సిద్దిపేట దాకా ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన అమరుల స్ఫూర్తి యాత్రకు వచ్చిన ఆదరణ క్రమంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్‌లోనే జేఏసీ యాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడంలేదన్నారు. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని వెల్లడించారు. స్ఫూర్తి యాత్రను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు. రెండో విడత యాత్రపై ఇంకా తేదీలు, ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే సిరిసిల్ల నుంచి రెండో విడత అమరుల స్ఫూర్తి యాత్రను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. జేఏసీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. -
కిరీటాలు.. పీఠాలు అడగడం లేదు
అమరుల స్ఫూర్తి యాత్ర’లో ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, సంగారెడ్డి: ‘నెత్తిమీద కిరీటాలు.. కూర్చోడానికి పీఠాలు.. సన్మానాలు, దండలు కోరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజ లకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాత్రమే ప్రశ్నిస్తున్నం’అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. తెలంగాణ జేఏసీ చేపట్టిన ‘అమరుల స్ఫూర్తియాత్ర’ను బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోదండరాం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చింది.. నువ్వెవరు? అని అడుగుతున్నారు.. అయినా మేం గుర్తింపు కోరుకోవడం లేదు’అన్నారు. ‘లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోయింది. రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానం, నిరక్షరాస్య తలో అట్టడుగున ఉన్నాం. దళితులకు ఇప్పుడు ఇస్తున్నట్లే భూమి పంపిణీ చేస్తే.. అందరికీ లబ్ధి కలగాలంటే ఇంకో 230 ఏళ్లు పడుతుంది. ఇదేం పద్ధతి.. మీకు అవసరమైతే మాత్రం భూములు దొరుకుతున్నాయి. మియాపూర్ భూములు పంచుకోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, పైసలు దండుకోవడంలోనే నాయకులు మునిగి తేలుతున్నారు. ఎవరిపైనైతే కొట్లాడినమో.. వారికే పైసలు దొరుకుతున్నయి. ఓట్లు అడిగేందుకు మాత్రమే ప్రజలు అక్కరకు వస్తారా?’అని కోదండరాం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. 20 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకం పనులను రూ.16 వేల కోట్లతో పూర్తి చేయొచ్చు. కానీ రూ.46 వేల కోట్లతో పనులు చేస్తున్నరు.’ అని కోదండరాం పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ కో కన్వీనర్ ప్రొఫెసర్ పురుషోత్తం, జిల్లా కో ఆర్డినేటర్ పల్పనూరు శేఖర్, ఆశ తదితరులు పాల్గొన్నారు. -
భూకుంభకోణంపై విచారణ జరపాలి
ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రభుత్వం తగిన చర్య లు తీసుకోకపోతే అన్ని దస్తావేజులతో బహిరంగ విచారణ జరుపుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ కోచైర్మన్ గోపాలశర్మ అధ్యక్షతన శనివారం ఇక్కడ ‘మియాపూర్ భూకుంభ కోణం’పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ మే, సంపన్నులకు అక్రమంగా కట్టబెడుతున్న దన్నారు. కాగితాల్లోనే భూములు మారాయని, ఎక్కడి భూములు అక్కడే ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్ప టికే ఆ భూముల్లో భారీ విల్లాలు, అపార్టుమెం ట్లను నిర్మించారని, వాటిని బడా బాబులు కొనుక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారని అన్నా రు. ఈ భూముల కుంభకోణంలో వాస్త వాలను చెప్పడానికి కరపత్రాలను వేస్తామన్నారు. ప్రభుత్వ భూములపై అధ్యయనం చేసిన ఎస్.కె.సిన్హా కమిటీ నివేదికను బయట పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా ప్రభు త్వం గుర్తించిన భూముల వివరా లను బయటపెట్టాలని, వాటిని సంరక్షిం చడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ తెలం గాణలో నిజాంకాలం నాటి నుంచి ఉన్న ప్రభుత్వ భూములు, వాటి స్వరూపం గురించి వివరిం చారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వ భూమి ఎంత ఉందో ఇప్పటికీ సరైన లెక్కలు లేవన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో తెలుసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టీజేఏసీ నేతలు భైరి రమేశ్, మాదు సత్యం, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ అవినీతి కంపుకొడుతోంది
∙ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ∙ భూకబ్జాల వెనుక పాలకుల హస్తం ∙ ఈనెల 21న అమరవీరుల స్ఫూర్తియాత్ర హయత్‌నగర్(ఇబ్రహీంపట్నం): టీఆర్ఎస్ సర్కార్ పాలన అవినీతిమయంతో కుళ్లిన కంపు కొడుతుందని, ఇంతటి అవినీతి పాలనను ఎప్పుడూ చూడలేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్‌లో జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది ఇలాంటిపాలన కోసం కాదన్నారు. సీమాంధ్ర పాలనకు కొనసాగింపుగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అత్మహత్యలకు పాల్పడుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఊరిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. భూ కుంభకోణాలు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయని, వీటిలో అధికారులతో పాటు పాలకుల హస్తం కూడా ఉందని అన్నారు, నయీం కేసులోని డైరీలో కొన్ని పేజీలు చిరిగి పోయాయని, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయన్నారు. గ్రూప్–2 పరీక్షలలో పారదర్శకత లోపించిందని, ఎస్ఐ రాత పరీక్షల ఫలితాల ఇంకా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న అమరుల స్ఫూర్తి యాత్రను చేపట్టనున్నామని స్పష్టం చేశారు. యాత్ర సంగారెడ్డిలో మొదలై.. సిద్ధిపేటలో ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ రఘు, కో–చైర్మన్ పురుషోత్తం, కో– కన్వీనర్లు శంకర్, రమేష్, అధికార ప్రతినిధి గురిజాల రవీందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్ఫూర్తి యాత్ర నిర్వాహణ కమిటీ ఏర్పాటు.. ఈ నెల 21 నుంచి జేఏసీ చేపట్టిన స్ఫూర్తి యాత్ర నిర్వాహణకు సమావేశంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా జె.రఘు, కో–చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం, నిజామాబాద్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా గోపాలశర్మ, నల్లగొండ జిల్లా కో–ఆర్డినేటర్‌గా ధర్మార్జున్, మెదక్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా అశోక్, వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్‌గా అంబటి శ్రీనివాస్, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కన్నెగంటి రవి, కో–కన్వీనర్‌గా బైరి రమేష్‌లు వ్యవహరిస్తారని సమావేశం తీర్మానించింది. -
ధర్నాచౌక్‌కు మద్దతుగా నేడు పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగం గా ఆదివారం ఇందిరాపార్కు సమీపంలోని ఎల్ఐసీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న ధర్నాచౌక్ ఆక్రమణను చేపట్టిన అనంతరం, దీని పున రుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి వారం సమయా న్నిచ్చింది. అనంతరం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీలోని వివిధ వామ పక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు ఆదివారం ఎల్ఐసీ కాలనీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పాదయాత్రను చేపట్టి ధర్నాచౌక్ పునరుద్ధరణ అవసరాన్ని అక్కడి ప్రజలకు వివరించాలని నిర్ణయించాయి. ధర్నాచౌక్ పునరుద్ధరణకు స్థానిక ప్రజల మద్దతును కూడగట్టాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ పాదయాత్రలో కమిటీ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొంటారు. -
అరెస్టులతో సమస్య పరిష్కారం కాదు
నిరుద్యోగ సమస్యపై ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పాల్గొనకుండా చేసి ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడం శోచనీయమని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. నిరుద్యోగ జేఏసీ చాలాకాలంగా ప్రభుత్వం ముందు, వర్సిటీ యాజమాన్యం ముందు పెడుతున్న ఉద్యోగ నియామకాల సమస్యను పరిష్కరించే బదులు విద్యార్థులను అరెస్టులు చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులతో విద్యార్థులను అణచివేయొచ్చేమో కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొనే అవకాశం మాత్రం ఉండదని స్పష్టం చేశారు. నిజానికి సెంటినరీ ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని తనకు సైతం ఉన్నప్పటికీ విద్యార్థుల అరెస్టులకు నిరసనగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, వలస పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలని కోదండరాం సూచించారు. -
‘నిజాం షుగర్స్‌ను కాపాడుకుందాం’
బోధన్ : తెలంగాణ వారసత్వ సంపద నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్)ని కలిసికట్టుగా కాపాడుకుందామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు నిచ్చారు. నిజాంషుగర్స్‌ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న ప్రధాన డిమాండ్‌తో టీ జేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బోధన్‌లో ధర్నా, పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ ఒక వైపు అసెంబ్లీలో వారసత్వ కట్టడాల రక్షణకు బిల్లు ఆమోదం తెలుపుతూనే మరో వైపు వారసత్వ సంపద నిజాంషుగర్ ఫ్యాక్టరీ నాశనమవుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచిత్రమైన పరిస్థితి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా రైతులు ముందుకువస్తే అప్పగిస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం నెలలు గడిచిపోతున్నా విధివిధానాలు ప్రకటించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 4వేల ఎరువు సహాయం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలన్నారు. -
లక్ష్మణ్‌తో కోదండరాం భేటీ
♦ అధికార పార్టీ తీరుపై చర్చ ♦ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను కలుపుకుపోయే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసు కుంటున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. నిరసనలకు అవకా శం లేకుండా ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ను ఎత్తేయడం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పై అందరినీ కలుపుకొని పోవడం వంటి అం శాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఇందిరాపార్కు ధర్నాచౌక్ ఎత్తివేత, సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ల కొనసాగింపునకు వ్యతిరేకంగా కలిసొచ్చే వారిని కూడగట్టేందుకు జేఏసీ ప్రయత్నిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మంగళవారం బాగ్‌లింగంపల్లి లోని ఓ ఇంటిలో వీరు సమావేశమయ్యారు. వీరితో పాటు పాటు గాదె ఇన్నయ్య, పలు ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ అసహనానికి నిదర్శనం... అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, ధర్నాచౌక్‌ను శివార్లకు తరలించడంవంటి సమస్యలపై స్పందిస్తున్న తీరు అధికార టీఆర్ఎస్లో పెరు గుతున్న అసహనానికి నిదర్శనమని వీరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వా మ్యహక్కుల పరిరక్షణలో భాగంగా ఈ అం శంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొనిపోయే అంశంపై జేఏసీగా కోదండ రాం, జస్టిస్ చంద్రకుమార్, ప్రజాగాయకుడు గద్దర్, మంద కృష్ణమాదిగ, ప్రజాసంఘాలు ఫ్రంట్‌గా ముందుకువస్తే బీజేపీ మద్దతిస్తుం దని లక్ష్మణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు భిన్నంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులను కొనసాగించడంపై మంచిర్యాలలో చేపడుతున్న నిరసనలపై ప్రస్తావన రాగా, ఓపెన్‌కాస్ట్‌లను కొనసాగించడాన్ని బీజేపీ తప్పుపడుతోందని లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలు స్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందా లేదా పొత్తులకు తలొగ్గుతారా అని కోదండరాం ప్రశ్నించగా కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారని సమాచారం. ప్రత్యామ్నాయం బీజేపీయే... టీఆర్ఎస్కు నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ యేనని లక్ష్మణ్ పేర్కొన్నట్లు సమాచారం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరి స్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపట్ల బీసీల్లో వ్యతి రేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారని తెలిసింది. దీనిపై ముస్లింలలో కూడా ఆం దోళన వ్యక్తమవుతోందని, 12శాతానికి పెంచి తే మొదటికే మోసం వస్తుందా అన్న సందే హాలు వారిలో వ్యక్తమవుతున్నాయని పేర్కొ న్నట్లు సమాచారం. -
ధర్నాచౌక్‌ను తరలించొద్దు
సాక్షి, హైదరాబాద్: నిరసన తెలపడం ప్రజల కనీస ప్రజాస్వామిక హక్కని, దాన్ని కాల రాస్తే ప్రజాస్వామ్యానికి మనుగడే లేదని వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ధర్నాచౌక్ సాధన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. నగరం నడిబొ డ్డునే ఉన్న ధర్నాచౌక్ తెలంగాణ ప్రజలకున్న నిరసన తెలిపే ఏకైక ధర్మగంటని, అది లేకుండా చేస్తే ప్రభుత్వానికే ప్రమాదకర మని.. తక్షణమే ధర్నాచౌక్ తరలింపును ఉపసంహరించుకోవాలని సదస్సు డిమాండ్ చేసింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మానికి వేదికగా నిలిచిన ధర్నాచౌక్‌ను తరలించి, శాంతి భద్రతల పేరుతో ప్రజల స్వేచ్ఛను హరించరాదన్నారు. విద్యావేత్త చుక్కారామయ్య మాట్లాడుతూ ఇటు ప్రజల కు, అటు కేసీఆర్‌కు ధర్నాచౌక్ అవసరమేనని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అంద రూ ఏదో ఒక సందర్భంలో ధర్నాచౌక్‌ను ఆశ్రయించక తప్పదని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన చరిత్రాత్మక పోరాటం మొదలుకొని తెలం గాణ ఉద్యమం వరకు ధర్నాచౌక్ వద్దే ప్రారం భమయ్యాయన్నారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాసిన ఇందిరమ్మకు 1977 ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తుపెట్టుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. డి.ఎల్ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నాయకులు సాది నేని వెంకటేశ్వరరావు, పోటు రంగారావు, పీఎల్.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ధర్నాచౌక్ తరలింపునకు నిరసనగా ఈ నెల 26న సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద 2కె రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 21 మందితో ధర్నాచౌక్ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా చాడ, సభ్యు లుగా కోదండరాం, వరవరరావు, జీవన్ కుమార్, రామయ్య, గోవర్ధన్, విమలక్క, పోటు రంగారావు, గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్, జస్టిస్ చంద్రకుమార్ తదితరు లను ఎన్నుకున్నారు. -
కోదండరాం పార్టీ పెట్టకపోవచ్చు: భట్టి
బాహుబలి ఊహాజనితం.. చర్చ అనవసరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను రాజకీయ నాయకునిగా తాము భావించడం లేదని, ఆయన పార్టీ పెట్టకపోవచ్చునని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఎవరు కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఉన్నవారెవరికీ మరోసారి అధికారం ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడటంలేదని తేలిందన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా లేదని, 4కోట్ల మందికి దక్కాల్సిన వనరులను, సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోని నలుగురే దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సిన అవసరంలేదని భట్టి అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీయాలని మా ఎమ్మెల్యేలు అనుకున్నా అధికారపక్షం మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రెండు మూడు రోజులుగా పార్టీలో సంచలనం సృష్టించిన బాహుబలి విషయం ఊహాజనితంగా భట్టి తేల్చేశారు. దాని గురించిన చర్చ అనవసరమని వ్యాఖ్యానించారు. -
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
హైదరాబాద్: ‘సమస్యలను చెప్పుకోవడం, సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను నిర్భందించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటల ఫలితంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ఉపాధి కల్పన దిశగా ఆలోచించాలి : కోదండరాం
► అడిగే ప్రశ్నను చూడాలి తప్ప.. వ్యక్తిని కాదు ► టీపీటీఎఫ్ మహాసభలో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్తగూడెంటౌన్: రాష్ట్రంలో విద్య, ఉపాధిలో నెలకొన్న సమస్యలపై, నిరుద్యోగులకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం ఆలోచించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పట్టణంలోని ఉర్దూఘర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లాస్థాయి ప్రథమ మహావిద్యాసభకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున తాను ప్రశ్నించినందుకు... ప్రశ్న ఏమిటో ఆలోచించకుండా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో సమస్యలున్నాయని చూపిస్తే.. చేతులు తనవైపు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే.. మంచే చేస్తున్నాం... సమస్యలు ఎక్కడున్నాయని ప్రభుత్వంలోని కొందరు తిరిగి ప్రశ్నిస్తున్నారన్నారు. ఆధునిక సమాజంలో విద్య ప్రత్యేక వ్యవస్థగా మారిందని, సావిత్రీబాయి పూలే చదువు చెపుతానంటే ఆనాటి నిరంకుశ పాలకులు అడ్డుచెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రైవేటు ప్రైమరీ బడులు వీధివీధినా కుప్పలుతెప్పలుగా వచ్చాయన్నారు. ప్రభుత్వ హయాంలో ప్రైవేటు యూనివర్సిటీలకు వందలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదన్నారు. ఆత్మకూరు, మహబూబాబాద్‌లను ఆదర్శంగా తీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్నారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులను పట్టించుకోకుండా కేసీఆర్ ఏకపక్షంగా నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు మా ట్లాడుతూ జిల్లాల విభజన రాజకీయ లబ్ధికోసం తప్ప ప్రజల కోసం కాదని, రాష్ట్రం ఇన్ చార్జిల పాలనలోనే కొనసాగుతుం దన్నారు. సభలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు జె.సరళ, బి.హనుమంతు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ బి.ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి కె.మాధవరెడ్డి ప్రసంగించారు. -
రాష్ట్రానికి నష్టం చేయడమే వారి ఎజెండా
కోదండరాంపై ఎంపీ బాల్క సుమన్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం తన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థులను బలిపశువులను చేసే కుట్రలు సాగిస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగా ణకు నష్టం చేయాలన్నదే కోదండరాం బ్యాచ్ ఎజెండా అని ధ్వజమెత్తారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శంభీపూర్‌రాజుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాస్తవాలను వెల్లడిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా నిరుద్యోగ ర్యాలీకి పిలుపునిచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కోదండరాం కుట్రలు పన్నారని సుమన్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలో ద్రోహపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్, టీడీపీలతో పాటు తెలంగాణ రాష్ట్రమే వద్దన్న సీపీఎంతో కోదండరాం అంటకాగుతున్నారని విమర్శించారు. -
కోదండరామ్‌కు క్షమాపణ చెప్పాలి: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి తలుపులు పగులగొట్టి పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు క్షమాపణలు చెప్పాలని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రజా ఉద్యమాల పట్ల టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. ఈ ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొంది. గురువారం సీపీఎం నాయకులు జి.నాగయ్య, బి.వెంకట్, టి.జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామ్య, నిరంకుశ విధానాలపై పునరాలోచించుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. మార్చి 19న సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం... సీపీఎం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా వచ్చేనెల 19న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ‘తెలంగాణ సామాజిక సంక్షేమ సమర సమ్మేళనం’ పేరిట సభను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దీనిని పార్టీ కార్యక్రమంగా కాకుండా, రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా నిర్వహిస్తామన్నారు. సామాజిక, ప్రజా సంఘాలు, సంస్థలు, మేధావులు, అభ్యుదయ, ప్రజాతంత్ర వాదులంతా భాగస్వాములు కావాలని కోరారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభలో వామపక్ష పార్టీల నేతలు, సామాజిక తరగతులకు చెందిన నాయకులు, మేధావులు, తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. జేఏసీ చైర్మన్ కోదండరాంకు, వివిధ సంఘాలకు, పార్టీల నేతలకు ఆహ్వానాలు అందజేస్తామన్నారు. -
కోదండరాంను పరామర్శించిన వీహెచ్
మన రాష్ట్రంలోనే ఉన్నామా: విమలక్క సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క పరామర్శించారు. కోదండరాం నివాసానికి గురువారం వచ్చిన వీహెచ్, విమలక్క ర్యాలీ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. విరిగిన తలుపులు, పోలీసులు చేసిన హడావుడి పరిశీలించారు. నిరుద్యోగ సమస్యపై, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం పోరాడాలని కోదండరాంకు సూచించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడంలేదని అడగడమే నేరమా అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు అడిగేవారు ఉగ్రవాదులా, నక్సలైట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్బంధం, పోలీసుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రంలోనే ఉన్నారా అని అనిపిస్తున్నదని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) నేత విమలక్క అన్నారు. ఎవరైనా దోపిడీ చేస్తే పోలీసులకు చెప్పుకుంటామని, అదే పోలీసులు దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఉద్యమశక్తుల అణచివేతకే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ఇదేనా ప్రజలు కోరుకున్న తెలంగాణ అని విమలక్క ప్రశ్నించారు. -
ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు: హోం మంత్రి
తెలంగాణ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతా ఆయన చెప్పినట్లే జరగాలా అని ప్రశ్నించారు. హైకోర్టు చెప్పినట్లుగా ఆయన ఎందుకు నడుచుకోలేదని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని.. కోదండరామ్ పార్టీ పెట్టినా కూడా తమకు నష్టం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్లే వ్యతిరేకంగా ఉంటే ఎలాగని నాయిని నరసింహారెడ్డి అన్నారు. -
కోదండరామ్ విడుదల, ఇంటికి తరలింపు
-
కోదండరామ్ విడుదల, ఇంటికి తరలింపు
నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు విడుదల చేశారు. కామాటిపురా పోలీసు స్టేషన్లో ఉన్న ఆయనను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి, తార్నాక ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందుకు నోటిఫికేషన్లను విడుదల చేయాలన్న డిమాండుతో నిరుద్యోగుల నిరసన ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలని కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే నగరంలో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. కోర్టు సైతం నాగోల్ ప్రాంతంలోని మెట్రో గ్రౌండులో నిర్వహించుకోవాలని తెలిపింది. అయితే.. అక్కడ ఏర్పాట్లు కష్టమని, తాము ఎలాగోలా ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామునే 3 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి, కామాటిపుర పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయం దాటిన తర్వాత ఆయనను విడుదల చేసి, అక్కడి నుంచి ఇంటికి తరలించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే అవకాశం తమకు ఇవ్వలేదని ఈ సందర్భంగా కోదండరామ్ అన్నారు. నిరుద్యోగుల ర్యాలీ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన ఇంటి మీద పడి పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారిన మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పరిష్యారం కోసం తమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి(గురువారం) విద్యా సంస్థల బంద్‌కు తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో టీజేఏసీ భేటీ ఉంటుందని, అనంతరం భవిష్యాత్ కార్యాచరణ పై చర్చిస్తామని అన్నారు. -
ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు గోదావరిఖని: ఓపెన్‌కాస్ట్‌లతో ప్రజలు ఉన్న ఊరును, వ్యవసాయ భూములను వదిలిపెట్టి పట్టణాలకు వలసవెళ్లి నిరుద్యోగులుగా బతకా ల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ గని కార్మిక మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జా తీయ గని కార్మికుల 2వ మహాసభ రెండోరోజు శుక్రవారం ఎన్టీపీసీలో ప్రతినిధుల సభ జరగ్గా కోదండరాం ప్రసంగించారు. సింగరేణిలో పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఓపెన్‌కాస్ట్‌ల తవ్వకం ఎక్కువగా జరుగుతోందని, ఇందుకు మందమర్రిలోని ఎర్రగుంటపల్లివాసులు ఏడా దిన్నరగా ఆందోళన చేస్తుండడం నిదర్శనమన్నారు. అందుకే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, కార్మికు ల భద్రతకు అనుకూలంగా మైనింగ్ పాలసీని అమలుచేయాలని కోరారు. ఓపెన్‌కాస్టుల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, దీంతో పర్మినెంట్ కార్మికుల ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభు త్వాలు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడుతున్నాయన్నారు. తక్కువ డబ్బులిచ్చి కాంట్రాక్ట్ కార్మికులతో ఎక్కువ పనులు చేయించుకుంటున్నారన్నారు. సింగరేణిలో ఏడాదిలోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులకు, వీఆర్ఎస్ డిపెండెంట్లకు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకం ద్వారా పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ కో–ఆర్డినేషన్ గ్రూప్ (ఐసీజీ) నేతృత్వంలో జాతీయ సన్నాహక కమిటీ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సమన్వయకర్త ఆండ్రియాస్ (జర్మనీ), సమన్వయకర్త బి.ప్రదీప్, చైర్మన్ పీకే మూర్తి, వివిధ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషలిజమే శరణ్యం: సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ దేశ ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో సోషలిజ మే శరణ్యమని, ఈ క్రమంలో సమాజ నిర్మాణ బాధ్యతలను భారత కార్మికవర్గం చేపట్టాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ కోరారు. గోదావరిఖనిలో మహాసభల రెండో రోజు కార్యక్రమానికి వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వాలు, ఆయా సంస్థల యాజమాన్యాలు విశాల దృక్పథంతో ఆలోచించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన కార్మికోద్యమాలు, పోరాటాలు అవసరమని, ఇందుకోసం కార్మిక సంఘాలన్నీ ముందుకు సాగాలని సూచించారు. -
హక్కులడిగితే దొంగలుగా ముద్ర వేస్తారా!
• రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం • సర్పంచుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా • ఆందోళనకు మద్దతు ప్రకటించిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన నిధులు, విధులు, అధికారాలను తక్షణం బదలాయిం చాలని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పంచాయితీ పెట్టుకోవడం తమ అభిమతం కాదని, ప్రజలకు సమస్యలు ఎదురైనప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటను తాము అనుసరిస్తున్నామని చెప్పారు. తమ హక్కుల సాధన కోసం సర్పంచులు ఐక్యవేదికగా ఏర్పడి మంగళవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులను నమ్మినట్లే సర్పంచులను కూడా నమ్మి ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ప్రభుత్వంలో ఉన్నవాళ్లు దొంగలుగా చిత్రీకరించడమేమిటని ప్రశ్నిం చారు. సర్పంచులకు గతంలో ఎంతో గౌరవం ఉండేదని, వారికి ఉండాల్సిన నిధులు, విధులు, అధికారాలను ప్రభుత్వం కల్పించకపోవడంతో పరిస్థితి హీనంగా మారిందన్నారు. కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు అంద కుండా చేయడం సరికాదన్నారు. కాగి తాలపై ఇచ్చినట్లు చూపి, నీటి సరఫరా, విద్యుత్ బిల్లుల పేరిట ప్రభుత్వమే నిధులను వెనక్కి లాక్కుంటోందన్నారు. ఆందోళనకు దిగిన సర్పంచులను ప్రభుత్వం పిలిచి మాట్లాడితే బాగుండేదని, లేకుంటే ప్రభుత్వ ప్రతిష్టే దిగజారుతుందని అన్నారు. సర్పంచులకు ప్రభుత్వమిచ్చే రూ.5 వేల గౌరవ వేతనం నెలనెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఈ నెల 29న రాజకీయ జేఏసీ తలపెట్టిన మహాధర్నాను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. గతంలో కన్నా ఎక్కువ ధర్నాలు... తాము అధికారంలోకి వచ్చాక «ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదని సీఎం కేసీఆర్ అన్నారని, అయితే గత ప్రభుత్వాల హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువగా ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. అధికారాలను సర్పంచులకు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ చేతుల్లోకి తీసుకుంటే గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గద్దె నెక్కిన ప్రభుత్వం ప్రజలను మర్చిపోయిం దని, ఫలితంగా ప్రజల మధ్య ఉండాల్సిన సర్పంచులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. గ్రామజ్యోతి పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అభూతకల్పనను సృష్టించారని, గ్రామా నికి రూ.10 కోట్ల చొప్పున ఇస్తానని నేటికీ నయాపైసా ఇవ్వలేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను, ప్రజాప్రతినిధులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమంటే ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమేన న్నారు. సర్పంచుల ఐక్యవేదిక ఆందోళ నకు తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం మద్ధతు ఇస్తోందని గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగా రెడ్డి ప్రకటించారు. గ్రామానికి రూ.యాభై లక్షలా.. ఎక్కడ ఈటల సారూ.. రాష్ట్రంలో గ్రామానికి రూ.50 లక్షల చొప్పున నిధులను అందించామని ఆర్థిక మంత్రి ప్రకటించి అసెంబ్లీని సైతం తప్పు దోవ పట్టించారు. ఈ విషయమై విపక్షా లకు ఈటల విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తాం. మంత్రి నియోజకవర్గంలో నైనా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఏ గ్రామ పంచాయతీౖకైనా ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు కాదు కదా.. రూ.200 వచ్చాయోమో నిరూపిస్తారా. – ఆందోల్ క్రిష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు -
అవసరమైతే ఉద్యమానికి సిద్ధం: కోదండరాం
-
అవసరమైతే ఉద్యమానికి సిద్ధం: కోదండరాం
ప్రజా సమస్యలపై ఇక అవసరమైతే ఉద్యమం చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై తాము సీరిస్‌గా చర్చించినట్లు తెలిపారు. భూసేకరణ 2013 చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని, దీనికి నిరసనగా ఈనెల 29న హైదరాబాద్‌లో ధర్నా చేస్తామన్నారు. విద్యాసంస్థల పరిరక్షణ, ఉపాధి, ఉద్యోగాలపై ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నా, అధ్యయన యాత్ర ఉంటాయని తెలిపారు. అలాగే మార్చి నెలలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన ఉంటుందన్నారు. ఏప్రిల్ నెలలో కుల వృత్తులు, సూక్ష్మ పరిశ్రమలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల పీఆర్సీ బకాయిలు విడుదల చెయ్యాలని, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చెయ్యాలని, వ్యవసాయ విధానం ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే.. ఆదివాసుల భూములు లాక్కోవద్దని, రాజకీయాల్లో విలువలు పాటించాలని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, స్పీకర్ తన హోదాను కాపాడుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో సిటిజన్ చార్టర్‌ను పాటించాలని కోరారు. రాజకీయ నాయకులను లోకాయుక్త పరిధిలోకి తేవాలని చెబుతూ... జోనల్ వ్యవస్థ రద్దు మంచిది కాదని, దీనిపై నిపుణుల కమిటీ వెయ్యాలని సూచించారు. ప్రజలకు జేఏసీపై విశ్వాసం ఉందని, ఇది రాజకీయ వేదిక కాదని తెలిపారు. ఇప్పుడు జేఏసీలో ఉన్నవారిలో ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా ఆ తర్వాత సైతం జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. పాలకుల ఇష్టాన్ని బట్టి కాకుండా, ప్రజల అవసరాలను బట్టి పాలన సాగాలని తెలిపారు. ఒక డాక్టర్‌తో పని కాకుంటే ఇంకో డాక్టర్ దగ్గరకు ఎలా వెళ్తామో రాజకీయాలు కూడా అంతేనని చెప్పారు. -
తెలంగాణ అభివృద్ధికి పునరంకితమవుతాం
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. జేఏసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేఏసీ కార్యాలయం వద్ద శనివారం ఆయన జెండాను ఎగురవేశారు. జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ఇటిక్యాల పురుషోత్తం, ప్రహ్లాద్, భైరి రమేశ్ తదితరులతో కలసి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం ముందుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నూతన రాష్ట్రంలో కొత్త అభివృద్ధి పంథాను అవలంబించాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని శక్తులను ఏకోన్ముఖంగా పనిచేసేలా జేఏసీ కృషి చేసిందన్నారు. భవిష్యత్ కార్యాచరణను ఆదివారం జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. -
భూసేకరణ బిల్లుపై అప్రమత్తత అవసరం
అఖిలపక్ష సమాలోచనలో కోదండరాం హైదరాబాద్: తెలంగాణలో బలవంతంగా భూ సేకరణ చేపడుతున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు, చేర్పులతో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు అన్యా యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఇక్కడ టీజేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమాలోచన నిర్వహిం చారు. టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ సహా పలు ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలం గాణ ప్రైవేటు విశ్వ విద్యా లయాల బిల్లును తీసుకురావడానికి ప్రయ త్నాలు జరుగు తున్నాయని, ఈ బిల్లు వస్తే అందరికీ విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, సిబ్బంది లేక ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ప్రైవేటు వర్సిటీలు వస్తే వీటి పరిస్థితి మరింత దారుణంగా దిగజా రుతుం దని అన్నారు. ఉన్నత విద్యను ప్రైవేటీక రించడానికి ప్రైవేటు వర్సిటీల బిల్లును తీసుకురాబోతోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగే ఏ బిల్లును కూడా తాము రానివ్వబోమని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాల లపై చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వర్సిటీల బిల్లు వస్తే హౌస్ కమిటీ వేయాలని కోరుతామని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ భూసేకరణ విషయంలో జేఏసీ ఆదేశా లను అనుసరిస్తామని చెప్పారు. కోదండరాం రూపొందించే కార్యాచరణ ప్రణాళికకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
సర్పంచులకు అన్ని అధికారాలు ఇవ్వాలి
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: కింది స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామ వ్యవస్థే ఎంతో కీలకమని దానికి నిధులు, విధులు, అధికారం ఇవ్వకపోవడం సబబు కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గ్రామ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ముందుగా సర్పంచ్‌నే ప్రశ్నిస్తారని, వారికి విధులు కల్పించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గడమే కాకుండా పనులు కూడా సక్రమంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘సర్పంచుల మహా ధర్నా’ పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్, పురుషోత్తంలతో కలసి కోదండరాం ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ నిధులు, విధులు కల్పించాలని రాజ్యాంగం చెప్పినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు ఆందోళ్ కృష్ణ, శాంతి నాయక్ పాల్గొన్నారు. -
అందరికీ ఉచిత విద్య అందాలి
నల్లగొండ టూటౌన్ : సమాజంలో ఉన్న అందరికీ నాణ్యమైన, ఉచితమైన, సమానత్వమైన విద్య అందాలని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో 2వ రోజు ఆదివారం నిర్వహించిన డీటీఎఫ్ 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య తెలంగాణలో వేల్లూనుకుపోరుుందని ఈ విధానం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం పడి మోయలేని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్కూళ్ల ఫీజుల భారం తగ్గాలని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ర్యాంకులు రాలేదనే వేధింపుల కారణంగా ఇటీవల కాలంలో అనేక మంది చనిపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కలిచివేస్తున్నాయన్నారు. విభజించి చదువులు చెబుతున్నారని, ఇది మంచి సంస్కృతి కాదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో రోజుకో కండీషన్, సర్క్యూలర్ల విధానంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలపై కచ్చితంగా మాట్లాడాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విజయగాథలు, ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధన గురించి మాగ్జిన్ల ద్వారా వెలుగులోకి తేవాలన్నారు. వీటి ఆధారంగానే ఉపాధ్యాయుల పోస్టులు, ఇతర సౌకర్యాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల గురించి లోతైన చర్చ జరగాలని, తక్షణమే ఇవాళ కామన్ స్కూల్ విధానం వస్తుందని నేను అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు విధి విధానం జరగాలని, జేఏసీ తరపు నుంచి యూనివర్సిటీలు, కాలేజీ విద్య గురించి ప్రత్యేకంగా రెండు రోజులు చర్చించినట్లు పేర్కొన్నారు. అందరికీ విద్యా, ఉపాధి, వైద్యం ఉచితంగా అందించినప్పుడే మెరుగైన సమాజం వస్తుందన్నారు. కామన్ విద్యా విధానానికి అందరం ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ విద్య లేనిదే ఆడపిల్లలు, కింది కులాల వారికి విద్య అందదన్నారు. రాష్ట్రంలో గుట్టలు, వన సంపద కరిగిపోతున్నాయన్నారు. ఈ కార్పొరేట్ సంస్థల వల్ల మన బిడ్డలకు ఒక్క ఉద్యోగం కూడా రాదన్నారు. నల్లగొండ నుంచే ప్రభుత్వం విధానంపై మలిదశ పోరాటం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా అనేది అందరికీ సమానంగా నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. సమాజంలో వ్యాపారీకరణ, కాషారుుకరణను రూపుమాపాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసి మాతృభాషలోనే విద్యనందించాలన్నారు. అదే విధంగా డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, జ్వాల సంపాదకుడు గంగాధర్ కామన్ స్కూల్ విధానం, నాణ్యమైన విద్య, సమానత్వపు విద్య, కేసీ టూ పీజీ విద్య తదితర వాటిపై ప్రసంగించారు. అంతకుముందు డీవీకే రోడ్డు నుంచి డీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం బజార్, బస్టాండ్, రామగిరి మీదుగా క్లాక్‌టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సభలో కళాకారుల పాటలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నారుు. ఆర్థిక అవాంతరాలు పోతేనే సమానవిద్య సమాజంలో ఆర్థిక అవాంతరాలు తొలగిపోతేనే కామన్ స్కూల్ విద్యా విధానం సాధ్యమని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీవీకే రోడ్డులో గల శివాంజనేయ ఫంక్షన్‌హాల్ శేషు ప్రాంగణంలో నిర్వహించిన రెండో రోజు డీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు. కామన్ స్కూల్ విద్యా విధానం రావాలంటే ప్రజల్లో బలమైన ఆకాంక్షను రగిలించాల్సిన అవసరముందన్నారు. ప్రజలు ప్రైవేటీకరణ విధానం వద్దని, అందరికీ సమాన విద్య, సమాన అవకాశాలు రావాలని కోరుకున్నప్పుడు ఆ దిశలో ఉద్యమాలు రావాలన్నారు. విద్యను అమ్మడం అప్రజాస్వామికమని విమర్శించారు. విరసం కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ సమాన హక్కుల కోసం పోరాడాల్సిందేనన్నారు. అధ్యాపక జ్వాల సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ కామన్ స్కూల్ విద్యా విధానం అమలు చేసి సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, డీఈఓ చంద్రమోహన్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం.సోమయ్య, ఎం.వెంకటరాములు, పి.శాంతన్, పద్మలత, ఎం.శ్యామ్యూల్, వి.రాజిరెడ్డి, లింగారెడ్డి, ఎస్.భాస్కర్, విద్యాసాగర్‌రెడ్డి, వెంకులు, సత్తయ్య, భాస్కర్, దశరథరామారావు, లింగయ్య, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
జేఏసీని ముక్కలు చేసింది కోదండరామే
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ప్రొఫెసర్ కోదండరాం చేసిందేమీ లేదని, జేఏసీని ముక్కలు చేసి 99 జేఏసీలు చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. విద్యార్థుల వల్లే తెలం గాణ రాష్ట్రం సిద్ధించిందని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తన పక్కన ఉన్నవారికి, అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న కోదండరాం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్లు ఇప్పిస్తానని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాంతో ఉన్న వాళ్లంతా టీడీపీ, బీజేపీకి చెందిన విద్యార్థులేనన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి కూడా ఆంధ్రా నేతల పక్షాన చేరలేదా అని రవి ప్రశ్నించారు. ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగి కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారన్నారు. -
ఒక బంగళా ఉంటే మరొకటి ఎందుకు?
హైదరాబాద్: ఒక బంగ్లా ఉన్నపుడు మరొకటి అవసరం లేదనేది తమ అభిప్రాయమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉన్న బంగళా సరిపోక పోతే మరో బ్లాక్ నిర్మించుకుంటే సరిపోయేదన్నారు. ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద బంగళా కట్టిన సీఎం కేసీఆర్‌కు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడం ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఈ నెల 30న భూనిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతుందని తెలిపారు. సదస్సుకు కాళేశ్వరం, ఓపెన్‌కాస్ట్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్వాసితులందరినీ పిలుస్తున్నామన్నారు. నిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు అనే భావనను ప్రభుత్వం విడనాడాలన్నారు. వారి సమస్యలు వినకుండా దబాయింపుతో భూములు లాక్కోవడం సరికాదన్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన కోదండరాం
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు విషజ్వరాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో విష జ్వరాల బారిన పడి కొందరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుంటుంబాలను ఆదుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. విషజ్వరాల బారినపడి మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని తక్షణమే అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. -
విద్య, వైద్యరంగాలపై పోరుబాట
టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రైతుదీక్ష విజయవంతమైన స్ఫూర్తితో విద్య, వైద్యం, యువతకు ఉపాధికల్పన అంశాలపై పోరాడాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్యరంగంపై నవంబర్ 13న సదస్సును నిర్వహించాలని, నవంబర్ చివరివారంలోనే విద్యా పరిరక్షణ యాత్రను నిర్వహించాలని, దీనిద్వారా విద్యారంగ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రైతుదీక్షపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ, జేఏసీ నిర్మాణం, వివిధ రంగాల్లో పరిస్థితులపై అధ్యయనం వంటి అంశాలపై కీలక నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో జేఏసీ కమిటీని పునర్వ్యవస్థీకరించడంతో పాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిదాకా నిర్మాణాన్ని నవంబర్‌లోగానే పూర్తిచేసుకోవాలని తీర్మానించారు. ప్రైవేటు పరిశ్రమల్లోనూ 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కోరుతూ డిసెంబర్లో పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. -
ప్రొఫెసర్ కోదండరామ్‌తో మనసులో మాట
-
అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్
తెలంగాణ ప్రజలు ఆశించినంత అభివృద్ధి రాష్ట్రంలో జరగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. తాను ఈనెల 23వ తేదీన రైతుదీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో పలువురు జేఏసీ నేతలు, రైతు సంఘాల నేతలు కూడా పాల్గొంటారన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కోదండరామ్ కలిశారు. కొత్త జిల్లాలు, మండలాల్లో ప్రజల డిమాండ్లపై ఆయనతో చర్చించారు. గట్టుప్పల్, నాగిరెడ్డిపేట మండలాల సమస్యను పరిష్కరించాలని రాజీవ్ శర్మను కోదండరామ్ కోరారు. -
బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
అంగీకారం లేకుండా ప్రాజెక్టులను నిర్మించడం దుర్మార్గం డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తారా? ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా? 2013 చట్టం ద్వారానే భూసేకరణ జరపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుల దీక్షలకు సంఘీభావం తొగుట: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపువాసులు చేపడుతున్న రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. గ్రామాల మధ్య 50 టీఎంసీల రిజర్వాయర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముం దుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల అం గీకారం లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం దుర్మార్గమని మండిపడ్డారు. 123 జీఓతో భూసేకరణ చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రజలు కోరినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంతో ప్రజలకు ఏ విధంగా నష్టమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం మాట వినని ప్రజలపై 144 సెక్షన్ విధించి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో బెదిరింపులకు గురి చేసి భూములు లక్కోవడం దుర్మార్గమన్నారు. భూములన్నీ గుంజుకుని బహుళజాతి సంస్థలకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టంలో నిరుపేదలకు అన్ని విధాలా హక్కులున్నాయని చెప్పారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రా జెక్టులు, పరిశ్రమల పేరిట భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీ జేఏసీ కోకన్వీనర్ పిట్టల రవీందర్, నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రమేశ్, విద్యా సంస్థల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చేర్యాల బంద్ సంపూర్ణం
చేర్యాల : జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జనగామ జిల్లా సాధన కోసం చేర్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు ఆహ్వానించిన నేపథ్యంలో చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చేర్యాల పరిరక్షణ సమితి కన్వీనర్ పందిళ్ల నర్సయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అ««దl్యక్షుడు ఉడుముల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుర్మ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని దుకాణాలు, పాఠశాలు, కళాశాలలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి సినిమా టాకీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కోదండరాంను చేర్యాలకు ఆహ్వానించి, సభ నిర్వహించాలనే ఆలోచనే సరికాదన్నారు. స్థానికుల మనోభావాలను అన్ని పార్టీలు గౌరవించాలన్నారు. చేర్యాలను సిద్ధిపేట జిల్లాలో కొనసాగించి, అక్కడి రెవెన్యూ డివిజన్‌లోనే కలపాలన్నారు. సర్పంచులు పెడతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము రవి, బొమ్మగోని రవిచందర్, ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, నాయకులు కందుకూరి సిద్దిలింగం, ఎండీ.మోయిన్, ఉప్పల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభీష్టం మేరకే విభజించాలి
నేటి జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వరంగల్ : రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రజాభీ ష్టం మేరకే జరగాలని, అసలు ఏ ప్రాతిపదకన జిల్లాల విభజన చేపట్టారో అర్థం కావడం లేదని తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హరిత కాకతీయ హోటల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. అస్థిత్వం కోల్పొయేలా జిల్లాల విభజ న జరిగితే చరిత్రకు అర్థం ఉండదన్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలకు ఎంతో విశిష్టత ఉందని, వాటిని వీడిదీయాలనుకోవ డం చారిత్రక తప్పిదమేనని అన్నారు. ప్రజ లు తమ ఫిర్యాదులు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబ ర్తో ఫోన్ సౌకర్యం కల్పించాలని సూచిం చా రు. మంగళవారం జేఏసీ చేపట్టిన జిల్లా బం ద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపా రు. బీజేపీ రాష్ట్ర ఉపా««దl్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా తుగ్లక్ పా లన అనుభవించామని అన్నారు. హైదరాబాద్ కు 400 ఏళ్ల చరిత్ర ఉంటే వరంగల్‌కు 1000 ఏళ్ల చరిత్ర ఉందని, వరంగల్–హన్మకొండను విభజించవద్దని అన్ని పార్టీలు కలసి కలెక్టర్‌కు లేఖ ఇస్తామని చెప్పారు. బంద్‌లో పాల్గొనవద్దని టీఆర్ఎస్ నేతలు విద్యా, వాణిజ్య సంస్థలకు ఫో న్లు చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నార ని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎవరికీ భయపడకుండా బంద్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల విభజన చేపట్టారని అన్నారు. తెలంగా ణ రాష్ట్రం వస్తే బంద్‌లు ఉండవన్న పెద్ద మనిషి వల్లే నేడు మళ్లీ బంద్‌లు చేసే దుస్థితి నెలకొందన్నారు. బంద్ విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీఆర్ఎస్లో వర్గాలుగా ఏర్పడి హన్మకొండ వద్దని కొందరు, కావాలని కొందరు అనడం వల్లే గందరగోళంగా మారిందన్నారు. ప్రజలు కోరిన జనగామ జిల్లాను ఏర్పాటు చేసి, వద్దంటున్న హన్మకొండ జిల్లా ఏర్పాటును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బైరపాక జయకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనగామ జిల్లా సాధన క మిటీ కన్వీనర్ ఆరుట్ల దశమంతరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అప్పం కిషన్, అమరేందర్‌రెడ్డి, పలు సంఘాల నాయకులు సహోదర్‌రెడ్డి, ఈసంపెల్లి వేణు, గంధం శివ, వేణుగోపాల్‌గౌడ్, తిరునహరి శేషు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, డా.విజయలక్ష్మి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత వెంకన్న, చంద్రమౌళి పాల్గొన్నారు. జనగామ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది : కోదండరాం జనగామ : రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాభీష్టం మేరకే తుది నిర్ణ యం తీసుకోవాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జనగామ జిల్లా రిలే దీక్షలను సోమవారం ఆయన సందర్శించి, మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో పరిపాలన అందించేందుకు 1984లోనే చిన్న జిల్లాల ఏర్పాటుకు నియమావళి రూపొందించారన్నారు. ఆ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న జనగామ, ఆ త ర్వాత వరంగల్‌లో కలిసిందని, ఆర్థిక, రాజకీ య, సాంస్కృతిక రంగాల్లో నిజాం కాలం నుం చి 60 గ్రామాలకు కేంద్ర బిందువుగా నిలిచిందని వివరించారు. జనగామ జిల్లా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాలను ఒకే జిల్లాలో ఉంచే లా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ఉద్యమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయన వెంట జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు కన్నా పర్శరాములు, పి.లింగయ్య, వేణుగోపాల్‌రావు, రాజు, సురేష్, మాజీద్ ఉన్నారు. -
‘జోనల్’ గందరగోళం తొలగించాలి
- జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్లపై చర్చ అవసరం - ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్ల మార్పు అంశాలపై లోతైన చర్చ, అధ్యయనం అవసరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా పని మేం చేస్తాం అంటే కుదరదని, ఇది ప్రజాస్వామ్య దేశమని.. ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జోనల్ వ్యవస్థతో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని, దీనిపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చి గందరగోళాన్ని పోగొట్టాలన్నారు.ఇందుకు కేబినెట్ కమిటీ, అధికారుల కమిటీలు వం టివి వేసి సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని సీఎం కేసీఆర్‌కు సూచిం చారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ విద్యా వంతుల వేదిక’ రూపొందించిన ‘మరో ఉదయం’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలసి కోదండరాం ఆవిష్కరించారు. పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని, ఆ పాలన పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. స్థానిక రిజర్వేషన్లపై 1970లో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయని, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ దీనిపై నివేదికను ఇచ్చిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆలోచనా, ప్రజాభిప్రాయ సేకరణ చాలా అవసరమని, దుబారాగా నిధులు ఖర్చు చేస్తే అది రాజ్యాంగ స్ఫూర్తి కాదన్నారు. ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు పరిశీలించాలన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ ప్రజలు పోరాటంలో ముందుంటున్నారన్నారు. ఏపీలో రాజధాని పేరిట 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎలా ఉద్యమించాలనే విషయం వారికి అంతుపట్టట్లేదని, కానీ మల్లన్నసాగర్ విషయంలో ఇక్కడ ప్రజలంతా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉంటే నయీమ్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడని, అతడిని పెంచి పోషించింది గత పాలకులేనని ఆరోపించారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధా న కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, అడ్వొకేట్ జేఏసీ నాయకుడు ప్రహ్లాద, మహిళా విభాగం కన్వీనర్ రమాదేవి ప్రసంగించారు. -
'కోదండరామ్ ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఫోన్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. చివరకు తెలంగాణ ఉద్యమ కారులపై కూడా నిఘా పెట్టడడంతో ప్రభుత్వ నిజరూపం బట్టబయలైందన్నారు. ఆయన మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారం ప్రభుత్వ దిగజారుడు తనాన్ని రుజువు చేస్తోందని వ్యాఖ్యానించారు. తమకు నచ్చని వ్యక్తులపై నిఘా పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించారు. వ్యక్తి స్వేచ్చను హరించే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పోషించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలుసనీ, అప్పటి కంటే ఇప్పుడే జేఏసీ అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం జేఏసీ పనిచేయాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి ఏమైందో అంతుబట్టడం లేదని రావల వ్యాఖ్యానించారు. -
చేనేత పరిశ్రమను ఆదుకోవాలి
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత స్వరాజ్య వేదిక, తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో వీవర్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... ‘చేనేత వస్త్రాలు, ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించేలా అంతా కృషి చేయాలి. మన సంస్కృతి, జాతి, వారసత్వ సంపదైన ఈ రంగాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి... జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలి’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమల కోసం పాలసీని ప్రకటించి, ముడిసరుకులు సబ్సిడీ ధరల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలన్నారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోషిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ, హ్యాండ్లూమ్ డే రూపకర్త ఎ.వెంకన్న తదితరులు వాక్‌లో పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీక‘రణం’
నిర్వాహకులు, మాల జేఏసీ నాయకుల బాహాబాహీ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా హైదరాబాద్‌లోని నిజాం పీజీ న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. భేటీ నిర్వాహకులకు, మాల జేఏసీ, మాల సంక్షేమ సంఘం నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలు, తోపులాటలు, పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కొదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడుల్లో నిజాం లా కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు నిర్వాహకుడు గాలి వినోద్‌కుమార్, మాలల జేఏసీ నాయకుడు ఆగమయ్యకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కొందరు మాల నాయకులు కోదండరాం నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది క్రమంగా ఇరు వర్గాల బాహాబాహీకి దారితీసింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఘర్షణ మొదలైందిలా..: నిజాం లా కాలేజీలోని అంబేడ్కర్ సెమినార్ హాల్లో శుక్రవారం ‘ఎస్సీ వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్, నిజాం లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైనట్లు తెలుసుకున్న మాలల జేఏసీ చైర్మన్ దీపక్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు బత్తుల రాంప్రసాద్, జంగం శ్రీనివాస్, ఆగమయ్యలతోపాటు పలువురు అక్కడికి చేరుకున్నారు. తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. చాలాసేపటి వరకు అవకాశం రాకపోవడంతో తమనెందుకు మాట్లాడనివ్వరంటూ మాలల ప్రతినిధులు నిర్వాహకులను ప్రశ్నిం చారు.అప్పటికే ప్రొఫెసర్ కోదండరాం తన ప్రసంగం ముగించి వెళ్తుండగా మాలల జేఏసీ నాయకులు ఆయన్ను నిలదీశారు. దళిత సీఎం హామీపై మాట తప్పిన కేసీఆర్ దళితులకు ఎంతో అన్యాయం చేశాడని, ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. టీజేఏసీ చైర్మన్‌గా అన్ని వర్గాలకు అండగా ఉండాలన్నారు. గద్దర్ ప్రసంగాన్ని సైతం అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో కొందరు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దాడుల్లో గాలి వినోద్‌కుమార్ తలకు గాయాలయ్యాయి. ఆయన తలకు నాలుగు కుట్లు వేశారు. ఆగమయ్యకు కూడా గాయపడడంతో ఇరువురినీ ఆస్పత్రికి తరలించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో గాలి వినోద్‌కుమార్, ఆగమయ్యతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలి కోదండరాం, గద్దర్ వర్గీకరణ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ సూచించారు. సభలో ఘర్షణ వాతావారణానికి ముందు వారు మాట్లాడారు. పాలకుల తీరు వల్లే ఎస్సీల మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరి ఏపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఎందుకు ఎందుకు తీర్మానం చేయడంలేదన్నారు. త్వరలో వెయ్యి డప్పులు లక్ష గొంతులతో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వర్గీకరణ సంఘీభావ కమిటీ కన్వీనర్‌గా గద్దర్‌ను ఎన్నుకున్నారు. ఈ నెల 7న ప్రధానిని కలిసి పార్లమెంట్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు తీర్మానించారు. సమావేశం అప్రజాస్వామికం వర్గీకరణ ప్రజాస్వామిక డిమాండ్ అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు కూడా అవకాశం ఇవ్వాల్సింది. సమావేశ మందిరంలోకి వెళ్లగానే గాలి వినోద్ అనుచరులు మాపై దాడులకు పాల్పడ్డారు. నిజాం లా కాలేజీలో ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేసిన గాలి వినోద్‌ను సీఎం సస్పెండ్ చేయాలి. కుటుంబంలోని సమస్య అన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని చర్చించుకోవాలి కానీ మేధావుల పేరుతో అగ్రకులాల వారిని పిలిచి ఎలా చర్చిస్తారు? - బత్తుల రాంప్రసాద్, రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాడి అప్రజాస్వామికం ఇది యావత్ ప్రజాస్వామికవాదులపై జరిగిన దాడిగా గుర్తించాలి. దాడికి పాల్పడిన వ్యక్తులు తమ తప్పును తెలుసుకోవాలని కోరుతున్నాను. జనాభా దామాషా ప్రకారం అందరికీ సమన్యాయం జరిగేలా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారనే విషయాన్ని మరవద్దు. నిజమైన అంబే డ్కర్వాదులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు రావాలి. - ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ వర్గీకరణ వద్దు.. ఐక్యంగా ఉందాం బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం వైపు నడిపించాలి కానీ దళితుల మధ్య చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం? వర్గీకరణ అంశంపై ఇరువర్గాల ప్రతినిధులతో బహిరంగ చర్చపెడితే బాగుండేది. కానీ కొంతమంది వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాలలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం సరికాదు. - మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్ కుమార్ -
ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరిస్తే..
పంజగుట్ట (హైదరాబాద్) : ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' రోజున అందరూ చేనేత దుస్తుల్ని ధరిస్తే లక్షమంది నేతన్నలకు బతుకుదెరువు ఇచ్చిన వారమవుతామని, మరో లక్ష మందికి ఉపాధి చూపినట్లవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం కూడా పూనుకుని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఇంకా ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చేనేత స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మస సంస్కృతిని గుర్తుంచుకుని గౌరవించుకోవాలంటే చేనేత దినోత్సవాన్ని గొప్పగా నిర్వహించుకోవాలని, కనీసం ఆ రోజైనా ప్రతివారూ చేనేత వస్త్రాల్ని ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడ్క కల్పన కుమారి మాట్లాడుతూ .. ఆగస్టు 7వ తేదీన నెక్లెస్ రోడ్లో చేపట్టే వాక్‌లో అందరూ చేనేత వస్త్రాలు ధరించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, పద్మశాలి పొలిటికల్ ఫోరం ప్రతినిధి చిక్క చందు, ఆలిండియా హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యుడు తడ్క యాదగిరి, చేనేత వర్గాల చైతన్య వేదిక ప్రతినిధి చిక్కా దేవదాసు, గోళ్ళ నరేందర్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత నేత కార్మికులకు అండగా ఉంటాం...
భూదాన్‌పోచంపల్లి : చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటానికి అండగా ఉంటామని తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం నిర్వహించిన చేనేత శంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదు జిల్లాల్లో చేపట్టిన చేనేత చైతన్య బస్సుయాత్ర ద్వారా లక్ష మగ్గాలు, రెండు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు సైతం చేతి వృత్తులను కాపాడుకుంటున్నాయన్నారు. చేనేత రంగానికి బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీపై ముడిసరుకులు, మగ్గాలు ఇవ్వాలని.. నేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వ్యవసాయం, కులవృత్తులు బతికితేనే తెలంగాణ బతుకతదనిది పేర్కొన్నారు. ఉన్నచోట బతుకుదెరువు దొరకాలని, అది కూడా ఇజ్జత్‌గా బతుకాలన్నారు. చేనేత దినోత్సవం రోజున అధికారులు, టీవీ యాంకర్లు, ప్రజాప్రతినిధులందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేసి.. చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు జేఏసీ తరఫున కృషి చేస్తామన్నారు. ఏ ఒక్క చేనేత కార్మికుడు నిరాశ చెందొద్దని.. వారికి జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హామీలను పట్టించుకోని ప్రభుత్వం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని భావించినా.. అది జరగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2016-17బడ్జెట్లో చేనేతకు ఒక్క రూపాయి కూడ కేటాయించకపోవడం దారుణమన్నారు. చేనేత, జౌళిశాఖను వేరు చేసి.. వేర్వేరుగా కేటాయింపులు చేస్తామని, చేనేత పాలసీని ప్రకటిస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు నిధులు, హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని బీజెపీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అవసరమైతే కేంద్రమంత్రి సంతోష్‌గంగ్వార్ కలిసి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మానవాళితోనే చేనేత పుట్టిందని, పాలకులు ఎందరూ మారిన, చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జోలపట్టయినా సరే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్‌కు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల గోస కన్పిస్తలేదని విమర్శించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలుగా ప్రజాసమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుదామంటే అపాయింట్మెంట్ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు గానీ.. చేనేత కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అనిల్‌కుమార్, తెలంగాణ చేనేతల అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ కూరపాటి రమేశ్, గర్ధాస్ బాలయ్య మాట్లాడారు. కార్యక్రమానికి ముందుగా ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలిండియా హ్యాండ్లూమ్‌బోర్డు సభ్యుడు కర్నాటి ధనుంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు గూడురు నారాయణరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కొంగరి భాస్కర్, తడక వెంకటేశం, తడక యాదగిరి, కల్పనాకుమారి, కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి, భారత వాసుదేవ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, కర్నాటి శ్రీనివాస్, మాచర్ల మోహన్‌రావు, గోలి యాదగిరి, గడ్డం జగన్నాధం తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల కోసమా?
► అలాంటి తెలంగాణ వద్దు: కోదండరాం ► జయశంకర్ బాటలో పోరాడతాం ► సార్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి ► అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రజల్లోకి జేఏసీ ►నాకు రాజకీయ ఆకాంక్షలేవీ లేవు ► జయశంకర్ వర్ధంతి సభల్లో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే పరిమితమయ్యే తెలంగాణ వద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు తదితర వర్గాలతో పాటు సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం రాజకీయ జేఏసీ మళ్లీ క్రీయాశీలక పాత్ర పోషిస్తూ భావి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుందని ప్రకటించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఐదో వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు తన జీవితాన్ని త్యాగం చేశారంటూ కొనియాడారు. రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలని కాంక్షించిన ఆయన లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. మలి దశ ఉద్యమంలో ఎంతోమందిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత సార్‌దేనని చెప్పారు. ‘‘మనుషులు శాశ్వతం కాదు. వారి ఆలోచనా విధానాలు, భావాలు శాశ్వతం. తెలంగాణ సాధించడం ఒక ఎత్తై, అభివృద్ధి చేసుకోవడం మరో ఎత్తని జయశంకర్ సార్ భావించేవారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలనేది ఆయన ఆశయం. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని చెప్పిన సార్ బాటలోనే అభివృద్ధి కోసం సంఘటిత పోరాటాలు చేస్తాం. వివిధ అంశాలపై తొందరపడి ఏ విషయమూ మాట్లాడబోం. సమగ్రంగా అధ్యయనం చేసి, లోతుగా పరిశీలించాకే మాట్లాడతాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ విగ్రహాల కూల్చివేతలను సమర్థించారు జయశంకర్‌ను తెలంగాణ జాతి పితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ఆయన జయంతి వేడుకల నాటికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రతిపాదించిన తీర్మానాన్ని కోదండరాం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఊరూరా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఓయూ విద్యార్థి జేఏసీ, టీఎస్ జాక్ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో భాగంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చివేయడాన్ని జయశంకర్ సమర్థించారని చెప్పారు. ‘‘మార్చ్‌లో ఆయన పాల్గొనలేదు. అదెలా జరిగిందో చెబుదామని సాయంత్రం వాళ్లింటికి వెళ్లాను. ట్యాంక్‌బండ్ విగ్రహాల ధ్వంసం గురించి ఆయనతో మాట్లాడేందుకు భయపడ్డాం. అయితే, మిలియన్ మార్చ్ బాగా జరిగిందని ఆయనన్నారు. తానూ వద్దామని బయల్దేరినా అక్కడి పరిస్థితుల దృష్ట్యా వద్దనడంతో ఆగిపోయానన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలొద్దని అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు వినతిపత్రం సమర్పించినా విన్లేదని, వాటిని ధ్వంసం చేయడం మంచిదేనని అన్నారు’’ అని వివరించారు. రాష్ట్ర సాధనకు ఎంత కష్టపడుతున్నామో ఆ తర్వాత ఈ ప్రాంత, ప్రజల అభివృద్ధికి కూడా అంతకంటే ఎక్కువ కృషి చేయాలని సార్ అనేవారన్నారు. తనకు ప్రత్యేక రాజకీయ ఆకాంక్షలేవీ లేవని కోదండరాం పునరుద్ఘాటించారు. ‘‘నావి ఎవరో అనిపిస్తే అంటున్న మాటలు కాదు. తెలంగాణ సమాజమే నా మాటాలకు కారణం. రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులున్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువకులు 20 లక్షల మంది ఉన్నారు. ఇక పది, ఇంటర్ అయినవారు 80 లక్షల దాకా ఉంటారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’ అన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఊరురా దొరల పాలన తెచ్చేందుకే గడీలను మరమ్మతులు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గడీల్లో దొరల పాలనను సాగనివ్వబోమని హెచ్చరించారు. అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ పాలన కొనసాగుతుందని జస్టిస్ చంద్రకుమార్ తప్పుబట్టారు. కార్యక్రమాల్లో ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్లు విశ్వేశ్వర్రావు, ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాదరావు, విద్యార్థి జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి కోదండరాం
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ యం. కోదండరాం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తారని టీజేయేసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ మీడియాకు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు ఎన్ఆర్ఐ సంస్థల ఆహ్వానం మేరకు ఈనెల 8వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన కోదండరాం ఆ దేశంలోని వివిధ పట్టణాలలో అక్కడి తెలంగాణా సంస్థలు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం అర్థరాత్రి స్వదేశానికి విచ్చేయనున్నట్లు రవీందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
'బంగారు తెలంగాణలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి'
- మెల్బోర్న్లో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ రాయికల్ (కరీంనగర్ జిల్లా) : బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణవాదులు, ఎన్ఆర్ఐలు సైతం ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి అనిల్, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతల కన్నెర్ర
న్యూఢిల్లీ/హైదరాబాద్: రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. ప్రపంచమంతా కేసీఆర్ ను కీర్తిస్తుంటే ఆయన మాత్రం తప్పుబడుతున్నారని ఢిల్లీలో అన్నారు. కోదండరామ్ కుబుసం విడిచిన పాము అని వర్ణించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉనికిలోనే లేదని, కోదండరామ్ దేనిక చైర్మనో చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరికి వారు విడిపోయారని గుర్తు చేశారు. చేతకాకుంటే తప్పుకోవాలన్న వ్యాఖ్యాలను కోదండరామ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రజలే ఇస్తారని చెప్పారు. తమతో కలిసి రావాలని కోరినా కోదండరామ్ రాలేదన్నారు. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కోదండరాం వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
కెనడాలో ఘనంగా తెలంగాణ నైట్ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కెనడా(టీడీఎఫ్సీ) నిర్వహించిన తెలంగాణ నైట్-2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ టొరంటోతో పాటు కెనడాలోని వివిధ నగరాల నుంచి 800 మందికి పైగా తెలంగాణ వాసులు హాజరై కార్యక్రమాన్ని విజయవం తం చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి దీపిక దామెర్ల హాజరయ్యారు. వారితోపాటు టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర గురించి కోదండరాం చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ మిమిక్రీ సభికులను రంజింపచేసింది. ప్రముఖ తెలంగాణ సాహితీవేత్త, కవి డాక్టర్ ఎం.కులశేఖర్రావుని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు విదేశాల్లో నిర్వహించి తెలంగాణ సంస్కృతిని పటిష్ట పరుస్తామని నిర్వాహకులు తెలిపారు. -
కెనడాలో ఘనంగా ‘తెలంగాణ నైట్’
ఒట్టావా: ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేసి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేయడానికి పాటుపడతామని తెలంగాణ నైట్ - 2016 నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు నిర్వహించిన తెలంగాణ నైట్ - 2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై కోదండరాం చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ వాసి, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్యశాఖ మంత్రి దీపిక దామెర్ల గౌరవ అతిధిగా హాజరై ఇరు రాష్ట్రాల మధ్య సహకార కార్యక్రమాల గురించి వివరించారు. ఆత్మీయ అతిథిగా ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ హాజరై మిమిక్రీతో సభికులను ఆనందింపజేశారు. తెలంగాణ సాహితీవేత్త, డాక్టర్ ఎం.కులశేఖరరావును నిర్వహకులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలకుగానూ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం అందరినీ విశేషంగా ఆకర్షించింది. గ్రేటర్ టొరంటోతో పాటు న్యూయార్క్, రోచెస్టర్, డిట్రాయిట్ నగరాల నుంచి 800 మందికిపైగా తెలంగాణ వాసులు ఈ వేడుకకు హాజరయ్యారు. -
ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు
కార్యాచరణ రూపొందిస్తున్న టీజేఏసీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని యోచిస్తోంది. ఉద్యమ ఘట్టాలను, సన్నివేశాలను ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తిని, వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిఫలించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టనుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలోనే జూన్ 2న భారీ కార్యక్రమానికి జేఏసీ రూపకల్పన చేస్తోంది. జూన్ 1నే మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో వేడుకలను నిర్వహించాలని యోచిస్తోంది. అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 2 సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల తెలంగాణ ధూంధాం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. ఇందులో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, ఉద్యమ సంఘాల నేతలను భాగస్వామ్యం చేయాలని జేఏసీ భావి స్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఈ నెల 25న తిరిగి రానున్నారు. ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత దీనిపై పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. -
సీఎంతో నాకెలాంటి విభేదాల్లేవు
ఇద్దరిదీ ఒకేదారి రాజకీయాలపై ఎలాంటి ఆలోచన లేదు త్వరలోనే జేఏసీ సమావేశం ‘సాక్షి’తో టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాయికల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలంగాణ రాజకీయ జేఏసీ(టీజేఏసీ) చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతుంటే... ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. తమ ఇద్దరిదీ ఒకే దారి అని పేర్కొన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, తాను జేఏసీతో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకూ పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కోదండరాం మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారని, అది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. తమ ఇద్దరిదీ ఒకే పంథా అని అన్నారు. జేఏసీలోంచి వివిధ సంఘాలు వారి ఇష్టానుసారంగానే బయటకు వెళ్తున్నాయని తెలిపారు. త్వరలోనే జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. తనకు రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అన్నా హజారే వంటి నాయకులు సేవ చేస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి వస్తున్నారా? అని అన్నారు. కరువుపై అధ్యయనం చేసి రైతులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. -
ఒకే దఫాలో మాఫీ చేయాలి
ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, రంగారెడ్డి జిల్లా : కరువు నేపథ్యంలో రైతులు ఆర్థికంగా చితికిపోయారని, ఈ సమయంలో రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు చిత్రహింసలకు గురిచేస్తుండడం దారుణమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కలెక్టర్ రఘునందన్‌రావును కలిసి జిల్లాలోని కరువు పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఒకేదఫాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మూగజీవాలకు తాగునీరు లేక మృత్యువాత పడుతున్నాయని, గతంలో ఒక్కో గ్రామంలో వెయ్యికిపైగా ఉన్న జీవాల సంఖ్య ఇప్పుడు వందలోపు పడిపోయిం దన్నారు. వెంటనే పశువులకు తాగునీరు, గ్రాసం ఉచితంగా పంపిణీ చేయచాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందన్నారు. అదేవిధంగా తాగునీటికి కటకట ఉన్న గ్రామాల్లో అద్దెబోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో జేఏసీ జిల్లా కన్వీనర్ చల్మారెడ్డి తదితరులున్నారు. -
రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో కోదండరాం పిటిషన్
రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలు రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సహించేలా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం స్వామినాథన్ రిపోర్టును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాగా.. ఇంప్లీడ్ పిటిషన్ పై రేపు విచారణ జరగ నుంది. -
రంగారెడ్డిని రెండు జిల్లాలుగా చేయాలి: కోదండరామ్
రంగారెడ్డి జిల్లాను తూర్పు, పశ్చిమగా రెండు జిల్లాలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శేఖర్, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ప్రజల్లోకి ఉద్యమ పతాకం
- ఈనెల 30న ప్రొఫెసర్‌గా రిటైర్ కానున్న కోదండరామ్ - 1981లో లెక్చరర్‌గా ప్రస్థానం - తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం - రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఉద్యమానికి దిశా నిర్దేశం - రాష్ట్ర ఏర్పాటు అనంతరం తిరిగి ‘పాఠాల’కే పరిమితం - ఇక ముందు పూర్తి సమయం ప్రజల కోసమే.. పుట్టిన తేదీ: 5 సెప్టెంబర్ 1955 స్వస్థలం: కరీంనగర్ జిల్లా ఊటూరు తల్లిదండ్రులు: వెంకటమ్మ, జనార్ధన్‌రెడ్డి చదువు: ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ హోదా: లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా (1981 నుంచి 2015 సెప్టెంబర్ 30 వరకు) భార్య: సుశీల, గృహిణి పిల్లలు : ఒక కుమార్తె, ఒక కుమారుడు సాక్షి, హైదరాబాద్: ఉక్కుపాదాల మహారక్కసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ తరం ఉప్పెనై ఎగిసింది.. ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమించింది. ఆ ఉద్యమాల బాటలోనే తొలి అడుగులు వేశారు ప్రొఫెసర్ కోదండరామ్. రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టాక పాఠాలు-పోరాటాలు జీవితంలో భాగమయ్యాయి. పౌర హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఒక ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయకమైన ఉద్యమ పథం ఆయనది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు ఉస్మానియాలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించిన కోదండరామ్ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌గా కోట్లాది మంది తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్న ఆయన... ఆ ప్రజల కోసం చేయవలసిన పని ఇంకా ఎంతో ఉందని చెప్పారు. ఇక పూర్తి కాలం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేసే అవకాశం లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. లెక్చరర్‌గా ప్రారంభమైన ప్రస్థానం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరులో కోదండరామ్ జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో స్థిరపడింది. కోదండరామ్ విద్యాభ్యాసం మాత్రం వరంగల్‌లో సాగింది. డిగ్రీ వరకు అక్కడ చదివిన ఆయన... ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఢిల్లీ జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తిచేశారు. 1981 జూన్ 16న నిజాం కళాశాలలో రాజనీతి శాస్త్రం లెక్చరర్‌గా చేరారు. తర్వాత 1987 నుంచి 1997 వరకు కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో, 2000 సంవత్సరం వరకు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో బోధించారు. 1996లోనే రీడర్‌గా పదోన్నతి పొందారు. 2000 సంవత్సరం నుంచి 2007 వరకు తిరిగి నిజాం కళాశాలలో పనిచేశారు. ఈ సమయంలో 1950-1990 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై కోదండరామ్ పరిశోధన చేశారు. 2004లోనే ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2007 నుంచి ఇప్పటివరకు ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాలు, సమకాలీన అంశాలు, సామాజిక ఉద్యమాలు వంటివి ఆయన బోధనాంశాలు. ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే... మరోవైపు హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 1981లో పౌర హక్కుల ఉద్యమంలో చేరింది మొదలు 1999లో మానవ హక్కుల వేదిక వరకు పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. ‘స్వేచ్ఛ’ పత్రిక సంపాదకులుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, వ్యక్తీకరణలన్నింటిలోనూ కోదండరామ్‌కు పాత్ర ఉంది. ‘‘ప్రొఫెసర్ జయశంకర్ నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫోరమ్ ఆధ్వర్యంలో లోతైన చర్చలు, సభలు, సదస్సులు జరిగేవి. 1996లో నవంబర్ 1వ తేదీని విద్రోహదినంగా పాటిస్తూ జరిపిన సభ ఒక విస్ఫోటనం. భారీ సంఖ్యలో ప్రజలు ఆ మీటింగ్‌కు వచ్చారు. 1997 నుంచి తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ ఉద్యమవ్యాప్తికి దోహదం చేశాయి. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భవించింది. దాంతో ఒక విస్తృతమైన కార్యాచరణ ఏర్పడింది. గిర్గ్లానీ కమిటీ నివేదికను వెలుగులోకి తేవడంతో పాటు దాని అమలు కోసం వేదిక పోరాటం చేపట్టింది. పోలవరంపైన సదస్సులు నిర్వహించింది. ప్రజల్లో తెలంగాణ భావవ్యాప్తికి, ఉద్యమ విస్తృతికి కృషి చేశాం. 2006 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాం..’’ అంటూ తన తెలంగాణ పోరాట క్రమాన్ని కోదండరామ్ గుర్తుచేసుకున్నారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర ఆవిర్భావం వరకు కోదండరామ్ కేంద్ర బిందువుగా వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తిరిగి పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా మారిపోయారు. ‘‘ఉద్యమ క్రమంలో చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ 2010 వరకు కాలేజీకి వెళ్లాను. పాఠాలు చెప్పాను. 2011 నుంచి సెలవు పెట్టవలసి వచ్చింది. రాష్ర్ట ఆవిర్భావం తరువాత తిరిగి కాలేజీకి వెళ్తున్నాను..’’ అని ఆయన చెప్పారు. భవిష్యత్తు గురించి.. రిటైర్ కాబోతున్న నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ గురించి కోదండరామ్ వివరించారు. ‘‘పాఠాలు చెప్పడం తప్పించి మిగతా పని కొనసాగుతుంది. పూర్తికాలం ప్రజల కోసమే పనిచేస్తాను. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంది. ఆత్మహత్యలకు, ఆకలి చావులకు తావులేకుండా రాష్ట్రంలో రైతుల వ్యవసాయం సాగాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రజా వైద్యం ఎంతో మెరుగుపడాల్సి ఉంది. అలాగే విద్యారంగం కూడా. ఈ మూడు ప్రధాన రంగాల్లో ఆయా వర్గాల ప్రజలతో, సంఘాలతో కలసి చేయవలసిన పని చాలా ఉంది..’’ అని పేర్కొన్నారు. -
రైతుల అప్పులన్నీ ప్రభుత్వ ఖాతాలోకి..
* ‘జాగృతి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ * ఇందుకు ఆర్బీఐని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి * ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం రూ.5 లక్షలకు పెంచాలి * రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించే తీరు మారాలి * రైతు కుటుంబాల దత్తతకు ముందుకు రండి: ఎంపీ కవిత పిలుపు సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుల పేర బ్యాంకుల్లో ఉన్న రుణాల(అప్పు)ను ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలి. తక్షణం రైతులను రుణ విముక్తులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీ వెళ్లి ఆర్బీఐపై ఒత్తిడి తేవాలి. రైతుల ఆత్మహత్యలు జరగలేదని గత ప్రభుత్వాలు చెప్పేవి. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి. రైతుల ఆత్మహత్యలను తక్కువ చేయడం మానుకోవాలి. కారణం ఏదైనా, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. ఇది మానవీయ ధృక్పథం కూడా..’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు తెలంగాణ జాగృతి ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామని, రైతు జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరు చనిపోతే, మీ కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి బాధ. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు..’ అని అన్నారు. 421 జీవో మేరకు ఆర్థిక దుస్థితితో చనిపోతే అది ఆత్మహత్యే అని, నష్టపరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ‘సమగ్ర వ్యవసాయ విధానం’ ప్రకటించాలని కోదండరాం కోరారు. ఇవీ.. సూచనలు దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల ఆత్మహత్యల నివారణకు పలు సలహాలు, సూచనలు వచ్చాయి. రైతుల సమస్యలు వినడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా లేరని, రైతులకు ఆదాయ భధ్రత విధానం అమల్లోకి తేవాలని వ్యవసాయరంగ విశ్లేషకులు రామాంజనేయులు సూచించారు. సన్న, చిన్నకారు రైతులే ఒత్తిడిలో ఉన్నారని, వీరికి ఉపాధి అవకాశాలు పెంచాలని ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం ప్రతినిధి రేవతి పేర్కొన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలే సూచనని, రైతు ఆత్మహత్య చేసుకుంటే భార్యాభర్తల గొడవలే కారణమని తేలిగ్గా తీసుకుంటున్నారని ఓ ఎన్జీవో ప్రతినిధి సజయ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని వృత్తిపరమైన ఒత్తిడిగా గుర్తించాలని, రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని రెయిన్బో ఫౌండేషన్ డెరైక్టర్ అనురాధ డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రాంతాలను అధ్యయనం చేయాలని, అశాస్త్రీయంగా ఉన్న బీమా విధానాన్ని మార్చాలని తెలంగాణ వికాస కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ కోరారు. వ్యవసాయాన్ని ప్రయారిటైజ్ చేయాలని, వ్యవసాయాన్ని స్థానిక సంస్థలకు లింక్ చేయాలని సామాజిక ఉద్యమకారిణి రమా మెల్కోటే, సమష్టి వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తేవాలని టీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్, ఎమ్మెల్యే సీహెచ్ రమేష్ సూచించారు. ‘ఈచ్ వన్.. అడాప్ట్ వన్’ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రౌండ్ టేబుల్ సమావేశంలో అందిన సూచనలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ‘‘ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను అక్కున చేర్చుకోవాలి. ఈచ్ వన్.. అడాప్ట్ వన్ నినాదంతో జాగృతి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎన్ఆర్ఐ మిత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు, ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి. పిల్లల చదువులు, అప్పులు తీర్చే ఆలోచన చేయాలి. ప్రతీ గ్రామంలో పనిచేయాలి. రైతులకు భరోసాగా ఉండండి..’ అని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. -
వెబ్సైట్లో తెలంగాణ పోరాట క్రమం!
ముఖ్య సమాచారాన్ని అందుబాటులోకి తెస్తాం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్‌తోపాటు ముఖ్యమైన సమాచారాన్ని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు గ్రూప్-1 సిలబస్ సబ్‌కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాట క్రమం, ఆవిర్భావంపై ప్రామాణిక పుస్తకాలు లేనందున విద్యార్థుల్లో ఆందోళనలున్నాయన్న విషయాన్ని ఆయన దృష్టికి ‘సాక్షి’తీసుకెళ్లగా స్పందించారు. ఉద్యమంలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి రచనలు, ఉద్యమంపై వచ్చిన రచనలు అందుబాటులోకి తేవాలనుకున్నట్లు చె ప్పారు. మరిన్ని అంశాలు ఆయన మాట ల్లోనే.. ‘‘ముఖ్యంగా గ్రూప్-1 మెయిన్స్‌లో ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం’ పేరుతో ఆరో పేపరు ప్రవేశపెట్టాం. అందులో ‘ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్, టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విభాగాలు ఉన్నా యి. ఇందులో మూడో విభాగమైన ‘టువార్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ’ విషయంలో అభ్యర్థులకు మరింత సమాచారం అందించాలని భావి స్తున్నాం. ఇందుకోసం గ్లిర్గానీ కమిటీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదికలు, 610 జీవో ముఖ్యాం శాలు వంటి ప్రధానమైన సంఘటనల సమాచారం సైతం అందించాలనేది ఒక ఆలోచన. అలాగే శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయం మినహా మిగతా విభాగాల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పేపర్ మొదటి రెండు విభాగాల్లో పేర్కొన్న నిర్దేశిత సిలబస్‌కు సరితూగే ప్రామాణిక పుస్తకాలు ఎన్నో ఉన్నా యి. అభ్యర్థులు ప్రధాన, సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధమ వ్వాలి. కొన్నేళ్లలో జరిగిన ముఖ్యఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు కాబట్టి ప్రతీ పేపర్లోనూ తెలంగాణ దృక్పథాన్ని ప్రతిబిం బించే అంశాలను పొం దుపర్చడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్న సమస్యలు, పరిస్థితుల వంటివి సిలబస్‌లో పేర్కొన్నాం. గ్రూప్-1 రెండో పేపర్‌నే తీసుకుంటే మూడో విభాగంలోని ఫ్లోరోసిస్ సమస్య, ఈప్రాంతం నుంచి వలసలు, రైతులు, చేనేత సమస్యలు ఇందుకు ఉదాహరణలు. తెలంగాణలో విధులు నిర్వర్తించే అభ్యర్థులకు ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితులపై అవగాహన ఉంటేనే విధుల్లో సమర్థత ఉంటుంది. తద్వారా అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు గల కారణాలు కూడా తెలియాలి. ఈ ఉద్దేశాలతోనే సిలబస్‌లో ఈ ప్రాంత పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.’’ -
సంపూర్ణ తెలంగాణ కోసం ఉద్యమిస్తాం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్: హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని, ఉద్యోగుల పంపకంలో కూడా కేంద్రం చేసిన ప్రకటన నిరాశ పరిచిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాది కాలమైనా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంపూర్ణ తెలంగాణను సాధించే వరకు మరోసారి ఉద్యమాన్ని చేపడుతామన్నారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేత నుంచి వచ్చిన తెలంగాణకు కేంద్రం చేయూతను అందించాలన్నారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పబ్లిక్ రంగ సంస్థల, ఉద్యోగుల పంపిణీ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏడాదిలోగా పూర్తి కావాలని, కానీ అలా జరగలేదన్నారు. ఉద్యోగుల విభజనలో గిర్గ్లానీ నివేదికను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక మంత్రికి బాధ్యతను అప్పగించాలన్నారు. -
దూకుడు పెంచిన కోదండరామ్
-
‘కార్పొరేట్’పై నియంత్రణ ఉండాలి: కోదండరాం
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ ఉంటేనే సామాన్యులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్య పోకడలపై పోరాట సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులతో ప్రచారం చేస్తూ విద్యార్ధులు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగా కార్పొరేట్ సంస్థలపై నిఘా పెట్టడం లేదని, ఇష్టం వచ్చినట్లు వారికి అనుమతులు ఇస్తున్నారని అన్నారు. నే డు పేదలకు విద్య భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షడు(ట్రెస్మా) ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానాన్ని పటిష్టం చేయాలని అప్పుడే అందరికి విద్య అందుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. రమేశ్, ఫార్మసీ కళాశాల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్ పెడతామనడం సిగ్గుచేటు'
నిజామాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏసీబీని ఎదుర్కోవాలంటే చట్టబద్ధంగానే ముందుకెళ్లాలని ప్రొఫెసర్ కోదందరాం సూచించారు. పట్టణంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీస్ స్టేషన్ పెడతామని ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం సహా మంత్రులు చట్టబద్ధంగా నడుచుకోవాలి, కానీ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు చెడగొట్టేలా మాట్లాడరాదని ఈ సందర్భంగా కోదండరాం హితవు పలికారు. -
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
-
'ఓటుకు కోట్లు' కేసు బాబు వ్యక్తిగతం..కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లోని సెక్షన్-8 పై వివాదాలు సృష్టించవద్దని ఏపీ నాయకులను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 'ఓటుకు నోటు' కేసు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యక్తిగతమైన అంశమని అన్నారు. ఈ కేసు విషయమై మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్థమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవ జరగలేదని ఆయన గుర్తుచేశారు. ఈ నెల 21 న ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
'తెలంగాణ వచ్చినా సమస్యలు ఉన్నాయి'
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .ప్రజాపోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పారు. ఓయూ భూముల వ్యవహారాన్ని జేఏసీ సమావేశంలో చర్చించలేదని చెప్పారు. -
'పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది'
-
సాధించాల్సింది చాలా ఉంది: కోదండరాం
- తెలంగాణ శాంతిదూత అవార్డు ప్రదానం హన్మకొండ: ‘తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు... మహిళల భద్రత చట్టాలు లేవు... అనేక సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధించుకుందాం.’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ర్టస్థాయి శాంతిదూతలుగా తెలంగాణ నుంచి కోదండరాం, ఆంధ్రప్రదేశ్ నుంచి కవి డాక్టర్ అద్దెపల్లి రాంమెహన్రావును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్‌రెడ్డిని జిల్లా శాంతిదూతగా ఎంపిక చేశారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో శాంతి దూత పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
నేనూ హాస్టల్లో ఉండే చదువుకున్న..
⇒ చాలామంది మంత్రులు వసతిగృహాల్లో చదువుకుని వచ్చినవారే.. ⇒ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వికారాబాద్: ‘నేనూ హాస్టల్లో ఉండి చదువుకున్న వాడినే.. ఉడికీ ఉడకని అన్నం భోంచేసిన వాడినే..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల్లో చాలామంది వసతిగృహాల్లో ఉండి చదువుకుని వచ్చిన వారేనన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన కళాశాల 14 వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. వికారాబాద్ హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నప్పటికీ అన్నిరంగాల్లో వె నకబడి ఉందన్నారు. భూగర్భజలాలు ఎక్కడ చూసినా కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చదివే విద్యార్థులు మంచి జియలజిస్టులుగా తయారు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేథావులుగా తయారై, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. మార్కులు విద్యలో ప్రామాణికమని అనుకోవడం లేదన్నారు. లక్ష్యం లేకుండా ఏ గమ్యస్థానం చేరుకోలేమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివి సివిల్స్ రాసి, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని సివిల్స్ రాసి ఐపీఎస్, ఐఏఎస్ అయినవారు గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. అనంతరం రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో చె ల్లించాల్సిన పెండింగ్ ఫీజ్ రియింబర్స్‌మెంట్ నిధులను తమ ప్రభుత్వం ఇటీవలే రూ.800 కోట్లు విడుదల చేసి, విద్యార్థులను ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులు చదివింది ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలన్నారు. చదివు లేకుంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే వారే కాదన్నారు. కార్పొరేట్ కళాశాల యజామాన్యాలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. చదువుతోపాటు ఆటపాటలు, విశ్రాంతి కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఎంత చదివినా తక్కువేనన్నారు. భవిష్యత్‌లో నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలురానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు ఎంపీపీ సామల బాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీఫ్, నాయకులు ఎల్లారెడ్డి, దేవకీదేవి, కడియాల శేఖర్, విఠల్, ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, కళాశాల డైరక్టర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు రాంరెడ్డి, బి.కృష్ణయ్య, లక్ష్మారెడ్డి, రాంచంద్రరెడ్డి, పి వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
'మహిళలకు అన్యాయం జరగనివ్వొద్దు'
వనపర్తి (మహబూబ్‌నగర్) : పొట్ట చేతబట్టుకొని భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి భార్యలకు అన్యాయం జరగనివ్వొద్దని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం అభిప్రాయపడ్డారు. వారు వేరే ప్రాంతాలకు పోతే ఇంటి వద్ద ఉన్న మహిళలకు భద్రత కరువైందని ఆ అంశం గురించి ప్రభుత్వాలు, చదువుకున్నోళ్లు ఆలోచించాలని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మహబూబ్‌నగర్ తూర్పు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వనపర్తి పట్టణంలోని పాత మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమస్యల అధ్యయనం గురించి అన్ని రంగాల్లో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. 'ప్రతి ఒక్కరు చదువుకోవాలని, చదువుకునోళ్లకే సమస్యలకు కారణాలు తెలుస్తాయని ఎప్పుడు జయశంకర్ సార్ చెబుతుండే వారని' కోదండరాం పేర్కొన్నారు. పొదుపు సంఘాలతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభం అయ్యిందని, సకలజనుల సమ్మెతో మహిళలు చైతన్యవంతమైన పాత్ర పోషించడం మరింత పెరిగిందని, అయినా ఆశించిన రీతిలో వారి ప్రగతి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి నియోజకవర్గం స్థాయి నుంచి మహిళల సమస్యలను అధ్యయనం చేసి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి కార్యచరణ మొదలు పెట్టేందుకు ముందుకు కదులుతున్నట్లు వివరించారు. మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లే అభివృద్దిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలి: కోదండరాం
నిర్మల్: తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత వచ్చిన ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేలా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన టీవీవీ నాలుగో జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు సమస్యలతో ఉన్నప్పుడు మౌనం వహించడం నేరమని అన్నారు. సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా ఉండలేరని చెప్పారు. నష్టం జరిగినప్పుడు సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని అన్నారు. ప్రజాసమస్యలపై జేఏసీ, టీవీవీ, కలిసి సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చారు. కేటాయింపులతో సరిపోదు: మల్లెపల్లి లక్ష్మయ్య బడ్జెట్ కేటాయింపులతో సరిపోదని, అవి ప్రజలకు పూర్తిస్థాయిలో చేరాలని టీవీవీ రాష్ర్ట అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ప్రజలు పైసల్లో భాగం, పాలనలో భాగం అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం టీవీవీ పోరాడుతుందన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆరోపించారు. ప్రజల పక్షాన లేని ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. -
అభివృద్ధిపై మరో ఉద్యమం
వనపర్తి టౌన్ : తెలంగాణ వచ్చిందని సంతోషించడం సరిపోదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం త్వరలో నల్లమల ప్రాంతం చెంచు పెంటలనుంచి అభివృద్ధి ఉద్యమం నిర్వహిద్దామని, ఇందుకు స్వచ్ఛంద సంఘాలు, ఉద్యోగ సంఘా లు, ప్రజలు ముందుకు రావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తూర్పు జిల్లా ప్రథమ మహాసభను శనివారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదటగా తెలంగాణ విద్యావంతుల వేదిక జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్యలు పూమాలలు వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆత్మకు శాం తి కలగాలని కాసేపు మౌనం పాటించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం అవసరమని, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తమవంతుగా కృషి చేస్తామన్నారు. ప్రజల పక్షాన ఉంటూ తెలంగాణ అభివృద్ధికి రాజీ పడకుండా పోరాటం చేస్తామని చెప్పారు. రాజకీయ పెట్టుబడులతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండటం లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల విభజన ఇంకా జరగకపోవడం దురదృష్ణకరమన్నారు. ప్రభుత్వానికి ప్రజలు కడుతున్న పరోక్ష పన్నులే 80 కోట్లు ఉంటుందని, తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా ప్రభుత్వాలు సహకరించడంలేదని, వారు గాడిలో పడాలంటే ప్రజల్లో ప్రశ్నించే నైజం రావాలని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, జైల్‌భరో తదితర రూపాల్లో ఉద్యమాలు చేశామని, అదే ఉద్యమ స్ఫూర్తితో సంపూర్ణ తెలంగాణ నిర్మాణానికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సంపూర్ణ రాజ ధానికిగా ఏర్పాటయ్యేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం పలు తీర్మాణాలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని, కొల్లాపూర్‌లో కాగితపు పరిశ్రమ, సిమెంట్ తయారీ పరిశ్రను నెలకోల్పాలని, ఐటీడీఏను బలోపేతం చేసి విద్యను, వైద్యాన్ని ఇతర మౌళిక సదుపాయాలను చెంచులకు అందించేందుకు కృషి చేయాలని, రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, గద్వాల- మాచర్ల రైల్వే పనులు మొదలుపపెట్టాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న తన ఆట పాటలతో అలరించారు. కార్యక్రమంలో టీవీవీ తూర్పు, పడమ జిల్లాల అధ్యక్షులు రాజు, రవీందర్‌గౌడ్, ప్రతినిధులు సతీష్‌రెడ్డి, వేణుగోపాల్, పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మురళీధర్‌గుప్తా, బి. కుమార్, జి. రంగస్వామి, రవిశాస్త్రి, జి. ప్రసాద్, వేణుగోపాల్, నిరంజన్వ లి పాల్గొన్నారు. -
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
-
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో చర్చ చిన్నారెడ్డి ప్రతిపాదనకు సానుకూల స్పందన ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు 24, 25 తేదీల్లోనే సదస్సు: కుంతియా, పొన్నాల సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉం టుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన వచ్చింది. పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని ప్రతిపాదిం చారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందిం చారు. ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ రాష్ర్ట సదస్సు నిర్వహణపై సమావేశం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ లోపమనే కారణమనే ఆవేశంతో కార్యకర్తలు ఉన్నారని, ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహిస్తే వారి ఆగ్రహం మరిం త రెట్టింపవుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ సూచించారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున సదస్సు నిర్వహించి తీరాల్సిందేనంటూ డీకే ఆరుణ, నంది ఎల్లయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు కార్యకర్తలను పట్టించుకోలేదని, సదస్సు వేదికగానైనా వారి ఆవేదనను పంచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సమావే శం అనంతరం కుంతియా, పొన్నాల మాట్లాడుతూ హైకమాండ్ మాత్రం ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కార్యాచరణను రూపొందిస్తామని తెలి పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, సీనియర్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సహా పలువురు సీనియర్ నాయకులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సోదరుడు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ రావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. -
అన్యాయూలపై ఉద్యమించాలి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తూ తెలంగాణకు జరిగే అన్యాయాలపై ఉద్యమించాలని టిజేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం స్థానిక ఆవంతిహోటల్ కాన్ఫరెన్స్ హాల్లో టీవీ వీ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి పరిస్థితుల్లో చారి త్రక అవసరంగా టీవీవీ ఏర్పడిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తెలంగాణ విధ్వంసకర విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేసిందన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని ఒక భావజాలవ్యాప్తి సంస్థగా ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా టీవీవీ ఏర్పడిందన్నారు. ఒక మార్గదర్శిలా తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిందన్నారు. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఉద్యమంలో మమేకం చేసేందుకు టీవీవీ చేసి కృషి ఆమోఘమన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ వేదిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలో నెలకొన్న ససమ్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమేగాక, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సూచించారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషిం చిన వేదిక ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్తుందని, తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తిప్పర్తి యా దయ్య, నాయకులు లక్ష్మి, సతీష్‌రెడ్డి, టి.జి.శ్రీనివాసులు, రవీందర్‌గౌడ్, కృష్ణాబగాడే, డాక్టర్ సురేష్‌చంద్రహరి, విజయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని నిర్దేశించేది రాజకీయ నిర్ణయాలే
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజకీయ నిర్ణయాలే ఆర్థిక ప్రగతిని నిర్దేశిస్తాయుని, అవి సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘ప్రజల కోసం-స్వావలంబన కోసం-తెలంగాణ ప్రగతి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ 1990 నుంచి ఏపీలో రాజకీయాలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం ప్రారంభమైందని, క్రమంగా ప్రకృతి వనరులైన భూమి, నీరు, ఇసుక, బొగ్గు, వ్యవసాయం వారి ఆధిపత్యంలోకి వెళ్లడంతో చిన్న చిన్న వృత్తులు దెబ్బతిన్నాయన్నారు. అధికారం కొద్దిమంది చేతుల్లో ఉండాలా? లేక ప్రజలందరికీ దక్కాలా? అనేది వలిక సమస్యగా మారిందన్నారు. తెలంగాణ తలకిందులుగా జరుగుతున్న అభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అభివృద్ధిలో వాటా దక్కాలంటే కచ్చితమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రజలకు సూచించారు. మార్కెట్లో ఆటుపోటులను తట్టుకునే శక్తి రైతులకు రావాలని, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అమెరికాలోని నైబర్‌హుడ్ స్కూల్ పద్ధతిలోనే తెలంగాణలో కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డెరైక్టర్ డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ గత పదేళ్లలో 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారిందని, 10 శాతం మంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారారని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ సత్యప్రసాద్, టి.రమేష్, ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఆర్.వేణుగోపాల్ ప్రసంగించారు. -
ఓ ‘బందూక్’ ఆత్మ ఘోష
తెలంగాణ ఉద్యమ కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ (బాబీ) స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం లోగోను తెలంగాణ జెఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, సి.ఎల్.రాజం, అల్లం నారాయణ, టీఎన్జీవో అధ్యక్షులు దేవిప్రసాద్, రసమయి బాలకృష్ణ, అద్దంకి దయాకర్, దేశ్పాండ్ శివాజి, తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షులు విజేందర్‌రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితర తెలంగాణ ప్రముఖులు దర్శక, నిర్మాత లక్ష్మణ్ ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ -‘‘ఓ బందూక్ ఆత్మఘోష ఇది. ఆత్మరక్షణ కోసం మనిషి తయారు చేసుకున్న బందూక్... నేడు చంపడం కోసమే ఉపయోగపడుతోంది. ప్రతి పోరాటంలో చంపడమే బందూక్ ఉనికిగా మారింది. తను లేని సమాజం లేదని బందూక్ అనుకుంటోంది. ఇలా బందూక్ ఆత్మఘోషను వివరిస్తూ ఈ సినిమా తీశాం. కేవలం తెలంగాణకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: కృష్ణచైతన్య జోషి, కార్యనిర్వాహక నిర్మాత: శ్రీధర్ మంచాల, సహ నిర్మాతలు: శ్రావణ్‌కుమార్, గణేష్‌బాబు, సమర్పణ: సంజయ్‌కుమార్. -
7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ: కోదండరాం
తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సిటీ కాలేజ్ నంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని, తర్వాత ముగింపు సభ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిందని ఆయన అంతకుముందు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఎదురయ్యే సమస్యలను ఇచ్చిపుచ్చుకునే రీతిలో సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు లేనిపోని అవాంతరాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. సీఎం కిరణ్ విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు. -
కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం
* సీమాంధ్ర ప్రాంత సమ్మె నేపథ్యంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ * ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ * 16 నుంచి గ్రామగ్రామాన..17 నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టగల శక్తి తమకు ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలెన్నింటినో తెలంగాణ సమాజం చూసిందన్నారు. కుట్రలతో ఆపగలిగితే ఆగే పరిస్థితిలో తెలంగాణ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ఎలాంటి కుయుక్తులు తమ ముందు నడవవని హెచ్చరించారు. సంయమనం అవసరమన్న ఉద్దేశంతోనే తాము ఇన్నాళ్లూ ఆగుతూ వచ్చామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీఎన్జీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మంగళవారం జేఏసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డి. శ్రవణ్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడు అశోక్, పలువురు ఉద్యోగ సంఘాల, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమావేశ అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు తమ ఆధిపత్యం కాపాడుకోవడానికి ప్రజల మధ్య తీవ్రమైన రీతిలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వెళ్లేవారికి కూడా ఇబ్బంది కలిగించేంత ప్రాంత విద్వేషాలు పెంచడం నాగరిక సమాజంలో సరికాదన్నారు. వారిది ఆధిపత్య ధోరణి అయితే తెలంగాణ ఉద్యమపంథా శాంతి మార్గమని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలన్నది తెలంగాణ ఉద్యమం అభిప్రాయం కూడానని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గం తక్షణమే తెలంగాణ బిల్లును ఆమోదించి, చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను అడ్డుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించేందుకు ఒక భవిష్యత్ కార్యాచరణను జేఏసీ సిద్ధం చేసుకుందని తెలిపారు. 16వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో గ్రామ, గ్రామా న ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 16, 17 తేదీలతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా అన్ని డివిజన్ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారని, వాటిని కూడా సమన్వయం చేసి ఆ సందర్భంగా భారీ ర్యాలీలు జరపాలని కోరారు. విద్యార్థులు ఈ ర్యాలీలలో పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు. 17వ తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న అందరినీ మరోసారి ఐక్యం చేసి భవిష్యతులో ఏమి చేయాలన్న దానిపై చర్చిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత మంత్రుల భార్యలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడాన్ని తప్పుపట్టారు. సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని మంత్రుల భార్యలు చెబుతున్నారని, ఆ ప్రాంతం వెనుకబడడానికి ఈ మంత్రులే కారణం కాబట్టి వారిపై ఏం చర్యలు తీసుకోవాలో వారి భార్యలు చెపితే బాగుంటుందని కోదండరాం సూచించారు. తెలంగాణ సమాజం కిరణ్‌పై విశ్వాసం కోల్పోయింది: ఈటెల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నార ని ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ సమాజం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్ల విశ్వాసం కోల్పోయిందని, తక్షణమే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసోం్తదని చెప్పారు. జేఏసీ కార్యక్రమాలకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమైక్యాంద్రకు మద్దతుగా ఏపీ ఉద్యోగుల సమ్మె ప్రభావం హైదరాబాద్ నగరంపై నామమాత్రంగా ఉందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈనెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి తెలంగాణ ప్రక్రియను నిలిపివేసే పక్షంలో తామందరం మెరుపుసమ్మెకు దిగుతామన్న నోటీసు అందజేయనున్నట్టు టి. గెజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై వందలాది కేసులు నమోదు చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు సీమాంధ్ర జిల్లాల్లో, సచివాలయంలో జరుగుతున్నవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమంలో సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాలపై దాడులు జరగడాన్ని ఆ పార్టీ నేత అశోక్‌కుమార్ ఖండించారు. -
విభజనకు సహకరించండి: కోదండరాం
రాష్ట్ర విభజనకు సహకరించండి.. సమస్యలను పరిష్కరించుకుందామని సీమాంధ్రులకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. హైదరాబాద్ తమదని సీమాంధ్రులు అనడం భావ్యం కాదన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుకు తాము కూడా వ్యతిరేకమే అని చెప్పారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని అంతకుముందు కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోదండరాం ఆంధ్ర ప్రాంతం వారికి ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రపాంతం వారు ఆందోళన చెందవద్దన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసుకుందామని కోదండరాం అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. కొందరి డబ్బుల సంచులతో ఉద్యమం నడుస్తోందన్నారు. తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేస్తే మళ్లీ ఉద్యమం చేస్తామని బీజేపీ నాయకుడు నాగం జనార్దన రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ కేంద్రం ఆధీనంలో ఉంటే సహించబోమని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు సహకరించాలని ఇరుప్రాంతాల వారికి మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.