భూసేకరణ బిల్లుపై అప్రమత్తత అవసరం
అఖిలపక్ష సమాలోచనలో కోదండరాం
హైదరాబాద్: తెలంగాణలో బలవంతంగా భూ సేకరణ చేపడుతున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు, చేర్పులతో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు అన్యా యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఇక్కడ టీజేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమాలోచన నిర్వహిం చారు. టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ సహా పలు ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
తెలం గాణ ప్రైవేటు విశ్వ విద్యా లయాల బిల్లును తీసుకురావడానికి ప్రయ త్నాలు జరుగు తున్నాయని, ఈ బిల్లు వస్తే అందరికీ విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, సిబ్బంది లేక ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ప్రైవేటు వర్సిటీలు వస్తే వీటి పరిస్థితి మరింత దారుణంగా దిగజా రుతుం దని అన్నారు. ఉన్నత విద్యను ప్రైవేటీక రించడానికి ప్రైవేటు వర్సిటీల బిల్లును తీసుకురాబోతోందని ఆరోపించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగే ఏ బిల్లును కూడా తాము రానివ్వబోమని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాల లపై చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వర్సిటీల బిల్లు వస్తే హౌస్ కమిటీ వేయాలని కోరుతామని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ భూసేకరణ విషయంలో జేఏసీ ఆదేశా లను అనుసరిస్తామని చెప్పారు. కోదండరాం రూపొందించే కార్యాచరణ ప్రణాళికకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.