special bill
-
Cryptocurrency Bill: క్రిప్టో బిల్లు ఇక లేనట్లేనా?
క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్ క్రిప్టో అడ్డుకట్టవేయడం, ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్ క్లియర్ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. బిజినెస్ న్యూస్ ఏజెన్సీ బ్లూమరాంగ్.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 23తో) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ చెప్పినా కూడా.. ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్ అనుమతి పొందలేదు. వేగిరపాటు వద్దనే.. సిడ్నీ డైలాగ్ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు. నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్ వెబ్సైట్లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా. అంశాలు.. క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు. క్రిప్టోకరెన్సీ హోల్డర్స్ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలిసిస్ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. -
Cyptocurrency : క్రిప్టోకరెన్సీ చట్టం.. అనూహ్య పరిణామం!
Coinstore Exchange India: క్రిప్టోకరెన్సీపై భారత ప్రభుత్వ నియంత్రణా? ఆంక్షలా? లేదా పూర్తి నిషేధమా?.. అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ తరుణంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా మరో ప్రైవేట్ బిట్‌కాయిన్‌స్టోర్ భారత్‌లో అడుగుపెట్టింది. సింగపూర్‌కి చెందిన వర్చువల్ కరెన్సీ ఏజెన్సీ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ భారత్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. క్రాస్‌టవర్(సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యింది) తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన రెండో గ్లోబల్ ఎక్సేంజ్ కాయిన్‌స్టోర్ కావడం విశేషం. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై బ్రాంచ్‌లతో కాయిన్‌స్టోర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. అంతేకాదు 20 మిలియన్‌డాలర్ల బడ్జెట్‌తో భారత మార్కెట్లో పెట్టనున్నట్లు.. ప్రస్తుతానికి వంద మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు కాయిన్‌స్టోర్ మార్కెటింగ్ హెడ్ చార్లెస్ టాన్ వెల్లడించారు. అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల పట్ల ఇవాళ్టి నుంచి(నవంబర్ 29, 2021) మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని తరుణంలో.. కాయిన్‌స్టోర్ వేసిన అడుగు సాహసోపేతమనే చెప్పాలి. అంతా సవ్యంగా జరుగుతుందనే ఆశాభావంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, క్రిప్టోకరెన్సీల కోసం భారత ప్రభుత్వం హెల్తీ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు చార్లెస్ టాన్ తెలిపారు. భారత్‌తో పాటు జపాన్, కొరియా, ఇండోనేషియా, వియత్నాంలలోనూ కార్యకలాపాలకు Coinstore సిద్ధమైంది. Cryptocurrency.. దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇదిలా ఉంటే ప్రపంచలోనే అతిపెద్ద(విలువైన) క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్.. ఈ ఏడాది ఆరంభంలో కంటే రెట్టింపు విలువతో భారత పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. కానీ, క్రిప్టోబిల్లు పరిణామాల తర్వాత వాటి విలువ పడుతూ.. లేస్తూ ఇన్వెస్టర్లను కంగారుపెడుతోంది. మరి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది మరికొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్‌కాయిన్‌కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్‌కాయిన్, ఎథెరియమ్, టెథర్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
ఫౌచీ ఊస్టింగ్.. వైరస్ గుట్టు వీడిందా?
డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.. కరోనా టైం నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వైరస్ వ్యాప్తి తీరుపై విశ్లేషణ, సలహాలు ఇస్తున్న ఫౌచీని ఉన్నపళంగా ఆ పదవి నుంచి తొలగించారట. అంతేకాదు ఆయన ఊస్టింగ్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక బిల్లును కూడా కాంగ్రెస్(పార్లమెంట్)లో ప్రవేశపెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ ల్యాబ్‌ల్లోనే తయారు చేశారనే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించిందనేది మరో వార్త. ఫేస్బుక్, వాట్సాప్‌లో ఫార్వార్డ్ అవుతున్న ఈ వార్తల్లో ఉన్న సగం నిజమెంతంటే.. సీనియర్ ఫిజిషియన్, అమెరికాలోనే టాప్ ఇమ్యునాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడి) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ. అంతెందుకు అమెరికా అధ్యక్షుడికి ఈయనే ఆరోగ్య సలహాదారు కూడా. అలాంటి వ్యక్తిని ఉన్నపళంగా పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందసలు?.. విషయంలోకి వెళ్తే.. ఫౌచీ నిర్లక్క్ష్యం వల్లే అమెరికాలో కరోనాతో తీరని నష్టం వాటిల్లిందని, వైరస్ వ్యాప్తి టైంలో ఆయన ప్రభుత్వానికి సరైన మార్గనిర్దేశం చేయలేకపోయాడని, పైగా వైరస్ వ్యాప్తికి సంబంధించి రహస్య ఈ-మెయిల్స్ ద్వారా ఫౌచీ కుట్రకు పాల్పడ్డారనేది రిపబ్లికన్ ఎంపీ మర్జోరి టేలర్ గ్రీనె ఆరోపణ. ఈ మేరకు ఆమె ‘ఫైర్ ఫౌచీ యాక్ట్’ పేరుతో ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించింది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెంట్లో చర్చదశకు రాలేదు. ఈలోపే ఓటింగ్ జరిగిందని, ఆమోదం దొరికిందని, ఫౌచీ పని అయిపోయిందని ఫేక్ కథనాలు వెలువడ్డాయి. ఇక కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా నిఘా వర్గాలకు 90 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే(మే 26 ఆదేశాలు వెలువడ్డాయి). వైరస్‌ను ల్యాబ్‌లోనే తయారు చేశారా?, లేదంటే జంతువుల ద్వారా సోకిందా? తేల్చాలని ఆయన నిఘా ఏజెన్సీలను ఆదేశించాడు. అయితే నెలలోపే దర్యాప్తు పూర్తైందని, ఇది మనిషి తయారు చేసిందని అమెరికా ధృవీకరించిందని ఒక ప్రైవేట్ బ్లాగ్ ద్వారా ఫేక్ వార్త వైరల్ అయ్యింది. ఇక ఈ రెండు ఫేక్ అని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ‘ఫౌచీ పట్ల తాను అత్యంత నమ్మకంగా ఉన్నట్లు’ ఈ నెల మొదట్లో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బైడెన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు ఆ అధికారి. చదవండి: కరోనా పుట్టకపై ఫౌచీ కీలక వ్యాఖ్యలు -
పీజీ వైద్య విద్యార్థుల తప్పనిసరి సర్వీసు రద్దు
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం శాసనసభలో ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశం తప్పనిసరి సర్వీసుతో ప్రయోజనం లేదనే ఈ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయా లన్న నిబంధనను రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును రూపొం దించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు.. మెడికల్ విద్యార్థులు తమ కోర్సు ముగిసిన తర్వాత కచ్చి తంగా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసులో గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేయాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు ఈ నిబంధనను అమలుపరిచారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిబంధన నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం పీజీ, సూపర్‌స్పెషాలిటీ వైద్య కోర్సు పూర్తి చేసిన వారికి దీన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు పూర్తిచేసిన తర్వాతే వారికి ప్రైవేటుగా వైద్యం చేయడానికి తెలంగాణ వైద్య మండలి అనుమతిస్తోంది. నిపుణుల కమిటీ సూచనలతో.. అయితే తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల నుంచి ఏటా 1,400 మంది వరకు పీజీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అంటే వీరంతా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలి. ఈ ఏడాది కాలంలో పీజీ వైద్య విద్యార్థులకు నెలకు రూ.40 వేలు, సూపర్ స్పెషాలిటీలకు రూ.45 వేలు, డిప్లొమా వారికి రూ.38 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. వారిని బోధనాసుపత్రులకు పంపినా ఎవరూ కూడా హైద రాబాద్‌ను వీడి బయటకు పోవడానికి ఇష్టపడటంలేదు. నగరంలో పోస్టింగ్‌లు ఇచ్చినా అక్కడా బాధ్యతలు నిర్వ హించడంలేదు. ప్రభుత్వ సర్వీసు చేయకుండానే నెలనెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు. రికార్డుల్లో మాత్రమే వీరు ప్రభుత్వ సర్వీసు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ తప్పనిసరి ప్రభుత్వ సర్వీసు ఎత్తివేయాలని సూచించింది. తప్పనిసరి సర్వీసును తొలగించి ప్రభుత్వానికి అవసరమైన వారిని పూర్తిస్థాయిలో నియమించాలన్న ఆలోచన ఉంది. ఇష్టమైన వారు.. ఎక్కడికైనా వెళ్లడానికి ఆసక్తి చూపే వారికి ఇప్పుడిస్తున్న దానికంటే ఎక్కువగా వేతనం ఇచ్చి ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమిం చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. -
భూసేకరణ బిల్లుపై అప్రమత్తత అవసరం
అఖిలపక్ష సమాలోచనలో కోదండరాం హైదరాబాద్: తెలంగాణలో బలవంతంగా భూ సేకరణ చేపడుతున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు, చేర్పులతో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు అన్యా యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఇక్కడ టీజేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమాలోచన నిర్వహిం చారు. టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్‌రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ సహా పలు ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలం గాణ ప్రైవేటు విశ్వ విద్యా లయాల బిల్లును తీసుకురావడానికి ప్రయ త్నాలు జరుగు తున్నాయని, ఈ బిల్లు వస్తే అందరికీ విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, సిబ్బంది లేక ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, ప్రైవేటు వర్సిటీలు వస్తే వీటి పరిస్థితి మరింత దారుణంగా దిగజా రుతుం దని అన్నారు. ఉన్నత విద్యను ప్రైవేటీక రించడానికి ప్రైవేటు వర్సిటీల బిల్లును తీసుకురాబోతోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగే ఏ బిల్లును కూడా తాము రానివ్వబోమని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ చట్టాల లపై చర్చ జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వర్సిటీల బిల్లు వస్తే హౌస్ కమిటీ వేయాలని కోరుతామని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లా డుతూ భూసేకరణ విషయంలో జేఏసీ ఆదేశా లను అనుసరిస్తామని చెప్పారు. కోదండరాం రూపొందించే కార్యాచరణ ప్రణాళికకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.