పీజీ వైద్య విద్యార్థుల తప్పనిసరి సర్వీసు రద్దు
వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం శాసనసభలో
ప్రత్యేక బిల్లు పెట్టే అవకాశం తప్పనిసరి సర్వీసుతో
ప్రయోజనం లేదనే ఈ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయా లన్న నిబంధనను రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును రూపొం దించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు..
మెడికల్ విద్యార్థులు తమ కోర్సు ముగిసిన తర్వాత కచ్చి తంగా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసులో గ్రామీణ ప్రాంతా ల్లో పనిచేయాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు ఈ నిబంధనను అమలుపరిచారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిబంధన నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం పీజీ, సూపర్‌స్పెషాలిటీ వైద్య కోర్సు పూర్తి చేసిన వారికి దీన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు పూర్తిచేసిన తర్వాతే వారికి ప్రైవేటుగా వైద్యం చేయడానికి తెలంగాణ వైద్య మండలి అనుమతిస్తోంది.
నిపుణుల కమిటీ సూచనలతో..
అయితే తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల నుంచి ఏటా 1,400 మంది వరకు పీజీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. అంటే వీరంతా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలి. ఈ ఏడాది కాలంలో పీజీ వైద్య విద్యార్థులకు నెలకు రూ.40 వేలు, సూపర్ స్పెషాలిటీలకు రూ.45 వేలు, డిప్లొమా వారికి రూ.38 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. వారిని బోధనాసుపత్రులకు పంపినా ఎవరూ కూడా హైద రాబాద్‌ను వీడి బయటకు పోవడానికి ఇష్టపడటంలేదు. నగరంలో పోస్టింగ్‌లు ఇచ్చినా అక్కడా బాధ్యతలు నిర్వ హించడంలేదు. ప్రభుత్వ సర్వీసు చేయకుండానే నెలనెలా వేతనాలు మాత్రం పొందుతున్నారు.
రికార్డుల్లో మాత్రమే వీరు ప్రభుత్వ సర్వీసు చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ తప్పనిసరి ప్రభుత్వ సర్వీసు ఎత్తివేయాలని సూచించింది. తప్పనిసరి సర్వీసును తొలగించి ప్రభుత్వానికి అవసరమైన వారిని పూర్తిస్థాయిలో నియమించాలన్న ఆలోచన ఉంది. ఇష్టమైన వారు.. ఎక్కడికైనా వెళ్లడానికి ఆసక్తి చూపే వారికి ఇప్పుడిస్తున్న దానికంటే ఎక్కువగా వేతనం ఇచ్చి ఔట్ సోర్సింగ్ పద్ధతిన నియమిం చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది.