ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు: హోం మంత్రి
తెలంగాణ ప్రభుత్వంపై కొంతమంది కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతా ఆయన చెప్పినట్లే జరగాలా అని ప్రశ్నించారు.
హైకోర్టు చెప్పినట్లుగా ఆయన ఎందుకు నడుచుకోలేదని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని.. కోదండరామ్ పార్టీ పెట్టినా కూడా తమకు నష్టం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్లే వ్యతిరేకంగా ఉంటే ఎలాగని నాయిని నరసింహారెడ్డి అన్నారు.