యాదాద్రి: హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లాలో సోమవారం పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా యాదాద్రి బాలాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నాయిని స్థానికంగా ఒక ప్రైవేట్ లాడ్జిని ప్రారంభించారు.