విభజనకు సహకరించండి: కోదండరాం
రాష్ట్ర విభజనకు సహకరించండి.. సమస్యలను పరిష్కరించుకుందామని సీమాంధ్రులకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. హైదరాబాద్ తమదని సీమాంధ్రులు అనడం భావ్యం కాదన్నారు. జోనల్ వ్యవస్థ రద్దుకు తాము కూడా వ్యతిరేకమే అని చెప్పారు.
తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని అంతకుముందు కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోదండరాం ఆంధ్ర ప్రాంతం వారికి ఆయన సూచించారు. హైదరాబాద్లోని ఆంధ్రపాంతం వారు ఆందోళన చెందవద్దన్నారు. అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసుకుందామని కోదండరాం అన్నారు.
సీమాంధ్ర ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. కొందరి డబ్బుల సంచులతో ఉద్యమం నడుస్తోందన్నారు. తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేస్తే మళ్లీ ఉద్యమం చేస్తామని బీజేపీ నాయకుడు నాగం జనార్దన రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ కేంద్రం ఆధీనంలో ఉంటే సహించబోమని ఆయన తెలిపారు. మరోవైపు విభజనకు సహకరించాలని ఇరుప్రాంతాల వారికి మంత్రి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.