'సీమాంధ్ర ప్రతినిధిగానే వ్యవహరిస్తున్న కిరణ్' | Kiran kumar reddy acting as seemandhra representative: BJP | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ప్రతినిధిగానే వ్యవహరిస్తున్న కిరణ్'

Published Fri, Aug 9 2013 3:44 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'సీమాంధ్ర ప్రతినిధిగానే వ్యవహరిస్తున్న కిరణ్' - Sakshi

'సీమాంధ్ర ప్రతినిధిగానే వ్యవహరిస్తున్న కిరణ్'

రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి
తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటినీ ఒకేలా చూడాల్సి ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కేవలం సీమాంధ్ర ప్రాంతానికే ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదని విమర్శించారు.

తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మాట్లాడిన సీఎం కిరణ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటన చేసిన తర్వాత, మళ్లీ ముఖ్యమంత్రి ఈ విధంగా చెప్పడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement