చేర్యాల బంద్ సంపూర్ణం
Published Thu, Sep 8 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
చేర్యాల : జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జనగామ జిల్లా సాధన కోసం చేర్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు ఆహ్వానించిన నేపథ్యంలో చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చేర్యాల పరిరక్షణ సమితి కన్వీనర్ పందిళ్ల నర్సయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అ««దl్యక్షుడు ఉడుముల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుర్మ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని దుకాణాలు, పాఠశాలు, కళాశాలలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి సినిమా టాకీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ కోదండరాంను చేర్యాలకు ఆహ్వానించి, సభ నిర్వహించాలనే ఆలోచనే సరికాదన్నారు. స్థానికుల మనోభావాలను అన్ని పార్టీలు గౌరవించాలన్నారు. చేర్యాలను సిద్ధిపేట జిల్లాలో కొనసాగించి, అక్కడి రెవెన్యూ డివిజన్‌లోనే కలపాలన్నారు. సర్పంచులు పెడతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము రవి, బొమ్మగోని రవిచందర్, ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, నాయకులు కందుకూరి సిద్దిలింగం, ఎండీ.మోయిన్, ఉప్పల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement