JAC chairman
-
వైజాగ్ కేంద్రంగా పాలన: ‘విశాఖ వందనం’ ప్రచార రథం ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన రాజధానిగా విశాఖ వర్థిల్లాలని సంపత్ వినాయక దేవాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘విశాఖ వందనం’ ప్రచార రథాన్ని రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణ జేఏసీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ ప్రారంభించారు. నేటి నుంచి పరిపాలన కేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దేవాలయాల సందర్శన కార్యక్రమం చేపట్టారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా సీఎం వైఎస్ జగన్ చేపట్టనున్న పరిపాలన సజావుగా సాగాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని లజపతిరాయ్ అన్నారు. అదేవిధంగా విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన విజయవంతంగా సాగాలని కాంక్షిస్తూ ప్రజలందరితో కలిసి శనివారం నుంచి దశలవారీగా సర్వమత ప్రార్థనలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపే శక్తిని ముఖ్యమంత్రికి ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జేఏసీ తరఫున దేవాలయాలు, చర్చిలు, ముస్లిం ప్రార్థనా స్థలాల్లో సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో ఇటీవల తీర్మానించినట్లు వెల్లడించారు. -
గాలికి పోయేవాళ్లం కాదు
ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాడుతాం: కోదండరాం ► ర్యాలీ విజయవంతమైంది ► సమస్య తీవ్రత అందరికీ అర్థమైంది ► ముస్లింల సమస్యలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించేవాళ్లు ఉండకూ డదని ప్రభుత్వంలో ఉన్నవారు కోరుకు న్నా.. తాము గాలికి కొట్టుకు పోయేవాళ్లం కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ఎన్ని నిర్బం ధాలు విధించినా పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. గురువారం కోదండరాం నివాసంలో టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులు, అనంతరం పరిణామాలు తదితర అంశాలపై అందులో చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని... ఈ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పాలనే తమ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందని ఆయన చెప్పారు. ర్యాలీ, సభ విషయంలో సంఘీ భావంగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల ప్రకారం నిరసన తెలపడానికి తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అనుమతి ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. అర్ధరాత్రి తమ ఇంటిపైకి వచ్చి, తలుపులు విరగ్గొట్టి మరీ అరెస్టు చేయాల్సిన పరిస్థితులు, అవసరం ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తమను ఏ పోలీస్‌స్టేషన్‌లో పెట్టారో కూడా తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచా ల్సిన అవసరమేమిటని నిలదీశారు. భూనిర్వాసితుల సమస్యపై రాష్ట్రపతిని కలుస్తాం పోలీస్‌స్టేషన్‌లో తమను కలవడానికి వచ్చిన వివిధ పార్టీల నేతలను కూడా పోలీ సులు అరెస్టు చేయడం దుర్మార్గమని కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా, పోలీసులతో వేధింపులకు గురిచేసినా పట్టించుకోవాల్సి న అవసరం లేదన్నారు. 5 వేల మందిని అరెస్టు చేయడం, వేలాది మంది పోలీసులను మోహరించడం ఎలాంటి సంకేతమో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఉస్మాని యా, కాకతీయ వర్సిటీల్లోని హాస్టళ్ల వద్ద సాయుధ బలగాలను పెట్టారని, నాయకులు, నేతల ఇళ్లపై పడి అరెస్టులు చేశారని... అయినా నిరసన ప్రదర్శన జరిగిందన్నారు. మొత్తంగా జేఏసీ ప్రతిపాదించిన అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగిందని, తాము సంపూర్ణ విజయం సాధించామని చెప్పా రు. స్వామి అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటివారు తమకు ఫోన్లు చేసి, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఖండించారన్నారు. భూనిర్వాసితుల సమ స్యపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ముస్లింల సమస్యలపై సుధీర్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తా మని.. మార్చి 1న మహబూబ్‌నగర్‌లో, 4న నిజామాబాద్‌లో వాటిని ఏర్పాటు చేస్తున్నా మని వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు కె.రఘు, ప్రహ్లాదరావు, వెంకటరెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, భైరి రమేశ్, గోపాల శర్మ, గురజాల రవీందర్ తదితరులు ఉన్నారు. -
పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా?
కడ్తాల్: కాలుష్యకారక ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలకొద్దీ ఎకరాల భూములు అవసరమా అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఎస్ఎల్ఆర్ గార్డెన్లో గురువారం నిర్వహించిన ‘ఫార్మాసిటీ భూనిర్వాసితుల ఘోస’లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో కంటే పార్లమెంటు చట్టం ఉన్నతమైనదని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా భూ సేకరణ చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే ఫార్మాకు బదులు వేరే ఇతర కంపెనీలను నెలకొల్పి అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫార్మాసిటీలాంటి విషం వెదజల్లె కంపెనీలతో ఇక్కడి ప్రజల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులారా నిర్ణయం మీది, భవిష్యత్తు మీది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మీ హక్కులను కాపాడుకోండి అని రైతులకు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో భవిష్యత్తు తరాలకు మిగిలేది విషమేనని, పచ్చని పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జేఏసీ ఛైర్మన్ చల్మారెడ్డి, హైకోర్టు న్యాయవాది అర్జున్, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందంగౌడ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలన సంతృప్తిగా లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం భీమదేవరపల్లి: రెండేళ్లు దాటినా టీఆర్ఎస్ పాలన అంత సంతృప్తిగా సాగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రచించిన ‘మా పోరాటం’ పుస్తకాన్ని శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో జేఏసీ కార్యవర్గ సమావేశంలో తాము అవలంబించే విధానాలు, భవిష్యత్ కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులతో పాటుగా చేతివృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం, విద్య సైతం పూర్తిస్థాయిలో అందడం లేదని కోదండరాం అన్నారు. ప్రజల ఇబ్బందులను జేఏసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పక్షాన నిలుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మా విధానాలు చేరువ చేసేందుకు త్వరలో మాస పత్రిక, వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
‘జనగామ’ కోసం నేడు చండీయాగం
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు జ్వాలా సుదర్శన నారసింహ సహిత చండీయాగం నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రెయిన్‌మార్కెట్ ఆవరణలోని కవర్ షెడ్ ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు చండీయాగం ప్రారంభం అవుతుందని తెలి పారు. మొదట గణపతి పూజ, స్వస్తి పుణ్యా హ వచనం, రుత్వికరణము, ఆ తర్వాత విజయగణపతి, చండీ హోమాలు, రుద్రహోమం, మన్యసూక్త హోమం, సుదర్శన నారసింహ, పంచసూక్త హోమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతితో ముగింపు పలుకుతారన్నారు. అనంతరం మహా అన్నదానం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో నాయకులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, డాక్టర్లు లకీనారాయణ నాయక్, రాజమౌళి, ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీనివాస్, మాశెట్టి వెంకన్న, జక్కుల వేణుమాధవ్, మంగళ్లపల్లి రాజు, రెడ్డి రత్నాకర్, ఆలేటి సిద్ధిరాములు పాల్గొన్నారు. -
చేర్యాల బంద్ సంపూర్ణం
చేర్యాల : జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను జనగామ జిల్లా సాధన కోసం చేర్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు ఆహ్వానించిన నేపథ్యంలో చేర్యాల పరిరక్షణ సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. చేర్యాల పరిరక్షణ సమితి కన్వీనర్ పందిళ్ల నర్సయ్య, చాంబర్ ఆఫ్ కామర్స్ అ««దl్యక్షుడు ఉడుముల భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుర్మ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని దుకాణాలు, పాఠశాలు, కళాశాలలు బంద్ చేయించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి సినిమా టాకీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కోదండరాంను చేర్యాలకు ఆహ్వానించి, సభ నిర్వహించాలనే ఆలోచనే సరికాదన్నారు. స్థానికుల మనోభావాలను అన్ని పార్టీలు గౌరవించాలన్నారు. చేర్యాలను సిద్ధిపేట జిల్లాలో కొనసాగించి, అక్కడి రెవెన్యూ డివిజన్‌లోనే కలపాలన్నారు. సర్పంచులు పెడతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము రవి, బొమ్మగోని రవిచందర్, ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, నాయకులు కందుకూరి సిద్దిలింగం, ఎండీ.మోయిన్, ఉప్పల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ విభజన ఎందుకు: కోదండరామ్
కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐదో షెడ్యూలులోని ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ ఒకే జిల్లాలో ఉంచాలని కోరారు. వరంగల్‌ను రెండు జిల్లాలుగా విభజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలపాలని ఆయన అన్నారు. గద్వాల, జనగామ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని తెలిపారు. ఇక మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోవాలనుకుంటున్న ఒప్పందం మంచిదే గానీ, ఆ ఒప్పందం వివరాలేంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే... ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ డైరీలో ఉన్న వివరాలు అన్నింటినీ కూడా బయటపెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. -
‘జేఏసీ నుంచి ఉద్యోగులు ఎందుకు వెళ్లారో? ’
హైదరాబాద్: 'ప్రజలపై జేఏసీకి ప్రేమ ఉంది...ఎవరి పట్లా శత్రుత్వం లేదు.. ఉద్యోగ సంఘాల వారు ఏ ఇబ్బందుల కారణంగా జేఏసీ నుంచి వైదొలిగారో తెలియదు' అని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. శుక్రవారం టీజేఏసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జేఏసీలో ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాతే తేలుతుందని చెప్పారు. వచ్చే వారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలతో విద్యావంతులు, ప్రజల సమస్యలపై గళమెత్తాలని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలొక్కటే ప్రజాస్వామ్యం కాదు.. ఎన్నికల అనంతరం కూడా ప్రజల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వికారాబాద్ రూరల్: తెలంగాణ ఉద్యమం గురించి తెలియనివారు, ఉద్యమంలో పాల్గొననివారు ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యమకారుడు మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పరామర్శించారు. అనం తరం విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో కాంట్రాక్టులను ఉద్యమకారులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉద్యమకారులకు కోటాను కల్పించాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు
-
ప్రజాసంక్షేమమే మా ఎజెండా
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వనపర్తిటౌన్: ‘ప్రజలు బాగుపడితే మేమే బాగు పడుతున్నట్లుగా ఆనందించి బతుకుతున్న వ్యక్తులం.. మాకు ప్రజల బాగోగులు తప్ప ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేవు’ అని తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఒకరిపై మరొకరు తిట్టిపోసుకునే రాజకీయాల జోలికి వెళ్లబోమని, రాజకీయాలు తనకు అవసరం లేదని స్పష్టంచేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని పాలిటెక్నిక్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) నిర్వహించిన ‘ప్రభుత్వ విద్య సంక్షోభం.. పరిష్కార మార్గాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక శ్వాస, ధ్యాసంతా అనునిత్యం ప్రజల వైపే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ విద్యను నిర్వర్యీం చేసేందుకు, తన బంధువులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ రంగాన్ని తీసుకొచ్చారని కోదండరాం మండిపడ్డారు. బాబు నిర్వాహకం వల్లే ప్రైవేట్ పెత్తనం పెరిగి, ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు చొరవచూపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించి నైపుణ్యాలు పెంపొందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించారు. ఉపాధిహామీ, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటో అర్థంకావడం లేదని విస్మయం వ్యక్తంచేశారు. ఉపాధిహామీ కూలీల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేసి వాటి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ఉపాధ్యక్షుడు ఆర్.విజయ్‌కుమార్, పబ్లికేషన్ కార్యదర్శి సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజు, రవీందర్‌గౌడ్, జిల్లా మహిళా ప్రతినిధులు పుష్పలత, శారద పాల్గొన్నారు. -
సుబ్బన్నకు పెద్ద హోదా..
హన్మకొండ అర్బన్: అనుకున్నట్లే జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సు బ్బారావు(సుబ్బన్న)కు పెద్ద హోదా దక్కింది. ఇంతకాలం గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయనను జిల్లా రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యో గ లోకాన్ని ఉద్యమం వైపు ముందుండి నడిపిన సుబ్బన్నకు సీఎం చొరవతో సముచిత స్థానం దక్కిందని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. 11నెలల ఎదురుచూపులు ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న పరిటాల ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఉద్యోగ నాయకుల్లో ఒకరుగా చెప్పాలి. ఇదే చొరవతో సుబ్బారావులో ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన సీఎం స్వయంగా ఆయన పదోన్నతి అంశా న్ని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో ప్రస్తావించారు. ఈ విషయంలో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలిశారు. వివిధ కారణాలతో నిర్ణయం విషయంలో జాప్యం జరిగింది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సమయంలో సైతం ఇదే విషయంపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు. సీఎం, ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నా... కొన్ని సాకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. 1908 నాటి చట్టంతో... సుబ్బారావుకు పదోన్నతి విషయంలో నిబంధనలు అడ్డురావడంతో 1908 నాటి చట్టం ఆధారంగా ప్రస్తుతం నేరుగా రిజి స్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. చ ట్టంలో ప్రభుత్వం ఒక వ్యక్తిని నేరుగా జిల్లా రిజిస్ట్రార్‌గా సీఎం ఆదేశాలతో నియమించే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుత నియామకం జరిగింది. ఇక పదోన్నతి కాకుండా నేరుగా నియామకం చేసినా... గత సర్వీసు నష్టం కాకుండా కొత్త సర్వీసుకు కలిపే అవకాశం నిబంధనల్లో ఉంది. కారుణ్య నియామకం నుంచి... సుబ్బారావు తండ్రి సత్యమూర్తి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ చనిపోయూరు. కారుణ్య నియామకం ద్వారా సుబ్బారావు జిల్లాలోని ఫోర్ట్ వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 1983లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. సర్వీసు మొత్తం దాదాపు అక్కడే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన సమయంలో పెద్దపల్లి బదిలీ అయి.. కొద్ది రోజులకే జిల్లాకు వచ్చారు. ఇక ఇటీవల సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-1గా పదోన్నతి రావడంతో జిల్లా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ప్రస్తుతం డీఐజీ కార్యాలయంలోనే సుబ్బారావు కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వం... ఉద్యమానికి స్ఫూర్తివంతమైన నాయకత్వం అందించిన కారణంగానే సుబ్బారావు విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారనడంలో సందేహం లేదు. అయితే సుబ్బారావు విద్యాభ్యాసం జిల్లాలో ఫాతిమా స్కూల్, ఆర్ట్స్ కళాశాలల్లో కొనసాగింది. 1979-80ప్రాంతంలో కళాశాలకు విద్యార్థి సంఘం కార్యదర్శిగా సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగంలో చేరిన తర్వాత సుమారు రెండు దశాబ్దాలుగా సంఘం నాయకత్వం పగ్గాలు వివిధ హోదాల్లో చేపట్టి వాటికి వన్నెతెచ్చారు. ప్రస్తుతం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్బారావు కొనసాగుతున్నారు. ప్రభుత్వం సుబ్బారావును రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు రాజేష్‌గౌడ్, జగన్మోహన్రావు, రత్నవీరాచారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈవీ.శ్రీనివాస్‌రావు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సుబ్బారావుకు భార్యశైలజ, కుమార్తెలు సత్య, సాయితన్మయి ఉన్నారు. ఆయన ఇంకా నాలుగున్నరేళ్ల సర్వీస్ ఉంది. -
చంద్రబాబు కాలం నుంచీ అంతే
ఓయూ ఉద్యోగుల మహాధర్నాలో నేతల ఆరోపణ ఉస్మానియా యూనివర్సిటీ: గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పటి నుంచి విశ్వవిద్యాలయాల నిధుల కుదింపు ప్రారంభమైందని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. బ్లాక్ గ్రాంట్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట జరిగిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర పాలకులు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే డాక్టర లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు భాగాన నిలిచిన అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. జేఏసీ అధ్యక్షుడు ప్రొ.భట్టు సత్యనారాయణ, ఉద్యోగుల నేత కంచి మనోహార్ మాట్లాడుతూ బడ్జెట్ పెంపునకు అధ్యాపకులు, ఉద్యోగులు చేపట్టిన తెలంగాణ వర్సిటీల బంద్ విజయవంతమైనట్లు తెలిపారు. గడువు కోరిన అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని ముందే తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు జేఏసీ నాయకులతో గురువారం ఉదయం చర్చలు జరిపారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ నాగిరెడ్డి, ఉన్నత విద్యా కార్యదర్శి వికాస్‌రాజ్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.పాపిరెడ్డితో టి.వర్సిటీల ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రొ.భట్టు సత్యనారాయణ, ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మనోహార్, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కంచి మనోహార్, పార్థసారథి, మల్లేష్ చర్చల్లో పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రభుత్వ అధికారులు తొలుత వ్యతిరేకతను ప్రదర్శించినా తర్వత సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ నేతలు వివరించారు. వారం రోజుల గడువును అడిగినట్లు జేఏసీ నాయకులు మహాధర్నాలో వివరించారు. మహాధర్నాలో ప్రొ.కోదండరామ్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, విశ్రాంత అధ్యాపకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపోరాటాలతోనే తెలంగాణ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం తిరుమలగిరి, న్యూస్‌లైన్: సకల జనుల పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని.. అలాగే ఐక్యత చూపిస్తూ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తిరుమలగిరిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లా ప్రాముఖ్యత ఎనలేనిదని కొనియాడారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో తెలంగాణ ఉద్యోగస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ముంపుపేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రాంతానికి తరలించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణను సాధించుకోవడం ఒక ఎత్తని. ఇప్పుడు మన అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని కోరా రు. తెలంగాణ ప్రాంత అభివృద్ధే జేఏ సీ లక్ష్యమని, తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, ధర్మార్జున్, మల్లేష్, కోటాచలం, బిచ్చునాయక్, నవీన్, నాగానంద్, రాంచందర్‌గౌడ్ పాల్గొన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డికి పరామర్శ అర్వపల్లి : ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని శుక్రవారం రాత్రి నాగారంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. అనంతరం విద్యాశాఖకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. పరామర్శించిన వారిలో జేఏసీ జిల్లా ఛైర్మన్ జి.వెంకటేశ్వర్లు, టీవీవీవీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, పొన్న మల్లేష్‌నేత, దబ్బేటి అంజయ్య, పగిళ్ల సైదులు, తహసిల్దార్ అరుణజ్యోతి, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, దావుల వీరప్రసాద్ యాదవ్, వలిగొండ కృష్ణ, న్యాయవాది పాటి నాగిరెడ్డి, పాశం యాదవరెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రత్యేక రాష్ట్రంలోనూ పోరాటమే
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో జరిగి ఎన్నికల్లో ప్రజలు పోరాట స్ఫూర్తిని కొనసాగించి అర్థవంతమైన తీర్పునిచ్చారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అద్భుతమనీ, అయితే ఇంకా సంక్షోభాలు పొంచి ఉన్నాయన్నారు. వీటిని తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేరుతాయన్నారు. తెలంగాణ జేఏసీ ఇక ముందు ప్రజలతో కలిసి నడుస్తుందన్నారు. విభజన నేపథ్యంలో జరిగే పంపకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వలసీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమాలు అనివార్యమన్నారు. ప్రస్తుతం సర్కార్‌ను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఉద్యోగుల విభజన అంశంలో ఆప్షన్స్ చట్టంలో లేవన్నారు. 610జీవో, గిర్గ్లానీ కమిషన్ ప్రతిపాదన ఆధారంగా, విభజన మార్గదర్శకాలు, స్థానిక రిజర్వేషన్లు, ఆర్టికల్ 371డీ లోబడి ఉద్యోగుల విభజన జరిగినప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ జేఏసీ అభివృద్ధికి, పౌర సమాజానికి అండగా ఉంటుందన్నారు. కోదండరాం వెంట టీజేఏసీ తూర్పుజిల్లా అధ్యక్షులు డా. పాపయ్య, వెంకట్రాంరెడ్డి ఉన్నారు. -
హోరెత్తించిన రైతు రంకె
సాక్షి, అనంతపురం / కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘రాష్ట్రాన్ని విభజిస్తే అధికంగా నష్టపోయేది రైతులే. కావున అన్నదాతలు ఉద్యమానికి నాయకత్వం వహించి పోరాడాలి. అప్పుడే విభజనకు బ్రేక్ పడుతుంద’ని జిల్లా సంయుక్త జేఏసీ చైర్మన్, డీఆర్వో హేమసాగర్ పిలుపునిచ్చారు. నగరంలో బుధవారం నిర్వహించిన ‘అనంత రైతు రంకె’ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. మరీ ముఖ్యంగా కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లా మరింత వెనకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతంలో ఉన్న వేర్పాటువాదులు కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటారన్నారు. ‘జిల్లాలో 2004 నుంచి ఇప్పటి వరకు అప్పుల బాధ తాళలేక 763 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలోనే పరిస్థితి ఇలా ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతాడు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా పోతాయి. విభజన అనేది విష సంస్కృతి. ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు పెంచి పోషించిన ఈ సంస్కృతిని నేడు కొందరు వంట బట్టించుకున్నారు. వారి వల్లే రాష్ట్ర విభజన జరుగుతోంది. దాన్ని ప్రోత్సహిస్తే దేశ వ్యాప్తంగా పాకుతుంది. కావున సమైక్య రాష్ట్ర పరిరక్షణకు రైతులు నడుం బిగించాల’ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీమాంధ్ర ఉద్యాన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్ని రోజులు పెన్నులు పట్టిన వారు ఉద్యమం చేస్తున్నారు.. ఇప్పుడు హలాలు, పలుగు, పార పట్టిన వారూ ఉద్యమంలోకి రావడం శుభపరిణామమని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కరుణాకర్ శర్మ, పశు సంవర్ధక శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు నగేష్, పట్టుపరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి, డీపీఆర్వో తిమ్మప్ప, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, పశుసంవర్ధకశాఖ డీడీ జయకుమార్, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుప్రకాష్, కర్నూలు డ్వామా పీడీ హరినాథరెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగిని పద్మావతి, ఎంపీడీఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేఏసీ నాయకులు రత్నకుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉర్రూతలూగించిన కళాకారులు ‘అనంత రైతు రంకె’లో కళాకారులు ఆట పాటలతో ఉర్రూతలూగించారు. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా... సమైక్యాంధ్ర నిలబెట్టు తెలుగోడా’ అంటూ ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపారు. శ్రీ నృత్యకళా నిలయం డ్యాన్స్ మాస్టర్ సంధ్యామూర్తి శిష్యురాళ్లు కావ్య, సాయిసింధు, దివ్య, సాయిలక్ష్మి, రితిక్, మౌనికల గణపతి ప్రార్థన ఆకట్టుకుంది. శ్రీనివాస నృత్యకళానికేతన్ డ్యాన్స్ మాస్టర్ విజయ్‌కుమార్, శిష్యురాలు కృతి అయ్యంగార్, కరిష్మా కల్చరల్ అసోసియేషన్, మక్బుల్ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు వివిధ పాటలకు నృత్యాలు చేసి అలరించారు. నెల్లూరు నుంచి వచ్చిన అన్నదాత మణి ఆట్టుకునేలా ప్రసంగించారు. దిగ్విజయ్, కేసీఆర్, టీఆర్ఎస్, యూపీఏ సర్కార్‌పై ఆయన విసిరిన ఛలోక్తులు రైతులను ఆకట్టుకున్నాయి. -
నేడు నల్లగొండకు కోదండరాం రాక
నల్లగొండ, న్యూస్‌లైన్ : నేడు జిల్లా కేంద్రానికి పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విచ్చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పొలిటికల్ జేఏసీ ఈనెల 29న తలపెట్టిన సకల జనభేరి సదస్సును విజయవంతం చేసేందుకు స్థానికంగా శుక్రవారం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు కోదండరాం విచ్చేస్తున్నట్టు జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పెన్షనర్స్ భవన్లో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. ఆయనతో పాటు జిల్లా జేఏసీ ఇన్చార్జ్ వెంకటేశం హాజరవుతున్నట్టు తెలిపారు. -
సమరభేరి
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో 39వ రోజు శనివారం సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నీటిపారుదలశాఖ అధికారులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం దిష్టిబొమ్మను ఊరేగించి నెల్లూరు హరనాథపురం సెంటర్లో ఉరితీశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిం చారు. జిల్లాలో ఆదివారం జరగనున్న షర్మల బస్సుయాత్రల సభల ఏర్పాట్లను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్షలు సాగుతున్నాయి. వీటికి వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన బహిరంగ సభను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవాలని చూడడం అప్రజాస్వామికమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నా రు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొ ట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషే కం నిర్వహించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో కవులు రిలే నిరాహార దీక్ష , ఆత్మకూరు బస్టాండ్ వద్ద బ్రాహ్మణ సంఘం ర్యాలీ జరిగింది. హైదరాబాడ్లో అపాడ్లో శనివారం శిక్షణకు హాజరైన ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీఓలను తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ఉపాధిహామీ ఉద్యోగులు ససేమిరా అనడంతో మహిళలని కూడా చూడకుండా రాళ్లతో తరుముకున్నారు. ఉదయగిరిలో పట్టణ యూత్ ఆధ్వర్యంలో బం ద్, ర్యాలీలు, వంటవార్పు జరిగాయి. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకులు రిలే దీక్షలు నిర్వహించారు. మం డలంలోని గండిపాళెంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్.అంకయ్య చౌదరి చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. జిర్రావారిపాళెం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలంటూ వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పాత బస్టాండ్ సెంటర్ నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్వీఎం పాఠశాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన జరగడానికి చంద్రబాబునాయుడే కారణమని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనతో అభ్యంతరం లేదని చంద్రబాబు రాసిన లేఖను పోస్టర్లగా చేసి టవర్‌క్లాక్ సెంటర్లో ఆయన ప్రదర్శించారు. చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం గ్రామంలో రైతులు సమైక్యాంధ్ర కోరుతూ ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. పొదలకూరులో అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొదలకూరులో రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేగేట్ సెంటర్లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పీర్లచావిడి సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరం బస్టాండ్ సెంటర్‌కు మార్పు చేశారు. కొందరు సమైక్యవాదులు నెల్లూరు-1 డిపోకు చెందిన బస్సుకు మనుబోలులో అద్దాలు, సూళ్లూరుపేటలో టైర్లలో గాలి తీసేశారు. కావలిలో జరగనున్న షర్మిల బస్సు యాత్ర సభ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేనిరాహారదీక్షలకు వారు సంఘీభావం తెలిపారు. పభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. హైరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో షామియానాతో ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేశారు.