సుబ్బన్నకు పెద్ద హోదా.. | Subbanna to the high status .. | Sakshi
Sakshi News home page

సుబ్బన్నకు పెద్ద హోదా..

Published Sun, May 17 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

సుబ్బన్నకు పెద్ద హోదా..

సుబ్బన్నకు పెద్ద హోదా..

హన్మకొండ అర్బన్:
అనుకున్నట్లే జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సు బ్బారావు(సుబ్బన్న)కు పెద్ద హోదా దక్కింది. ఇంతకాలం గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయనను జిల్లా రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యో గ లోకాన్ని ఉద్యమం వైపు ముందుండి నడిపిన సుబ్బన్నకు సీఎం చొరవతో సముచిత స్థానం దక్కిందని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

11నెలల ఎదురుచూపులు
ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న పరిటాల ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఉద్యోగ నాయకుల్లో ఒకరుగా చెప్పాలి. ఇదే చొరవతో సుబ్బారావులో ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన సీఎం స్వయంగా ఆయన పదోన్నతి అంశా న్ని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో ప్రస్తావించారు. ఈ విషయంలో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులను కలిశారు. వివిధ కారణాలతో నిర్ణయం విషయంలో జాప్యం జరిగింది. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సమయంలో సైతం ఇదే విషయంపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు.  సీఎం, ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నా... కొన్ని సాకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది.

1908 నాటి చట్టంతో...
సుబ్బారావుకు పదోన్నతి విషయంలో నిబంధనలు అడ్డురావడంతో 1908 నాటి చట్టం ఆధారంగా ప్రస్తుతం నేరుగా రిజి స్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. చ ట్టంలో ప్రభుత్వం ఒక వ్యక్తిని నేరుగా జిల్లా రిజిస్ట్రార్‌గా సీఎం ఆదేశాలతో నియమించే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రస్తుత నియామకం జరిగింది. ఇక పదోన్నతి కాకుండా నేరుగా నియామకం చేసినా... గత సర్వీసు నష్టం కాకుండా కొత్త సర్వీసుకు కలిపే అవకాశం నిబంధనల్లో ఉంది.

కారుణ్య నియామకం నుంచి...
సుబ్బారావు తండ్రి సత్యమూర్తి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ చనిపోయూరు. కారుణ్య నియామకం ద్వారా సుబ్బారావు జిల్లాలోని ఫోర్ట్ వరంగల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 1983లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. సర్వీసు మొత్తం దాదాపు అక్కడే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన సమయంలో పెద్దపల్లి బదిలీ అయి.. కొద్ది రోజులకే జిల్లాకు వచ్చారు.  ఇక ఇటీవల సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-1గా పదోన్నతి రావడంతో జిల్లా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ప్రస్తుతం డీఐజీ కార్యాలయంలోనే సుబ్బారావు కొనసాగుతున్నారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వం...
ఉద్యమానికి స్ఫూర్తివంతమైన నాయకత్వం అందించిన కారణంగానే సుబ్బారావు విషయంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారనడంలో సందేహం లేదు. అయితే సుబ్బారావు విద్యాభ్యాసం జిల్లాలో ఫాతిమా స్కూల్, ఆర్ట్స్ కళాశాలల్లో కొనసాగింది. 1979-80ప్రాంతంలో కళాశాలకు విద్యార్థి సంఘం కార్యదర్శిగా సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగంలో చేరిన తర్వాత సుమారు రెండు దశాబ్దాలుగా సంఘం నాయకత్వం పగ్గాలు వివిధ హోదాల్లో చేపట్టి వాటికి వన్నెతెచ్చారు.

ప్రస్తుతం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుబ్బారావు కొనసాగుతున్నారు. ప్రభుత్వం సుబ్బారావును రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించడంతో జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు రాజేష్‌గౌడ్, జగన్మోహన్‌రావు, రత్నవీరాచారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈవీ.శ్రీనివాస్‌రావు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సుబ్బారావుకు భార్యశైలజ, కుమార్తెలు సత్య, సాయితన్మయి ఉన్నారు. ఆయన ఇంకా  నాలుగున్నరేళ్ల సర్వీస్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement