సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో 39వ రోజు శనివారం సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. నీటిపారుదలశాఖ అధికారులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం దిష్టిబొమ్మను ఊరేగించి నెల్లూరు హరనాథపురం సెంటర్లో ఉరితీశారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిం చారు. జిల్లాలో ఆదివారం జరగనున్న షర్మల బస్సుయాత్రల సభల ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్షలు సాగుతున్నాయి. వీటికి వైఎస్సార్‌సీపీ సంఘీభావం తెలిపింది.
హైదరాబాద్‌లో ఏపీ ఎన్‌జీఓలు తలపెట్టిన బహిరంగ సభను టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవాలని చూడడం అప్రజాస్వామికమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నా రు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొ ట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషే కం నిర్వహించారు. నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో కవులు రిలే నిరాహార దీక్ష , ఆత్మకూరు బస్టాండ్ వద్ద బ్రాహ్మణ సంఘం ర్యాలీ జరిగింది. హైదరాబాడ్‌లో అపాడ్‌లో శనివారం శిక్షణకు హాజరైన ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీఓలను తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ఉపాధిహామీ ఉద్యోగులు ససేమిరా అనడంతో మహిళలని కూడా చూడకుండా రాళ్లతో తరుముకున్నారు.
ఉదయగిరిలో పట్టణ యూత్ ఆధ్వర్యంలో బం ద్, ర్యాలీలు, వంటవార్పు జరిగాయి. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకులు రిలే దీక్షలు నిర్వహించారు. మం డలంలోని గండిపాళెంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్.అంకయ్య చౌదరి చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. జిర్రావారిపాళెం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావాలంటూ వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పాత బస్టాండ్ సెంటర్ నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్‌వీఎం పాఠశాలలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన జరగడానికి చంద్రబాబునాయుడే కారణమని వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనతో అభ్యంతరం లేదని చంద్రబాబు రాసిన లేఖను పోస్టర్లగా చేసి టవర్‌క్లాక్ సెంటర్‌లో ఆయన ప్రదర్శించారు. చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం గ్రామంలో రైతులు సమైక్యాంధ్ర కోరుతూ ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు.
పొదలకూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొదలకూరులో రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేగేట్ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
పీర్లచావిడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరం బస్టాండ్ సెంటర్‌కు మార్పు చేశారు. కొందరు సమైక్యవాదులు నెల్లూరు-1 డిపోకు చెందిన బస్సుకు మనుబోలులో అద్దాలు, సూళ్లూరుపేటలో టైర్లలో గాలి తీసేశారు. కావలిలో జరగనున్న షర్మిల బస్సు యాత్ర సభ ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేనిరాహారదీక్షలకు వారు సంఘీభావం తెలిపారు.
పభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. హైరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో షామియానాతో ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేశారు.
సమరభేరి
Published Sun, Sep 8 2013 5:31 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement