నేడు నల్లగొండకు కోదండరాం రాక | today jac chairman kodandaram nalgonda | Sakshi
Sakshi News home page

నేడు నల్లగొండకు కోదండరాం రాక

Published Fri, Sep 20 2013 2:58 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

today jac chairman kodandaram  nalgonda

నల్లగొండ, న్యూస్‌లైన్ :  నేడు జిల్లా కేంద్రానికి పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విచ్చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పొలిటికల్ జేఏసీ ఈనెల 29న తలపెట్టిన సకల జనభేరి సదస్సును విజయవంతం చేసేందుకు స్థానికంగా శుక్రవారం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు  కోదండరాం విచ్చేస్తున్నట్టు జేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి  తెలిపారు. స్థానిక పెన్షనర్స్ భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్న సమావేశంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. ఆయనతో పాటు జిల్లా జేఏసీ ఇన్‌చార్జ్ వెంకటేశం హాజరవుతున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement