![professor kodandaram Contest From Huzurnagar - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/11/kodandaram.jpg.webp?itok=sofNa9g4)
ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరామ్ హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలుపొందిన తరువాత ఎమ్మెల్యేగా రాజీనామా అనంతరం ఖాళీ అయిన ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేయనున్నారు. ఆయన గెలుపు కోసం ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు, టీవీయూవీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఎమ్మెల్యేలు ప్రస్తుతం లేనందున కోదండరామ్ గెలుపుకోసం కృషి చేస్తామని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నిజ్జన రమేష్‌ముదిరాజ్ తెలిపారు. హుజుర్‌నగర్‌లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment