హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్‌స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్‌లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం.
► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్‌లు పాల్గొంటారు.
► స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు.
► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్‌రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు.
► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు.
► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment