Hyderabad Literary Festival
-
కాంతులీనిన కళా కౌముది.. ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: సాహిత్యం, చిత్రలేఖనం తదితర కళలకు వేదికగా నిర్వహించిన 13వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సైఫాబాద్ లోని విద్యారణ్య పాఠశాలలో జరిగిన ఈ వేడుక 3 రోజుల పాటు నగర వాసులను అలరించింది. ఆద్యంతం.. వైవిధ్యం.. చివరి రోజైన ఆదివారం తొలి ప్యానెల్ చర్చలో భారతీయ ఒంటరి యువతి.. దగ్గర తనం కోసం అన్వేషణ, స్వేచ్ఛ అనే అంశంపై వరల్డ్ బ్యాంక్ ఉద్యోగినిగా సేవలు అందిస్తున్న శ్రేయణ, సి.రామమోహన్‌రెడ్డిల మధ్య డెస్పరేట్లీ సీకింగ్ ఫర్ షారూఖ్ రచనపై జరిగిన సంభాషణ అర్థవంతంగా సాగింది. హైదరాబాద్ బుక్ 2 ఆఫ్ ది పార్టిషన్‌పై రచయిత్రి మన్రీత్ సోథీ, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సోమేశ్వర్ సాతి, ఎ.సునీతలు చర్చ చరిత్రలోకి తొంగిచూసింది. అదే విధంగా పలు అంశాలపై ప్యానెల్ చర్చలు ఆసక్తికరంగా సాగాయి. కావ్యధారలో భాగంగా సరోజిని నాయుడు కవిత నుంచి స్ఫూర్తి పొందిన బర్డ్ ఆఫ్ టైమ్‌ను నగరానికి చెందిన కాలేజ్ ప్రొఫెసర్, నృత్య కళాకారిణి మైథిలి ప్రదర్శించారు, హమ్ ఐసీ బోల్లీ పేరిట హైదరాబాద్‌కి చెందిన పలువురు కవుల సమూహం అందించిన కవితలు స్థానికతకు పట్టం కట్టాయి. వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్‌షాప్‌లో పర్యావరణ వేత్త నల్లపురాజు చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తించాయి. భారతీయ సైన్ లాంగ్వేజ్‌పై సంబంధిత నిపుణురాలు అంజుఖేమాని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా సైన్స్ స్టోరీస్ ఫర్ ఆల్ అంటూ రోహిణి చింత సైన్స్‌ని కొత్తగా వినిపించారు. మూవీ ఇమేజెస్‌లో నాచో–మియా కంపోజర్ ప్రదర్శన... ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇండీ ఎక్స్‌ప్రెస్ సంగీతం వీనుల విందు చేయగా, తుది కార్యక్రమంగా నిర్వహించిన మనాల్ పాటిల్, రవి గైక్వాడ్ల స్టాండప్ కామెడీ ఆహూతులకు నవ్వుల్ని పంచింది. నృత్యం, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం.. ఇలా విభిన్న అంశాల మేలు కయికగా సాగిన ఫెస్ట్‌ని ఆహూతులు, కళాభిమానులు బాగా ఆస్వాదించారు. రెండేళ్ల విరామం తర్వాత కూడా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తనదైన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. -
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్‌యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్‌ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్: రెండో రోజు విశేషాలు ఇవే..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 10 గంటలకు ‘ది లాస్ట్ హీరోస్–ఫూట్ సోల్జియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడ మ్’ అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు, రచయిత పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి సునీతారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 10.50 నుంచి 11.35 గంటల వరకు ‘కాన్స్టిట్యూషన్ : ఏ సిస్ఫియన్ లైఫ్ ఇన్ లా’ అనే అంశంపై ప్రొఫెసర్ కల్పన కన్నబీరన్, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడతారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ► ఉదయం 11.40 గంటల నుంచి 12.25 వరకు ఎవరెస్టు అధిరోహించిన విజేతలు అపర్ణ తోట, పూర్ణ మాలావత్లతో ఉమా సుధీర్ ప్రత్యేక కార్యక్రమం. ► కావ్యధార వేదికపై ఉదయం10.50 గంటలకు బహు భాషా కవితా పఠనం. దీప్తి నావల్, జెర్రీ పింటో, కల్యాణీ ఠాకూర్లు పాల్గొంటారు. ► స్టోరీ టెల్లింగ్‌లో భాగంగా ఉదయం 10 .30 నుంచి 11.20 వరకు ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ ఆసక్తికరమైన కథలు చెబుతారు. ► మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.45 వరకు గోవా భాషలు (గోవా బార్డరీ బర్రెట్టో) అనే అంశంపైన ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో,జెర్రీ పింటో మాట్లాడతారు. గిరిధర్‌రావు సమన్వకర్తగా వ్యవహరిస్తారు. ► మధ్యాహ్నం 3.40 నుంచి 4.25 వరకు విమెన్ ఇన్ సైన్స్ అనే అంశంపైన చర్చా కార్యక్రమం ఉంటుంది. నస్రీన్ ,వినీత బాల్, సాగరి రాందాస్, తదితరులు పాల్గొంటారు. ► సాయంత్రం 5.20 నుంచి 6.20 గంటల వరకు ఫుగ్డీ అండ్ ధాలో కొంకణి జానపద నృత్యరూపకం. ధ్యానజ్యోతి మహిళా మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ► సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు నాన్ నూకడ్ వేదికపై ప్రత్యేక సంగీత కార్యక్రమం. వరిజశ్రీ వేణుగోపాల్ నిర్వహిస్తారు. -
మూడు రోజులు.. పదమూడు వేదికలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవం(హెచ్ఎల్ఎఫ్) సంబరంగా ప్రారంభమైంది. సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విద్యారణ్య స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లిటరరీ ఫెస్టివల్ ఆరంభమైంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రచయిత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరు కాగా, జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈశాన్యరాష్ట్రాల నుంచి దక్షిణాది కేరళ, తమిళనాడు, ఒడిశా, తదితర అన్ని రాష్ట్రాలకు చెందిన సాహితీప్రియులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్,తదితర దేశాలకు చెందిన రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్యోత్సవం కోసం 13 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల పాటు సాహిత్యం, కళలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన సుమారు 150 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. (క్లిక్ చేయండి: పేరెంటింగ్.. కూతురు నేర్పిన పాఠం) -
హైదరాబాద్ సాహిత్యోత్సవం.. ప్రత్యేకతలు ఇవే
సాక్షి, హైదరాబాద్: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సాహితీ ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) 13వ ఎడిషన్‌కు నగరం సన్నద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు విద్యారణ్య స్కూల్ వేదికగా వేడుకలు జరగనున్నాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్ సాహిత్యోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నుంచి నిరాటంకంగా (కోవిడ్ కాలం మినహా) జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యాన్ని గడించింది. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు, భిన్న భావజాలాలు, విభిన్న జీవన సమూహాలను ప్రతిబింబించే కళారూపాలకు, సాహిత్య, సాంస్కృతిక ప్రక్రియలకు ఇది వేదికగా నిలిచింది. మూడు రోజుల పాటు సాహితీ ప్రియులను అక్కున చేర్చుకొని సమకాలీన సాహిత్య, సామాజిక అంశాలపై లోతైన చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అతిథి దేశంగా జర్మనీ.. హెచ్ఎల్ఎఫ్ 13వ ఎడిషన్‌కు జర్మనీ అతిథి దేశంగా హాజరు కానుంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, మేధావులు భాగస్వాములు కానున్నారు. ప్రముఖ జర్మనీ యువ నవలా రచయిత్రి ఎవేన్‌కో బుక్కోసీ ఈ వేడుకల్లో పాల్గొంటారు. జర్మనీ కళారూపాలను ప్రదర్శించనున్నారు. కొంకణి సాహిత్యం ఎంపిక.. ఈ ఏడాది కొంకణి భాషా సాహిత్యాన్ని భారతీయ భాషగా ఎంపిక చేశారు. గతేడాది జ్ఞానపీఠ అవార్డు పొందిన కొంకణికి చెందిన ప్రముఖ రచయిత దామోదర్ మౌజో ఈ వేడుకల్లో కీలకోపన్యాసం చేయనున్నారు. కొంకణి భాషా చిత్రాల దర్శకుడు బార్డ్‌రాయ్‌బరెక్టో పాల్గొంటారు. కొంకణి నృత్యాలు, జానపద కళలను ప్రదర్శించనున్నారు. ప్రముఖుల ప్రసంగాలు ప్రఖ్యాత దర్శకుడు దీప్తీ నవల్, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పాలగుమ్మి సాయినాథ్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మానస ఎండ్లూరి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి గీతా రామస్వామి, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. జర్మనీతో పాటు అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్ చారిత్ర వైభవాన్ని, వాస్తు నైపుణ్యాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉషా ఆకెళ్ల రూపొందించిన ‘హమ్ ఐసీ బాత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది అందరి వేడుక: ప్రొఫెసర్ విజయ్‌కుమార్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఈసారి మెట్రో రైల్ ప్రత్యేక ప్రచారం నిర్వహించనుంది. ఖైరతాబాద్ నుంచి విద్యారణ్య స్కూల్ వరకు మూడు రోజుల పాటు ప్రతి 15 నిమిషాలకో ఉచిత ట్రిప్పును ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) -
సినిమా, సాహిత్యం పరస్పర ప్రభావితాలే
సాక్షి, హైదరాబాద్: సాహిత్యం సినిమాలపైన ప్రభావం చూపించినట్లుగానే వాటిపై సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయని ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, రచయిత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆదూర్ గోపాల కృష్ణన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ విద్యారణ్య స్కూల్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సారి వేడుకలకు అతిథి దేశంగా పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రతినిధిగా చెన్నైలోని ఆ దేశ కాన్సుల్ జనరల్ సుసాస్ గ్రేస్ మరో అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదూర్ గోపాల కృష్ణన్ మాట్లాడుతూ..‘సాధారణంగా సాహిత్యంనుంచి సినిమాలు రూపొందుతాయి. నవల,కథా సాహిత్యం ఇందుకు దోహదం చేస్తుంది. సమాజంలోని విభిన్న దృక్కోణాల నుంచి వెలువడే సాహిత్యం ఆధారంగానే సినిమాలు రూపొందినట్లుగానే సినిమాల నుంచి కూడా సాహిత్యం వస్తుంది.’అని అన్నారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మంచి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని, అధికం హోటల్ గదుల్లోనే తయారవుతున్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.సినిమాలు నిజ జీవితాన్ని ప్రతిబింబించడం లేదన్నారు. ‘ఎలిపఠాయం’, ‘సప్తపది’వంటి గొప్ప చిత్రాలను రూపొందించిన ఆదూర్ తన సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గొప్ప సాంస్కృతిక చరిత్ర భారత్ సొంతం... ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సుసాన్ మాట్లాడుతూ, తాను భారతదేశ చరిత్ర, సాహిత్యం, సాంస్కృతిక వైవిధ్యాన్ని వివిధ రచనల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్లుగా తాను ఇండియాలో ఉంటున్నప్పటికీ పుస్తకాల ద్వారానే ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగినట్లు చెప్పా రు. అరుంధతీరాయ్ ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’, విక్రమ్‌సేద్ ‘ది సూటబుల్ బాయ్’వంటి పుస్తకాలు తనను ప్రభావితం చేశాయన్నారు. ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న కార్చి చ్చు వల్ల తాము నష్టపోతున్నట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ అండమాన్ జైలు తరహాలో ఒకప్పుడు ఖైదీలకు .జైలు శిక్ష విధించే కారాగారంగా ఉన్న ఆస్ట్రేలియా ఒక గొప్ప దేశంగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి. విజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచానికి విషాదకరమన్నారు. -
నేటి నుంచి లిటరరీ ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ భాష , సాహిత్య, సాంస్కృతిక సమాహారం హైదరాబాద్ సాహిత్యుత్సవం దశాబ్ది వేడుకలు విద్యారణ్య స్కూల్లో ప్రారంభం కానున్నాయి.వివిధ దేశాలకు చెందిన కవులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి ఆదివారం (ఈనెల 24నుంచి 26) వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన వ్యక్తులు, సంస్థలు ఈ వేడుకల్లో పాల్గొంటాయి. ఈ ఏడాది అతిథి దేశంగా ఆస్ట్రేలియాను ఆహ్వానించారు.ఆ దేశానికి చెందిన జర్నలిస్టులు, రచయితలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సూజన్ గ్రేస్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే ఈ సారి మలయాళ భాషా సాహిత్య, సాంస్కృతిక అంశాలపైన ప్రత్యేకమైన చర్చలు నిర్వహిస్తారు. దీనిపై ప్రముఖ దర్శకులు ఆదూర్‌గోపాల్ కృష్ణ కీలకోపన్యాసం చేస్తారు. ఆస్ట్రేలియాతో పాటు బ్రిటన్, అమెరికా, పోర్చుగల్, తదితర దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. భాష, సాహితీ, సాంస్కృతికరంగాల్లో వచ్చే మార్పులను, పరిణామాలను చర్చించే లక్ష్యంతో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ జరగనుంది. కాగా ఈ సందర్భంగా గతేడాది దివంగతుడైన నటుడు, సాహితీ ప్రముఖుడు గిరీష్ కర్నాడ్‌తో పాటు మరో ఇద్దరు ప్రముఖులను స్మరించుకోనున్నారు. రాజ్యాంగంపై ప్రత్యేక చర్చలు ఈసారి వేడుకల్లో భారత రాజ్యాంగం మూలస్వభావంపైన ప్రత్యేక చర్చలు ఉంటాయని హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్ తెలిపారు. జస్టిస్ చంద్రచూడ్, రోహిత్ డేలు భారత రాజ్యాంగం పైన, దాని ప్రత్యేకతలు, స్వరూప స్వభావాలపైన ప్రసంగిస్తారు. అలాగే ‘ ది ఐడియా ఆఫ్ ఇండియా ఐడెంటిటీ’ పైన మరో చర్చా ఉంటుంది. కశ్మీర్ అంశంపై ప్రముఖ రచయితలు ప్రసంగించనున్నారు. గాంధీ–అంబేడ్కర్–కాస్ట్, పొయెట్రీ–ఐడెంటిటీ, తదితర అంశాలపై సదస్సులు, చర్చలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కేరళలో ప్రాచుర్యం పొందిన కళారూపం ‘కుడియాట్టం’ ప్రదర్శన ఉంటుంది. నాటక రంగ ప్రముఖులు అనురాధా కపూర్ సారధ్యంలో ‘ బనారస్ కా ఠగ్’ ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ టి.విజయ్ కుమార్, జీఎస్పీ రావులు వ్యవస్థాపకులుగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2010లో ప్రారంభమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. -
సాహితీ పరిమళం.. సౌ'భాగ్య' ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: విభిన్న కళలు, సాహిత్యం, సంస్కృతుల్ని ఒక వేదికపైకి తెచ్చే హైదరాబాద్ సాంస్కృతిక ఉత్సవం (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)కు రాజధాని ముస్తాబైంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు జరగనున్న ఈ వేడుకలకు ఇప్పటికే హెచ్ఎల్ఎఫ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తొమ్మిదో ఎడిషన్ వేడుకలకు చైనా అతిథి దేశంగా హాజరుకానుండగా..గుజరాతీ భాషా సాహిత్యాన్ని ఈ ఏడాది భారతీయ భాషగా ఎంపిక చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాది కావడంతో ఆయన తత్వ్త చింతన, సిద్ధాంతాలు, ఆయనపై రూపొందిన సినిమాలపై ఈ వేడుకల్లో చర్చలు, సదస్సులు జరగనున్నాయి. పెద్దనోట్ల రద్దు, ఆధార్ గుర్తింపు, ‘మీ టూ’ఉద్యమం, సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలు, తదితర అంశాలపైన ఈ వేడుకల్లో లోతైన చర్చలు జరగనున్నాయి. చైనా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తం మూడు వేదికలపైన 30 వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ‘కావ్యధార’కు శ్రీకారం ఈ ఏడాది హైదరాబాద్ సాహిత్యోత్సవంలో సరికొత్తగా ‘కావ్యధార’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కావ్యధారలో ప్రతిరోజూ 12 గంటల పాటు నిరంతర కవితా పఠనం ఉంటుంది. ఈ కవి సమ్మేళనంలో తమ కవిత్వాన్ని చదవడమే కాకుండా దానికి వివిధ కళారూపాలను జోడించి ప్రదర్శించడం ఈ కావ్యధార ప్రత్యేకత. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలకు చెందిన కవులు ఈ వేదికను పంచుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కవిత్వానికి సైతం ఇక్కడ చోటు ఉంటుంది. ఈ కావ్యధారలో ఆచార్య ఎన్.గోపీ, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, యాఖూబ్, షబానా ఆజ్మీ, మంగళాభట్, రాజ్‌రావు, ఈల అరుణ్, చైనా రచయిత బైటా తదితరులు పాల్గొంటారు. అలాగే ‘జోష్ – జోష్–ఇ–హైదరాబాద్’పేరుతో దక్కనీ, హిందూస్తానీ కవిత్వ ప్రదర్శనతో పాటుగా లక్నోకు చెందిన కళాకారుల గ్రూపు ‘లక్నవీ కల్చర్’పై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. ‘మీ టూ’, గాంధీయిజంపై చర్చలు... గత ఏడాది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ‘మీ టూ’ఉద్యమంపై హెచ్ఎల్ఎఫ్లో మరోసారి చర్చ జరగనుంది. వైరముత్తు నుంచి ఎదురైన వేధింపులను బయటపెట్టిన చిన్మయి శ్రీపాద, ఎంజే అక్బర్ లైంగిక వేధింపులను బహిర్గతం చేసిన దీదీ’పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్టు షుతపాపల్, బెంగళూర్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ లైంగిక వేధింపులను బయటి ప్రపంచానికి చెప్పిన సంధ్య మీనన్‌లు తమ అనుభవాలను ఆవిష్కరించనున్నారు. ‘గాంధీ ఇంపాజిబుల్–పాజిబిలిటీ’, ‘ది మహాత్మా అండ్ మూవీస్’పై పలువురు ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని ప్రసంగిస్తారు. గుజరాతీ సాహిత్యంపై గాంధీ ప్రభావం అనే అంశంపైన చర్చ ఉంటుంది. ప్రముఖ రచయిత సుధీర చంద్ర, నిర్మాత సురేశ్ జిందేల్, గోవింద్ నిహ్లానీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ‘పెద్దనోట్ల రద్దు’పై చాల్స్ ఎస్సెస్సీ, రామ్మనోహర్రెడ్డి (ఈపీడబ్ల్యూ) ప్రసంగిస్తారు. ‘ది ఆధార్ స్టోరీ’పైన చాల్స్ ఎస్సెస్సీ, కళలు, కళాకారులు, రచయితలు, మేధావులు, తదితర వర్గాలపైన కొనసాగుతున్న దాడులు, వివిధ వర్గాల్లోంచి వస్తోన్న ఆందోళనలపైన నిఖిలా హెన్సీ (హిందూ), రష్మీ సక్సేనా, తదితరులు ప్రసంగిస్తారు. ముస్కాన్‌కు సన్మానం హెచ్ఎల్ఎఫ్, ఫుడ్ ఫర్ థాట్ ఆధ్వర్యంలో భోపాల్‌లో ‘బాల పుస్తకాలయ’గ్రంథాలయాన్ని నడిపిస్తున్న 11 ఏళ్ల చిన్నారి ముస్కాన్‌ను ఈ సందర్భంగా సన్మానించనున్నారు. జగర్నాట్ పబ్లిషింగ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఆకాష్జోషి రచనకు పుస్తక ప్రచురణ అవకాశం కల్పిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా 12 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. పదేళ్ల చిన్నారి కృతి మునగాల రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనుంది. కైఫే ఆజ్మీ, మృణాళిని సారాభాయిల శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా వారిపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడు వేదికలు–ముప్పై వర్క్‌షాపులు ఈ వేడుకల్లో మొత్తం మూడు వేదికలను ఏర్పాటు చేస్తారు. ఒక వేదిక ప్రత్యేకంగా కవిత్వం కో సం కేటాయించగా మిగతా రెండు వేదికలపైన చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో 30 వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చె ప్పారు. మట్టి వస్తువుల తయారీ, స్టోరీ టెల్లింగ్, హౌ టూ రైట్ ఏ ఫిల్మ్, క్విజ్ పోటీలు, సినిమా దర్శకత్వంపై చర్చలు, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చైనా నుంచి ఎనిమిది మంది రచయితలు - అతిథి దేశంగా పాల్గొంటున్న చైనా నుంచి 8 మంది రచయితలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. చైనాకు చెందిన ప్రముఖ రచయిత ఎలాయ్ సమకాలీన చైనా సాహిత్యంపై ప్రసంగిస్తారు. - చైనా సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శిస్తారు. - మొదటి రోజు ప్రారంభోత్సవంలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత సితాన్షు యశస్చంద్ర కీలకోపన్యాసం చేస్తారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొంటారు. -
సాహిత్య సరిగమలు
-
డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం..
సాక్షి, హైదరాబాద్: అనేక రకాల దాడుల నుంచి సెక్యులరిజాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగమే గొప్ప ఆయుధమని, రాజ్యాంగం ప్రసాదించిన అత్యున్నతమైన విలువల వెలుగులలో లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా పిలుపునిచ్చారు. సెక్యులరిజానికి విఘాతం కలిగించే చర్యలను నియంత్రించకపోవడం వల్ల రోజురోజుకూ తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. అషార్ఫరాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గాంధీ, నెహ్రూ కాలం నాటి సెక్యులరిజాన్ని ఇప్పుడు చూడలేమని, ఆనాటి లౌకికవాద విలువలు ఇప్పుడు ఏ మాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వరుసగా జరుగుతున్న దాడులతో సెక్యులరిజానికి తూట్లు పడుతున్నాయి. దీంతో రాజ్యాంగ లక్ష్యం అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టడం లేదు. ఇది మన సెక్యులర్ వ్యవస్థకే ప్రమాదకరం’’అని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వర్గాల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతోందని, దీనివల్ల దాడులు, హింస చెలరేగుతున్నాయన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరమత సహనం, లౌకిక భావాలపై అవగాహన కల్పిస్తే భావితరాల్లో సెక్యులరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. వేర్పాటువాదం, మతం ఒకటి కాదు.. ప్రపంచంలో ఎక్కడ హింస చోటుచేసుకున్నా, దాడులు జరిగినా ఇక్కడ ముస్లింల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం సరైంది కాదన్నారు. భారతీయ ముస్లింలు ఈ దేశ సంస్కృతిలో ఒక భాగమని అర్థం చేసుకోవాలన్నారు. ‘మైనారిటీ’భావనను ఏ ఒక్క దేశానికి, రాష్ట్రానికి పరిమితమైన అర్థంలో కాకుండా విస్తృత పరిధిలో చూడాలని, మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని మైనారిటీ భావనను పునర్నిర్వచించాలని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తలెత్తే వేర్పాటువాద ఆందోళనలకు ముస్లిం మతానికి ఎలాంటి సంబంధం లేదని, రెండూ ఒకటి కాదని చెప్పారు. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇలాంటి అనేక విషయాలు స్పష్టంగా బోధపడతాయన్నారు. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేకుండా వాస్తవాలను యథాతథంగా రిపోర్ట్ చేయాలన్నారు. ‘పద్మావత్’ మూవ్మెంట్లో ఉన్నాం.. కొన్ని రకాల అసహన భావాలను చూస్తోంటే ఎంతో విస్మయం కలుగుతోందని, చరిత్రను ఉన్నదున్నట్లుగా స్వీకరించేందుకు కూడా కొన్ని వర్గాలు సిద్ధంగా లేవని నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కన్నబీరన్ అన్నారు. ఇప్పుడు మనమంతా ‘పద్మావత్’ సినిమా మూవ్మెంట్లో ఉన్నామని, పద్మావతి అనే మహిళ పేరును ‘పద్మావత్’గా మార్చి చెప్పుకునే దుస్థితిలో ఉన్నామన్నారు. ‘ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వుమెన్’అనే అంశంపై కొలంబియా రచయిత్రి లారా రెస్ట్రెపో, సీమా ముస్తఫా పాల్గొన్నారు. కొలంబియాలో ఇప్పటికీ మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారని లారా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమ భావప్రకటన స్వేచ్ఛను అనుభవించలేకపోతున్నారని, ఇందుకు రాజకీయాల్లో, సమాజంలో వ్యవస్థీకృత పురుషాధిపత్యమే కారణమని సీమా ముస్తఫా అన్నారు. మరోవైపు ‘ది జర్నీ ఆఫ్ కాటన్ ఇండియా’ అనే అంశంపై జరిగిన చర్చలో మీనా మీనన్, ఉజ్రమ్మ పాల్గొన్నారు. బీటీ కాటన్బారి నుంచి దేశ రైతాంగాన్ని కాపాడాలని, మన దేశ అవసరాలకు అనుగుణమైన స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ఉజ్రమ్మ కోరారు. ‘ది జునూన్ ఆఫ్ ది కెండల్స్ అండ్ కపూర్స్’అనే అంశంపై శశికపూర్ కూతురు సంజనా కపూర్ మాట్లాడారు. తమ తండ్రి కుటుంబం నుంచి, అమ్మ కుటుంబం నుంచి నాటక రంగానికి జరిగిన కృషిని గురించి వివరించారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘గులాబీ టాకీస్’సినిమాను ప్రదర్శించారు. ముంబైకి చెందిన చింటూసింగ్ కళాకారుల బృందం ప్రదర్శించిన బాంబే బైరాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ భాషల్లో సాగిన కవి సమ్మేళనం విశేషంగా ఆకట్టుకుంది. మిలిటరీ హీరోస్‌కు సెల్యూట్.. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శత్రువుతో వీరోచితంగా పోరాడే ఎందరో సైనికులు తమ సొంత జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రముఖ జర్నలిస్టులు శివ్అరూర్, రాహుల్‌సింగ్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు, ఇటీవల జరిగిన పలు ఘటనల్లో ప్రాణాలను కోల్పోయిన 14 మంది వీరుల గాథలను వివరిస్తూ వారు రాసిన ‘ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలటరీ హీరోస్’పుస్తకంపై నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. సరిహద్దుల్లో సైనికులతో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. డబ్బింగ్ సినిమాలతో తీవ్ర నష్టం.. ‘లిటరేచర్ అండ్ ఫిల్మ్’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ కన్నడ డైరెక్టర్ గిరీష్ కాసరవల్లి మాట్లాడుతూ.. డబ్బింగ్ సినిమాల వల్ల సినీపరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోందన్నారు. డబ్బింగ్ సినిమాల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండదని, దీనివల్ల ఆయా భాషల్లో సినిమాలు తీసేందుకు అవసరమైన 70 విభాగాలు నష్టపోతాయన్నారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు ఇప్పటికీ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని, ప్రభుత్వ సేవలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్త ఆదిరాజు పార్థసారథి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులపై నిర్వహించిన చర్చా కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అధ్యక్షత వహించారు. -
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్‌మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్‌లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
26 నుంచి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో సాహితీ ఉత్సవానికి వేదిక కానుంది. ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ సాహిత్యోత్సవం’ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సన్నాహాలు చేపట్టింది. వివిధ భాషల సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవంలో ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరుకానుంది. ఆ దేశానికి చెందిన మేధావులు, రచయితలు, కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అమెరికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం తరలిరానున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవాల్లో ఈసారి భారతీయ భాషగా కన్నడంపై విస్తృత చర్చలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కర్ణాటకకు చెందిన సాహితీ ప్రముఖులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. బెంగళూరులో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతినాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త సరస్వతి, దివంగత పాత్రికేయురాలు గౌరీలంకేష్ స్నేహితురాలు, ప్రముఖ ఆర్టిస్ట్ పుష్ప మేలా తదితరులు పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్, సీమా ముస్తఫా, శివఅరూర్ తదితరులు కూడా పాల్గొననున్నారు. ప్రముఖులకు నివాళులు.. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో అపార సేవలందించి కన్నుమూసిన ప్రముఖులకు నివాళులర్పిస్తారు. ఈ ఏడాది నలుగురు మహనీయులకు ఈ ఉత్సవాల సందర్భంగా నివాళులర్పించనున్నారు. హిందుస్థానీ సంగీ తంలో ట్రుమీ సింగర్‌గా పేరొందిన ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ సినీదిగ్గజం శశికపూర్, బాలీవుడ్, రంగస్థల నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌ను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా హైదరాబాద్ సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది ఎనిమిదో వేడుక. ఈసారి కూడా అద్భుతమైన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఆహూతులను ఆకట్టుకోనున్నాయి. స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ అంతర్జాతీయ సినీ దర్శకుడు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’చిత్రాలను ప్రదర్శిస్తారు. శశికపూర్ కూమార్తె సంజనకపూర్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. శశికపూర్ తీసిన సినిమా ‘షేక్స్పియరియానా’ను ప్రదర్శించనున్నారు. అలాగే టామాల్టన్ సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. వీటితో పాటు వంట చేస్తూ చెప్పే సరస్వతి రామాయణం కథ, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ‘నన్న నుక్కడ్’(చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితా సమ్మేళనం, ముంబైకి చెందిన సంగీత, నృత్యకళాకారుల ‘బాంబే బైరాగ్’, కాలితో అద్భుతమైన చిత్రాలు గీసే కళాకారుడు బందేనవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
సాహితీ సౌరభం
• హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు పూర్తి • నేటి నుంచి జాతీయ, అంతర్జాతీయ కళల ఉత్సవాలు సాక్షి, హైదరాబాద్: సాహితీ సౌరభానికి భాగ్యనగరి ముస్తాబైంది. హైదరాబాద్ సాహి త్యోత్సవానికి బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్ఎల్ఎఫ్)–2017లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక, సమకాలీన అంశాలపై ఈ ఉత్సవంలో సమగ్రమైన చర్చలు జరుగనున్నాయి. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక రంగాలపై సదస్సులు, వర్క్‌షాపులు, సాంస్కృతిక అంశాలు, ఇష్టాగోష్టులు, చిత్రప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలతో ఏటా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ అతిథి దేశంగానూ, తమిళం ప్రధాన భాషగానూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరుగనున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో సమాచార కేంద్రానికి ‘కార్వీ ప్లాజా’గా నామకరణం చేశారు. మూడు వేదికల్లో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి వేదికకు ‘హేపెనింగ్ హైదరాబాద్ పెవిలియన్’గా నామకరణం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఈ వేదికను ఏర్పాటు చేశాయి. రెండో వేదిక ‘ఎస్బీహెచ్ ఎన్విరాన్’, మూడో వేదిక ‘గోయిథె గ్యాలరీ’ల్లో సమాంతరంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. శుక్రవారం(27న) ప్రధాన కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి. ⇔ ఉదయం 9.30కు ‘హేపెనింగ్ హైదరా బాద్ పెవిలియన్’వేదికపై ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ హిందీ కవి అశోక్ వాజ్ పేయి ముఖ్యఅతిథిగా.. ఫిలిప్పీన్స్ రాయ బారి మా తెరిసిటా సి డాజా, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొంటారు. అశోక్ వాజ్‌పేయి ‘లిటరేచర్ అండ్ అవర్ టైమ్స్’అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. ⇔ ఉదయం 11 గంటలకు తెలంగాణ సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘తెలంగాణ విలేజ్’ను ఆవిష్కరిస్తారు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వేడుకల 3 రోజులు ఈ విలేజ్ ప్రదర్శన ఉంటుంది. ⇔ ఇదే సమయంలో గోయిథె గ్యాలరీలో దివ్య దిశ ఆధ్వర్యంలో ‘చైల్డ్‌హుడ్ ఇన్ మై సిటీ’ ప్రదర్శన ఉంటుంది. ది చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. ⇔ తెలంగాణలో మరుగున పడిపోతున్న వాద్యాల ప్రదర్శన ‘తెలంగాణ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్’ 3 రోజులు కొనసాగు తుంది. వివిధ రకాల తెలంగాణ జానపద, కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ⇔ సాయంత్రం 4 నుంచి 4.50 వరకు ‘జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, బర్మాలో మానవ హక్కుల ఉల్లంఘనపై’ప్రముఖ హక్కుల ఉద్యమ నేత నందితా హక్సర్ ప్రసంగిస్తారు. కల్పనా కన్నబీరన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ⇔ సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు మహాశ్వేతాదేవికి నివాళిగా ‘స్తనదాయిని’ కథను ‘చోళీ కే పీచే క్యాహై’పేరుతో ప్రద ర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు ‘కార్మిక్ హార్వెస్ట్’ అనే ఫిలిప్పీన్స్ కళాకారుల ప్రదర్శన ఉంటుంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్ –2017 కోసం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు -
కొత్త పుస్తకం: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్.. సాహిత్యాభిమానులను మూడు రోజులు మురిపించి నిన్నటితో ముగిసింది.. వచ్చేయేటి పండగ వరకు ఇది మధుర జ్ఞాపకమై ‘కొత్త పుస్తకం’గా పుస్తకప్రియుల మదిలో పదిలంగా ఒదగనున్నది. మూడు రోజుల ముచ్చట్లపై వీక్షణం.. - సాక్షి, సిటీప్లస్ శుక్రవారం సాయంకాలం ప్రముఖ కవి, రచయిత జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రారంభమైన లిటరరీ ఫెస్టివల్‌కు 26 సాయంకాలం ప్రముఖ నాట్యకళాకారిణి, సెన్సార్‌బోర్డ్ మాజీ చైర్పర్సన్, కళాక్షేత్ర డెరైక్టర్ లీలా సామ్సన్ ముగింపు పలికారు. మొదటిరోజు ఉర్దూసాహిత్య సంప్రదాయ ప్రక్రియ ‘దాస్తాన్‌గొయి’ ప్రధాన ఆకర్షణ అయితే చివరి రోజు మహాత్మాగాంధీ ‘హింద్ స్వరాజ్’ మీద ‘అన్బౌండ్’ పేరుతో ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చిన ప్రదర్శన ఫెస్టివల్ ఇమేజ్ను పెంచింది. కీ నోట్ టు కల్చరల్ ప్రోగ్రామ్ దాకా.. 24వ తేదీ ఉదయం.. తన పుస్తకం ‘ఇన్ అదర్ వర్డ్స్’ అనువాదకుడు అలి హుస్సేన్ మీర్‌తో జావేద్ అఖ్తర్ సంభాషణ, పాఠకులతో ముఖాముఖి.. ఛలోక్తులు హెచ్ఎల్ఎఫ్ ప్రారంభానికి ఊపునిచ్చాయి. విజువల్స్టోరీ టెల్లింగ్, స్పేస్ అండ్ సెన్సిబిలిటీస్ వర్క్‌షాప్స్ పిల్లలకు ‘ఫన్’డగ మూడ్‌ని తెచ్చాయి. ఇంకా పర్యావరణ, సామాజిక సమస్యలకు కొంచెం వ్యంగ్యం, ఇంకాస్త కామెడీ జోడించి తీసిన డాక్యుమెంటరీ, ఫీచర్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ ఆ రోజు హైలైట్! టామ్ అల్టర్ నాటక ప్రదర్శన ‘పర్చాయియా’ సాహిర్ లూధియాన్విని కళ్లముందుకు తెచ్చింది. 25.. ఆదివారం హైదరాబాద్ హాలీడేని ఆహ్లాదంగా మలిచిన రోజు. ఉర్దూ షాయరీలు, కవిత్వంలో మహిళల గళం వినిపించిన రోజు. తెలంగాణ కవిత్వమూ తన పుటను తెరిచింది. పిల్లల కోసం సాగిన ‘ది సిటీ వి నీడ్’ అనే స్టోరీ రైటింగ్ సెషన్ పెద్దలనూ ఆకట్టుకుంది. జర్మన్ డెరైక్టర్, కొరియోగ్రాఫర్ జాన్ జబీల్ ఆధ్వర్యంలోని యాక్టింగ్ వర్క్‌షాప్ అందరినీ నటింపచేసింది. ‘యూనివర్సల్ యాక్సెస్ టు ప్రింట్ అండ్ లిటరేచర్’ ప్రోగ్రామ్‌కు ఔత్సాహికుల హాజరు ఫుల్‌గానే పడింది. జీఎన్ డెవీ ప్లీనరీతో ఉత్సాహంగా మొదలై.. ప్రముఖ కథక్ నర్తకి మంగళాభట్ ‘ఆజ్ కి షామ్ దక్కన్ కె నామ్’ అభినయంతో హ్యాపీగా ఎండ్ అయింది. 26..రిపబ్లిక్ డే హెచ్ఎల్ఎఫ్కి పబ్లిక్ డే!. ఆఖరి రోజూ వేడుకకు విశేష స్పందన లభించింది. అదీగాక ‘కల్చరల్ అండ్ క్రియేటివ్ ప్లురలిజమ్ ఇన్ మోడర్న్ ఇండియా’ అనే ప్లీనరీని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత మహేష్‌భట్, డాన్సర్ లీలాసామ్సన్ నిర్వహించడం ప్రధాన ఆకర్షణ. పలు రంగాల ముఖ్యులు ఈ సెషన్లో పాలుపంచుకున్నారు. సినిమాలు, వాటిపై ఆంక్షలు మొదలు సెన్సార్‌బోర్డ్ సభ్యులపై ఒత్తిడి, ఘర్‌వాపసి వంటి మతపర వివాదాలు, సాహిత్యం, పత్రికల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రశ్నార్థకంగా మారిన వైనం వరకు అన్నిటినీ చర్చించారు. సెన్సార్ బోర్డ్ పదవికి రాజీనామా చేయడంపై లీలాసామ్సన్ను ప్రశ్నిస్తే.. ‘ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్’ అంటూ తప్పించుకున్నారు. ‘హైదరాబాద్‌తో మీకున్న అనుబంధం’ చెప్పండి అని మహేష్‌భట్‌ను అడిగితే ‘మిర్చీకా సాలన్’ అని నవ్వుతూ కారెక్కారు. చర్చలే చర్చలు.. హెచ్‌బీటీ గీతా రామస్వామి నిర్వహించిన ‘కాస్ట్ అండ్ జెండర్’పై చర్చ కొత్త ఆలోచనలను రేకెత్తించింది. ఇందులో యంగ్రైటర్, యాక్టివిస్ట్ మీనా కందస్వామి, నది పల్షికర్ పాల్గొన్నారు. మీనా కందస్వామి కొత్త రచన జిప్సీ గాడెస్ కూడా చర్చకు వచ్చింది. ఇండియన్ ఎలక్షన్స్ .. ఎ కాన్వర్జేషన్ పేరుతో జయప్రకాశ్‌నారాయణ్, ఎస్‌వై ఖురేషీ మధ్య సాగిన సంభాషణ సోసోగా నడిచింది. ‘ది ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ థియేటర్ ట్రైనింగ్’ అనే థియేటర్ యాక్టింగ్ వర్క్‌షాప్‌ను పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు. ఆఖరి రోజున తెలుగువాళ్లను బాగా ఆకట్టుకున్న కార్యక్రమం.. ముస్లిమిస్ట్ పొయెట్రీ ఇన్ తెలుగు. భరతనాట్య కళాకారిణి ఆనందశంకర్ జయంతి నిర్వహించిన ‘ది డ్రామా ఆఫ్ డ్యాన్స్’ కార్యక్రమంలో లీలాసామ్సన్తో పాటు ప్రముఖ ఆర్ట్ క్రిటిక్ అండ్ ఆర్ట్ లవర్ సునీల్ కొఠారీ, వీణ బసవరాజయ్య పాల్గొన్నారు. ఇక, సినిమా రైటింగ్‌పై సాగిన ‘రీమ్స్ అండ్ రీల్స్’ సెషన్లో యంగ్ రైటర్స్ బాగా పార్టిసిపేట్ చేశారు. ఉర్దూ సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషించిన మాధ్యమం రేడియోపై జరిగిన ‘దక్కన్ రేడియో అండ్ ఉర్దూ కల్చర్’ సెషనూ బాగా ఆకట్టుకుంది. ఉర్దూకి ప్రాధాన్యమివ్వడం బాగుంది ఈసారి హైదరాబాద్ ఫెస్టివల్లో ఉర్దూ భాషకు ప్రాధాన్యమివ్వడం చాలా బాగుంది. తెలుగు కవిత్వంలో ఉన్న ముస్లిం కవులకు ఓ వేదిక కల్పించడం సంతోషం. జావేద్ అఖ్తర్, మహేష్‌భట్ లాంటివాళ్లు ఈ ఫెస్టివల్‌కి రావడం వల్ల దీని స్థాయి పెరిగింది. - యాకూబ్, కవి పిల్లల కోసమని వస్తే.. ఈ ఫెస్టివల్ స్టార్టయిన సెకండ్ డే తెలిసింది. అసలు మా బాబు కోసం వచ్చాం కానీ వచ్చాక పెద్దలకూ ఇది యూజ్‌ఫుల్ అని అర్థమైంది. స్టోరీ టెల్లింగ్ సెషన్స్ పిల్లల కన్నా మాకే ఎక్కువ ఉపయోగం. నేనైతే వంటల పుస్తకాలను కొన్నా. మా బాబుకీ మంచి పుస్తకాలు దొరికాయి. - అనురాధ, గృహిణి మహిళలకు శక్తినిస్తుంది ఐదేళ్లుగా ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నాను. కళకు స్త్రీకి ఉన్న అనుంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ సాధన మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాక ఓ శక్తిగా నిలబెడుతుంది. - ఆనంద శంకర్జయంతి, నృత్యకారిణి పేరు లేని హీరో కథ నేను రాసిన ఇంగ్లిష్ నవల ‘అనాటమీ ఆఫ్ లైఫ్’. ఇది ఓ కవి జీవన ప్రస్థానానికి సంబంధించినది. ఇందులో మన దేశంలోని మెట్రోనగరాలన్నిటి ప్రస్తావన ఉంటుంది. కానీ వాటి పేర్లు, హీరో పేరు ఎక్కడా ఉండవు. ఇది లండన్ వాళ్లు అన్పబ్లిష్డ్ నవలకు ఇచ్చే ‘టిబోర్ జోన్ సౌత్ఏషియా’ అవార్డ్‌కి నామినేటైంది. - దేవ్‌దాన్ చౌదరి, బెంగాలీ రైటర్ తరచుగా నిర్వహిస్తేనే ఫలం లిటరరీ యాక్టివిటీ అనేది దక్కన్సంస్కృతి. తెలుగు, ఉర్దూకి ప్రాధాన్యమివ్వడం, నేషనల్, ఇంటర్నేషనల్ రచయితలు రావడం, ప్రశ్నోత్తర సెషన్స్.. ఇవన్నీ అందరినీ ఒక్కచోటకు చేరుస్తాయి. తెలంగాణను సాధించుకున్న క్రమంలో జరిగిన ఈ ఈవెంట్ మన ఐకమత్యాన్ని బలపరుస్తోంది. గంగాజమున తెహ్జీబ్ను పునరుద్ధరిస్తోంది. లిటరరీ ఫెస్టివల్ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి.. దీన్ని ఇయర్లీగా కాకుండా చిన్నచిన్న మీట్స్గా చేసి వారాంతాలకో, పదిహేను రోజులకు ఒకసారో ఏర్పాటు చేస్తే, వీలైతే జిల్లాలకూ తీసుకెళ్తే బాగుంటుంది. తెలుగు సాహిత్యాన్ని ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లిష్లలోకి, అట్లాగే ఆయా భాషల్లో ఉన్న సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తే విభిన్న సంస్కృతులు వెల్లివిరుస్తాయి. - వేదకుమార్, సామాజికవేత్త -
విమెన్స్ పోయెట్రీ ఇన్ ఉర్దూ
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ఆదివారం ఆకట్టుకున్న అంశం ‘విమెన్స్ పొయెట్రీ ఇన్ ఉర్దూ’. 1940ల్లో హైదరాబాద్ ఉర్దూ సాహిత్యంలో మహిళల కంట్రిబ్యూషన్ సాటిలేనిది. డెబ్బైల వరకూ అంతే ఉత్సాహంగా సాగిన స్త్రీ కలం తర్వాత ఎంతో నిర్లక్ష్యానికి గురైంది. ‘ఆ పరిస్థితికి గల కారణాలతో పాటు మహిళా ఉద్యమాలు, ఉర్దూ సాహిత్యంలో మహిళా కవయిత్రులు, రాజకీయాల్లో మహిళలు వంటి అనేక అంశాల మీద చర్చ సాగింది. కవయిత్రులు అష్రాఫ్ రఫీ, ఫాతిమా తాజ్, మనీషా, బంగార్, షాఫిఖ్ ఫాతిమా షేరాల షాయరీలు ఆహూతులను ఆకట్టుకున్నాయి’ అని చెప్పారు నిర్వాహకురాలు జమీలా నిషాత్. 1940ల్లో హైదరాబాద్ ఉర్దూ సాహిత్యంతో ముడిపడి ఉన్న పేరు సొహ్రా హుమాయున్ మిర్జా. సరోజినీనాయుడికి అత్యంత సన్నిహితురాలైన సొహ్రా సాహిత్యంలోనే కాదు స్వాతంత్య్ర సమరంలో, స్త్రీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న వనిత. అప్పట్లో గాంధీజీ సమావేశాలకు ఆమే నిర్వాహకురాలు.‘బజ్మె హవాతి దక్కన్’ అనే మహిళా సంస్థను స్థాపించి ఉర్దూ సాహిత్యంలో స్త్రీలను ప్రోత్సహించారు. స్త్రీవిద్య కోసం పాటుపడ్డారు. ఆమె స్థాపించిన ‘సబ్దరియా’ అనే బడి ఇప్పటికీ మెహిదీపట్నంలో నడుస్తోంది. -
మగ్దూం షాయరీలంటే పిచ్చి
జావేద్ అఖ్తర్.. సాహిత్యంలో సుస్థిరమైన పేరు! సినిమారంగానికొస్తే ఆ పేరు తెలియనివారు లేరు! హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అఖ్తర్సాబ్ కాసేపు సాగించిన చిట్‌చాట్.. భాష.. ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు.. సంస్కృతికి ప్రతిబింబం. ప్రపంచాన్ని అనుసంధానం చేసే వారధి. ప్రతి భాష దేనికదే గొప్పది. అయితే ప్రపంచంతో కమ్యూనికేషన్ కొనసాగాలంటే ఓ కామన్ భాష మాత్రం ఉండాలి. అందుకే మాతృభాషతో పాటు విధిగా దేశంలో అయితే జాతీయ భాష హిందీని, అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌ను తప్పకుండా నేర్చుకోవాలి. మాతృభాష చెట్టుకు వేరులాంటిదైతే.. ప్రపంచంతో మనం మాట్లాడే భాష కొమ్మలాంటిది. చెట్టుకు కొత్త రెమ్మలతో కొమ్మలు విస్తరించడం ఎంత అవసరమో, నేలలో బలంగా వేళ్లూనుకోవడమూ అంతే అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే చెట్టు పచ్చగా ఉంటుంది. నీ భాషను ప్రేమించడమంటే ఇతర భాషలను ద్వేషించడమని కాదుకదా! సాహిత్యం.. భాషకు ప్రాణం సాహిత్యం. భాష ద్వారా సంస్కృతిని చాటేది సాహిత్యమే. అలాంటి విలువైన ప్రపంచ సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలు తప్పనిసరి. ఈ అనువాదాలే లేకుండా మాక్సిమ్ గోర్కి నవల ‘అమ్మ’ను మనం చదివుండేవాళ్లం కాదు. ఇలాంటివెన్నో! నా కవిత్వం నాకు తెలియని కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ లాంటి ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. ఉర్దూ.. హైదరాబాద్ పేరు లేకుండా ఉర్దూని ఊహించలేం. ఇక్కడి ఉర్దూ అయితే దక్కనీగా ఓ ప్రత్యేకతను పొందింది. ఈ నేల ఉర్దూ సాహిత్యంతో తరించిపోయింది. మగ్దూం మొహియుద్దీన్లాంటి కవులు తమ కవిత్వంతో ఉర్దూ భాష ఉన్నతిని చాటారు. నిన్న జైపూర్ లిటరరీ ఫెస్టివ ల్లో కూడా ఆయన షాయరీల గురించి ప్రస్తావన వచ్చింది.. కొన్ని షాయరీల్లో ఆయన వ్యక్తపరిచిన భావాలు అద్భుతం. అంతకుముందు నేనెప్పుడూ చదవలేదు. అలాగే షాద్సాబ్.. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన గజల్స్, షాయరీలంటే నాకు ప్రాణం. నేటి అభివృద్ధికి అద్దం పడుతున్నట్టు ఉంటాయి. ఇలా ఉర్దూ సాహిత్యంలో హైదరాబాద్ కంట్రిబ్యూషనూ వెలకట్టలేనిది. హైదరాబాద్‌తో అనుబంధం.. చాలా ఉంది. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే.. లిటరరీ ఫెస్టివల్ కీనోట్లో చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే చాలా దాస్తున్నాను (నవ్వుతూ) ఇక్కడివాడైన మగ్దూం మొహియుద్దీన్కి పిచ్చి అభిమానిని. అంటే పరోక్షంగా హైదరాబాద్‌తో అనుబంధం ఉన్నట్టే కదా. ఇక ప్రత్యక్షంగా చూసుకున్నా సంబంధం, అనుబంధం ఉంది. నా భార్య షబానాది హైదరాబాదే.. అంటే ఈ సిటీ నా అత్తగారిల్లన్నట్టే కదా! మా ఇల్లంతా ఇప్పటికీ బగారా బైంగన్, కట్టాసాలన్ వంటలతో ఘుమఘమలాడుతూనే ఉంటుంది. - శరాది -
సాహితీ ఆంగనం
హైదరాబాద్.. ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ! చౌమొహల్లా ప్యాలెస్ మొదలు చిక్కడపల్లి త్యాగరాయగానసభ, సైఫాబాద్ రవీంద్రభారతి వయా సికింద్రాబాద్ హరిహరకళాభవన్, అవర్ సేక్రెడ్ స్పేస్ నుంచి బంజారాహిల్స్ గోథే జెంత్రం, కళాకృతి, సృష్టి ఆర్ట్ గ్యాలరీల స్పేస్ పూరిస్తూ, శిల్పకళా వేదికనూ వరించి హైటెక్స్ హంగులనూ అద్దుకొని నిత్యం ఏదో ఒక సంబురం సందడి చేస్తూనే ఉంటుంది.. జాతీయ, అంతర్జాతీయ వేడుకలెన్నో భాగ్యనగరినీ భాగస్వామిని చేస్తుంటాయి ! అలాంటిదే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్! శుక్రవారం నుంచి 26వ తేదీ వరకూ చిన్నాపెద్దా అందరినీ ఆనందంలో ముంచనుంది! ఈ సాహితీ పండుగ కు ఈ ఏడాది వేదిక.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్! ..:: సరస్వతి రమ 2010 నుంచి అక్షరమాలికల అల్లిక ప్రారంభించిందీ హైదరాబాద్ ఫెస్టివల్. సాహిత్యంలోని సృజనాత్మక ప్రక్రియలన్నిటికీ ఒక ముంగిలిగా నిలిచే ఈ ఈవెంట్ పలు భాషల ద్వారాలనూ నిలుపుతోంది. ఏటా ఒక్కో భారతీయ భాష మీద ప్రధాన దృష్టి సారిస్తోంది. అలా హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఉర్దూ భాష ఈ ఏడాది పండుగలో తన విశిష్టతను చాటనుంది. ఈ భాషలో భిన్న సాహితీ ప్రక్రియలను పరిచయం చేయడం, అవసానదశలో ఉన్న సాహితీకళను ప్రదర్శించడంతో పాటు ఉర్దూ ప్రఖ్యాత రచయితలు, కవులు.. వాళ్లు రాసిన రచనల విశ్లేషణ ఉండబోతున్నాయి. దాస్తాన్‌గొయి.. దాస్తాన్, గొయి అనే రెండు పర్షియన్ పదాల కలియికే దాస్తాన్‌గొయి. అంటే కథ చెప్పే కళ. ఉర్దూ సాహిత్యంలో అవసాన దశలో ఉన్న ప్రక్రియ ఇది. మహమూద్ ఫారూఖీ దర్శకత్వం వహించిన 80 నిమిషాల దాస్తాన్ ఇ ఛౌబోలీ అనే దాస్తాన్‌గొయిని ప్రదర్శించనున్నారు రాణా ప్రతాప్, రాజేష్‌కుమార్ అనే కళాకారులు. ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూధియాన్వీ మీద రాసిన ‘పర్‌ఛాయియా’ నాటకాన్ని ప్రముఖ నటుడు టామ్ ఆల్టర్ ప్రదర్శించనున్నాడు. ఖాలిద్ సయీద్, అమినా కిషోర్ల ‘ఘజల్ అప్రిసియేషన్’ కార్యక్రమం ఉంది. దీంతో పాటు ‘విమెన్స్ పొయెట్రీ ఇన్ ఉర్దూ’ అనే అంశం మీద సదస్సూ జరగనుంది. ఇందులో షఫీఖ్ ఫాతిమాషేరా, ఫాతిమా తాజ్, జమీలా నిషాత్‌లు పాల్గొంటున్నారు. వారధిలా వేడుక.. ఏటా ఒక్కో దేశాన్ని ఆహ్వానిస్తున్న హెచ్ఎల్ఎఫ్ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్) ఈసారి పోలెండ్ దేశాన్ని అతిథిగా పిలుస్తోంది. ఈ ఆహ్వానం వెనకున్న ఉద్దేశం ఒక్కటే.. ఈ ఉత్సవానికి అంతర్జాతీయ హోదా కల్పించడం కోసం, మన సాహితీవేత్తలు.. ప్రచురణ కర్తలకు, విదేశీ సాహితీవేత్తలు.. ప్రచురణకర్తలకు మధ్య వారధిలా నిలవడం! పోలెండ్ నుంచి ముగ్గురు రచయితలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. 70 ఈవెంట్లు ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు, రైటర్ మహేశ్ భట్, లీలాశామ్సన్‌లు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ రోజు తప్పించి మిగిలిన మూడు రోజుల్లో 70 ఈవెంట్ల వరకూ జరగనున్నాయి. వీటిలో పిల్లలకు స్టోరీటెల్లింగ్, స్టోరీ రైటింగ్ వర్క్‌షాప్‌లు, లిటరరీ క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సాంస్కృతిక సంగమం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కథక్ నర్తకి మంగళాభట్ నృత్యం, ఖవ్వాలీ, కవితా పఠనం ఉన్నాయి. ఆర్ట్ హిస్టారియన్, క్యూరేటర్ కొయిలీ ముఖర్జీ ఘోష్ ‘నాట్ ఎ టైగర్’ అనే వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. ‘గీతా ట్రాన్స్‌లేషన్స్’ పేరుతో మణీరావు అనువాదాల్లోని విధానాలను వివరించనున్నారు. హైదరాబాద్ నేటివిటీకి కెమెరా పట్టిన లక్ష్మీప్రభల ‘అబ్సల్యూట్ హైదరాబాద్ .. అన్‌చేంజింగ్ సైడ్ టు ఎ సిటీ ఆఫ్ చేంజ్’ అనే ఛాయాచిత్ర ప్రదర్శనా ఉంది. అలాగే జి.శంకర్‌నారాయణ్ ‘హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ.. లిటిల్ నోన్ ఆర్కిటెక్చరల్ జెమ్స్’ పేరుతో తెలంగాణ హెరెటేజ్, ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. తెలంగాణ కవిత్వానికీ చోటుంది. విమెన్ అండ్ లా.. ఇందులో ఇందిరా జైసింగ్, పద్మినీ స్వామినాథన్, కల్పనా కన్నబీరన్‌లు పాలుపంచుకుంటున్నారు. సాహిత్యానికి, కళలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే లె క్చర్స్, డిమాన్ స్ట్రేషన్స్, యూరోప్, ఇండియాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే సాహిత్య గోష్ఠులు, స్క్రీనింగ్స్.. ఇలా సాహిత్యాభిలా షుల తృష్ణను తీర్చేవెన్నో కార్యక్రమాలు ఈ ఉత్సవంలో ఉన్నాయి. -
సాహిత్య సౌరభం..
భాగ్యనగరం మరోసారి సాహిత్య శోభను సంతరించుకోనుంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు ఇందులో భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని చెబుతున్నారు ఫెస్టివల్ నిర్వాహకులు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఈ వేడుక వివరాలను ఫెస్టివల్ డెరైక్టర్స్ అజయ్ గాంధీ, అమితా దేశాయ్, జీఎస్పీ రావ్, టి.విజయ్ కుమార్ సోమవారం వెల్లడించారు. మూడు రోజులు జరిగే ఈవెంట్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు, స్క్రీనింగ్స్, ప్రసంగాలు ఇలా 70కి పైగా కార్యక్రమాలు నగరవాసులను అలరించనున్నాయి. భాషకు సంబంధించిన అనేక అంశాలకు ఈ ఫెస్టివల్ వేదికగా మారనుంది. ఈ పండుగలో దేశంలోని ప్రముఖ రచయితలు, యాక్టివిస్ట్‌లు, కళాకారులు తదితరులు పాల్గొననున్నారు. చదివే అలవాటును ప్రమోట్ చేయడమే దీని ప్రదానోద్దేశం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఫీజు లేదని, అందరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి జావేద్ అక్తర్ హాజరుకానున్నారు. ఉర్దూ కవి సాహిర్ లుధియాన్వీకి ట్రిబ్యూట్‌గా ‘పర్చాయియన్’ అనే నాటకాన్ని 24న ప్రదర్శించనున్నారు. మహేష్‌భట్, అరుణ్‌శౌరి, మంగళాభట్, కల్పన తదిరతర ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. బెస్ట్ ఈవెంట్.. ‘2014లో నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ప్రపంచంలో సెకెండ్ బెస్ట్ విజిటింగ్ ప్లేస్‌గా హైదరాబాద్‌ని పేర్కొంది. ఆ లింక్‌లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ గురించి ప్రముఖంగా పేర్కొంది. అంతేకాదు దేశంలో జరిగే ఆరు అతిపెద్ద లిటరరీ ఫెస్టివల్స్‌లో ఇదీ ఒకటి’ అని తెలిపారు హెచ్ఎల్ఎఫ్ డెరైక్టర్ జీఎస్పీ రావ్. ‘ఐదేళ్లుగా ఏటా డిఫరెంట్ లొకేషన్స్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్నాం. పర్మినెంట్ వెన్యూ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాల’ని కోరారు మరో డెరైక్టర్ అజయ్ గాంధీ. - ఓ మధు -
ముగిసిన సాహిత్యోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మూడు రోజుల పాటు సందడిగా సాగిన ‘హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు’ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఎంతోమంది దేశ, విదేశీ ర చయితలు తమ అనుభవాలను, రచనలను నగర సాహితీ ప్రియులకు అందించారు. చివరిరోజు ఉత్సవాల్లో ప్రధాన వేదిక ఆషియానా వద్ద ‘జెండర్ టేల్స్’ పేరిట సాహిత్యంలో ‘స్త్రీవాదం’పై సునితి నమ్ జోషి, ఊర్వశి బుతల్యా ప్రసంగించారు. ‘ఏ లైఫ్ ఇన్ ఫిలిమ్స్’ పేరిట కాంచన్ఘోష్, విపిన్ శర్మలు చలనచిత్రాల్లో జీవన చిత్రణపై వివరించారు. పబ్లిషర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మిని కృష్ణన్, ఊర్వశి బుతల్యాలు ప్రసంగించారు. ప్రస్తుతం పత్రికల్లో పుస్తక సమీక్షలకు స్థానం కుచించుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనువాద సమస్యలపై సబా మహ్మద్ బషర్, సస్ క్యాజైన్, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో, భాషల్లో ఉండే వైవిద్యం వల్ల అన్నిభాషలు, సంస్కృతి ప్రత్యేకత కలిగి ఉంటాయని, అనువాదకులు స్థల కాలలకు అనుగుణంగా పదాలను వాడాలని పేర్కొన్నారు. ప్రముఖ దళిత రచయిత్రులు బామా, శివలక్ష్మి దళిత సాహిత్య ఆవశ్యకత, తీరుతెన్నులపై తమ అనుభవాలను ‘దళిత్ వాయిస్’లో పంచుకున్నారు. నగర మహిళల జీవనచిత్రం ‘ది షాడో ఉమెన్’ ఫెస్టివల్ వేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారి చందనాఖన్ రచించిన ‘ది షాడో ఉమెన్’ పుస్తకాన్ని బెంగాలీ రచయిత సుబోధ్ శంకర్ ఆవిష్కరించారు. పాతబస్తీ స్త్రీల జీవనం ఆధారంగా ఆమె ఈ ఆంగ్ల కథల సంకలనాన్ని రాశారు. సుబోధ్ మాట్లాడుతూ.. అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే రచన.. చిత్రలేఖనాలను కొనసాగిస్తున్న చందనాఖన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. బంజారాహిల్స్/శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: సప్తపర్ణిలో నిర్వహించిన థియేటర్ వర్క్‌షాప్‌లో రంగస్థలంపై నటించేటప్పుడు నటులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ప్రముఖ ఐరిష్ నటుడు, నాటక శిక్షకుడు క్యాథల్ క్విన్ వివరించారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రాన్ రోజన్ స్టాక్.. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన అద్భుతమైన ఫొటోలకు గాబ్రియెల్ రోజన్ స్టాక్ రాసిన భావుకత నిండిన హైకు కవితలను జోడించడం ఆహుతులను అలరించింది. అలరించిన కథలు ఆదివారం స్కూళ్లకు సెలవు కావడంతో వందలాదిగా తరలివచ్చిన చిన్నారులతో సాహితీ వీధులు కళకళలాడాయి. లామకాన్, కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో జరిగిన స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రముఖ స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ చిన్నారులకు ఉత్సాహం నింపే కథలను వినిపించారు. దీనికి పెద్దలు కూడా హాజరయ్యారు. భాగ్యనగరి జీవనంపై.. లామకాన్‌లో నిర్వహించిన ‘క్రియేటివ్ రైటింగ్’ వర్క్‌షాప్‌కు విశేష ఆదరణ లభించింది. రచనల నిపుణురాలు మధు కజ ‘హౌ టు గెట్ స్టార్టెడ్’ పేరిట రచనలు ఏ విధంగా రాయాలి.. ఏ అంశానికి యే విషయాలు రాస్తే రచనలు బాగుంటాయో వివరించారు. ఈ వర్క్‌షాపులో పలువురు వర్థమాన రచయితలు హాజరయ్యారు. మధ్యాహ్నం ఆనంద్‌రాజు వర్మ రచించిన ‘హైదరాబాద్- మెహలే’, ‘గలిస్ అండ్ కుచెస్’ పుస్తకాలపై చర్చించారు. ఇలాంటి ఉత్సవాలు అవసరం.. ఇప్పటి వరకు పలు చిత్రాలకు, ఆల్బమ్స్‌కు సంగీతం అందించాను. ఒక సంగీత దర్శకుడిగా సంగీతాన్ని అందించడమే కాకుండా సాహిత్యంలోని అర్థాన్ని వివరిస్తూ ప్రేక్షకుడికి పాటలు అందించాలి. రచనలు రాయడం అనేది చాలా కష్టమైన పని. ఈ లిటరరీ ఫెస్టివల్లో క్రియేటివ్ రైటింగ్‌పై పలు విషయాలను నేర్చుకున్నాను. ఏ విధంగా రచనలు చేయాలో మధు కజ చాలా చక్కగా వివరించారు. ఇలాంటి ఫెస్టివల్స్ మరిన్ని నిర్వహించాలి. - సత్య కశ్యప్, సంగీత దర్శకుడు కొత్త విషయాలు నేర్చుకున్నా.. హైదరాబాద్‌లో ఇలాంటి లిటరరీ ఫెస్టివల్ నిర్వహించడం శుభ పరిణామం. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలకు గేయ రచయితగా వ్యవహరిస్తున్నాను. పాటలు సందర్భానుసారంగా రాయడం అనేది మెదడుకు పదును పట్టే అంశం. ఈ వర్క్‌షాప్ ద్వారా కొన్ని మెళకువలు నేర్చుకోగలిగాను. లోతుగా విశ్లేషించడం, ఎక్కడ ఏ పదాలు ఉపయోగించాలో తెలుసుకున్నాను. - హర ఉప్పాడ, సినీ గేయ రచయిత -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సంవత్సరం జనవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంగణాల్లో (ఆషియానా, లామకాన్, కళాకృతి, సప్తపర్ణి) జరగనుంది. ఈసారి రాజమోహన్ గాంధీ, మల్లికా సారాభాయ్, ఆనంద్ గాంధీ, మృదులా గార్గ్, సుబోధ్ సర్కార్, గీతా హరిహరన్ తదితరులు పాల్గొంటారు. ఈసారి హిందీ సాహిత్యం మీద ప్రధాన దృష్టి ఉంటుంది. ముషాయిరాలకు కూడా కొదవ లేదు. ఈసారి ప్రత్యేకం- ఐరిష్ సాహిత్య బృందం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు: http://www.hydlitfest.org చూడండి.