సాహితీ సౌరభం | ready for Hyderabad Literary Festival | Sakshi
Sakshi News home page

సాహితీ సౌరభం

Published Fri, Jan 27 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

సాహితీ సౌరభం

సాహితీ సౌరభం

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి జాతీయ, అంతర్జాతీయ కళల ఉత్సవాలు  


సాక్షి, హైదరాబాద్‌: సాహితీ సౌరభానికి భాగ్యనగరి ముస్తాబైంది. హైదరాబాద్‌ సాహి త్యోత్సవానికి బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ (హెచ్‌ఎల్‌ఎఫ్‌)–2017లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక, సమకాలీన అంశాలపై ఈ ఉత్సవంలో సమగ్రమైన చర్చలు జరుగనున్నాయి. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక రంగాలపై సదస్సులు, వర్క్‌షాపులు, సాంస్కృతిక అంశాలు, ఇష్టాగోష్టులు, చిత్రప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలతో ఏటా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది 7వ హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌.

ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌ అతిథి దేశంగానూ, తమిళం ప్రధాన భాషగానూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరుగనున్న హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో సమాచార కేంద్రానికి ‘కార్వీ ప్లాజా’గా నామకరణం చేశారు. మూడు వేదికల్లో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి వేదికకు ‘హేపెనింగ్‌ హైదరాబాద్‌ పెవిలియన్‌’గా నామకరణం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఈ వేదికను ఏర్పాటు చేశాయి. రెండో వేదిక ‘ఎస్‌బీహెచ్‌ ఎన్విరాన్‌’, మూడో వేదిక ‘గోయిథె గ్యాలరీ’ల్లో సమాంతరంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. శుక్రవారం(27న) ప్రధాన కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి.

ఉదయం 9.30కు ‘హేపెనింగ్‌ హైదరా బాద్‌ పెవిలియన్‌’వేదికపై ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ హిందీ కవి అశోక్‌ వాజ్‌ పేయి ముఖ్యఅతిథిగా.. ఫిలిప్పీన్స్‌ రాయ బారి మా తెరిసిటా సి డాజా, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొంటారు. అశోక్‌ వాజ్‌పేయి ‘లిటరేచర్‌ అండ్‌ అవర్‌ టైమ్స్‌’అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు.
ఉదయం 11 గంటలకు తెలంగాణ సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘తెలంగాణ విలేజ్‌’ను ఆవిష్కరిస్తారు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వేడుకల 3 రోజులు ఈ విలేజ్‌ ప్రదర్శన ఉంటుంది.
ఇదే సమయంలో గోయిథె గ్యాలరీలో దివ్య దిశ ఆధ్వర్యంలో ‘చైల్డ్‌హుడ్‌ ఇన్‌ మై సిటీ’ ప్రదర్శన ఉంటుంది. ది చిల్డ్రన్స్‌ ఫైన్‌ ఆర్ట్‌ గ్యాలరీలో వర్క్‌ షాపులు నిర్వహిస్తారు.
తెలంగాణలో మరుగున పడిపోతున్న వాద్యాల ప్రదర్శన ‘తెలంగాణ మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ 3 రోజులు కొనసాగు తుంది. వివిధ రకాల తెలంగాణ జానపద, కళారూపాల ప్రదర్శన ఉంటుంది.
సాయంత్రం 4 నుంచి 4.50 వరకు ‘జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, బర్మాలో మానవ హక్కుల ఉల్లంఘనపై’ప్రముఖ హక్కుల ఉద్యమ నేత నందితా హక్సర్‌ ప్రసంగిస్తారు. కల్పనా కన్నబీరన్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.
సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు మహాశ్వేతాదేవికి నివాళిగా ‘స్తనదాయిని’ కథను ‘చోళీ కే పీచే క్యాహై’పేరుతో ప్రద ర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు ‘కార్మిక్‌ హార్వెస్ట్‌’ అనే ఫిలిప్పీన్స్‌ కళాకారుల ప్రదర్శన ఉంటుంది.

            బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో లిటరరీ ఫెస్టివల్‌ –2017 కోసం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement