అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈ సారి ఎంతమందంటే? | 2 More Flights Carrying Indians Deported From Us | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈ సారి ఎంతమందంటే?

Published Fri, Feb 14 2025 9:33 AM | Last Updated on Fri, Feb 14 2025 2:52 PM

2 More Flights Carrying Indians Deported From Us

వాషింగ్టన్‌ : అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఇటీవల  కొందరు భారతీయులను  పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసదారుల్ని భారత్‌కు పంపనున్నట్లు సమాచారం. వీరందరూ ఫిబ్రవరి 15న అమృత్‌సర్‌కి రానున్నట్లు తెలుస్తోంది. .  

అమెరికాలో భారత అక్రమ వలసదారుల్ని గుర్తించింది.  ఫిబ్రవరి 5న 104 మంది వలసదారుల్ని అమెరికా సైనిక విమానం అమృత్‌సర్‌కు తరలించింది. అక్రమ వలసదారుల అంశంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ స్పందించారు. అమెరికాలో 487 మంది అక్రమ భారత వలసదారుల్ని గుర్తించింది. వారిని స్వదేశానికి తరలించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు.  ఇందులో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వం మరింత మందిని భారత్‌కు పంపనుంది.  

మరోవైపు, అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడం విమర్శలు దారితీస్తోంది. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

అమెరికాలో అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విమానాలు అమృత్‌సర్‌లో దించడం ద్వారా కేంద్రం పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది. హర్యానా లేదంటే గుజరాత్‌లో ఎందుకు దించకూడదు? అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నమే అని మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement