సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవం(హెచ్‌ఎల్‌ఎఫ్) సంబరంగా ప్రారంభమైంది. సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విద్యారణ్య స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లిటరరీ ఫెస్టివల్ ఆరంభమైంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రచయిత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరు కాగా, జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్‌ఎల్‌ఎఫ్ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈశాన్యరాష్ట్రాల నుంచి దక్షిణాది కేరళ, తమిళనాడు, ఒడిశా, తదితర అన్ని రాష్ట్రాలకు చెందిన సాహితీప్రియులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్,తదితర దేశాలకు చెందిన రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తున్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్యోత్సవం కోసం 13 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల పాటు సాహిత్యం, కళలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన సుమారు 150 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్‌ఎల్‌ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. (క్లిక్ చేయండి: పేరెంటింగ్.. కూతురు నేర్పిన పాఠం)
Comments
Please login to add a commentAdd a comment