Venues
-
వన్డే వరల్డ్‌కప్ వేదికలు ఖరారు
తదుపరి జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. 2027 అక్టోబర్, నవంబర్లలో షెడ్యూలైన ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రస్తుతానికి సౌతాఫ్రికాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారైయ్యాయి. సౌతాఫ్రికాలో ఐసీసీ గుర్తింపు పొందిన మైదానాలు మొత్తం 11 ఉండగా.. వాటిలో ఎనిమిదింట వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్ అండ్ న్యూలాండ్స్‌లోని బోలాండ్ పార్క్, బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్ మైదానాలు 2027 క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్ మైదానాల్లో వసతులు సక్రమంగా లేనందుకు వాటిని పక్కకు పెట్టారు. చాలా అంశాలను (హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌లు, స్టేడియం కెపాసిటీ తదితర అంశాలు) పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ ఎనిమిది వేదికలను వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలెట్సీ మోసెకీ తెలిపారు. జింబాబ్వే నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు త్వరలోనే ఖరారుకానున్నాయి. కాగా, 2027 వరల్డ్‌కప్‌కు ఆతిథ్య దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించగా.. నమీబియా ఆఫ్రికన్ క్వాలిఫైయర్‌ను అధిగమిస్తే అర్హత సాధిస్తుంది. ఈ మెగా టోర్నీకి వన్డే ర్యాంకింగ్స్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉండే జట్లు నేరుగా అర్హత పొందనుండగా.. మిగిలిన నాలుగు స్థానాలు గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 14 జట్లు గ్రూప్‌కు ఏడు చొప్పున రెండు గ్రూపులు విభజించబడతాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అనంతరం సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2003 వరల్డ్‌కప్ తరహాలోనే ఈ ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలో జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కాకుండా ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ మ్యాచ్‌ను కూడా యాడ్ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్‌ల్లో (BGT) భారత్ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2018-19, 2020-21 సిరీస్‌లను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్ట్‌ల్లో భారత్ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్‌లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. భారత్‌లో జరిగిన 2016-17 సిరీస్‌లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్‌లో కూడా భారత్.. 2-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ లెక్కన టీమిండియా ఆసీస్‌పై వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్‌ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్‌ల్లో 2020-21 గబ్బా టెస్ట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. రాబోయే సిరీస్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేదికలను లాక్ చేసినట్లు సమాచారం. తొలి టెస్ట్: పెర్త్ రెండో టెస్ట్: అడిలైడ్ (డే అండ్ నైట్) మూడో టెస్ట్: గబ్బా నాలుగో టెస్ట్: మెల్బోర్న్ ఐదో టెస్ట్: సిడ్నీ -
వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 45 లీగ్ దశలో.. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లు(రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్) ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లకు పది వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. వార్మప్ మ్యాచ్‌లకు మరో రెండు మైదానాలను(త్రివేండం, గుహవాటి) ఎంపిక చేసింది. అయితే ఈ వరల్డ్‌కప్‌కు పలు స్టేడియాలకు మ్యాచ్‌లు కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు గుర్రుగా ఉన్నాయి. వరల్డ్‌కప్ వేదికల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈసారి వరల్డ్‌కప్ వేదికల జాబితాలో నాగ్‌పూర్, మొహాలీ, జైపూర్ లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా మొహాలీ వేదికపై దుమారం నెలకొంది. 1996 నుంచి ప్రపంచకప్ మ్యాచులకు ఇది వేదికగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు. రాజకీయ జోక్యం వల్లే మొహాలిని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మొహాలీకి చేయిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు. ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి పన్నెండు వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్‌ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలో జరిగింది. మొహాలీలోని మల్లాన్‌పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌కు వేదికయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను కేటాయించాం. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అందులోనూ ఎన్నోసార్లు చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి'' అని శుక్లా వెల్లడించారు. చదవండి: వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా! 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా అంటూ జోస్యం! -
'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా?
ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. తటస్థ వేదికలో అయితే మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమని.. లేదంటే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆధ్వర్యంలో బీసీసీఐ, పీసీబీలతో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌లో భారత్ ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఏసీసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.. ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును(పీసీబీ) కూడా ఒప్పించింది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే అప్పుడు ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకరించాలని పీసీబీని కోరింది. దీనికి పీసీబీ ఒప్పుకుంది. అయితే ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకోవడం పీసీబీకి గిట్టనట్లుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదిక(బంగ్లాదేశ్‌లో) నిర్వహించాలని ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ ఏం స్పందించలేదని తెలిసింది. అయితే ఐసీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఆసియా కప్ అనేది ఉపఖండపు టోర్నీ. అందులో నాలుగు నుంచి ఆరు దేశాలు మాత్రమే పాల్గొంటాయి. పైగా బీసీసీఐ కనుసన్నల్లోనే ఆ టోర్నీ జరుగుతుందని అందరికి తెలుసు. ఏసీసీ కౌన్సిల్లో అగ్రభాగం భారత్‌దే. కానీ ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తుంది. ఈ విషయాన్ని ముందే ఆయా దేశాల క్రికెట్ బోర్డుల దృష్టికి తీసుకెళ్లాం. కేవలం మీకోసం మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించలేం. వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చే దేశాలు ఒకే వేదికలో మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని అనుకుంటాయి. ఇప్పుడు ఇలా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించడం మంచి పద్దతి కాదు. పీసీబీ అడిగింది న్యాయపరమైనదే కావొచ్చు. పాక్ ఆడే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని అడిగారు. కానీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చే వాటిలో భారత్ ఒకటే ఉంది. బంగ్లాదేశ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై దృష్టి సారిస్తాం'' అని పేర్కొన్నారు. ఆసియా కప్‌లో టీమిండియా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏసీసీని ఒప్పించి తమ పంతం నెగ్గించుకుంది బీసీసీఐ. ఇది మనసులో పెట్టుకొనే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడుతామని లేఖ రాసిందని టీమిండియా అభిమానులు పేర్కొన్నారు. కానీ పీసీబీ ప్లాన్ బెడిసికొట్టింది. ఆసియా కప్ అనేది ఉపఖండపు టోర్నీ.. అది మీ ఇష్టం.. కానీ వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ.. అలా కుదరదు అని ఐసీసీ చెప్పకనే చెప్పింది. దీంతో బీసీసీఐని దెబ్బకు దెబ్బ తీయాలని భావించిన పీసీబీ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లుగా తయారైందని అభిమానులు వ్యంగ్యంగా స్పందించారు. ఇక అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో 48 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు 12 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రతీ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక టోర్నీలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చెన్నై లేదా ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. ఒక సెమీఫైనల్‌ను ముంబైలోని వాంఖడేలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ మరొక సెమీఫైనల్ కోసం వేదికను వెతికే పనిలో ఉంది. చదవండి: Asia Cup 2023: పాక్‌లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ! బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ! -
WPL 2023: డబ్ల్యూపీఎల్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే!
Women's Premier League- 2023- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి అమ్మాయిల మెరుపులు మొదలవుతాయి. దీనికి సంబంధించిన మొత్తం 22 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను మంగళ వారం విడుదల చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. ఫైనల్ 26న జరుగుతుంది. ఈ సీజన్లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 11 చొప్పున బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో నిర్వహిస్తారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2. ఢిల్లీ క్యాపిటల్స్ 3. యూపీ వారియర్స్ 4. గుజరాత్ జెయింట్స్ 5. ముంబై ఇండియన్స్ చదవండి: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
మూడు రోజులు.. పదమూడు వేదికలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవం(హెచ్ఎల్ఎఫ్) సంబరంగా ప్రారంభమైంది. సెక్రెటేరియట్ ఎదురుగా ఉన్న విద్యారణ్య స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లిటరరీ ఫెస్టివల్ ఆరంభమైంది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రచయిత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరు కాగా, జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎల్ఎఫ్ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈశాన్యరాష్ట్రాల నుంచి దక్షిణాది కేరళ, తమిళనాడు, ఒడిశా, తదితర అన్ని రాష్ట్రాలకు చెందిన సాహితీప్రియులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్,తదితర దేశాలకు చెందిన రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సాహిత్యోత్సవం కోసం 13 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల పాటు సాహిత్యం, కళలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన సుమారు 150 కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు హెచ్ఎల్ఎఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 250 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. (క్లిక్ చేయండి: పేరెంటింగ్.. కూతురు నేర్పిన పాఠం) -
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ క్రీడా పోటీలకు వేదికలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడాపోటీలకు వేదికలు ఖరారయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఐదు చోట్ల పోటీలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు 15 వ్యక్తిగత విభాగాల్లో 2,763 మంది, ఏడు టీమ్ విభాగాల్లో 2,207 మంది దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన పాఠశాలల క్రీడా పోటీల్లో 20 రాష్ట్రాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 480 చొప్పున, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ 61, సిక్కిం 83, ఉత్తర ప్రదేశ్ 96 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఏకలవ్య జాతీయ పోటీలను సమర్థవంతంగా చేపడతామన్నారు. పోటీలు ప్రారంభానికి ముందే ఏపీ క్రీడాకారులకు నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇవ్వనున్నట్టు వివరించారు. కచ్చితంగా పతకాలు వచ్చే విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌కు మేం రెడీ: అజహర్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబైలో కరోనా ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి తరలించే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని అంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్. ఈ మేరకు ఆయన ఆదివారం బీసీసీఐకి లేఖ రాసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై వాంఖడే స్టేడియంకు చెందిన 10 మంది సిబ్బంది, కొందరు ఈవెంట్ మేనేజర్లకు కోవిడ్ నిర్ధారణ కావడంతో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించే విషయమై సందిగ్ధత నెలకొంది. దీంతో వాంఖడేలో నిర్వహించే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు స్టాండ్ బై గ్రౌండ్లను సిద్ధం చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజ్జూ భాయ్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకాబోయే 14వ సీజన్ ఐపీఎల్ కోసం ఇండోర్, హైదరాబాద్‌లను స్టాండ్-బై వేదికలుగా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబైలో పరిస్థితులు ఎంతగా దిగజారినా క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని బీసీసీఐ ఆఫీసు బేరర్ ప్రకటించడం కొసమెరుపు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న వాంఖడే స్టేడియంలో జరగాల్సిన తొలి మ్యాచ్‌లో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, త్రీ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: కోహ్లితో ఓపెనర్‌గా అతనైతే బాగుంటుంది, కానీ.. -
ఆరు వేదికలూ ఓకే
అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ వచ్చే ఏడాది అక్టోబరు 6 నుంచి టోర్నీ కోల్‌కతా: భారత్‌లో తొలిసారి నిర్వహించబోతున్న ఫుట్‌బాల్ అండర్–17 ప్రపంచకప్ కోసం ఆరు వేదికలకూ ఆమోదముద్ర లభించింది. కొచ్చి, నవీ ముంబై, గోవా, న్యూఢిల్లీ, గువహటి, కోల్‌కతాలలో టోర్నీ జరుగుతుందని ఫిఫా ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబరు 6 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఫిఫాకు చెందిన 13 మంది సభ్యుల బృందం వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించి వేదికలను పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన విడుదల చేసింది. -
మా తపనంతా పిల్లల గురించే...
క్రీడా మైదానాలు ఉండడం లేదని హైకోర్టు ఆవేదన శివాజీపార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా? ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణంపై కోర్టు వ్యాఖ్య పిల్లలు ఆడుకోవడానికి ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పండి టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా హైదరాబాద్: ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తోందని అనలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ తపన ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న ప్రజల గురించి కాదని, పిల్లల గురించేనని స్పష్టం చేసింది. నగరీకరణ నేపథ్యంలో చిన్నారులు ఆడుకోవడానికి సరైన మైదానాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ముంబైలో శివాజీ పార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా.. వారు ప్రపంచస్థాయి క్రీడాకారులు అయ్యారంటే అది ఆ మైదానం ఘనతే. చిన్నప్పుడు నేను కూడా అక్కడే ఆడుకున్నా. హైదరాబాద్‌లోనూ క్రీడామైదానాలు ఉండి తీరాలి.’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే వ్యాఖ్యానించారు. స్టేడియంలో కళాభారతి నిర్మాణం పోను పిల్లలు ఆడుకునేందుకు ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిని కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవో 73ను సవాలు చేస్తూ ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్ ఎ.సుధాకర్ యాదవ్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా మంగళవారం దీనిని మరోసారి విచారించింది. 14 ఎకరాల భూమిలో ఎంత విస్తీర్ణంలో కళాభారతి నిర్మిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. 6 ఎకరాల్లో కళాభారతి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన స్థలాన్ని వదిలేస్తామని, దానిని వాకర్లు వాడుకోవచ్చని రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ తపన మంచిదే. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కళాభారతిని నిర్మిస్తున్నట్లు చెబుతోంది. ఇందులో తప్పేమీ లేదు. కాని మైదానాలు లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి..’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, ఎన్టీఆర్ స్టేడియం పక్కనే కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందని.. అందులోని విద్యార్థులు సైతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఆడుకుంటారని తెలి పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ కాలేజ్ స్థలాన్ని కూడా పిల్లలు ఆడుకునేందుకు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది కదా.. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండని ఏజీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహా రంలో తాము కోరిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.