భారత్‌లో తొలిసారి నిర్వహించబోతున్న ఫుట్‌బాల్ అండర్–17 ప్రపంచకప్ కోసం ఆరు వేదికలకూ ఆమోదముద్ర లభించింది.
అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్
వచ్చే ఏడాది అక్టోబరు 6 నుంచి టోర్నీ
కోల్‌కతా: భారత్‌లో తొలిసారి నిర్వహించబోతున్న ఫుట్‌బాల్ అండర్–17 ప్రపంచకప్ కోసం ఆరు వేదికలకూ ఆమోదముద్ర లభించింది. కొచ్చి, నవీ ముంబై, గోవా, న్యూఢిల్లీ, గువహటి, కోల్‌కతాలలో టోర్నీ జరుగుతుందని ఫిఫా ప్రకటించింది.
వచ్చే ఏడాది అక్టోబరు 6 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఫిఫాకు చెందిన 13 మంది సభ్యుల బృందం వారం రోజుల పాటు భారత్‌లో పర్యటించి వేదికలను పరిశీలించిన తర్వాత ఈ ప్రకటన విడుదల చేసింది.